ప్రాణం తీసిన ఫేస్బుక్ ప్రేమ | Dumped by Facebook boyfriend, Bangalore schoolgirl hangs self | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఫేస్బుక్ ప్రేమ

Published Thu, Nov 7 2013 3:18 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ప్రాణం తీసిన ఫేస్బుక్ ప్రేమ - Sakshi

ప్రాణం తీసిన ఫేస్బుక్ ప్రేమ

బెంగళూరు: ఫేస్బుక్ ప్రేమ బెంగళూరులో ఓ బాలిక ప్రాణాలు తీసింది. ఫేస్బుక్లో పరిచయమైన యువకుడితో ప్రేమాయణం సాగించిన 14 ఏళ్ల బాలిక చివరకు మోసపోయి ప్రాణాలు తీసుకుంది. ప్రియుడు మొహం చాటేయడంతో కలత చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది.

యలహంక శేషాద్రిపురం కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్న ఎం మనోజ్ కుమార్ ఫేస్బుక్లో పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్ను తొమ్మిదో తరగతి విద్యార్థిని శిఖా(పేరు మార్చాం) ఈ ఏడాది సెప్టెంబర్లో ఆమోదించింది. తర్వాత వీరిద్దరూ ప్రేమికులుగా మారారు. ఈ విషయం తెలిసి శిఖా తల్లిదండ్రులు ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ తీయించేశారు. బయట ఇంటర్నెట్ కేఫ్ల్లో చాటుగా అతడితో చాటింగ్ చేసేది. అతడు తనను పెళ్లి చేసుకుంటాడని ఆమె ఆశపడింది.

ఒకరోజు నందిని లేవుట్లోని తన రూముకు ఆహ్వానించి శిఖాను వశపరుచుకున్నాడు. తర్వాత నుంచి అతడు శిఖాతో మాట్లాడడం మానేశాడు. 'ఇదంతా సరదా కోసం చేశాను, సీరియస్గా తీసుకోవద్దు' అంటూ హేళన చేశాడు. మోసపోయానని తెలుసుకున్న శిఖా మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శిఖాను మోసం చేసిన మనోజ్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement