
సాక్షి, బెంగళూరు: తెలుగు గాయని హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్ సీఈవో ఏకే రావుది హత్యేనని పోస్టుమార్టం నివేదికలో తేలింది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏకే రావు సుమారు వారం రోజుల కింద కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ నెల 22న కర్ణాటకలోని యలహంక–రాజన్‌కుంటె స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై ఏకే రావు మృతదేహం లభించింది.
చదవండి: సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. ‘ఆ 4 రోజుల్లో ఏం జరిగింది?’
కర్ణాటక పోలీసులు తొలుత ఆయనది ఆత్మహత్యగా భావించినా.. మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అక్కడి ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా.. ఏకే రావు శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయని, అది హత్యేనని వైద్యులు నిర్ధారించినట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment