ఓటీటీలోకి వచ్చేసిన ఎమోషనల్ ‘ట్రూ లవర్’ మూవీ | 'True Lover' Movie Is Now Streaming On This OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి వచ్చేసిన ఎమోషనల్ ‘ట్రూ లవర్’ మూవీ

Published Wed, Mar 27 2024 1:19 PM | Last Updated on Wed, Mar 27 2024 1:28 PM

True Lover Movie OTT Streaming Now - Sakshi

గుడ్‌నైట్‌ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మణికందన్, శ్రీగౌరి ప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లవర్’. తమిళంలో ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 10న 'ట్రూ లవర్‌'గా విడుదలై ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా కలెక్షన్స్‌ విషయంలో కాస్తా వెనుకపడినప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది.

ఎమోషనల్ లవ్ మూవీగా వచ్చిన ఈ చిత్రం  ఇప్పుడు, ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన 'హాట్‌స్టార్‌'లో ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తాజాగా విడుదలైంది. హాట్‌స్టార్, సింప్లీ సౌత్, టెంట్ కొట్టా అనే మూడు ఓటీటీల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.

'ట్రూ లవర్' కథ విషయానికొస్తే.. అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీ గౌరిప్రియ).. ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడే ప్రేమలో పడతారు. దివ్య సెటిల్ అయిపోగా, అరుణ్ మాత్రం అలానే ఉండిపోతాడు. ప్రతి విషయంలో దివ్యని అనుమానిస్తుంటాడు. మరొకరితో మాట్లాడినా సహించలేడు. అరుణ్ ప్రవర్తనతో విసిగిపోయిన దివ్య.. బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. కానీ అరుణ్ సారీ చెప్పగానే కరిగిపోతుంది. అలాంటి వీళ్లిద్దరి జీవితాల్లో ఓ టూర్ కలకలం రేపుతోంది. చివరకు ఏమైంది? అనేదే మూవీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement