గుడ్‌నైట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మణికందన్, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం లవర్. తమిళంలో ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 10న 'ట్రూ లవర్'గా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్‌గా ఐషు పాత్రలో నటి హరిణి సుందరరాజన్ కనిపించింది. ప్రభు రామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన లవర్ మంచి హిట్‌గా నిలిచింది.
అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకు నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైంది. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై సోషల్ మీడియా వేదికగా నటి మండిపడింది. మీరు నాపై కోపం ప్రదర్శించడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నా పాత్ర నచ్చకపోతే ఒక నటి పట్ల అలా నీచంగా, అగౌరవంగా ప్రవర్తించడం సరైంది కాదని ట్వీట్ చేసింది. ఇకనైనా ఇలాంటి విమర్శలకు ముగింపు పలకాలని కోరింది. కాగా.. హరిణి ఫింగర్‌టిప్ అనే తమిళ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది.
హీరోయిన్ స్నేహితురాలిగా..
లవర్ చిత్రంలో దివ్య (శ్రీ గౌరీ ప్రియ), అరుణ్ (మణికందన్) ప్రేమించుకుంటారు. అతనిపై అభద్రతా భావంతో అరుణను దివ్య తన మాటలతో దుర్భాషలాడుతూ ఉంటుంది. దీంతో అరుణ్‌కు బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. అదే సమయంలో దివ్యకి స్నేహితురాలైన ఐషూ అతనితో బంధానికి ముగింపు చెప్పమని సలహా ఇస్తుంది. దీంతో నెటిజన్ల దృష్టిలో ఐషూ ఒక చెడ్డ స్నేహితురాలిగా కనిపించింది. ప్రేమ జంటకు సమస్యలు సృష్టించారంటూ ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు గురైంది. చాలామంది నెటిజన్స్ ఆమె పాత్రపై కామెంట్స్ చేయడంతో హరిణి స్పందించింది. అది కేవలం సినిమాలో పాత్ర మాత్రమేనని మీకు తెలియదా? అంటూ ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసింది.
Secondly, don’t these thick heads realise that this behaviour only warrants the need for more Aishus?
Disagreement does not have to be shown with disrespect.— Rini (@rinibot) April 10, 2024
This morning, I woke up to some idiots in my DMs swearing at me because they don’t like Aishu in Lover.
Firstly, that they think it’s okay to be vile and disrespectful towards an actor because they didn’t like a character they played is beyond me.— Rini (@rinibot) April 10, 2024
Comments
Please login to add a commentAdd a comment