
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మరాఠీ నటుడు మిలింద్ సఫాయ్(53) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ నటుడు జయవంత్ వాడ్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
(ఇది చదవండి: 'పుష్ప 2' ముందున్న కొత్త సవాళ్లు.. బన్నీ ఏం చేస్తాడో? )
మిలింద్ సఫాయ్ మరాఠీ టీవీ సీరియల్ 'ఆయ్ కుతే కే కర్తే' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా మేకప్, థాంక్ యు విఠలా, పోస్టర్ బాయ్స్, చడీ లగే చమ్ చమ్, ప్రేమచి గోష్టా, టార్గెట్, బి పాజిటివ్ వంటి చిత్రాల్లో కూడా నటించారు. ఒకరోజు ముందే ఆగస్టు 24న ప్రముఖ మరాఠీ నటి సీమా డియో సైతం ముంబైలో తుది శ్వాస విడిచారు. ఆమె చాలా కాలంగా అల్జీమర్స్ వ్యాధితో పోరాడుతోంది. కాగా.. సీమా గతేడాది మృతి చెందిన ప్రముఖ నటుడు రమేష్ డియో భార్య. దీంతో వరుసగా ఇద్దరు నటీనటులు మృతి చెందడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.
(ఇది చదవండి: ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ కమెడియన్.. కన్నీటిని ఆపుకుంటూ!)
Comments
Please login to add a commentAdd a comment