ఈ ఇడియ‌ట్ నావాడు: అవికా గోర్‌ | Avika Gor Found Her Love, Introduced Future Husband | Sakshi
Sakshi News home page

ప్రియుడిని ప‌రిచ‌యం చేసిన అవికా గోర్‌

Published Wed, Nov 11 2020 8:47 PM | Last Updated on Wed, Apr 28 2021 1:53 PM

Avika Gor Found Her Love, Introduced Future Husband - Sakshi

'చిన్నారి పెళ్లి కూతురు' ఫేమ్, న‌టి అవికా గోర్ త‌న ప్రియుడిని ప‌రిచ‌యం చేశారు. మిలింద్ చంద్వానీతో ప్రేమ‌లో మునిగి తేలుతున్నాన‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌కు వెల్ల‌డించారు. త‌న జీవితంలో చిగురించిన ఈ ప్రేమ ప్ర‌యాణం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘ లేఖ‌ను పంచుకున్నారు. ఆయ‌న‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ను సైతం పంచుకున్నారు.

"నా ప్రార్థ‌న‌ల‌కు స‌మాధానం దొరికింది. నా లైఫ్‌లో ల‌వ్ దొరికింది. ఇక‌పై ఇత‌డు నావాడు. నేను అత‌నికే చెందుతాను. మ‌న‌ల్ని అర్థం చేసుకుని, నమ్మ‌కం ఉంచుతూ, స్ఫూర్తి నింపుతూ, ఎదుగుద‌ల‌కు దోహ‌దం చేస్తూ మ‌న‌ల్ని కంటికి రెప్ప‌లా చూసుకునే వ్య‌క్తిని పొందేందుకు మ‌నం అర్హులం. కానీ అలాంటి భాగ‌స్వామి దొర‌క‌డం అసాధ్య‌మ‌ని చాలామంది అనుకుంటారు. కానీ నా విష‌యంలో మాత్రం ఇది నిజ‌మైంది. అందుకే ఇదంతా ఇప్ప‌టికీ క‌ల‌లాగే అనిపిస్తోంది. మీ అంద‌రి కోసం నేను ప్రార్థిస్తాను. నేను ఎలా ఫీల్ అవుతున్నానో అది మీ అంద‌రు కూడా ఫీల‌వ్వాల‌ని ఆశిస్తున్నా" (చ‌ద‌వండి: ఆ కాలంలో ఒకరోజు!)

"నాకు ఈ అనుభూతిని ఇచ్చినందుకు ఆ దేవుడికి కృత‌జ్క్ష‌త‌లు. ఈ బంధం నా జీవితంలో కీల‌కంగా మార‌బోతోంది. కొంప‌దీసి పెళ్ల‌నుకునేరు. కానే కాదు. ఇప్పుడ‌ప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్య‌మే లేదు. నాకోసం, న‌న్ను ఎప్ప‌టికీ సంతోషంగా ఉంచడం కోసం నా జీవితంలోకి ఓ వ్య‌క్తి వ‌చ్చాడు. దీన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ఇడియ‌ట్ నా హృద‌యాన్ని క‌దిలించాడు. నా జీవితానికి నిండుద‌నం తెచ్చినందుకు థ్యాంక్స్ మిలింద్‌. నిన్ను హృద‌య‌పూర్వ‌కంగా ప్రేమిస్తున్నా.." అని సంతోష క్ష‌ణాల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. కాగా బాల‌న‌టిగా కెరీర్ ఆరంభించిన అవికా గోర్ ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోయిన్‌గా మారారు. ప‌లు చిత్రాల్లో న‌టించి మెప్పించిన అవికా లాక్‌డౌన్‌లో శరీరం మీద దృష్టి పెట్టి సుమారు 13 కిలోల వరకూ తగ్గారు. (చ‌ద‌వండి: బాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌.. కానీ తెలుగులో!)

La vie en rose. My prayers have been answered. I have found the love of my life! (Shiroo ke alava😂) This kind human is mine. And I’m his.. forever.. We all deserve a partner that understands us, believes in us, inspires us, helps us grow & truly cares for us. But, most of us feel that it's impossible to find such a partner. So, it feels like a dream, but it’s real! So so so real! I pray for all of you .. I want u all to feel what I’m feeling today.. Utmost joy.. Abundance of love.. My heart is so full and the feeling is precious. I thank God for giving me this experience that’s going to be most important chapter of my life... Haha... Nahi nahi, not getting married or anything so soon... Lekin log kya kahenge waale thoughts toh ab jaa chuke hai.. isiliye is pyaar ke baare mein khule aam batana chahti thi.. I feel so blessed and I feel this emotion right now for someone who entered my life with the intention of just making me smile.. Today I can proudly say that this idiot is making my heart smile.. Ufff ... challo itne paise mein itna hi milega🤓 isse zayada tareef karungi toh Mr. Chandwani chand tak udega.. 🤪 Well, I’m aware yeh kaafi ganda joke tha, but pura credit goes to his sense of humour! Like they say “sangat ka asar”😜 Challo jao sab khush raho ab 🥰 I love you from the bottom of my heart❤️Thanks for completing me. 😊 @milindchandwani Pc @j.v.d23

A post shared by Avika Gor (@avikagor) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement