Yelahanka
-
భర్త కంటే 16 ఏళ్లు చిన్న.. వివాహేతర సంబంధం మోజుతో
సాక్షి, బెంగళూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ యువతి తాళికట్టిన భర్తనే ప్రియునితో కలిసి హత్య చేయించింది. ఈ ఘటన బెంగళూరు యలహంక పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. శుక్రవారం రాత్రి యలహంకలోని కొండప్ప లేఔట్లో ఓ మేడపై చంద్రశేఖర్ (35) అనే నేత కార్మికుడు తల, మర్మావయవాలపై తీవ్ర గాయాలతో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టగా భార్య ప్రమేయముందని వెల్లడైంది. దీంతో భార్య శ్వేత (19), ఆమె ప్రియుడు సురేశ్ (22)ని బుధవారం అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల కిందట అక్క కూతురితో పెళ్లి వివరాలు.. శ్వేత, చంద్రశేఖర్‌కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరిది పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం స్వస్థలం కాగా, అక్కడే నేత పని చేసేవారు. చంద్రశేఖర్ కంటే శ్వేత 16 ఏళ్ల చిన్నది. కానీ అక్క కుమార్తె అనే కారణంతో కుటుంబసభ్యులు ఇద్దరికీ బలవంతంగా వివాహం చేశారు. పెళ్లయిన తరువాత శ్వేత చదువుకోవడానికి హిందూపురంలో కాలేజీకి వెళ్లింది. అక్కడ స్నేహితులతో కలిసి షికార్లకు వెళ్లేదని భర్త తరచూ గొడవపడేవాడు. హిందూపురం నుంచి యలహంకకు దీంతో కుటుంబసభ్యులు 4 నెలల కిందటే దంపతుల మధ్య రాజీ చేసి హిందూపురం నుంచి యలహంక కొండప్పలేఔట్ లో ఉండాలని ఇక్కడకు పంపించారు. శ్వేత హిందూపురానికి చెందిన ప్రియుడు సురేశ్‌తో సంబంధం కొనసాగిస్తోంది. సురేశ్ అప్పుడప్పుడు శ్వేత ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఆమె భర్తకు తెలియకుండా ఈ తతంగం సాగుతోంది. చివరికి ఈ విషయం భర్తకు తెలియడంతో మళ్లీ ఘర్షణ పడ్డారు. హత్యకు కుట్ర శ్వేత, సురేశ్ కలిసి తమకు అడ్డుగా ఉన్న చంద్రశేఖర్‌ను తొలగించుకోవాలనుకున్నారు. సురేశ్ 22వ తేదీన బెంగళూరుకు వచ్చాడు. చంద్రశేఖర్ ఇంట్లోనే ఉన్నాడని, ఇదే సరైన సమయమని శ్వేత ఫోన్ చేసింది. సురేశ్ వచ్చి చంద్రశేఖర్‌ను కలిశాడు, మీతో మాట్లాడాలంటూ మేడపైకి తీసుకెళ్లి గొడవపడ్డాడు. సురేశ్ పక్కనే ఉన్న ఇటుక తీసుకుని చంద్రశేఖర్ తలపై దాడిచేశాడు. చంద్రశేఖర్ రక్తస్రావంతో కిందపడిపోయాడు. ఇదే సమయంలో మర్మావయవాలపై పొడిచి చంపి అక్కడి నుంచి ఉడాయించాడు. విచారణలో అసలు నిజం సమాచారం అందిన వెంటనే యలహంక పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఎవరు హత్య చేశారు అని భార్యను ప్రశ్నించగా తనకు తెలియదని, ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి వెళ్లారని పొంతన లేకుండా చెప్పింది. ఆమెపై అనుమానంతో పోలీస్‌స్టేషన్ కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించగా ప్రియుడు సురేశ్‌తో కలిసి హత్య చేసినట్లు నోరువిప్పింది. పోలీసులు ముమ్మర గాలింపు జరిపి పరారీలో ఉన్న సురేశ్‌ను కూడా అరెస్ట్ చేసి కేసు విచారణ చేపట్టారు. -
సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. ‘ఆ 4 రోజుల్లో ఏం జరిగింది?’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని హరిణి తండ్రి ఏకే రావు మృతి చెందిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై అనుమానస్పద స్థితిలో ఆయన మృతదేహం లభ్యమయ్యింది. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు దీన్ని హత్య కేసుగా నమోదు చేశారు. సెక్షన్ 302, 201 ప్రకారం కేసు నమోదు చేశారు. ఏకే రావు శరీరం పై కత్తి గాయాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఏకే రావు నవంబర్ 8 న హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. చివరిసారిగా ఆయన ఈ నెల 19 న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. నాలుగు రోజుల తర్వాత అనగా నవంబర్ 23 న ఏకే రావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఈ నాలుగు రోజుల్లో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. ఈ క్రమంలో ఏకే రావుది హత్యే అంటూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బెంగళూరులోనే ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు ఏకే రావు కుటుంబ సభ్యులు. ఆయనది హత్యనా, ఆత్మహత్యనా అన్న కోణంలో బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ప్రముఖ సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. కుటుంబం అదృశ్యం!) ఎఫ్ఐఆర్లో ఏం ఉంది అంటే.. ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 23 తేదీన యలహంక, రాజనా కుంటు రైల్వే స్టేషన్ మధ్య ఏకే రావు మృత దేహం గుర్తించాము. నాందేడ్ ఎక్స్ ప్రెస్ కో పైలెట్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్నాం. యలహంక రైల్వే ట్రాక్ పైన బోర్ల పడి ఉన్న మృత దేహాన్ని గుర్తించాము. తల ఎడమ వైపు ఆరు సెంటిమీటర్లు గాయం.. ఎడమ చేతికి , గొంతుపై గాయాలు ఉన్నట్లు గుర్తించాము. ఘటన స్థలంలో చాకు, కత్తి, బ్లెడ్‌ని స్వాధీనం చేసుకున్నాం. పోస్టు మార్టం నిమిత్తం ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించాము’’ అని తెలిపారు. ‘‘మృతుడు దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాము. తన మృతుడు ఏకే రావు కుమారుడు వచ్చి, తన తండ్రి మృత దేహం అని గుర్తించాడు. ఓ ప్రాజెక్ట్ పని మీద అప్పుడప్పుడు బెంగళూరుకి వచ్చేవాడు. ఈ నెల 8 తేదీన బెంగళూరుకు వచ్చిన ఏకే రావు తన కొడుకు ఇంట్లో ఉన్నాడు’’ అని తెలిపారు. (చదవండి: ఇంట్లో తెలియకుండా పెళ్లి.. నవ వధువు అనుమానాస్పద మృతి) ఇక నవంబర్ 23 తేదీన ఏకే రావు మృతి గురించి తెలిసిన తర్వాత ఆయన భార్య బెంగళూర్‌లో ఉన్న కుమారుడుకి ఫోన్ చేసింది. యశ్వంత్‌పూర్ రైల్వే పోలీసుల నుంచి నాకు ఫోన్ వచ్చిందని.. రైల్వే ట్రాక్‌పై మీ భర్త మృతదేహం ఉంది అని పోలీసులు చెప్పారు.. అని కుమారుడుకి సమాచారం ఇచ్చింది. ఒంటిపై ఉన్న గాయాలను చూసి ఏకే రావును వేరే ప్రాంతంలో హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు’’ అని తెలిపారు. ‘‘ఈ కేసులో లోతైన దర్యాప్తు చేసి న్యాయ చేయాలని ఏకే రావు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూర్ రూరల్ రైల్వే పోలీస్ స్టేషన్ లో302, 201 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశాం. హత్య, ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: పెళ్లి చేసుకోవాలని డ్యాన్సర్ బలవంతం చేయడంతో -
దారుణం: కూలీ ప్రాణం తీసిన పెంపుడు కుక్క
సాక్షి, బెంగళూరు: నిర్మాణ స్థలంలో మెట్ల కింద నిద్రిస్తున్న కూలీని యజమాని పెంపుడు కుక్క దాడి చేసింది. ఆ కుక్క చేతిలో తీవ్రంగా గాయపడి అతడు మృతి చెందాడు. ఈ దాడిని ఆపడానికి ప్రయత్నించిన యజమానిని కూడా ఆ కుక్క గాయపరిచింది. దీంతో ఆ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని అత్తూర్ లేఅవుట్ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుడు నరసింహ (36) పని చేసేందుకు వచ్చాడు. నిర్మాణం జరుగుతున్న స్థలంలో మెట్ల కింద నరసింహ నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో యజమాని తన విదేశీ (పిట్ బుల్) జాతికి చెందిన పెంపుడు కుక్కతో అక్కడకు చేరింది. అకస్మాత్తుగా ఆ కార్మికుడిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అతడి మెడను పట్టుకుని కొరికేసింది. అయితే కుక్క అదుపు చేయడానికి వెళ్లగా యజమానికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. నరసింహ అరుపులు విని తోటి కార్మికులు అక్కడికి చేరుకుని వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నరసింహ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒక వ్యక్తి మరణానికి కారణమైన కుక్క యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అర్ధరాత్రి రౌడీ షీటర్ హల్చల్.. పోలీసుల ఎన్కౌంటర్ చదవండి: దారుణం.. వేశ్యను వాడుకుని డ్రైనేజీలో పారవేత -
Sonu Sood: ప్రాణం పోసిన సోనూసూద్ ట్రస్ట్
యలహంక: ఆక్సిజన్ నిల్వలు ఖాళీ కావడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కరోనా రోగులకు సోనూసూద్ చారిటబుల్ ట్రస్టు సకాలంలో ప్రాణవాయివు అందించి ప్రాణాలు నిలిపింది. బెంగళూరులోని యలహంక వద్ద ఆర్క ప్రైవేటు ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేశారు. ఇక్కడ 15 మందికి పైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటలకు ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. ఓ మహిళా బాధితురాలి సోదరుడు అనిల్ గుర్తించి ఆస్పత్రి సిబ్బందిని అలర్ట్ చేశాడు. దీంతో యాజమాన్యం యలహంక న్యూటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సత్య నారాయణ అక్కడికి సమీపంలోని సోనూసూద్ చారిటబుల్ ట్రస్ట్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించగా 11 ఆక్సిజన్ సిలిండర్లను బైక్‌లు, కార్లలో ఆస్పత్రికి పంపగా ఆక్సిజన్ వ్యవస్థను పునరుద్ధరించారు. అయితే, అప్పటికే ఇద్దరు మహిళలు మృతి చెందగా 13 మంది ప్రాణాపా యస్థితి నుంచి బయట పడ్డారు. సకాలంలో ఆక్సిజన్ అందించిన ట్రస్టు సభ్యులు అశ్మత్, రాధిక, రాఘవ్‌లకు ఆస్పత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది. -
నింగినంటే సంబరం
సాక్షి, బెంగళూరు: ప్రతిష్టాత్మక ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనకు బెంగళూరు యలహంక వైమానిక స్థావరం సిద్ధమైంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి అలరించే ఈ ఆకాశ వేడుక ఈ నెల 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ఏరో షో జరిగే ప్రదేశం చుట్టుపక్కల 45 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రదర్శనల్లో దుర్ఘటనలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ఆకస్మికంగా ప్రమాదాలు, హాని జరగకుండా తప్పించేందుకు గ్రిడ్, సబ్ గ్రిడ్, మైక్రో గ్రిడ్లుగా విభజించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గత ప్రదర్శనలో రెండు సూర్యకిరణ్ విమానాలు ఆకాశంలో విన్యాసాల సమయంలో ఢీకొని కూలిపోవడం, పార్కింగ్ ప్రదేశంలో మంటలు చెలరేగి సుమారు 300 కార్లు కాలిపోవడం వంటి దుర్ఘటనలు సంభవించాయి. 600 పైగా ప్రదర్శనలు.. ఈ కార్యక్రమంలో 600లకు పైగా ప్రదర్శనలు నిర్వహిస్తారు. గతేడాది 22 దేశాల నుంచి ప్రదర్శనలు వచ్చాయి. కాగా కోవిడ్ కారణంగా ఈసారి 14 దేశాలకు మాత్రమే అనుమతి లభించింది. సందర్శకులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తారు. వైమానిక రంగంలో నూతన ఆవిష్కారాలను చాటేలా పెద్దసంఖ్యలో స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. -
కిడ్నాప్ కథ సుఖాంతం
యలహంక: ఏడాది వయస్సున్న పిల్లాడి కిడ్నాప్ కేసును కొత్తునూరు పోలీసులు చేధించారు. వివరాలు.. భారతినగరలో నివాసముంటున్న శహనాజ్ ఖానమ్ భర్త చనిపోవడంతో గౌరిపాళ్యకు చెందిన ఫైరోజ్‌ఖాన్‌ను రెండేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకుంది. మొదట్లో బాగానే సాగిన వీరి సంసారంలో ఒడదొడుకులు ఎదురయ్యాయి. భర్త సరిగా ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలో భర్త నుంచి డబ్బు రాబట్టడం కోసం శహనాజ్ ఖానమ్ కొత్త ఎత్తుగడ వేసింది. దీని ప్రకారం ఓ పిల్లాడిని కిడ్నాప్ చేసుకురావాలని తనకు తెలిసిన మహమద్ నూరుల్లా, ఇసాక్ ఖాన్, అబ్దుల్ వాహీద్లను పురమాయించింది. ఆ పిల్లాడు తమకే జన్మించాడని చెప్తే భర్త ఫైరోజ్నాన్ మనసు మారి ఇంటికి సక్రమంగా వస్తాడు.. లేదా తనతో పాటు పిల్లాడి పోషణకు ఎక్కువ డబ్బు ఇప్పించుకోవచ్చనేది శహనాజ్ ఖానమ్ పథకం. దీని ప్రకారం మహమద్ నూరుల్లా, ఇసాక్ ఖాన్, అబ్దుల్ వాహీద్‌లు ఈనెల 5న కొత్తునూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని హెగడేనగర ఎక్స్ సర్వీస్ లేఔట్లో గుడిసెలో నివాసముంటున్న దొడ్డభీమయ్య, మహేశ్వరి దంపతుల కుమారుడు ఏడాది వయస్సున్న అభిరామ్‌ను ఎత్తుకొని ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. దీనిపై బాధిత తల్లిదండ్రులు కొత్తునూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు పిల్లాడిని ఎత్తుకుని వెళుతున్న దృశ్యాలు సీసీ కెమరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజీల ఆధారంగా శహనాజ్ ఖనామ్, ఇసాక్ ఖాన్, అబ్దుల్ వహీద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మరో నిందితుడైన నూరుల్లా శుక్రవారం వేకువజామున మిట్టెగెనహళ్లి సమీపంలోని ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేయడానికి వెళ్లగా నూరుల్లా తన దగ్గర ఉన్న చాకుతో ఇన్స్పెక్టర్ హరియప్పను గాయపరిచారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం నూరుల్లా కాలుపై కాల్పులు జరిపారు. గాయపడిన ఎస్సై హరియప్ప, నిందితుడు నూరుల్లాను స్థానిక అంబేడ్కర్ ఆసుపత్రికి తరలించారు. కిడ్నాప్ గురైన చిన్నారి అభిరామ్‌ను పోలీసులు తల్లిదండ్రులకు శుక్రవారం అప్పగించారు. -
ఐపీఎల్ బెట్టింగ్‌లే కొంపముంచాయి!
► భార్యాబిడ్డలకు నిద్రమాత్రలు, విషపు ఇంజెక్షన్ ! ►హెడ్ కానిస్టేబుల్ కుటుంబం ఆత్మహత్య కేసులో వెల్లడైన నిజం ►హత్య కేసుగా నమోదు యలహంక: ఐపీఎల్ బెట్టింగ్‌లు కుటుంబాన్ని మింగేశాయి. అతను పోలీస్ హెడ్ కానిస్టేబుల్ విచ్చలవిడిగా బెట్టింగ్ వేశాడు. ఆ కారణంతోనే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేలా చేశాయి. బెట్టింగ్ ఒక సరదా. హద్దులు దాటి ఆడితే అదే సరదా ప్రాణాలు తీస్తుంది. ఇలాంటి సంఘటననే నగరంలో సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సీఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సుభాష్‌చంద్ర ఆరోగ్యం మెరుగ్గానే ఉందని చికిత్స అందిస్తున్న బాప్టిస్ట్ ఆసుపత్తి వైద్యురాలు ఇందిరా మీనన్ తెలిపారు. ఈ ఘోరానికి మూలం ఐపీఎల్ బెట్టింగ్లేనని తెలుస్తోంది. అతని కుటుంబం ‘ఆత్మహత్యాయత్నం’ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు మరణించడం తెలిసిందే. మంగళవారం వెలుగు చూసిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యకు యత్నించిన సుభాష్ మొదట భార్య వీణ, పిల్లలు, మణి, పథ్విలకు నిద్రమాత్రలు వేశారు. వారు నిద్రలోకి జారుకోగానే విషపు ఇంజెక్షన్లను ఇచ్చాడని వైద్యపరీక్షలో తేలినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆ తరువాత సుభాష్ కూడా నిద్రమాత్రలు మింగి తాను కూడా విషాన్ని ఇంజెక్ట్ చేసుకున్నాడు. విషం ధాటికి భార్య పిల్లు మరణించగా, ఇతడు కొనప్రాణంతో ఉండగా బంధువులు గమనించి ఆస్పత్రికి తరలించారు. విచారణలో వెలుగు చూసిన అంశాలతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. విచ్చలవిడిగా ఐపీఎల్ పందేలు తాజాగా ముగిసిన ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో బెట్టింగ్‌లే హెడ్‌కానిస్టేబుల్ సుభాష్ కుటుంబంలో ఘోరానికి కారణంగా తెలుస్తోంది. మ్యాచ్‌లు మొదలైన రోజు నుంచి బెట్టింగ్‌లకు పాల్పడుతున్న సుభాష్ చాలా మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో బాగా నష్టపోయాడు. అతని ఒత్తిడితో భార్య వీణ అప్పుడప్పుడూ ఇంటి నుంచి డబ్బులు తెచ్చేదని వారి బంధువులు చెబుతున్నారు. ఆదివారం పుణే,ముంబయి జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సుభాష్ రూ.15 లక్షలకు పుణె గెలుస్తుందని పందెం కాశాడని తెలిసింది. అయితే పుణె ఓడిపోవడంతో బెట్టింగ్‌రాయుళ్లు డబ్బుల కోసం ఇతనిపై ఒత్తిడి తెచ్చారు. సుభాష్ బళ్లారిలో ఉన్న స్నేహితులు, బంధువులను అప్పులు అడగగా అంతమొత్తంలో ఇవ్వలేమంటూ సమాధానాలు రావడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. దీంతో భార్యా, పిల్లలకు విషమివ్వాలనే భయంకరమైన ఆలోచన తట్టి ఉంటుందని చెబుతున్నారు. ఇతడు తక్కువ మోతాదులో నిద్రమాత్రలు, విషాన్ని ఇంజెక్ట్ చేసుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రాణం తీసిన ఫేస్బుక్ ప్రేమ
బెంగళూరు: ఫేస్బుక్ ప్రేమ బెంగళూరులో ఓ బాలిక ప్రాణాలు తీసింది. ఫేస్బుక్లో పరిచయమైన యువకుడితో ప్రేమాయణం సాగించిన 14 ఏళ్ల బాలిక చివరకు మోసపోయి ప్రాణాలు తీసుకుంది. ప్రియుడు మొహం చాటేయడంతో కలత చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. యలహంక శేషాద్రిపురం కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్న ఎం మనోజ్ కుమార్ ఫేస్బుక్లో పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను తొమ్మిదో తరగతి విద్యార్థిని శిఖా(పేరు మార్చాం) ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆమోదించింది. తర్వాత వీరిద్దరూ ప్రేమికులుగా మారారు. ఈ విషయం తెలిసి శిఖా తల్లిదండ్రులు ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ తీయించేశారు. బయట ఇంటర్నెట్ కేఫ్‌ల్లో చాటుగా అతడితో చాటింగ్ చేసేది. అతడు తనను పెళ్లి చేసుకుంటాడని ఆమె ఆశపడింది. ఒకరోజు నందిని లేవుట్లోని తన రూముకు ఆహ్వానించి శిఖాను వశపరుచుకున్నాడు. తర్వాత నుంచి అతడు శిఖాతో మాట్లాడడం మానేశాడు. 'ఇదంతా సరదా కోసం చేశాను, సీరియస్‌గా తీసుకోవద్దు' అంటూ హేళన చేశాడు. మోసపోయానని తెలుసుకున్న శిఖా మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శిఖాను మోసం చేసిన మనోజ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.