
Avika Gor About Tenth Class Diaries Movie And Her Lover: ‘టెన్త్ క్లాస్ డైరీస్’ నా పాత్ర (చాందిని) చుట్టూ తిరుగుతుంది. చాందిని ఎక్కడ ఉంది? బతికి ఉందా? లేదా? అనే సస్పెన్స్ ఆసక్తికరంగా ఉంటుంది. చాందిని గురించి తెలుసుకోవాలని క్లాస్‌మేట్స్ ప్రయత్నిస్తారు. ఆ సస్పెన్స్ ఏంటో సినిమా చూసి తెలుసుకోవాలి’’ అని అవికా గోర్ అన్నారు. ‘గరుడవేగ’ కెమెరామేన్ అంజి దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అవికా గోర్, శ్రీరామ్ ముఖ్య పాత్రల్లో నటించారు. అజయ్ మైసూర్ సమర్పణలో అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ సినిమా జులై 1న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ.. ‘‘టెన్త్ క్లాస్ డైరీస్’ స్వీట్ మూవీ. టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ రీ యూనియన్ అయితే ఎలా ఉంటుందనేది చూపించారు. నేను పదో తరగతిలో ఉన్నప్పుడు ఒకవైపు ఎగ్జామ్స్ రాస్తూ.. మరోవైపు షూటింగ్స్ చేశాను. అచ్యుత రామారావు, రవితేజ మన్యం, అజయ్ మైసూర్ ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సురేష్ బొబ్బిలి మంచి మ్యూజిక్ ఇచ్చారు. శ్రీరామ్‌తో నటించినప్పుడు ఎంతో నేర్చుకున్నాను.
చదవండి: హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్..
అంజి చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ఆయన సినిమాటోగ్రాఫర్ కూడా కావడంతో విజువల్స్ బాగా తీశారు. నేను హిందీ సీరియల్స్ చేస్తుండటం వల్ల కొద్ది రోజులు తెలుగు సినిమాలు చేయలేకపోయాను. ఇక నా ప్రతి అడుగులో మిళింద్ (ప్రేమికుణ్ణి ఉద్దేశించి) ఉన్నాడు. జులై 1న ‘టెన్త్ క్లాస్ డైరీస్’ విడుదలవుతోంది. కుదిరితే ఒక్క రోజు ముందు నా పుట్టిన రోజున (జూన్ 30) ఆ సినిమా చూడాలనుకుంటున్నాను. నేను నటించిన ‘థ్యాంక్యూ’ వచ్చే నెలలో రిలీజ్ కానుంది. మరో తెలుగు సినిమా చేస్తున్నాను’’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment