పిచ్చెక్కిస్తారట!
‘‘మాటలతో, చేతలతో కొంతమంది ఎదుటి వ్యక్తులకు పిచ్చెక్కిస్తారు. మా హీరో హీరోయిన్ కూడా ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తారు. అయితే అది నెగటివ్‌గా మాత్రం కాదు’’ అంటున్నారు శ్రీకాంత్‌రెడ్డి. స్వీయదర్శకత్వంలో సెవన్ ఆర్ట్స్ పతాకంపై ఎన్.కె., హరిణిలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఆయన రూపొందించిన చిత్రం ‘పిచ్చెక్కిస్తా’. నిర్మాణానంతర కార్యక్రమలు కూడా పూర్తయ్యాయి. ఇదే నెలలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నారు. టైటిల్ నెగటివ్‌గా ఉందనే ఫీలింగ్ కొంతమందికి కలగవచ్చని, కానీ ఇది పాజిటివ్ మూవీ అని శ్రీకాంత్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రాము. జి, సంగీతం: నవనీతాచారి.