
అమ్మా, నాన్న.. ఓ తమిళ అమ్మాయి చిత్రంతో రవితేజ సరసన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ భామ ఆసిన్. ఆ తర్వాత శివమణి, లక్ష్మీనరసింహా, షుర్షణ, అన్నవరం లాంటి చిత్రాల్లో స్టార్ హీరోలతో నటించింది. తమిళంతో పాటు హిందీలోనూ పలు సినిమాల్లో కనిపించింది. కోలీవుడ్‌లో కమల్ హాసన్ సరసన దశవతారం, సూర్యకు జంటగా గజిని లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. ఆసిన్ ఏకంగా ఎనిమిది భాషల్లో మాట్లాడగలదు. అన్ని భాషల్లోనూ తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునే టాలెంట్ ఆమె సొంతం.
(ఇది చదవండి: రికార్డులు కొల్లగొడుతున్న లియో.. కమల్, రజినీ చిత్రాలను వెనక్కినెట్టి!)
తాజాగా అసిన్ తన కుమార్తె అరిన్ పుట్టినరోజు వేడుకలు చేసుకుంది భామ. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఆసిన్ కూతురు తన ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. కాగా.. ఆసిన్ చివరిసారిగా 2015లో వచ్చిన అభిషేక్ బచ్చన్, రిషి కపూర్, సుప్రియా పాఠక్‌లతో కలిసి ఆల్ ఈజ్ వెల్ అనే కామెడీ చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ నటించిన గజిని, రెడీ, బోల్ బచ్చన్, హౌస్‌ఫుల్ -2 లాంటి హిట్ చిత్రాలలో నటించింది.
కాగా.. అసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంట అక్టోబర్ 2017లో తమ కుమార్తె అరిన్‌ను స్వాగతించారు. అయితే రాహుల్ శర్మను పెళ్లాడిన తర్వాత ఆసిన్ సినిమాలకు పూర్తిగా దూరమైంది.
(ఇది చదవండి: గర్భస్రావమని చెప్పినా వినలేదు.. మరుసటి రోజే షూటింగ్: బుల్లితెర నటి)
Comments
Please login to add a commentAdd a comment