Milind
-
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మరాఠీ నటుడు మిలింద్ సఫాయ్(53) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ నటుడు జయవంత్ వాడ్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. (ఇది చదవండి: 'పుష్ప 2' ముందున్న కొత్త సవాళ్లు.. బన్నీ ఏం చేస్తాడో? ) మిలింద్ సఫాయ్ మరాఠీ టీవీ సీరియల్ 'ఆయ్ కుతే కే కర్తే' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా మేకప్, థాంక్ యు విఠలా, పోస్టర్ బాయ్స్, చడీ లగే చమ్ చమ్, ప్రేమచి గోష్టా, టార్గెట్, బి పాజిటివ్ వంటి చిత్రాల్లో కూడా నటించారు. ఒకరోజు ముందే ఆగస్టు 24న ప్రముఖ మరాఠీ నటి సీమా డియో సైతం ముంబైలో తుది శ్వాస విడిచారు. ఆమె చాలా కాలంగా అల్జీమర్స్ వ్యాధితో పోరాడుతోంది. కాగా.. సీమా గతేడాది మృతి చెందిన ప్రముఖ నటుడు రమేష్ డియో భార్య. దీంతో వరుసగా ఇద్దరు నటీనటులు మృతి చెందడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. (ఇది చదవండి: ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ కమెడియన్.. కన్నీటిని ఆపుకుంటూ!) -
టీసీఎస్‌లో పెరిగిన మహిళా ఉద్యోగుల వలసలు
ముంబై: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ టీసీఎస్‌లో మహిళల అట్రిషన్ రేటు (వలసలు/కంపెనీని వీడడం) పురుషులతో సమాన స్థాయికి పెరిగింది. ఈ విషయాన్ని కంపెనీ మానవ వనరుల ముఖ్య అధికారి మిలింద్ లక్కడ్ వెల్లడించారు. చారిత్రకంగా చూస్తే పురుషుల కంటే మహిళా ఉద్యోగుల అట్రిషన్ రేటు తక్కువగా ఉండేదంటూ, ప్రస్తుత పరిస్థితిని అసాధారణంగా పేర్కొన్నారు. ఇంటి నుంచి పనిచేసే విధానానికి ముగింపు పలకడం ఇందుకు కారణం కావొచ్చన్నారు. టీసీఎస్ మొత్తం ఉద్యోగుల్లో 35 శాతం (6 లక్షల మందికి పైగా) మహిళలే కావడం గమనార్హం. ‘‘కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కారణంగా కొంత మంది మహిళలకు ఇంటి ఏర్పాట్ల విషయంలో మార్పులకు దారితీసి ఉండొచ్చు. ఇదే వారిని తిరిగి కార్యాలయాలకు రానీయకుండా చేయవచ్చు’’అని మిలింద్ లక్కడ్ కంపెనీ వార్షిక నివేదికలో అభిప్రాయపడ్డారు. లింగ వైవిధ్యం కోసం కృషి చేస్తున్న కంపెనీకి పెరిగిన మహిళల అట్రిషన్ రేటు ప్రతికూలమన్నారు. దీన్ని తగ్గించడంపై కంపెనీ దృష్టి పెడుతుందన్నారు. మార్చి నాటికి టీసీఎస్‌లో మొత్తం మీద అట్రిషన్ రేటు 20 శాతం స్థాయిలో ఉండడం గమనార్హం. రాజేజ్ గోపీనాథన్‌కు రూ.29 కోట్లు టీసీఎస్ సంస్థ 2022–23 సంవత్సరానికి గాను సీఈవో స్థానంలో ఉన్న రాజేష్ గోపీనాథన్‌కు రూ.29.16 కోట్ల పారితోషికాన్ని చెల్లించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 13.17 శాతం ఎక్కువ. ఆరేళ్లుగా టీసీఎస్‌ను నడిపించిన గోపీనాథన్ ఇటీవలే సీఈవోగా వైదొలగగా కే.కృతివాసన్ ఈ బాధ్యతల్లోకి రావడం తెలిసిందే. కొత్త సీఈవో కృతివాసన్‌కు ప్రతి నెలా రూ.10 లక్షలు బేసిక్ వేతనంగా కంపెనీ చెల్లించనుంది. ఇది రూ.16 లక్షల వరకు పెరుగుతూ వెళుతుంది. బోర్డు నిర్ణయించిన మేరకు కమీషన్, అద్దెలేని నివాస వసతి తదితర సదుపాయాలు కల్పించనున్నారు. ఇక కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణియమ్ గత ఆర్థిక సంవత్సరానికి రూ.23.60 కోట్ల పారితోషికాన్ని (13.58 శాతం అధికం) పొందారు. -
నా ప్రతి అడుగులో అతను ఉన్నాడు: యంగ్ హీరోయిన్
Avika Gor About Tenth Class Diaries Movie And Her Lover: ‘టెన్త్ క్లాస్ డైరీస్’ నా పాత్ర (చాందిని) చుట్టూ తిరుగుతుంది. చాందిని ఎక్కడ ఉంది? బతికి ఉందా? లేదా? అనే సస్పెన్స్ ఆసక్తికరంగా ఉంటుంది. చాందిని గురించి తెలుసుకోవాలని క్లాస్మేట్స్ ప్రయత్నిస్తారు. ఆ సస్పెన్స్ ఏంటో సినిమా చూసి తెలుసుకోవాలి’’ అని అవికా గోర్ అన్నారు. ‘గరుడవేగ’ కెమెరామేన్ అంజి దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అవికా గోర్, శ్రీరామ్ ముఖ్య పాత్రల్లో నటించారు. అజయ్ మైసూర్ సమర్పణలో అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ సినిమా జులై 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ.. ‘‘టెన్త్ క్లాస్ డైరీస్’ స్వీట్ మూవీ. టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ రీ యూనియన్ అయితే ఎలా ఉంటుందనేది చూపించారు. నేను పదో తరగతిలో ఉన్నప్పుడు ఒకవైపు ఎగ్జామ్స్ రాస్తూ.. మరోవైపు షూటింగ్స్ చేశాను. అచ్యుత రామారావు, రవితేజ మన్యం, అజయ్ మైసూర్ ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సురేష్ బొబ్బిలి మంచి మ్యూజిక్ ఇచ్చారు. శ్రీరామ్‌తో నటించినప్పుడు ఎంతో నేర్చుకున్నాను. చదవండి: హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. అంజి చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ఆయన సినిమాటోగ్రాఫర్ కూడా కావడంతో విజువల్స్ బాగా తీశారు. నేను హిందీ సీరియల్స్ చేస్తుండటం వల్ల కొద్ది రోజులు తెలుగు సినిమాలు చేయలేకపోయాను. ఇక నా ప్రతి అడుగులో మిళింద్ (ప్రేమికుణ్ణి ఉద్దేశించి) ఉన్నాడు. జులై 1న ‘టెన్త్ క్లాస్ డైరీస్’ విడుదలవుతోంది. కుదిరితే ఒక్క రోజు ముందు నా పుట్టిన రోజున (జూన్ 30) ఆ సినిమా చూడాలనుకుంటున్నాను. నేను నటించిన ‘థ్యాంక్యూ’ వచ్చే నెలలో రిలీజ్ కానుంది. మరో తెలుగు సినిమా చేస్తున్నాను’’ అని తెలిపింది. -
‘గడ్చిరోలి’ మృతుల్లో తేల్‌తుమ్డే
ముంబై/నాగ్‌పూర్: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందిన 26 మందిలో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్‌తుమ్డే ఉన్నట్లు పోలీసులు ఆదివారం ధ్రువీకరించారు. మర్దిన్‌తోలా అటవీప్రాంతంలోని కోర్చి సమీపంలో సి–60 పోలీస్ కమాండోలతో దాదాపు 10 గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో చనిపోయిన వారిలో మిలింద్ తేల్‌తుమ్డే కూడా ఉన్నట్లు పోలీసులు శనివారం అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎల్గార్ పరిషత్–మావోయిస్ట్ లింకుల కేసు లో ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన 26 మందిలో తేల్‌తుమ్డే కూడా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. మృతుల్లో 20 మంది పురుషులు కాగా ఆరుగురు మహిళలు. వీరిలో తేల్తుమ్డేకు బాడీగార్డులుగా వ్యవహరిస్తున్న ఒక మహిళ, పురుషుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు 29 ఆయుధాలతోపాటు మందుగుండు సామగ్రి, వాకీటాకీలు,విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల ముందే సమాచారం: కోర్చిలోని గ్యారపట్టి వద్ద మావోయిస్ట్‌ల శిబిరం ఉన్నట్లు తమకు రెండు రోజుల ముందే సమాచారం అందిందని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయెల్ చెప్పారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో సి–60 కమాండోలు, స్పెషల్ యాక్షన్ టీమ్‌లతోపాటు మొత్తం 300 మంది పోలీసు బలగాలు అదనపు ఎస్పీ సౌమ్య ముండే నేతృత్వంలో గురువారం రాత్రి నుంచి కూంబింగ్ ప్రారంభించారన్నారు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో వారికి తారసపడిన మావోయిస్టులు సుమారు 100 మంది అత్యాధునిక ఆయుధాలతో భారీ ఎత్తున కాల్పులకు దిగారన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్ట్‌లు చనిపోగా, నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మృతి చెందిన 26 మందిలో తేల్‌తుమ్డే సహా ఇప్పటి వరకు 16 మందిని గుర్తించినట్లు చెప్పారు. తేల్‌తుమ్డే తలపై రూ.50 లక్షల రివార్డు ఉందన్నారు. మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ మిలింద్ తేల్‌తుమ్డే మరణం దేశంలో మావోయిస్ట్ ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ అని గడ్చిరోలి రేంజ్ డీఐజీ సందీప్ పాటిల్ పేర్కొన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్(ఎంఎంసీ జోన్) పరిధిలో మావోయిస్ట్‌ల ఉద్యమానికి మిలింద్ కీలకంగా మారాడన్నారు. మహారాష్ట్రలో 20 ఏళ్లుగా నక్సల్ ఉద్యమం బలపడటంలో ఇతడు ముఖ్యుడని, ఇతడికి సాటి వచ్చే మావోయిస్ట్ నేతలు ఈ ప్రాంతంలో మరెవరూ లేరని చెప్పారు. ఎంఎంసీ జోన్ చీఫ్ ఇన్ఛార్జిగా, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో మహారాష్ట్రకు చెందిన ఏకైక నేత ఇతడేనన్నారు. కేంద్ర ప్రభుత్వ దృష్టిని కొండప్రాంతాల నుంచి ఎంఎంసీ జోన్ వైపు మళ్లించే బాధ్యతను కేంద్ర కమిటీ ఇతడికి అప్పగించిందని తెలిపారు. అటవీప్రాంతాలతోపాటు అర్బన్ నక్సల్ ఉద్యమంతో దగ్గరి సంబంధాలున్న మావోయిస్ట్ నేతల్లో మిలింద్ తేల్‌తుమ్డే ఒకడని చెప్పారు. మిలింద్ తేల్‌తుమ్డే హక్కుల కార్యకర్త ఆనంద్ తేల్తుమ్డేకు సోదరుడు. ఎల్గార్ పరిషత్ మావోయిస్ట్ లింకుల కేసులో అరెస్టయిన ఆనంద్ ప్రస్తుతం తలోజా జైలులో ఉన్నాడు. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో మిలింద్‌ను ప్రమాదకరమైన మావోయిస్ట్‌గా పేర్కొంది. మహారాష్ట్రలో 1996 నుంచి కొనసాగుతున్న మావోయిస్ట్ కార్యకలాపాల్లో ఇతనికి ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. ఇతడిపై గత ఐదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర భద్రతా విభాగాలు ఒక కన్నేసి ఉంచాయి. అజ్ఞాతంలో ఉన్న ఇతడు అనిల్, దీపక్, సహ్యాద్రి, కామ్రేడ్ ఎం.. వంటి పేర్లతో వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. బిహార్‌లో నక్సలైట్ల దాడిలో నలుగురి మృతి గయ(బిహార్): బిహార్‌లో నక్సలైట్లు ఓ ఇంటిని బాంబులతో పేల్చివేయడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. గయ జిల్లా దుమారియా పోలీసు స్టేషన్ పరిధిలో బిహార్–జార్ఖండ్ సరిహద్దుకు సమీపంలో ఈ సంఘటన జరిగింది. మావోయిస్టులు శనివారం రాత్రి సర్యూసింగ్ భోక్తా ఇంట్లో బాంబు అమర్చి పేల్చేశారు. ఆ సమయంలో సర్యూసింగ్ ఇంట్లో లేరు. పేలుడుతో సర్యూసింగ్ ఇద్దరు కుమారులు, వారి భార్యలు మృతిచెందారు. మృతదేహాలను నక్సలైట్లు పశువుల దొడ్డిలో స్తంభానికి వేలాడదీశారు. ఘటనా స్థలంలో ఒక కరపత్రాన్ని వదిలి వెళ్లారు. సర్యూసింగ్, ఆయన కుటుంబం పోలీసు ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్నందున వారిని శిక్షించామని అందులో పేర్కొన్నారు. -
Syed Mushtaq Ali Trophy: కెప్టెన్ సెంచరీ మిస్.. అయితేనేం భారీ విజయం
Hyderabad Beat Uttarakhand Tanmay And Milind Well Played - సుల్తాన్పూర్ (గురుగ్రామ్): సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఉత్తరాఖండ్ జట్టుతో శుక్రవారం జరిగిన ఎలైట్గ్రూప్ ‘ఈ’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (59 బంతుల్లో 97 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు. చివర్లో బుద్ధి రాహుల్ (13 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) కూడా దూకుడుగా ఆడాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు స్కోరు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాఖండ్ జట్టును హైదరాబాద్ జట్టు ఎడంచేతి వాటం పేస్ బౌలర్ సీవీ మిలింద్ (5/16) బెంబేలెత్తించాడు. దాంతో ఉత్తరాఖండ్ జట్టు 18.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్, రక్షణ్, తనయ్ త్యాగరాజన్, హనుమ విహారి, రోహిత్ రాయుడు ఒక్కో వికెట్ తీశారు. సౌరాష్ట్ర జట్టుతో గురువారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ప్రస్తుతం హైదరాబాద్ ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. చదవండి: Ravindra Jadeja: ఇంకేం చేస్తాం.. బ్యాగులు సర్దేసి ఇంటికి వెళ్తాం.. ఇచ్చిపడేశావ్ కదా భయ్యా! -
ఈ ఇడియట్ నావాడు: అవికా గోర్
'చిన్నారి పెళ్లి కూతురు' ఫేమ్, నటి అవికా గోర్ తన ప్రియుడిని పరిచయం చేశారు. మిలింద్ చంద్వానీతో ప్రేమలో మునిగి తేలుతున్నానని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించారు. తన జీవితంలో చిగురించిన ఈ ప్రేమ ప్రయాణం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘ లేఖను పంచుకున్నారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోలను సైతం పంచుకున్నారు. "నా ప్రార్థనలకు సమాధానం దొరికింది. నా లైఫ్‌లో లవ్ దొరికింది. ఇకపై ఇతడు నావాడు. నేను అతనికే చెందుతాను. మనల్ని అర్థం చేసుకుని, నమ్మకం ఉంచుతూ, స్ఫూర్తి నింపుతూ, ఎదుగుదలకు దోహదం చేస్తూ మనల్ని కంటికి రెప్పలా చూసుకునే వ్యక్తిని పొందేందుకు మనం అర్హులం. కానీ అలాంటి భాగస్వామి దొరకడం అసాధ్యమని చాలామంది అనుకుంటారు. కానీ నా విషయంలో మాత్రం ఇది నిజమైంది. అందుకే ఇదంతా ఇప్పటికీ కలలాగే అనిపిస్తోంది. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను. నేను ఎలా ఫీల్ అవుతున్నానో అది మీ అందరు కూడా ఫీలవ్వాలని ఆశిస్తున్నా" (చదవండి: ఆ కాలంలో ఒకరోజు!) "నాకు ఈ అనుభూతిని ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్క్షతలు. ఈ బంధం నా జీవితంలో కీలకంగా మారబోతోంది. కొంపదీసి పెళ్లనుకునేరు. కానే కాదు. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదు. నాకోసం, నన్ను ఎప్పటికీ సంతోషంగా ఉంచడం కోసం నా జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడు. దీన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ఇడియట్ నా హృదయాన్ని కదిలించాడు. నా జీవితానికి నిండుదనం తెచ్చినందుకు థ్యాంక్స్ మిలింద్. నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా.." అని సంతోష క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. కాగా బాలనటిగా కెరీర్ ఆరంభించిన అవికా గోర్ ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోయిన్గా మారారు. పలు చిత్రాల్లో నటించి మెప్పించిన అవికా లాక్డౌన్లో శరీరం మీద దృష్టి పెట్టి సుమారు 13 కిలోల వరకూ తగ్గారు. (చదవండి: బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్.. కానీ తెలుగులో!) View this post on Instagram La vie en rose. My prayers have been answered. I have found the love of my life! (Shiroo ke alava😂) This kind human is mine. And I’m his.. forever.. We all deserve a partner that understands us, believes in us, inspires us, helps us grow & truly cares for us. But, most of us feel that it's impossible to find such a partner. So, it feels like a dream, but it’s real! So so so real! I pray for all of you .. I want u all to feel what I’m feeling today.. Utmost joy.. Abundance of love.. My heart is so full and the feeling is precious. I thank God for giving me this experience that’s going to be most important chapter of my life... Haha... Nahi nahi, not getting married or anything so soon... Lekin log kya kahenge waale thoughts toh ab jaa chuke hai.. isiliye is pyaar ke baare mein khule aam batana chahti thi.. I feel so blessed and I feel this emotion right now for someone who entered my life with the intention of just making me smile.. Today I can proudly say that this idiot is making my heart smile.. Ufff ... challo itne paise mein itna hi milega🤓 isse zayada tareef karungi toh Mr. Chandwani chand tak udega.. 🤪 Well, I’m aware yeh kaafi ganda joke tha, but pura credit goes to his sense of humour! Like they say “sangat ka asar”😜 Challo jao sab khush raho ab 🥰 I love you from the bottom of my heart❤️Thanks for completing me. 😊 @milindchandwani Pc @j.v.d23 A post shared by Avika Gor (@avikagor) on Nov 11, 2020 at 4:43am PST -
‘దులీప్’ జట్లలో మిలింద్, సిరాజ్
సెప్టెంబర్ 7 నుంచి 29 వరకు టోర్నీ న్యూఢిల్లీ: దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్లలో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లకు చోటు దక్కింది. ఆంధ్ర ఆటగాడు కె. శ్రీకర్ భరత్... సురేశ్ రైనా సారథ్యంలోని భారత బ్లూ జట్టుకు ఎంపికయ్యాడు. గత సీజన్లో ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన భార్గవ్ భట్ కూడా ఇదే జట్టులో ఉన్నాడు. హైదరాబాద్ ఆల్‌రౌండర్ సీవీ మిలింద్, స్టార్ బ్యాట్స్‌మన్ అంబటి తిరుపతి రాయుడు, రాహుల్ సింగ్ భారత రెడ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు భారత గ్రీన్ జట్టులో చోటు దక్కింది. గాయంతో లంక టూర్‌కు దూరమైన భారత ఓపెనర్ మురళీ విజయ్ కూడా ఈ జట్టులోనే ఉన్నాడు. నాలుగు రోజుల మ్యాచ్‌లు వచ్చే నెల 7 నుంచి 29 వరకు కాన్పూర్, లక్నో వేదికల్లో జరుగుతాయి. మొదట్లో ఈ టోర్నీకి బీసీసీఐ వార్షిక షెడ్యూల్లో చోటు లేకపోయింది. గంగూలీ జోక్యంతో హడావుడిగా దీన్ని షెడ్యూలులో చేర్చారు. -
మిలింద్కు చోటు
బంగ్లాతో ప్రాక్టీస్‌కు భారత్ ‘ఎ’ జట్టు ప్రకటన న్యూఢిల్లీ: భారత్ ‘ఎ’ జట్టులో హైదరాబాదీ ఆటగాడు సి.వి.మిలింద్కు చోటు దక్కింది. బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. తమిళనాడుకు చెందిన అభినవ్ ముకుంద్ ‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ వచ్చే నెల 5, 6 తేదీల్లో జింఖానా గ్రౌండ్స్‌లో జరుగుతుంది. భారత్ ‘ఎ’ జట్టు: ముకుంద్ (కెప్టెన్), ప్రియాంక్ పంచాల్, శ్రేయస్ అయ్యర్, ఇషాంక్ జగ్గీ, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, షాబాజ్ నదీమ్, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అనికేత్ చౌదరి, సీవీ మిలింద్, నితిన్ సైని.