True Lover Movie
-
హిట్ సినిమాలో రోల్.. నటిపై నెటిజన్స్ ట్రోలింగ్!
గుడ్‌నైట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మణికందన్, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం లవర్. తమిళంలో ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 10న 'ట్రూ లవర్'గా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్‌గా ఐషు పాత్రలో నటి హరిణి సుందరరాజన్ కనిపించింది. ప్రభు రామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన లవర్ మంచి హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకు నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైంది. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై సోషల్ మీడియా వేదికగా నటి మండిపడింది. మీరు నాపై కోపం ప్రదర్శించడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నా పాత్ర నచ్చకపోతే ఒక నటి పట్ల అలా నీచంగా, అగౌరవంగా ప్రవర్తించడం సరైంది కాదని ట్వీట్ చేసింది. ఇకనైనా ఇలాంటి విమర్శలకు ముగింపు పలకాలని కోరింది. కాగా.. హరిణి ఫింగర్‌టిప్ అనే తమిళ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. హీరోయిన్ స్నేహితురాలిగా.. లవర్ చిత్రంలో దివ్య (శ్రీ గౌరీ ప్రియ), అరుణ్ (మణికందన్) ప్రేమించుకుంటారు. అతనిపై అభద్రతా భావంతో అరుణను దివ్య తన మాటలతో దుర్భాషలాడుతూ ఉంటుంది. దీంతో అరుణ్‌కు బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. అదే సమయంలో దివ్యకి స్నేహితురాలైన ఐషూ అతనితో బంధానికి ముగింపు చెప్పమని సలహా ఇస్తుంది. దీంతో నెటిజన్ల దృష్టిలో ఐషూ ఒక చెడ్డ స్నేహితురాలిగా కనిపించింది. ప్రేమ జంటకు సమస్యలు సృష్టించారంటూ ఆన్లైన్ ట్రోలింగ్‌కు గురైంది. చాలామంది నెటిజన్స్ ఆమె పాత్రపై కామెంట్స్ చేయడంతో హరిణి స్పందించింది. అది కేవలం సినిమాలో పాత్ర మాత్రమేనని మీకు తెలియదా? అంటూ ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసింది. Secondly, don’t these thick heads realise that this behaviour only warrants the need for more Aishus? Disagreement does not have to be shown with disrespect. — Rini (@rinibot) April 10, 2024 This morning, I woke up to some idiots in my DMs swearing at me because they don’t like Aishu in Lover. Firstly, that they think it’s okay to be vile and disrespectful towards an actor because they didn’t like a character they played is beyond me. — Rini (@rinibot) April 10, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన ఎమోషనల్ ‘ట్రూ లవర్’ మూవీ
గుడ్‌నైట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మణికందన్, శ్రీగౌరి ప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లవర్’. తమిళంలో ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 10న 'ట్రూ లవర్'గా విడుదలై ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కాస్తా వెనుకపడినప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది. ఎమోషనల్ లవ్ మూవీగా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు, ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన 'హాట్‌స్టార్'లో ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తాజాగా విడుదలైంది. హాట్‌స్టార్, సింప్లీ సౌత్, టెంట్ కొట్టా అనే మూడు ఓటీటీల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. 'ట్రూ లవర్' కథ విషయానికొస్తే.. అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీ గౌరిప్రియ).. ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడే ప్రేమలో పడతారు. దివ్య సెటిల్ అయిపోగా, అరుణ్ మాత్రం అలానే ఉండిపోతాడు. ప్రతి విషయంలో దివ్యని అనుమానిస్తుంటాడు. మరొకరితో మాట్లాడినా సహించలేడు. అరుణ్ ప్రవర్తనతో విసిగిపోయిన దివ్య.. బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. కానీ అరుణ్ సారీ చెప్పగానే కరిగిపోతుంది. అలాంటి వీళ్లిద్దరి జీవితాల్లో ఓ టూర్ కలకలం రేపుతోంది. చివరకు ఏమైంది? అనేదే మూవీ. -
ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరో రియలస్టిక్ ప్రేమకథా సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అప్పుడూ ఇప్పుడూ అంటూ ఊరిస్తూ వచ్చారు. కానీ ఫైనల్‌గా అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమా ఒకేసారి మూడు ఓటీటీల్లో రిలీజ్ కానుండటం విశేషం. ప్రేమకథలకు సినిమాల్లో ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలా ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్న ఓ పాయింట్ ఆధారంగా తీసిన సినిమానే 'లవర్'. దీన్ని తెలుగులో 'ట్రూ లవర్' పేరుతో ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల చేశారు. తమిళంలో మోస్తరు వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తెలుగులో మాత్రం రూ.2 కోట్ల వరకే కలెక్షన్ అందుకుంది. కంటెంట్ బాగున్నా సరే రవితేజ 'ఈగల్', రజినీకాంత్ 'లాల్ సలామ్' మూవీస్.. అదే టైంలో రిలీజ్ కావడంతో దీనికి దెబ్బపడింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) 'లవర్' సినిమా మార్చి తొలివారంలోనే ఓటీటీలోకి వచ్చేస్తుందని హడావుడి చేశారు కానీ ఇప్పుడు అధికారిక ప్రకటన రావడంతో అదంతా ఉత్తిదే అని తేలిపోయింది. మార్చి 27 నుంచి హాట్‌స్టార్, సింప్లీ సౌత్, టెంట్ కొట్టా అనే మూడు ఓటీటీల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. 'లవర్' కథ విషయానికొస్తే.. అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీ గౌరిప్రియ).. ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడే ప్రేమలో పడతారు. దివ్య సెటిల్ అయిపోగా, అరుణ్ మాత్రం అలానే ఉండిపోతాడు. ప్రతి విషయంలో దివ్యని అనుమానిస్తుంటాడు. మరొకరితో మాట్లాడినా సహించలేడు. అరుణ్ ప్రవర్తనతో విసిగిపోయిన దివ్య.. బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. కానీ అరుణ్ సారీ చెప్పగానే కరిగిపోతుంది. అలాంటి వీళ్లిద్దరి జీవితాల్లో ఓ టూర్ కలకలం రేపుతోంది. చివరకు ఏమైంది? అనేదే మూవీ. (ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు) Love is Battle, Love is War, Love is Growing up! 🫶🏻 'LOVER' Arrives on March 27 on #DisneyplusHotstar @Vyaaaas @RSeanRoldan @Manikabali87 @srigouripriya @iamkannaravi @MillionOffl @Yuvrajganesan @mrp_entertain pic.twitter.com/1yuI8whZRf — Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) March 12, 2024 -
True Lover Movie Review: ‘ట్రూ లవర్’ మూవీ రివ్యూ
టైటిల్: ట్రూ లవర్ నటీనటులు: మణికందన్.కె, గౌరీ ప్రియా రెడ్డి, కన్నా రవి, హరీశ్ కుమార్, నిఖిల శంకర్ తదితరులు రచన, దర్వకత్వం: ప్రభు రామ్ వ్యాస్ నిర్మాతలు: హరీష్, యువరాజ్ తెలుగు విడుదల: మారుతి, ఎస్కేఎన్ సంగీతం: సీన్ రోల్డన్ సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ ఎడిటింగ్: భరత్ విక్రమన్ విడుదల తేది: ఫిబ్రవరి 10, 2024 కథేంటంటే.. అరుణ్(మణికందన్), దివ్య(గౌరీ ప్రియ) ఇద్దరు కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడతారు. కాలేజీ పూర్తి కాగానే దివ్యకు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అరుణ్ మాత్రం ఖాలీగా తిరుగుతూ.. కాఫీ కేఫ్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. తోటి ఉద్యోగులతో క్లోజ్ ఉండడంతో దివ్య ప్రేమ విషయంలో అరుణ్‌కి అభద్రతా భావం కలుగుతుంది. ప్రేమని వదిలి ఆమెను అనుమానించడం మొదలు పెడతాడు. దివ్య తన ఆఫీస్‌లో పని చేసే అబ్బాయిలతో మాట్లాడినా.. ఎక్కడికైనా వెళ్లినా సహించడు. ఆమెతో గొడవపడడం..మళ్లీ సారి చెప్పడం అరుణ్‌కి సర్వసాధారణం అయిపోతుంది. అరుణ్ ప్రవర్తన కారణంగా దివ్యకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అరుణ్ పొసెసివ్‌నెస్ దివ్యకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది? చివరకు వీళ్లిద్దరు కలిశారా? విడిపోయారా? కేఫ్ పెట్టాలన్న అరుణ్ లక్ష్యం నెరవేరిందా?లేదా? అన్నది మిగతా కథ. ఎలా ఉందంటే.. అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. ఒక్కసారి ఒకరిపై అనుమానం మొదలైతే..వాళ్లు ఏం చేసినా అది తప్పులాగే అనిపిస్తుంది. ఇక ఇద్దరి ప్రేమికుల మధ్య ఆవగింజంత అనుమానం ఉన్నా..అది ఆకాశమంత శోకాన్ని మిగులుస్తుంది. అనుమానం, అభద్రతా భావం పెట్టే మానసిక క్షోభ వర్ణణాతీతం. ట్రూ లవర్ కూడా ఓ అనుమానపు ప్రేమ కథే. అనుమానపు ప్రేమ కారణంగా ఓ జంట ఎంత మానసిక సంఘర్షణకు లోనయింది? అనేది ఈ సినిమా కథ. నేటితరం ప్రేమికులకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో చాలా నేచురల్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. రొమాన్స్, ఎమోషన్..ఫన్ అన్ని రకాల సన్నివేశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. నేటితరం ప్రేమికుల ఆలోచనా ధోరణికి అద్దం పట్టేలా కథను తీర్చిదిద్దారు. కేవలం ప్రేమ కథనే కాకుండా.. అరుణ్ ఫ్యామిలీ కథను కూడా చెప్పడం సినిమాకు ప్లస్ అయింది. అక్కడ ఎమోషన్ పండించేందుకు అవకాశం దక్కింది. అరుణ్, దివ్యల మధ్య ప్రేమ సమస్యలను చూపిస్తూ కథను ప్రారంభించాడు. దివ్య తోటి ఉద్యోగులతో మాట్లాడిన ప్రతిసారి అరుణ్ అనుమానం వ్యక్తం చేయడం..ఇద్దరి మధ్య గొడవలు.. మళ్లీ కలిసిపోవడం.. ఫస్టాఫ్ చాలా వరకు ఇలానే సాగుతుంది. అనుమానం కారణంగా దివ్య నిజాన్ని దాచేయడం.. ఆ విషయం అరుణ్‌కి తెలిస్తే ఎలా ప్రవర్తిస్తాడో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగిస్తూ కథనాన్ని నడిపించాడు దర్శకుడు. అయితే ఫస్టాఫ్‌లో చాలావరకు రిపీట్ సన్నివేశాల్లో ఉండడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. అరుణ్ అంత గొడవ చేస్తున్నప్పటికీ దివ్య ఎందుకు అతన్ని భరిస్తుందనే విషయాన్ని బలంగా చూపించలేకపోయాడు. అయితే హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమ కథ మాత్రం ఎంతో సహజంగా చిత్రీకరించారు. ఆ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. ఇంటర్వెల్ సీన్ ద్విదియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కూడా హీరో హీరోయిన్ల మధ్య గొడవలు కొనసాగుతూనే ఉంటాయి. అరుణ్ అమ్మ నాన్న రిలేషన్లో వచ్చిన సమస్యకి ఈ ప్రేమ కథతో ముడిపెట్టి చెప్పడం బాగుంది. అరుణ్‌కి తన తల్లికి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలో హీరోని ఎక్కువగా సిగరేట్ తాగుతూ..లేదా మద్యం సేవిస్తూ చూపించడం ఓ వర్గం ఆడియెన్స్‌కి ఇబ్బంది కలిగించొచ్చు. యూత్‌ని ఆకట్టుకోవడానికే హీరోని అలా చూపించారే తప్ప ఈ కథకు అవసరం లేదనిపిస్తుంది. ఓవరాల్‌గా ట్రూలవర్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నవారికి, బ్రేకప్ అయినవారికి నచ్చే అవకాశం ఉంది. . ఎవరెలా చేశారంటే.. అరుణ్ పాత్రలో మణికందన్ ఒదిగిపోయాడు. అనుమానపు ప్రేమికుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దివ్య పాత్రకి గౌరీ ప్రియ వంద శాతం న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించింది. తెరపై మణికందన్, గౌరీ ప్రియల కెమిస్ట్రీ బాగా పండింది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. స్నేహితుల పాత్రలు పోషించినవారంతా చక్కగా నటించారు. సాంకెతిక పరంగా సినిమా బాగుంది. సీన్ రోల్డన్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలతో పాటు బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
కంటెంట్‌పై మాకు నమ్మకం ఉంది.. అవి కేవలం రూమర్స్: బేబీ నిర్మాత
మణికందన్, గౌరి ప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "ట్రూ లవర్". ఈ విభిన్నమైన ప్రేమ కథ చిత్రాన్ని దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్కేఎన్, మారుతి పాల్గొన్నారు. నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ - 'ఈ సినిమా తమిళ ప్రీమియర్స్ చూసిన వాళ్లు ఇటీవల ఇలాంటి మంచి లవ్ స్టోరి రాలేదని చెబుతున్నారు. తెలుగు ఆడియెన్స్‌కు కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా బేబి సినిమాకు కూడా ఇలాగే ముందు రోజు ప్రీమియర్ వేశాం. కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. మారుతికి యూత్ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమా ఈ వాలెంటైన్ డే విన్నర్ అవుతుంది. రవితేజ ఈగల్తో మా సినిమాకు పోటీ లేదు. మాస్ మహారాజ్ రవితేజ అంటే నాకు ఇష్టం. నేను ఆయనతో ఓ సినిమా కూడా చేయాలని అనుకున్నా. బేబి హిందీ రీమేక్‌లో నేను నటిస్తున్నాననే అనే వార్తల్లో నిజం లేదు' అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ - 'నేను ఈ సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. తమిళ ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు చూస్తున్నప్పుడు అంతే సంతోషం కలిగింది. ఈ సినిమా కథను దర్శకుడు చాలా జెన్యూన్‌గా తెరకెక్కించాడు. అబ్బాయిలు, అమ్మాయిలే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఈ మూవీతో వాలెంటైన్స్ డే మర్చిపోలేకుండా ఉంటుందని చెప్పగలను. ప్రస్తుతం ప్రభాస్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నా. ఇదొక మంచి సినిమా కావడం వల్లే ఇంతగా ప్రమోట్ చేస్తున్నాం. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి పాయింట్‌తో సినిమా రాలేదు.' అన్నారు. -
‘ఈగల్’తో మాకు పోటీ లేదు: నిర్మాత ఎస్కేఎన్
‘ట్రూ లవర్’అనేది చిన్న సినిమా. చిన్న రిలీజ్. ఈగిల్‌తో పోటీ పడే పెద్ద సినిమా కాదు. అయినా కూడా హంబుల్ గా అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న నిర్ణయాన్ని తీసుకుని ఈ నెల 10వ తేదీన రిలీజ్ చేస్తున్నాం’ అని అన్నారు నిర్మాత ఎస్కేఎన్. డైరెక్టర్ మారుతితో కలిసి తమిళ మూవీ లవర్ ను "ట్రూ లవర్" పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఎస్కేఎన్. మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. విభిన్న ప్రేమ కథతో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఫిబ్రవరి 10న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్కేఎన్ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు.. ► ఒక ఫ్రెండ్ ద్వారా "ట్రూ లవర్" సినిమా మా దృష్టికి వచ్చింది. ఆయన మారుతిని కలిసి సినిమా చూడమని అన్నాడు. మారుతి నాకు చెప్పి నువ్వూ రా ఇద్దరం మూవీ చూద్దాం అన్నాడు. మా ఇద్దరికీ మూవీ నచ్చింది. దాంతో తెలుగులో చేద్దామని నిర్ణయించాం. ట్రూలవర్ ను మా ప్రీవియస్ మూవీ బేబితో పోల్చలేం. రెండు వేర్వేరు తరహా మూవీస్. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు తమతో పోల్చుకుంటారు. ప్రేమలో ఉన్న యువతకు రీచ్ అయ్యే సబ్జెక్ట్ ఇది.లవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు. తను ఎంచుకున్న కథకు డైరెక్టర్ పూర్తి న్యాయం చేశాడు. ►ఏ రిలేషన్ లోనైనా నమ్మకం అనేది పునాదిగా ఉంటుంది. ఉండాలి. "ట్రూ లవర్" సినిమాలో మెయిన్ పాయింట్ అదే. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా స్ట్రైకింగ్ గా అనిపించాయి. అవి చూసే సినిమా సక్సెస్ ను బిలీవ్ చేశా. ►నాకు సహజంగా లవ్ స్టోరీస్, యూత్ ఫుల్ మూవీస్ ఇష్టం. నేను మారుతి గారితో కలిసి చేసిన ఈ రోజుల్లో కూడా యూత్ ఫుల్ మూవీ. పెద్ద స్టార్స్ తో సినిమాలు చేస్తే దాని బడ్జెట్ ఎక్కువ కాబట్టి మేకింగ్ కు మేము ప్రిపేర్ కావాలి. కొత్త వాళ్లతో మూవీ చేసినప్పుడు కంటెంట్ యూత్ ఫుల్ గా ఉంటే ఆ సినిమాల రీచ్ బాగుంటుంది. నెక్ట్ నేను చేస్తున్న నాలుగు సినిమాల్లో మూడు యూత్ ఫుల్ మూవీస్ ఉంటాయి. ఒకటి సైన్స్ ఫిక్షన్ తో ఔటాఫ్ ది బాక్స్ గా ఉంటుంది. ►బేబి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాం. మరో ఒకట్రెండు వారాల్లో అనౌన్స్ చేస్తాం. హిందీలో స్టార్ కిడ్స్ లేదా కొత్త వాళ్లతో బేబీ రీమేక్ చేయాలనుకుంటున్నాం. సాయి రాజేశ్ హిందీలో డైరెక్టర్ చేయబోతున్నారు. అర్జున్ రెడ్డి ఇక్కడి కంటే హిందీలో హ్యూజ్ గా కలెక్షన్స్ చేసింది. బేబి కూడా అలాగే బాలీవుడ్ లో వైడ్ రేంజ్ కలెక్షన్స్ తెచ్చుకుంటుందని ఆశిస్తున్నా. ► ప్రస్తుతం సంతోష్ శోభన్, ఆనంద్ దేవరకొండతో సినిమాలు చేస్తున్నాను. అలాగే ఓ సూపర్ న్యాచురల్ మూవీ చేయాలి. సందీప్ రాజ్ తో కూడా ఓ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్ గా అప్పర్ ప్రైమరీ స్థాయిలో ఉన్నాను. కాలేజ్ స్థాయికి వచ్చాక అల్లు అర్జున్ తో సినిమా నిర్మిస్తా.