harini
-
Harini Amarasuriya: శ్రీలంక ప్రధాని హరిణి.. హక్కుల చుక్కాని!
శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య. ప్రధాని కావడానికి ముందు పార్లమెంట్ సభ్యురాలు. ఎంపీ కావడానికి ముందు లెక్చరర్. లెక్చరర్‌కు ముందు, లెక్చరర్ అయిన తరువాత స్త్రీవాదం, నిరుద్యోగం, లింగ వివక్ష... ఇలా ఎన్నో సామాజిక అంశాలపై హక్కుల కార్యకర్తగా తన గొంతును బలంగా వినిపించింది. సమస్యలు తెలిసిన... సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ప్రధాని అయితే ఆ పాలన దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని చరిత్ర నిరూపించింది. ‘ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రయాణంతో శ్రీలంకలో మరో చరిత్ర మొదలుకానుంది’ అనే ఆశారేఖలు వెల్లివిరుస్తున్నాయి...కొలంబోలో పుట్టి పెరిగిన హరిణి అమరసూర్య హిందూ కాలేజ్, దిల్లీ యూనివర్శిటీలో బి.ఎ, సిడ్నీలోని మక్వరీ యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ అండ్ డెవలప్మెంట్లో ఎం.ఎ, ఎడిన్‌బరో యూనివర్శిటీలో సోషల్ ఆంత్రోపాలజీలో పీహెచ్డీ చేసింది. యూత్, పాలిటిక్స్, యాక్టివిజం, జెండర్, డెవలప్మెంట్, శిశు సంరక్షణ, గ్లోబలైజేషన్ అండ్ డెవలప్మెంట్... ఇలా ఎన్నో అంశాలపై లోతైన పరిశోధన చేసింది. పుస్తకాలు రాసింది. డిగ్రీ తరువాత శ్రీలంకలోని మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నెస్ట్’తో కలిసి పనిచేసింది హరిణి. ‘నెస్ట్’ వ్యవస్థాపకురాలైన సాలీ హులుగల్లే అట్టడుగు, అణగారిన వర్గాల కోసం పనిచేసింది. ‘నెస్ట్’ ద్వారా ఎంతో మార్పు తీసుకురాగలిగింది. ఆమె ప్రభావంతో మానసిక వైద్యశాలలలో ఎంతోకాలంగా దిక్కుమొక్కు లేకుండా పడి ఉన్న దీనులు, ఎవరూ పట్టించుకోని హెచ్ఐవీ బాధితులు, అనాథ పిల్లలతో కలిసి పనిచేసింది హరిణి.చైల్డ్ ప్రొటెక్షన్, సైకలాజికల్ ప్రాక్టీషనర్‌గా ఎన్నో సంవత్సరాలు పని చేసిన తరువాత శ్రీలంక ఓపెన్ యూనివర్శిటీలో లెక్చరర్‌గా చేరింది. యాక్టివిస్ట్‌గా ఉచిత విద్య కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది. ‘ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్’ సభ్యురాలైన హరిణి లింగసమానత్వం నుంచి జంతుసంక్షేమం వరకు ఎన్నో అంశాలపై తన గళాన్ని వినిపించింది.ఇక రాజకీయాల విషయానికి వస్తే... 2019లో ‘నేషనల్ ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్’లో చేరిన హరిణి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సమయంలో నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ) అభ్యర్థి అనురా కుమార దిస్సానాయకే తరఫున ప్రచారం చేసింది. 2020 శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల తరువాత ఎంపీగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టింది. ఎంపీగా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించడానికి లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అత్యున్నత పదవి విషయంలో ‘సరిౖయెన వ్యక్తి’ అనే ప్రశంస చాలా తక్కువమందికి లభిస్తుంది. ఇలాంటి వారిలో 54 సంవత్సరాల హరిణి అమరసూర్య ఒకరు. ‘ప్రధానిగా ఆమె సరిౖయెన వ్యక్తి’ అనేది ఇప్పుడు చాలామంది నోట వినిపిస్తున్న మాట.సమాజం అనే పుస్తకాన్ని చదివి..హరిణికి ఆంగ్ల సాహిత్యం అంటే చాలా ఇష్టం. ‘ఇంగ్లీష్ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని ఉంది’ అంటూ నాన్న స్నేహితుడైన మాజీ దౌత్యవేత్త దగ్గర తన మనసులో మాట బయటపెట్టింది. మొదట ఆయన ఎగతాళిగా నవ్వినా ఆ తరువాత మాత్రం ఆంగ్ల సాహిత్యంలోని ఎంతో మంది దిగ్గజ రచయితలను పరిచయం చేశాడు. వారి రచనలు చదువుతుంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపించింది. ‘ఆంగ్ల సాహిత్యంలోకి అడుగు పెట్టిన తరువాత నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది. ఆ తరువాత కాలంలో సాహిత్య అధ్యయనం కంటే నా చుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయాలనిపించింది’ అంటుంది హరిణి. పుస్తక ప్రపంచంలో కంటే సామాజిక ప్రపంచంలోనే ఆమెకు ఎక్కువ విషయాలు తెలిసాయి. నిరుద్యోగం నుంచి లింగ వివక్ష వరకు ఎన్నో సమస్యలను ప్రత్యక్షంగా చూసింది. ఆమె ఉద్యమకారిణిగా ప్రయాణంప్రారంభించడానికి, ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ‘సమాజం’ అనే పుస్తకం ఎంతో ఉపయోగపడింది.అవును... ఆమె దిల్లీ స్టూడెంట్!‘హిందూ కళాశాల పూర్వ విద్యార్థి అయిన హరిణి శ్రీలంక ప్రధాని కావడం మా కళాశాలకు గౌరవంగా భావిస్తున్నాను. ఆమె విజయం పట్ల మేము గర్వపడుతున్నాం. హరిణి సాధించిన విజయం మా కళాశాల చరిత్రలో మరో మైలురాయి. హిందూ కళాశాలలో హరిణి గడిపిన కాలం ఆమె నాయకత్వానికి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు ఆ కళాశాల ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ. హరిణి హిందూ కాలేజీలో 1991 నుండి 1994 వరకు చదివింది. బాలీవుడ్ దర్శకుడు నళిన్ రాజన్సింగ్ హిందూ కాలేజీలో హరిణి బ్యాచ్ మేట్.‘కాలేజీ ఉత్సవాలు, చర్చలలో హరిణి చురుగ్గా పాల్గొనేది. ఆమె ప్రధాని స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది’ అంటున్నాడు నళిన్ రాజన్సింగ్.ఇవి చదవండి: మహిళల ప్రపంచకప్ టికెట్ల విక్రయం షురూ -
శ్రీలంక ప్రధానిగా హరిణి
కొలంబో: శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య(54) ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగియడంతో సోమవారం ప్రధాని దినేశ్ గుణవర్థనే పదవికి రాజీనామా చేశారు. నూతన అధ్యక్షుడు అనూర కుమార దిస్స నాయకే మంగళవారం జరిగిన ఒక కార్య క్రమంలో హరిణితో ప్రధానిగా ప్రమాణం చేయించారు.ఎన్‌పీపీకే చెందిన విజితా హెరత్, లక్ష్మణ్ నిపుణ రచ్చిలతోపాటు అధ్యక్షుడు దిస్సనాయకే కూడా మంత్రిగా ప్రమాణం చేయడం గమనార్హం. నవంబర్ 14∙పార్లమెంట్ ఎన్నికలు జరిగేదాకా తాత్కాలిక కేబినెట్ పనిచేస్తుంది. పార్లమెంటును రద్దు చేస్తూ నూతన అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే మంగళవారం రాత్రి నిర్ణయం ఉత్తర్వులు జారీ చేశారు.బండారునాయకే తర్వాత: సిరిమావో బండారు నాయకే (2000) తర్వాత శ్రీలంక ప్రధాని అయిన తొలి మహిళగా హరిణి నిలిచారు. ఆమె హక్కుల కార్యకర్త. యూనివర్సిటీ లెక్చరర్‌గా చేస్తున్నారు.డిగ్రీ చదివింది ఢిల్లీలోనే..శ్రీలంక నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణి అమరసూర్య డిగ్రీ చదివింది ఢిల్లీ యూనివర్సిటీ లోనే. ఇక్కడి హిందూ కాలేజీలో 1991– 1994 సంవత్సరాల్లో సోషియాలజీలో బీఏ పూర్తి చేశారు. హిందూ కాలేజీ పూర్వ విద్యార్థిని శ్రీలంక ప్రధాని కావడం తమకెంతో గర్వకారణమని కాలేజీ ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ హర్షం వ్యక్తం చేశారు. హరిణి బ్యాచ్‌మేట్, బాలీవుడ్ డైరెక్టర్ నళినీ రంజన్ సింగ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. -
శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య
కొలంబో: శ్రీలకం నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె మంగళశారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొలంబోలో జరిగిన ఈ వేడుకలో శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే.. నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ)కి చెందిన 54 ఏళ్ల హరిణితో చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ఎన్పీపీకి చెందిన మరో ఇద్దరు పార్లమెంట్ ఎంపీలు విజితా హెరాత్, లక్ష్మణ్ నిపునరాచ్చిని కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో శ్రీలంకలో దిసనాయకే, హరిణితోసహా మొత్తం నలుగురి సభ్యులతో శ్రీలంక మంత్రివర్గం కొలువుదీరింది. ప్రధానితోపాటు ఆమెకు న్యాయం, విద్య, కార్మిక, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలకమైన మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు. ఇదిలా ఉండగా ఎన్నికల తర్వాత అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన ప్రధాని పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలను ప్రస్తుతం హరిణి చేపట్టారు. కాగా సిరిమావో బండారు నాయకే తర్వాత(2020 తర్వాత) ప్రధాని పదవి చేపట్టిన మొదటి మహిళా నేతగా హరిణి నిలిచారు.హక్కుల కార్యకర్తగా, యూనివర్సిటీ లెక్చరర్‌గా పనిచేసిన అమరసూర్య శ్రీలంకలో సామాజిక న్యాయం, విద్యకు గణనీయమైన కృషి చేశారు. ఆమె నియామకం రాజకీయాల్లో మహిళలకు పురోగతిని సూచించడమే కాకుండా ప్రగతిశీల నాయకత్వం, సంస్కరణపై ఎన్పీపీ దృష్టిని నొక్కి చెబుతుంది. ఇక శ్రీలంకకు మూడో మహిళా ప్రధానిగా హరిణి చరిత్ర సృష్టించారు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన బండారునాయకే తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం మూడుసార్లు(1960–65, 1970–77, 1994–2000) ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలో ఆ పదవిని అధిరోహించిన మొదటి మహిళగా ఖ్యాతికెక్కారు. ఆమె తర్వాత చంద్రికా కుమారతుంగ(1994) ప్రధాని పదవిలో రెండు నెలలు కొనసాగారు.ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే సంచలన విజయంతో శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పార్లమెంట్‌ను రెండు రోజుల్లో రద్దు చేస్తామని దిసనాయకే సోమవారం చెప్పడంతో శ్రీలంకలో ముందస్తు పార్లమెంటు ఎన్నికలు నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది. -
హిట్ సినిమాలో రోల్.. నటిపై నెటిజన్స్ ట్రోలింగ్!
గుడ్‌నైట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మణికందన్, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం లవర్. తమిళంలో ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 10న 'ట్రూ లవర్'గా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్‌గా ఐషు పాత్రలో నటి హరిణి సుందరరాజన్ కనిపించింది. ప్రభు రామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన లవర్ మంచి హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకు నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైంది. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై సోషల్ మీడియా వేదికగా నటి మండిపడింది. మీరు నాపై కోపం ప్రదర్శించడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నా పాత్ర నచ్చకపోతే ఒక నటి పట్ల అలా నీచంగా, అగౌరవంగా ప్రవర్తించడం సరైంది కాదని ట్వీట్ చేసింది. ఇకనైనా ఇలాంటి విమర్శలకు ముగింపు పలకాలని కోరింది. కాగా.. హరిణి ఫింగర్‌టిప్ అనే తమిళ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. హీరోయిన్ స్నేహితురాలిగా.. లవర్ చిత్రంలో దివ్య (శ్రీ గౌరీ ప్రియ), అరుణ్ (మణికందన్) ప్రేమించుకుంటారు. అతనిపై అభద్రతా భావంతో అరుణను దివ్య తన మాటలతో దుర్భాషలాడుతూ ఉంటుంది. దీంతో అరుణ్‌కు బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. అదే సమయంలో దివ్యకి స్నేహితురాలైన ఐషూ అతనితో బంధానికి ముగింపు చెప్పమని సలహా ఇస్తుంది. దీంతో నెటిజన్ల దృష్టిలో ఐషూ ఒక చెడ్డ స్నేహితురాలిగా కనిపించింది. ప్రేమ జంటకు సమస్యలు సృష్టించారంటూ ఆన్లైన్ ట్రోలింగ్‌కు గురైంది. చాలామంది నెటిజన్స్ ఆమె పాత్రపై కామెంట్స్ చేయడంతో హరిణి స్పందించింది. అది కేవలం సినిమాలో పాత్ర మాత్రమేనని మీకు తెలియదా? అంటూ ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసింది. Secondly, don’t these thick heads realise that this behaviour only warrants the need for more Aishus? Disagreement does not have to be shown with disrespect. — Rini (@rinibot) April 10, 2024 This morning, I woke up to some idiots in my DMs swearing at me because they don’t like Aishu in Lover. Firstly, that they think it’s okay to be vile and disrespectful towards an actor because they didn’t like a character they played is beyond me. — Rini (@rinibot) April 10, 2024 -
పిచ్చుకా క్షేమమా
మనిషి తన సౌకర్యం కోసం ప్రకృతి సమతుల్యతకు విఘాతం కలిగిస్తూనే ఉంటాడు. ప్రకృతి సహనంతో ఓర్చుకుంటూ, అప్పుడప్పుడూ విలయం రూపంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. మొత్తంగా తనను తాను సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు’... అని పిచ్చుకలు ఆవేదన చెందుతున్న సమయంలో ప్రకృతి ఓ అమ్మాయి మనసును కదిలించింది. ఆమె ఇప్పుడు పక్షి ప్రేమికురాలైంది. తన ఇంటిని పక్షులకు విలాసంగా మార్చింది. తాను పక్షి ప్రేమికురాలిగా మారిన సందర్భాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు మంచాల హరిణి. అడవికి దాహం వేసింది! ‘‘అప్పుడు నేను బీబీఏ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. అమ్మా నాన్న, నేను, అక్క అందరం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మా పెద్ద నానమ్మ వాళ్ల ఊరికి వెళ్తున్నాం. నిర్మల్ దాటి కడెం మీదుగా అడవిలో ప్రయాణిస్తున్నాం. మే నెల కావడంతో ఎండ తీవ్రంగా ఉంది. చెట్ల మొదళ్లు ఎండిపోయి వానల కోసం ఎదురు చూస్తున్నాయి. ఓ పక్షి మా కళ్ల ముందే చెట్టుకొమ్మ మీద నుంచి జారి నేల మీద పడింది. కొద్ది సెకన్లపాటు రెక్కలు కొట్టుకున్నాయి. కారాపి వెళ్లి చూశాం, పక్షిని చేతుల్లోకి తీసుకుని మా దగ్గరున్న నీటిని చల్లి, తాగించడానికి ప్రయత్నించాం. కానీ ఆ పక్షి అప్పటికేప్రాణాలు వదిలేసింది. ఆ చిన్నప్రాణికి ఎన్ని నీళ్లు కావాలి, ఆ గుక్కెడు నీళ్లు లేకనే కదాప్రాణం పోయిందని చాలా బాధేసింది. ఆ దృశ్యం పదే పదే కళ్ల ముందు మెదలసాగింది. ఇలాగ ఒక్కో వేసవికి ఎన్ని పక్షులుప్రాణాలు కోల్పోతున్నాయో కదా... అనిపించింది. ఏదైనా చేయాలనిపించింది. కానీ ఏం చేయాలనేది వెంటనే స్ఫురించ లేదు. పిచ్చుకలు వచ్చాయి! పక్షులకు నీటికోసం ఇంటిముందు చిన్న పాత్రలో నీటిని పెట్టడం మొదలు పెట్టాను. పావురాలు ఇతర పక్షుల కంటే పిచ్చుకలే ఎక్కువగా రాసాగాయి. దాంతో పర్మినెంట్ సొల్యూషన్ కోసం ఆలోచించిస్తున్నప్పుడు పిచ్చుకల సైజ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని ఫీడర్ బాక్స్ డిజైన్ చేశాను. ఇందుకోసం ఇంటర్నెట్లో చాలా సెర్చ్ చేశాను. మహారాష్ట్ర, నాసిక్‌లోని ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్లతో మాట్లాడి నాక్కావలసిన డిజైన్‌ను వివరించాను. వాళ్లు రఫ్ తయారు చేసి వాట్సాప్‌లో పంపించేవారు. ప్లాస్టిక్ డబ్బాకు కిటికీల్లాగ ఓపెన్‌గా ఉంచి చిన్న ప్లాస్టిక్ రాడ్‌ను పెట్టించాను. పక్షి ఆ రాడ్ మీద నిలబడి, తెరిచి ఉన్న కిటికీలో ముక్కు పెట్టి గింజలను తింటుంది. నీటి కోసం డబ్బా కింద సాసర్ పెట్టించాను. నాకు సంతృప్తి కలిగే వరకు డిజైన్‌ను మారుస్తూ చేసిచ్చారు వాళ్లు. ఐదేళ్ల కిందట ఇదే తొలి డిజైన్. మొదట వంద పీస్‌లు చేయించి బంధువులు, స్నేహితులకిచ్చాను. తర్వాత అందరూ అడుగుతుండడంతో పెద్ద మొత్తంలో చేయిస్తున్నాం. తాతయ్య పేరుతో ‘మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా అందరికీ పంచుతున్నాం. ఒక మంచి పని చేయడం, అది కూడా మా తాతయ్య పేరుతో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి రెండువేలకు పైగా ఇలాంటి డబ్బాలను పంచాను. ఇప్పుడు నేను యూఎస్‌లో పీజీ చేస్తున్నాను. నేను మొదలు పెట్టిన పనిని మా నాన్న కొనసాగిస్తున్నారు. మా చేతిమీదుగా ఈ బర్డ్ ఫీడర్ బాక్స్‌లు అటు ఆదిలాబాద్, నాందేడ్ వరకు, ఇటు హైదరాబాద్, సూర్యాపేట, గుంటూరుకు కూడా చేరాయి. ఈ బాక్స్ కావాలని ఎవరడిగినా వాళ్ల అడ్రస్ పంపిస్తే చాలు కొరియర్ చార్జ్‌లు కూడా మేమే భరించి ఉచితంగా పంపిస్తాం. వంద మాటలు చెప్పడం కంటే ఒక మంచి పని చేయడం మేలని నమ్ముతాను. ఐదేళ్ల నుంచి ఈ పని చేస్తున్నప్పటికీ నేను ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. ఐ లవ్ స్పారోస్ అనేది ఈ ఏడాది వరల్డ్ స్పారో డే (మార్చి 20)సందర్భంగా ప్రపంచం ఇచ్చిన పిలుపు. కానీ నేను పిచ్చుకలను ప్రేమించడం ఎప్పుడో మొదలైంది. నేను అందరినీ కోరుకునేది ఒక్కటే. ఆ చిన్నప్రాణుల కోసం రోజూ ఓ లీటరు నీటిని పెడదాం’’ అన్నారు మంచాల హరిణి. చుక్క నీరుంటే చాలు! గుప్పెట్లో పట్టుకుంటే నిండా గుప్పెడంత కూడా ఉండదు. పిచ్చుకంతప్రాణం, రేడియేషన్ బారిన పడి అల్లాడిపోతోంది. అభివృద్ధి పేరుతో మనిషి చేసే అరాచకానికి భయపడిపోతోంది. మనిషి కంటపడకుండా పారిపోతోంది. ఏకంగా ఈ భూమ్మీద నుంచే మాయమైపోదామనుకుంటోంది. మనసున్న మనిషి కరవైన నేల మీద తనకు మనుగడ లేదని ఊరు వదిలి పారిపోయింది. అడవుల బాట పట్టి ఏ చెట్టుకొమ్మనో తనను తాను దాచుకుంటూ నీటిచుక్క కోసం వెతుక్కుంటోంది. మనిషి మనసులో ఆర్ద్రత, గుండెలో తడి ఉందని తెలిసిన పిచ్చుక మళ్లీ రెక్కలు టపటపలాడిస్తోంది. వందలాది బంధుగణంతో నిజామాబాద్‌లో మంచాల హరిణి ఇంటి ముందు కొలువుదీరింది. ఈ మాత్రం ఆలంబన దొరికితే చాలు... కిచకిచలతో ఊరంతటికీ వీనులవిందు చేస్తానంటోంది పిచ్చుక. – వాకా మంజులారెడ్డి -
ప్రతిభ..: జయం మనదే!
అమెరికాలో స్పెల్లింగ్ బీ పోటీలకు పెద్ద చరిత్ర, ఘనత ఉన్నాయి. ఆ చరిత్రను భారత సంతతికి చెందిన పిల్లలు తమ ఘనతతో తిరగరాస్తున్నారు. గెలుపు జెండా ఎగరేస్తున్నారు... తాజాగా పద్నాలుగు సంవత్సరాల హరిణి లోగాన్ ‘2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీ విజేతగా నిలిచింది... ఒక పదం స్పెల్లింగ్ పలకడమే కాదు, దాని అర్థం కూడా చెప్పాలని ఈసారి కొత్త నిబంధన చేర్చారు. ఈ ప్రభావంతో చాలామంది ఫైనల్ వరకు చేరుకోలేకపోయారు. విక్రమ్‌రాజు, సహన శ్రీకాంత్, అభిలాష పటేల్, శివకుమార్... మొదలైన వారితోపాటు ఫైనల్లో పోటీ పడింది హరిణి. ఒక పదానికి హరిణి ఇచ్చిన నిర్వచనం తప్పేమీ కాదని న్యాయనిర్ణేతలు ప్రకటించడం ద్వారా ‘ఎలిమినేట్’ ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. 90 సెకండ్ల లైటినింగ్ రౌండ్ గతంలో లేనిది. ఈ రౌండ్లో 90 సెకన్లలో హరిణి 26 పదాలకు 21 పదాల స్పెల్లింగ్ కరెక్ట్‌గా చెప్పింది. తొలిసారిగా ప్రవేశపెట్టిన టై బ్రేకర్‌లో విజయం సాధించింది. విక్టరీ ట్రోఫీని అందుకొని 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. ‘కల నిజం అయినందుకు ఆనందంగా ఉంది. ఈ గెలుపు ఉత్సాహాన్ని ఇవ్వడమే కాదు ముందుకు వెళ్లడానికి శక్తిని ఇచ్చింది’ అంటుంది టెక్సాస్‌లోని సాన్ ఆంటోనియోకు చెందిన హరిణి. అయితే ఆమె సంతోషం వెనుక ఎంతో కష్టం ఉంది. ‘స్పెల్లింగ్ బీ’ బరిలోకి దిగే క్రమంలో రోజుకు ఆరు నుంచి ఎనిమిదిగంటల పాటు కష్టపడేది. ‘పోటీ సంగతి ఎలా ఉన్నా, ప్రిపేర్ అవుతున్న క్రమంలో రకరకాల కొత్త పదాలు, వాటిద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాను’ అంటుంది హరిణి. గత విజేతల విజయాలు హరిణిలో స్ఫూర్తి నింపాయి. ‘ఈసారి విన్నర్ ట్రోఫీని నేను అందుకోవాల్సిందే’ అనే పట్టుదల పెంచాయి. పోటీదారుల ఒత్తిడి ఎలా ఉన్నా, ప్రేక్షకులు మాత్రం ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను చూసినంత ఉత్కంఠగా స్పెల్లింగ్ బీ పోటీని చూశారు. కోవిడ్ పుణ్యమా అని గత రెండు సంవత్సరాలు ఈ ఉత్సాహం మిస్ అయింది. ‘తాను ఎంతో కష్టపడింది అని ఆమె విజయం చెప్పకనే చెప్పింది’ అంటూ హరిణిని ప్రశంసిస్తున్నారు ‘వర్డ్ బై వర్డ్: ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ డిక్షనరీస్’ రచయిత కొరి స్టాంపర్. హరిణికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. హైస్కూల్లో చదువుతున్నప్పుడే పుస్తకం రాసే ప్రయత్నం చేసింది. విజయం కోసం తాను పడిన కష్టాన్నే అక్షరీకరిస్తే ఎంతోమందికి అది స్ఫూర్తి ఇచ్చే పుస్తకం అవుతుంది కదా! -
వారి వంచనే ముంచిందా..?
బనశంకరి: అనుమానాస్పదంగా మృతిచెందిన ప్రొఫెసర్ ఏకే రావు కేసులో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఒక ముఠా చేసిన భారీ మోసమే ఆయన మృతికి కారణమని తెలుస్తోంది. దీనికి బలం చేకూరేలా ఏకే రావు చనిపోయే రోజు పోలీసుల విచారణ ఎదుర్కొన్నారని తేలింది. తెలుగు గాయని హరిణి తండ్రి, విశ్రాంత ప్రొఫెసర్ ఏకే రావు 23వ తేదీ బెంగళూర్‌లో యలహంక–రాజానుకుంటే రైల్వే పట్టాలపై శవమై కనిపించారు. చాకుతో గొంతు, ఎడమ చేతిని కోసిన గుర్తులు కనిపించాయి. ఇది హత్యేనని కుటుంబ సభ్యులు యశవంతపుర రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పదవీ విరమణ తరువాత లోన్ కన్సల్టెన్సీ.. రావు మృతి చెందక ముందు కర్ణాటక సుద్దగుంటెపాళ్య పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన ఇటీవల పదవీవిరమణ పొందారు. తరువాత బెంగళూర్‌లో లోన్ కన్సల్టెన్సీ ఏజెన్సీని తెరిచారు. ఈ సమయంలో రావుకు, ఎస్ వెంచర్స్ కేపిటల్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన డేనియల్ ఆర్మ్‌స్ట్రాంగ్, రాఘవన్, వివేకానంద అనే వ్యక్తులు పరిచయమయ్యారు. తాము భారీ ప్రాజెక్టులకు రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. దీంతో రావు తన లోన్ కన్సల్టెన్సీ ద్వారా రుణాలు అడిగిన అరుణాచలప్రదేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణి తారంగ, బెంగళూర్ పారిశ్రామిక వేత్త గిరీశ్‌లను వారి వద్దకు పంపారు. లోన్లు ఇస్తామని, అయితే 3 నెలల ఈఎంఐ ముందుగా చెల్లించాలని ఆర్మ్‌స్ట్రాంగ్ బృందం చెప్పగా ఫణి తారంగ, గిరీశ్ సరేనన్నారు. రూ.240 కోట్ల లోన్‌కు ఫణి తారంగ రూ.3.60 కోట్లు, గిరీశ్ రూ.150 కోట్లకు రూ.3 కోట్లు ముందస్తుగా ఈఎంఐ చెల్లించారు. ఆ తరువాత ఆర్మ్‌స్ట్రాంగ్ బృందం ఫోన్లు స్విచాఫ్ చేసుకుని పరారైంది. దీంతో ఫణి తారంగ, గిరీశ్‌లు రావును నిలదీయడంతో పాటు స్థానిక సుద్దగుంటపాళ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రావును విచారణకు పిలిపించి పంపించినట్లు సమాచారం. ఫైనాన్షియర్లు నమ్మించి మోసం చేశారని రావు స్నేహితుల వద్ద వాపోయారు. అనంతరం కొద్దిసేపటికి ఏకే రావు రైల్వేట్రాక్‌పై శవమై కనిపించారు. ఈ నేపథ్యంలో ఆర్మ్‌స్ట్రాంగ్, వివేకానంద, రాఘవన్ కోసం సుద్దగుంటెపాళ్య పోలీసులు గాలిస్తున్నారు. -
ఏకే రావు ఉదంతంలో అనేక అనుమానాలు.. ఆత్మ‘హత్యా’?
సాక్షి, హైదరాబాద్: సుజనా ఫౌండేషన్ సీఈఓ, సినీ నేపథ్య గాయని హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి మిస్టరీగా మారింది. ఘటనాస్థలిలోని ఆధారాలు ఇది హత్య అనడానికి అనుమానాలు కలిగిస్తుండగా... కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఈ ఉదంతాన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు సిటీ రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.శివకుమార్ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీలో నివసించే ఏకే రావు గతంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు డైరెక్టర్‌గా పని చేశారు. చదవండి: సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. ‘ఆ 4 రోజుల్లో ఏం జరిగింది?’ బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారికి ఫిర్యాదు మేరకు అక్కడి సుద్ధగుంటపాళ్య పోలీసుస్టేషన్లో నమోదైన కేసుతో రావుకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇందులో నిందితులుగా ఉన్న ముగ్గురితో రావు సంప్రదింపులు జరిపారని సమాచారం. ఈ నెల 13న బెంగళూరు వెళ్లిన ఏకే రావు అక్కడి అశోక్‌నగర్ ప్రాంతంలో ఉన్న ది చాన్సరీ పెవిలియన్ హోటల్లో బస చేశారు. ఆఖరుసారిగా ఈ నెల 19న కుటుంబీకులతో మాట్లాడారు. సోమవారం రాత్రి క్యాబ్ బుక్ చేసుకున్న అతను హోటల్ నుంచి యలహంక రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ క్యాబ్ దిగిన ఆయన ఆ తర్వాత ఆదృశ్యమయ్యాడు. మంగళవారం ఉదయం యలహంక రైల్వేస్టేషన్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన లోకో పైలెట్ యలహంక రైల్వేస్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇచ్చారు. చదవండి: తెలుగు గాయని హరిణి తండ్రిది హత్యే ఆయన సిటీ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. మృతదేహన్ని పరిశీలించిన పోలీసులు ఎడమ చేతి మణికట్టపై రెండు కత్తిగాట్లు, మెడకు ఎడమ వైపు మరో గాటు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహం పక్కనే ఓ కత్తి, బ్లేడ్‌తో పాటు రెండు కత్తెరలను స్వాధీనం చేసుకున్నారు. నరాలు కోసుకోవడం ద్వారా ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తే ఆ మూడింటిలో ఏదో ఒకటి తీసుకుని వస్తారని, అయితే ఇన్ని రకాలైనవి ఎందుకు తెచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్స్పెక్టర్ వి.శివకుమార్ శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఏకే రావు కుమార్తె శాలినీ రావు ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశామన్నారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం చేసిన ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమికంగా ఆత్మహత్యగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన నివేదిక రెండుమూడు రోజుల్లో వస్తుంది. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. సుద్ధగుంటపాళ్య పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో నిందితులుగా ఉన్న వారితో పాటు ఫిర్యాదుదారుడినీ ప్రశ్నిస్తున్నాం’ అని తెలిపారు. మరోపక్క ఏకే రావు కుటుంబం శ్రీనగర్‌కాలనీలో నివసిస్తోందని తెలిసిందని, అంతకు మించి తమకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదులు లేవని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. -
తెలుగు గాయని హరిణి తండ్రిది హత్యే
సాక్షి, బెంగళూరు: తెలుగు గాయని హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్ సీఈవో ఏకే రావుది హత్యేనని పోస్టుమార్టం నివేదికలో తేలింది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏకే రావు సుమారు వారం రోజుల కింద కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ నెల 22న కర్ణాటకలోని యలహంక–రాజన్‌కుంటె స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై ఏకే రావు మృతదేహం లభించింది. చదవండి: సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. ‘ఆ 4 రోజుల్లో ఏం జరిగింది?’ కర్ణాటక పోలీసులు తొలుత ఆయనది ఆత్మహత్యగా భావించినా.. మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అక్కడి ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా.. ఏకే రావు శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయని, అది హత్యేనని వైద్యులు నిర్ధారించినట్టు పోలీసులు తెలిపారు. -
సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. ‘ఆ 4 రోజుల్లో ఏం జరిగింది?’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని హరిణి తండ్రి ఏకే రావు మృతి చెందిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై అనుమానస్పద స్థితిలో ఆయన మృతదేహం లభ్యమయ్యింది. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు దీన్ని హత్య కేసుగా నమోదు చేశారు. సెక్షన్ 302, 201 ప్రకారం కేసు నమోదు చేశారు. ఏకే రావు శరీరం పై కత్తి గాయాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఏకే రావు నవంబర్ 8 న హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. చివరిసారిగా ఆయన ఈ నెల 19 న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. నాలుగు రోజుల తర్వాత అనగా నవంబర్ 23 న ఏకే రావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఈ నాలుగు రోజుల్లో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. ఈ క్రమంలో ఏకే రావుది హత్యే అంటూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బెంగళూరులోనే ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు ఏకే రావు కుటుంబ సభ్యులు. ఆయనది హత్యనా, ఆత్మహత్యనా అన్న కోణంలో బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ప్రముఖ సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. కుటుంబం అదృశ్యం!) ఎఫ్ఐఆర్లో ఏం ఉంది అంటే.. ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 23 తేదీన యలహంక, రాజనా కుంటు రైల్వే స్టేషన్ మధ్య ఏకే రావు మృత దేహం గుర్తించాము. నాందేడ్ ఎక్స్ ప్రెస్ కో పైలెట్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్నాం. యలహంక రైల్వే ట్రాక్ పైన బోర్ల పడి ఉన్న మృత దేహాన్ని గుర్తించాము. తల ఎడమ వైపు ఆరు సెంటిమీటర్లు గాయం.. ఎడమ చేతికి , గొంతుపై గాయాలు ఉన్నట్లు గుర్తించాము. ఘటన స్థలంలో చాకు, కత్తి, బ్లెడ్‌ని స్వాధీనం చేసుకున్నాం. పోస్టు మార్టం నిమిత్తం ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించాము’’ అని తెలిపారు. ‘‘మృతుడు దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాము. తన మృతుడు ఏకే రావు కుమారుడు వచ్చి, తన తండ్రి మృత దేహం అని గుర్తించాడు. ఓ ప్రాజెక్ట్ పని మీద అప్పుడప్పుడు బెంగళూరుకి వచ్చేవాడు. ఈ నెల 8 తేదీన బెంగళూరుకు వచ్చిన ఏకే రావు తన కొడుకు ఇంట్లో ఉన్నాడు’’ అని తెలిపారు. (చదవండి: ఇంట్లో తెలియకుండా పెళ్లి.. నవ వధువు అనుమానాస్పద మృతి) ఇక నవంబర్ 23 తేదీన ఏకే రావు మృతి గురించి తెలిసిన తర్వాత ఆయన భార్య బెంగళూర్‌లో ఉన్న కుమారుడుకి ఫోన్ చేసింది. యశ్వంత్‌పూర్ రైల్వే పోలీసుల నుంచి నాకు ఫోన్ వచ్చిందని.. రైల్వే ట్రాక్‌పై మీ భర్త మృతదేహం ఉంది అని పోలీసులు చెప్పారు.. అని కుమారుడుకి సమాచారం ఇచ్చింది. ఒంటిపై ఉన్న గాయాలను చూసి ఏకే రావును వేరే ప్రాంతంలో హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు’’ అని తెలిపారు. ‘‘ఈ కేసులో లోతైన దర్యాప్తు చేసి న్యాయ చేయాలని ఏకే రావు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూర్ రూరల్ రైల్వే పోలీస్ స్టేషన్ లో302, 201 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశాం. హత్య, ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: పెళ్లి చేసుకోవాలని డ్యాన్సర్ బలవంతం చేయడంతో -
ప్రముఖ సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. కుటుంబం అదృశ్యం!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని హరిణి కుటుంబం అదృశ్యమైంది. వారం రోజుల నుంచి హరిణి కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. వారం నుంచి వారందరి మొబైల్స్ కూడా స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో అనుమానస్పద స్థితిలో హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం లభ్యమైంది. బెంగళూరులోని రైల్వేట్రాక్‌పై ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఏకే రావు మృతిపై బెంగళూరు పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. సెక్షన్ 302, 201 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఏకే రావు శరీరంపై కత్తి గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయన సుజనా ఫౌండేషన్ సీఈఓగా, సుజనా గ్రూప్స్ లీగల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఏకే రావు ఫ్యామిలీతో నివాసముంటున్నారు. చదవండి: ప్రియాంక తన భర్త పేరు అందుకే తొలగించిందట! ఈ నెల 8న ఆయన హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు చివరిసారిగా ఈ నెల 19న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. 23 న ఏకే రావు మృతి చెందినట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బెంగుళూరులోనే మృతుడి అంతక్రియలు పూర్తి చేశారు. మృతుడి శరీరంపై కత్తిగాట్లు ఉండటంతో హత్య కోణంలో బెంగుళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. ఏకేరావును హతమార్చి మృతదేహాన్ని ట్రాక్‌పై పడేసి ఉండొచ్చిని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హరిణి కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియాల్సి ఉంది. హరిణి ఓ ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్. ఆమె గాయని మాత్రమే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్, క్లాసికల్ డ్యాన్సర్ కూడా. తమిళం, తెలుగు, కన్నడ, మాళయాలం, హిందీ సినిమాల్లో చాలా పాటలు పాడారు. -
కరోనా భయాన్ని జయించడం ఎలా..?
అనవసర భయాల నుంచి మనస్సును వేరే అంశాల వైపు మళ్లించుకోవడానికి (డైవర్ట్ చేయడానికి) గట్టిగా ప్రయత్నించాలి. కరోనా అంటేనే చాలామందిలో భయం ఏర్పడిపోయింది. కరోనా సోకితే భయం. పాజిటివ్ కాకపోయినా తమకూ వస్తుందేమో అనే భయం. కరోనాతో ఆస్పత్రుల్లో సీరియస్‌గా ఉన్న వారి గురించి, మరణించిన వారి గురించిన వార్తలు, అంబులెన్సుల సైరన్లు వంటి నెగెటివ్ విషయాలు వినడం వల్ల ఓవర్ థింకింగ్ అలవాటైపోతోంది. దీంతో గుండె దడ, గాభరా పెరిగి పోతుంది. పులి వచ్చినప్పుడు ఫేస్ చేయడం ఎలా అనేది నేర్చుకోవాలి. అంతే కానీ అదిగో వస్తోంది, ఇదిగో వస్తోంది అనే టెన్షన్ పడకూడదు. ఈ విధమైన అవగాహన పెంచుకోవాలి. కొందరైతే పాజిటివ్ కాకపోయినా ముందుగానే ఆసుపత్రిలో బెడ్ బుక్ చేసుకుంటున్నారు. ఇంత ఆలోచన పనికిరాదు. ఒక విషయం గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే... అంతగా అదే జోన్లోకి మనం వెళ్లిపోతాం. ప్రసుతం కోవిడ్ వచ్చినవారికి అప్పటివరకూ లేని భయాలు కూడా ఆవరిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది హార్ట్ అటాక్ వస్తుందేమోనన్నది. దాంతో కాస్త గుండె గట్టిగా కొట్టుకున్నా ఆందోళన పడుతున్నారు. ఇవన్నీ ఇమ్యూనిటీని దెబ్బతీసేవే. ఇలాంటివారిలో రికవరీ అయ్యాక కూడా తీవ్రమైన అలసట కనపడుతోంది. పెద్ద వయసు వారిలో జ్ఞాపకలేమి, ఏవోవో ఫోబియాలు పెరుగుతున్నాయి. అందుకే ఈ సమయంలో మనసును బాగా డైవర్ట్ చేసుకోవాలి. వీలైతే గార్డెనింగ్ దగ్గర్నుంచి కేరమ్స్ ఆడడం వరకు నచ్చిన పనులు చేసుకుంటూ ఉండాలి. కోవిడ్ వల్ల నలుగురితో కలవడం కూడా (సోషలైజేషన్) బాగా తగ్గిపోయింది. అలవాటు లేని ఒంటరితనం వల్ల బాగా డిప్రెషన్‌కి గురవుతున్నారు. ఎవరైనా సరే ఒంటరిగా ఉండొద్దు. ఇతరులు కూడా ఇలాంటి వారిని ఒంటరిగా వదలొద్దు. ఏదో రకమైన పలకరింపు ముఖ్యం. డా.హరిణి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కేర్ హాస్పిటల్, హైదరాబాద్ -
అసిన్ కూతురి ఫొటో వైరల్
చెన్నై,పెరంబూరు: ఓనం పండగ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఒకప్పటి క్రేజీ కథానాయకి అసిన్ గారాల బిడ్డ. పేరు హారిణి. కేరళకు చెందిన అసిన్ తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ కథానాయకిగా వెలిగిన విషయం తెలిసిందే. అలా అగ్రనటిగా రాణిస్తున్న సమయంలోనే మైక్రోమాక్స్ సంస్థ అధినేత రాహుల్‌శర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి గత 2015లో ఘనంగా జరిగింది. కాగా 2017 అక్టోబరు 24న అసిన్ అందమైన పాపకు జన్మనిచ్చింది.అయితే బుధవారం ఓనం పండగ సందర్భంగా అసిన్ తన కూతురు హారిణి ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి అందరికీ ఓనం శుభాకాంక్షలు తెలిపింది. అయితే హరిణి ఫోటో గత ఏడాది పుట్టిన రోజున తీసినదన్నది గమనార్హం. ఆ ఫోటో ఇప్పుడు సా మాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
చిరు బర్త్‌డేకి గ్యాంగ్‌లీడర్
మోహన్ కృష్ణ, హరిణి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. సిహెచ్ కిషోర్‌బాబు దర్శకత్వంలో సింగులూరి మోహన్‌రావు నిర్మిస్తున్నారు. కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ సమర్పకులు. చిత్ర హీరో మోహన్‌కృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ లను రిలీజ్ చేస్తున్నారు.‘‘నా అభిమాన హీరో చిరంజీవిగారి పుట్టిన రోజు ఆగస్టు 22న మా సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని మోహన్‌కృష్ణ అన్నారు. ‘‘చిరంజీవిగారి సినిమా టైటిల్ పెట్టడం వల్ల ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు సిహెచ్ కిషోర్ బాబు. ‘‘సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. టీమ్ చాలా కష్టపడుతున్నారు’’ అన్నారు సింగులూరి మోహన్‌రావు. -
జీరో టెంపరేచర్లో షూటింగ్
మ్యాజిక్ లైట్స్ స్టూడియోస్ మరియు వర్షి స్టూడియోస్ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం ‘ద ఫాగ్’. యంవీ రెడ్డి నిర్మాత. మధుసూదన్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. విరాట్ చంద్ర, హరిణి, చందన, ఆత్మనంద తదితరులు ఈ చిత్రం ద్వారా నటీనటులుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా విడుదల చేయించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ ఇప్పుడే చూశాను. చాలా కొత్తగా ఉంది. కొత్తగా వచ్చిన కెమెరాలతో ఎటువంటి లైట్స్ లేకుండా కొత్త లొకేషన్స్‌లో జీరో టెంపరేచర్లో హాలీవుడ్ లెవల్లో షూట్ చేశారు. చిన్న సినిమా అని చెప్తున్నారు కానీ పెద్ద సినిమాలా వుంది. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ సినిమా కావాలి. అలా తీస్తే సినిమాకు మంచి లాభం వస్తుంది నా అంచనా. ఈ సినిమా ద్వారా దర్శకుడు మధుసూదన్‌కు, సినిమా పరిశ్రమకు మంచి జరగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యల్లనూరు హరినాథ్, సతీశ్ రెడ్డి, సంగీతం: సందీప్. -
నవ్వుల్ నవ్వుల్
తేజ, హరిణిరెడ్డి జంటగా రూపొందుతోన్న వినోదాత్మక చిత్రం ‘డ్రీమ్ బాయ్’. రాజేష్ కనపర్తి దర్శకత్వంలో సెవన్ వండర్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రేణుక నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఎం.వి. రావు కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు. రాజేష్ కనపర్తి మాట్లాడుతూ– ‘‘ఇదొక థ్రిల్లింగ్ ఎంటర్టైనర్. ప్రేమతో నిండిన క్యూట్ స్టోరీ. ఆద్యంతం కామెడీతో రూపొందుతోన్న ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకముంది. కొత్త, పాత నటీనటులతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ‘‘రాజేష్ చెప్పిక కథ నచ్చడంతో ఈ చిత్రం నిర్మిస్తున్నా. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మాకు, మా బ్యానర్‌కు మంచి పేరు తీసుకొచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు రేణుక. నటులు ధనరాజ్, రాకేష్, సుఖేష్ రెడ్డి, లడ్డు, ఆర్ట్ డైరెక్టర్ వెంకట్ సన్నిధి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాని, సంగీతం: సుభాష్ ఆనంద్, సమర్పణ: మాస్టర్ ఎన్.టి. రామ్ చరణ్. -
ఆలయ ఘటనలతో... ద్యావుడా!
‘రేసుగుర్రం’ చిత్రంలో అల్లు అర్జున్ పలికిన ‘ద్యావుడా’ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో ఓ చిత్రం తెరకెక్కింది. భాను, శరత్, జై, అనూష, హరిణి, కారుణ్య ముఖ్య పాత్రల్లో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో శాన్వీ క్రియేషన్స్, అమృత సాయి ఆర్ట్స్ పతాకాలపై హరికుమార్ రెడ్డి.జి నిర్మించిన చిత్రం ‘ద్యావుడా’. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, లోగోను ‘హ్యాపీడేస్’, ‘వంగవీటి’ ఫేమ్ వంశీ ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘దైవాంశ పరమైన అంశంతో ముడిపడి ఉన్న చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘విభిన్న కథా చిత్రమిది. ఇండియాలోని కొన్ని దేవాలయాల్లో జరిగిన సంఘటనలతో తెరకెక్కించాం. నటీనటులు కొత్తవారైనా బాగా చేశారు’’ అని దర్శకుడు చెప్పారు. ‘నాటుకోడి’ చిత్ర నిర్మాత బందరు బాబీ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: తరణ్. కె, సోను. కె. -
జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు హరిణి
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని ది ఫ్యూచర్‌కిడ్స్ బాడ్మింటన్ అకాడమీ విద్యార్థి జి.హరిణి కేంద్రీయ విద్యాలయ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందని చీఫ్ కోచ్ ఎన్వి.భద్రం ఓ ప్రకటనలో తెలిపారు. హరిణి ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్‌లోని కేంద్రీయ విద్యాలయలో తొమ్మిదో lతరగతి చదువుతూ ఫ్యూచర్‌కిడ్స్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. ఇటీవల హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన కేంద్రీయ విద్యాలయ హైదరాబాద్ ప్రాంతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి ఈనెల 21న ముంబాయిలో జరిగే కేంద్రీయ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందన్నారు. హరిణిని అకాడమీ డైరెక్టర్ వై.రవిబాబు, ప్రిన్సిపాల్ రవీంద్రనాథ్, చీఫ్ కోచ్ ఎన్వి.భద్రం, కేంద్రీయ పాఠశాల పీఈటీ మధుసూదనరెడ్డి అభినందించారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
హైదరాబాద్: నగరంలోని బాలానగర్ పరిధిలోని రాజ్‌కాలనీలో హరిణి అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. భర్త అత్తామామలే చంపారని హరిణి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆరు నెలలుగా తమ కూతుర్ని చంపుతానని భర్త బెదిరించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురి మృతదేహాన్ని చూపించాలని కోరుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని హరిణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
వడ్లమూడిలో విద్యార్థిని ఆత్మహత్య
గుంటూరు : గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఓ ప్రైవేట్ యూనివర్సిటీ హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న హరిణి ఆదివారం తెల్లవారుజామున కళాశాల హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకింది. గమనించిన సహాచర విద్యార్ధులు యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సమ్మర్లో హాయి.. హాయ్
‘పిచ్చెక్కిస్తా’ మూవీ ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన అందాల బొమ్మ హరిణి మంగళవారం తాజ్ దక్కన్లో తళుకులీనింది. ‘ఫ్యాషన్ అన్లిమిటెడ్’ ఎక్స్పోను ప్రారంభించింది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ యాక్ససరీస్‌తో కొలువుదీరిన ఈ ఎక్స్పో నేడు కూడా కొనసాగనుంది. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో హరిణి పంచుకున్న ముచ్చట్లు.. . - శిరీష చల్లపల్లి నాన్నది అసోం. అమ్మది విశాఖపట్నం. నేను అసోంలోనే పుట్టాను. చదువంతా వైజాగ్‌లోనే. నాకు ఇద్దరు చెల్లెళ్లు. నేను పూర్తిగా అమ్మకుట్టిని. నా ముద్దు పేరు అమ్ము. డిగ్రీ తరువాత మోడలింగ్ చేశాను. కొన్ని షోస్‌లో ర్యాంప్‌వాక్ చేశాను. అప్పుడే నాకు సినీ అవకాశాలు రాసాగాయి.‘పిచ్చెక్కిస్తా’ నా తొలి మూవీ. లాస్ట్ ఇయర్ ఈ మూవీ షూటింగ్ నిమిత్తం ఫస్ట్‌టైమ్ హైదరాబాద్ వచ్చా. గోల్కొండ ఫోర్ట్‌లో షూటింగ్ కావడంతో కోట మొత్తం చుట్టేశాను. అక్కడ గోడలపై లవర్స్ పేర్లు, గబ్బిలాల చక్కర్లు, చప్పట్ల శబ్దాలు నాకు వింతగా అనిపించాయి. చికెన్ అంటే బాగా ఇష్టం. గోంగూర చికెన్ కాంబినేషన్ అదరగొట్టేలా వండుతాను. అది వండినప్పుడల్లా ఫ్రెండ్స్ అందరికీ మా ఇంట్లోనే ట్రీట్. ప్రస్తుతం ‘నాడు నేడు’, ‘వలయం’, ‘ఈ వయసులో’ సినిమాలు ప్రాసెస్‌లో ఉన్నాయి. నాకు పదహారణాల తెలుగమ్మాయి రోల్ వేయాలని ఉంది. సౌందర్య నా అభిమాన నటి. ఇక సమ్మర్ సీజన్ బాగా ఇష్టం. కొబ్బరిబోండాలు, తాటిముంజలు, మామిడిపండ్లు ఈ సీజన్‌ను జాయ్‌ఫుల్‌గా మారుస్తాయి. ఈ హాట్ సమ్మర్లో స్విమ్మింగ్‌ని ఎంజాయ్ చేస్తా. పెళ్లిళ్లు, ఫంక్షన్లతో వేసవి భలే సందడిగా ఉంటుంది. -
వలయంలో చిక్కుకుంటే....!
ప్రేమకథలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కనున్న చిత్రం ‘వలయం’. నివాస్ అనంతనేని, హరిణి జంటగా పి. శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ నెల 6 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని, కథ,కథనాలు చాలా వైవిధ్యంగా ఉంటాయనిదర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ముజీబ్, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి. -
మహిళా అధికారిపై మళ్లీ వేధింపులు..!
ఇంట్లోకి చొరబడి కొంత మంది వ్యక్తుల బీభత్సం డిప్యూటీ రిజిస్ట్రార్ హరిణి భర్త కుమారస్వామితో దురుసు ప్రవర్తన తమతో తెచ్చిన కాగితాలపై సంతకాలు చేయాలంటూ ఒత్తిడి ఆగంతకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమారస్వామి ప్రస్తుతం ప్రసవం కోసం ఆస్పత్రిలో ఉన్న హరిణి సాక్షి, హైదరాబాద్: ‘ఏపీ హైకోర్టు కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’కి సంబంధించిన ఫైళ్ల వివాదం మరింతగా ముదురుతోంది.. ఆ అక్రమాలను వెలుగులోకి తెచ్చిన తనపై ఉన్నతాధికారి ఒకరు వేధింపులకు పాల్పడుతున్నారని సహకారశాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ పి.హరిణి ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రికార్డుల కోసం హరిణి నివాసానికి కొంత మంది వ్యక్తులు వచ్చి, బీభత్సం సృష్టించడంతో ఇది మళ్లీ తెరపైకి వచ్చింది. తమ ఇంట్లో కొంత మంది ఆగంతకులు ప్రవేశించి బీభత్సం సృష్టించారని హరిణి భర్త కుమారస్వామి జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. నిండు గర్భిణి అయిన హరిణి ప్రస్తుతం ప్రసూతి సెలవుల్లో ఉన్నారు. ప్రసవం కోసం ఆమె ఆస్పత్రిలో చేరడంతో... ఆగంతకులు వచ్చిన సమయంలో ఆమె భర్త మాత్రమే ఇంట్లో ఉన్నారు. పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం కుమారస్వామి విలేకరులకు ఈ వివరాలను వెల్లడించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 46లో ఉన్న హరిణి నివాసంలోకి గురువారం ఉదయం ఆరుగురు వ్యక్తులు దౌర్జన్యంగా చొరబడ్డారు. వెంటనే గదులన్నింటినీ గాలించడం మొదలుపెట్టారు. నిండు గర్భంతో ఉన్న తన భార్య హరిణి ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిం దని కుమారస్వామి చెప్పినా వినిపించుకోకుండా... వచ్చిన వాళ్లు ఫైళ్లకోసం ఇంట్లోని టేబుళ్లన్నీ వెతికారు. ఆ తర్వాత వారు తమతో పాటు తీసుకువచ్చిన కాగితాల మీద సంతకాలు పెట్టాలంటూ కుమారస్వామిపై ఒత్తిడి చేశారు. అసలు మీకు ఏం కావాలని ప్రశ్నించగా... హైదరాబాద్ జిల్లా సహకారశాఖ అధికారి దశరథ రామయ్యతో కుమారస్వామిని ఫోన్లో మాట్లాడిం చారు. ఓ అధికారి ఆదేశాల మేరకు సంతకాల కోసం పంపించామని దశరథ రామయ్య కుమారస్వామికి చెప్పారు. కానీ కుమారస్వామి ఆ పత్రాలపై సంతకాలు చేయకపోవడంతో ఆగంతకులు ఇంటి బయట ఓ నోటీసును అతికించి వెళ్లిపోయారు. -
‘పిచ్చెక్కిస్తా’ ప్రెస్ మీట్
-
పిచ్చెక్కిస్తా మూవీ న్యూ పోస్టర్స్