సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని హరిణి తండ్రి ఏకే రావు మృతి చెందిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై అనుమానస్పద స్థితిలో ఆయన మృతదేహం లభ్యమయ్యింది. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు దీన్ని హత్య కేసుగా నమోదు చేశారు. సెక్షన్ 302, 201 ప్రకారం కేసు నమోదు చేశారు. ఏకే రావు శరీరం పై కత్తి గాయాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఏకే రావు నవంబర్ 8 న హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. చివరిసారిగా ఆయన ఈ నెల 19 న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. నాలుగు రోజుల తర్వాత అనగా నవంబర్ 23 న ఏకే రావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఈ నాలుగు రోజుల్లో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. ఈ క్రమంలో ఏకే రావుది హత్యే అంటూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బెంగళూరులోనే ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు ఏకే రావు కుటుంబ సభ్యులు. ఆయనది హత్యనా, ఆత్మహత్యనా అన్న కోణంలో బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: ప్రముఖ సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. కుటుంబం అదృశ్యం!)
ఎఫ్‌ఐఆర్‌లో ఏం ఉంది అంటే..
ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 23 తేదీన యలహంక, రాజనా కుంటు రైల్వే స్టేషన్ మధ్య ఏకే రావు మృత దేహం గుర్తించాము. నాందేడ్ ఎక్స్ ప్రెస్ కో పైలెట్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్నాం. యలహంక రైల్వే ట్రాక్ పైన బోర్ల పడి ఉన్న మృత దేహాన్ని గుర్తించాము. తల ఎడమ వైపు ఆరు సెంటిమీటర్లు గాయం.. ఎడమ చేతికి , గొంతుపై గాయాలు ఉన్నట్లు గుర్తించాము. ఘటన స్థలంలో చాకు, కత్తి, బ్లెడ్‌ని స్వాధీనం చేసుకున్నాం. పోస్టు మార్టం నిమిత్తం ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించాము’’ అని తెలిపారు.
‘‘మృతుడు దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాము. తన మృతుడు ఏకే రావు కుమారుడు వచ్చి, తన తండ్రి మృత దేహం అని గుర్తించాడు. ఓ ప్రాజెక్ట్ పని మీద అప్పుడప్పుడు బెంగళూరుకి వచ్చేవాడు. ఈ నెల 8 తేదీన బెంగళూరుకు వచ్చిన ఏకే రావు తన కొడుకు ఇంట్లో ఉన్నాడు’’ అని తెలిపారు.
(చదవండి: ఇంట్లో తెలియకుండా పెళ్లి.. నవ వధువు అనుమానాస్పద మృతి)
ఇక నవంబర్ 23 తేదీన ఏకే రావు మృతి గురించి తెలిసిన తర్వాత ఆయన భార్య బెంగళూర్‌లో ఉన్న కుమారుడుకి ఫోన్ చేసింది. యశ్వంత్‌పూర్ రైల్వే పోలీసుల నుంచి నాకు ఫోన్ వచ్చిందని.. రైల్వే ట్రాక్‌పై మీ భర్త మృతదేహం ఉంది అని పోలీసులు చెప్పారు.. అని కుమారుడుకి సమాచారం ఇచ్చింది. ఒంటిపై ఉన్న గాయాలను చూసి ఏకే రావును వేరే ప్రాంతంలో హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు’’ అని తెలిపారు.
‘‘ఈ కేసులో లోతైన దర్యాప్తు చేసి న్యాయ చేయాలని ఏకే రావు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూర్ రూరల్ రైల్వే పోలీస్ స్టేషన్ లో302, 201 సెక్షన్‌ల ప్రకారం కేసు నమోదు చేశాం. హత్య, ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు.
చదవండి: వివాహేతర సంబంధం: పెళ్లి చేసుకోవాలని డ్యాన్సర్ బలవంతం చేయడంతో
Comments
Please login to add a commentAdd a comment