ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Lover Movie OTT Release Date And Streaming Details | Sakshi
Sakshi News home page

Lover Movie OTT: మూడు ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 'లవర్' మూవీ

Published Wed, Mar 13 2024 7:24 AM | Last Updated on Wed, Mar 13 2024 10:06 AM

Lover Movie OTT Release Date And Streaming Details - Sakshi

మరో రియలస్టిక్ ప్రేమకథా సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అప్పుడూ ఇప్పుడూ అంటూ ఊరిస్తూ వచ్చారు. కానీ ఫైనల్‌గా అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమా ఒకేసారి మూడు ఓటీటీల్లో రిలీజ్ కానుండటం విశేషం.

ప్రేమకథలకు సినిమాల్లో ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలా ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్న ఓ పాయింట్ ఆధారంగా తీసిన సినిమానే 'లవర్'. దీన్ని తెలుగులో 'ట్రూ లవర్' పేరుతో ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల చేశారు. తమిళంలో మోస్తరు వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తెలుగులో మాత్రం రూ.2 కోట్ల వరకే కలెక్షన్ అందుకుంది. కంటెంట్ బాగున్నా సరే రవితేజ 'ఈగల్', రజినీకాంత్ 'లాల్ సలామ్' మూవీస్.. అదే టైంలో రిలీజ్ కావడంతో దీనికి దెబ్బపడింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

'లవర్' సినిమా మార్చి తొలివారంలోనే ఓటీటీలోకి వచ్చేస్తుందని హడావుడి చేశారు కానీ ఇప్పుడు అధికారిక ప్రకటన రావడంతో అదంతా ఉత్తిదే అని తేలిపోయింది. మార్చి 27 నుంచి హాట్‌స్టార్, సింప్లీ సౌత్, టెంట్ కొట్టా అనే మూడు ఓటీటీల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. 

'లవర్' కథ విషయానికొస్తే.. అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీ గౌరిప్రియ).. ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడే ప్రేమలో పడతారు. దివ్య సెటిల్ అయిపోగా, అరుణ్ మాత్రం అలానే ఉండిపోతాడు. ప్రతి విషయంలో దివ్యని అనుమానిస్తుంటాడు. మరొకరితో మాట్లాడినా సహించలేడు. అరుణ్ ప్రవర్తనతో విసిగిపోయిన దివ్య.. బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. కానీ అరుణ్ సారీ చెప్పగానే కరిగిపోతుంది. అలాంటి వీళ్లిద్దరి జీవితాల్లో ఓ టూర్ కలకలం రేపుతోంది. చివరకు ఏమైంది? అనేదే మూవీ.

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement