
చెన్నై,పెరంబూరు: ఓనం పండగ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఒకప్పటి క్రేజీ కథానాయకి అసిన్ గారాల బిడ్డ. పేరు హారిణి. కేరళకు చెందిన అసిన్ తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ కథానాయకిగా వెలిగిన విషయం తెలిసిందే. అలా అగ్రనటిగా రాణిస్తున్న సమయంలోనే మైక్రోమాక్స్ సంస్థ అధినేత రాహుల్‌శర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి గత 2015లో ఘనంగా జరిగింది. కాగా 2017 అక్టోబరు 24న అసిన్ అందమైన పాపకు జన్మనిచ్చింది.అయితే బుధవారం ఓనం పండగ సందర్భంగా అసిన్ తన కూతురు హారిణి ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి అందరికీ ఓనం శుభాకాంక్షలు తెలిపింది. అయితే హరిణి ఫోటో గత ఏడాది పుట్టిన రోజున తీసినదన్నది గమనార్హం. ఆ ఫోటో ఇప్పుడు సా మాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment