Gajini
-
స్టార్ హీరోయిన్ కూతురు బర్త్‌డే.. సోషల్ మీడియాలో వైరల్!
అమ్మా, నాన్న.. ఓ తమిళ అమ్మాయి చిత్రంతో రవితేజ సరసన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ భామ ఆసిన్. ఆ తర్వాత శివమణి, లక్ష్మీనరసింహా, షుర్షణ, అన్నవరం లాంటి చిత్రాల్లో స్టార్ హీరోలతో నటించింది. తమిళంతో పాటు హిందీలోనూ పలు సినిమాల్లో కనిపించింది. కోలీవుడ్‌లో కమల్ హాసన్ సరసన దశవతారం, సూర్యకు జంటగా గజిని లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. ఆసిన్ ఏకంగా ఎనిమిది భాషల్లో మాట్లాడగలదు. అన్ని భాషల్లోనూ తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునే టాలెంట్ ఆమె సొంతం. (ఇది చదవండి: రికార్డులు కొల్లగొడుతున్న లియో.. కమల్, రజినీ చిత్రాలను వెనక్కినెట్టి!) తాజాగా అసిన్ తన కుమార్తె అరిన్ పుట్టినరోజు వేడుకలు చేసుకుంది భామ. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఆసిన్ కూతురు తన ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. కాగా.. ఆసిన్ చివరిసారిగా 2015లో వచ్చిన అభిషేక్ బచ్చన్, రిషి కపూర్, సుప్రియా పాఠక్‌లతో కలిసి ఆల్ ఈజ్ వెల్ అనే కామెడీ చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా బాలీవుడ్లో అమీర్ ఖాన్ నటించిన గజిని, రెడీ, బోల్ బచ్చన్, హౌస్‌ఫుల్ -2 లాంటి హిట్ చిత్రాలలో నటించింది. కాగా.. అసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంట అక్టోబర్ 2017లో తమ కుమార్తె అరిన్‌ను స్వాగతించారు. అయితే రాహుల్ శర్మను పెళ్లాడిన తర్వాత ఆసిన్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. (ఇది చదవండి: గర్భస్రావమని చెప్పినా వినలేదు.. మరుసటి రోజే షూటింగ్: బుల్లితెర నటి) -
సూర్య గజిని సీక్వెల్‌కు సిద్ధం?
తమిళ సినిమా: నటుడు సూర్య దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం గజిని. 2008లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అంతేకాకుండా సూర్య కెరియర్లో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని ఏఆర్ మురుదాస్ అమీర్ ఖాన్ హీరోగా హిందీలోనూ తెరకెక్కించి హిట్ కొట్టారు. ఆ తర్వాత సూర్య, ఏఆర్. మురుగదాస్‌లో కాంబినేషన్లో రూపొందిన ఏళామ్ అరివు చిత్రం 2011లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్! ఆ తర్వాత వీరి కాంబినేషన్లో చిత్రం రాలేదు. ఏఆర్ ముగురుదాస్ చివరిగా రజనీకాంత్ కథానాయకుడిగా దర్బార్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత విజయ్ కథానాయకుడిగా తుపాకీ- 2 చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ తెర్కెక్కించబోతున్నట్టు ప్రచారం జరిగినా అది ఆచరణలోకి రాలేదు. దీంతో ఏఆర్.మురుగదాస్ తదుపరి చిత్రం ఏమిటి అన్నది ఆసక్తిగా మారింది. ఈయన చిత్రం చేసి చాలా కాలమే అయ్యింది. చదవండి: ‘గాడ్‌ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే కాగా తాజాగా సూర్యతో మరోసారి సినిమా చేయడానికి ఈయన సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. వీరిద్దరి కాంబినేషన్లో ఘనవిజయం సాధించిన గజిని చిత్రానికి సీక్వెల్ కోసం మురుగదాస్ కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. అలాగే ఇందులో నటించే విషయమై సూర్యతో సంప్రదింపులు జరుపుతున్న ట్లు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక నటుడు సూర్య చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. -
గజినీ సీక్వెల్లో అల్లు అర్జున్!
అఅ్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బన్నీకి కొద్ది రోజుల క్రితం కరోనా సోకడంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇక పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల శ్రీనివాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొరటాల మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా పూర్తయిన తర్వాతే బన్నీ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడట. సో ఈ గ్యాప్‌లో బన్నీ కూడా ఓ మూవీకి సైన్ చేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినా మురగదాస్‌తో సినిమా చేసేందుకు బన్నీఆసక్తి చూపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గజిని-2 సీక్వెల్ వీరి మధ్య చర్చకు వచ్చింది. ఎప్పటినుంచో గజినీ మూవీ సీక్వెల్ తీయాలని భావిస్తున్న మురగదాస్‌కు ఇప్పుడు హీరో దొరికేశాడని, ఇందుకు బన్నీ కూడా పచ్చజెండా ఊపినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. సూర్య, అసిన్ హీరో, హీరోయిన్లుగా 2005లో వచ్చిన ఈ సినిమా హిందీలోనూ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గజిని సీక్వెల్‌గా మురగదాస్ మరో కొత్త కథను రూపొందించనున్నారు. మరి ఈ సీక్వెల్ వర్షన్లో బన్నీ సరసన హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే మురగదాస్-బన్నీ కాంబినేషన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చ అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. చదవండి : అల్లు అర్జున్ను దారుణంగా అవమానించిన దిల్ రాజు! ‘వల్లంకి పిట్ట’ చిన్నారి ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా! -
గజిని ఫోటోతో పోలీసుల వినూత్న యత్నం
సాక్షి, పూణే: కరోనా వైరస్‌పై అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా సివిల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అనేక విధాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకచోట ట్రాఫిక్ పోలీసులు కరోనా గురించి రోడ్డు మీద డాన్స్ వేస్తూ అవగాహన కల్పిస్తే మరో చోట చేతులు ఎలా కడుక్కోవాలో ట్రాఫిక్ పోలీసులు చూపించారు. ఇక సోషల్‌మీడియాలో సైతం విభిన్న మీమ్స్‌తో కరోనాపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇదేవిధంగా ప్రస్తుతం పూణే పోలీసులు 2008 లో వచ్చిన గజిని ఫోటోతో కరోనా పై అవగాహన కల్పిస్తున్నారు. (కరోనాపై పోరాటం: రంగంలోకి ‘మాయల ఫకీరు’) 1. Wear a mask 2. Practice social distancing 3. Wash hands frequently You don’t need to cover your entire body with tattoos for that, do you?#OnGuardAgainstCorona pic.twitter.com/CbJmLB9KoB — PUNE POLICE (@PuneCityPolice) April 14, 2020 గజిని సినిమా మొదటిలో అమీర్‌ఖాన్‌కు షార్ట్‌టర్మ్ మెమరీ ఉండటంతో అన్ని విషయాలను తన ఒట్టిన మీద టాటులా వేసుకుంటాడు. ఇప్పుడు పూణే పోలీసుల ఆ టాటు ప్లేసులో ఒక స్టికర్లాంటిది వేసి అన్ని మర్చిపోండి, కానీ మాస్క్ పెట్టుకోవడం మార్చిపోవద్దు అని రాశారు. దాంతో పాటు ఆ ఫోటోలో కోపంతో ఉన్న అమీర్‌ఖాన్ ముఖానికి మాస్క్ కట్టి ఉంది. ఈ ఫోటోని పూణే పోలీసులు తమ అఫిషియల్ ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి 1. మాస్క్ ధరించండి. 2. సామాజిక దూరం పాటించండి. 3. చేతులు తరచూ కడక్కోండి అనే క్యాప్షన్‌ను పోలీసులు జోడించారు. దీనికి అదనంగా పోలీసులు ఇందుకోసం మీరు మీ శరీరం మీద టాటులు వేయించుకోవల్సిన పనిలేదు, మీరూ వేయించుకుంటారా? అని జోడించారు. పోలీసులు చేసిన ఈ పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మీరు సామాన్యులకు పోలీసువారికి మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించారు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా మిగిలిన వారు వారికి తోచిన విధంగా స్పందిస్తున్నారు. (భయపడకు తల్లీ.. నీ కొడుకు వచ్చేశాడు: డీజీపీ) -
అది చెత్త నిర్ణయం
‘ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఏదో పిచ్చి... ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి...’ అంటూ ‘గజిని’ సినిమాలో యూత్‌ని హీటెక్కించారు నయనతార. ఇప్పటికీ ఆ పాట ఎక్కడ విన్నా, చూసినా కాలు కదపకుండా ఉండలేరు. సూర్య హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 2005లో వచ్చిన ఆ సినిమాలో చిత్ర పాత్రలో ప్రేక్షకులను అలరించారు నయనతార. ఆ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. ఇప్పుడీ సినిమా గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే.. ‘గజిని’ సినిమా చేయడం తన జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయనతార పేర్కొన్నారు. కెరీర్ ప్రారంభంలో ఆమె చేసిన తమిళ చిత్రాలు ‘చంద్రముఖి, గజిని’ ప్రేక్ష కుల్లో మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ‘గజిని’ చేయడం గురించి ఇటీవల ఆమె మాట్లాడుతూ– ‘‘గజిని’ కథ చెబుతున్నప్పుడు నా పాత్ర వేరు.. తెరపై కనిపించింది వేరు. చిత్ర పాత్రను అంతలా తగ్గించేశారు. ఆ సినిమా చేయాలనుకోవడం నేను తీసుకున్న చెత్త నిర్ణయం. ‘చంద్రముఖి’ సినిమాలో కూడా నాది చిన్న పాత్రే. అయితే ఆ సినిమా మాత్రం నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ‘గజిని’ తర్వాత పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తపడ్డా’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం నయనతార తెలుగులో ‘సైరా’తో పాటు తమిళంలో ‘మిస్టర్ లోకల్, దళపతి 63, దర్బార్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
గజినీ 2 ?
తెలుగు ఆడియన్స్‌కు సూర్యను బాగా దగ్గర చేసిన చిత్రం ‘గజిని’. ఈ తమిళ సూపర్ హిట్‌ను తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. తమిళంలోలానే ఇక్కడా ఘనవిజయం సాధించింది. అంతే కాదు హిందీ వెర్షన్‌ను ఆమిర్‌తో నిర్మించారు అరవింద్. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ‘గజినీ 2’ అనే టైటిల్‌ను తెలుగు, తమిళ భాషల్లో రిజిస్టర్ చేయించినట్టు తెలిసింది. మరి ఈ సినిమా సూర్య, మురుగదాస్ కాంబినేషన్లోనే ఉంటుందా? కాంబినేషన్ మారుతుందా? వేచి చూడాలి. -
అప్పుడు సొంత కారు కూడా లేదు: ఆమిర్ ఖాన్
సాక్షి, ఢిల్లీ: ‘కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వచ్చింది. నేడు వైవిధ్యమైన, వినూత్నమైన కథలను అభిమానులు ఆదరిసున్నార’ని బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత 30 ఏళ్లలో భారతీయ సినీ అభిమానుల ఆసక్తుల్లో వచ్చిన మార్పులపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ డ్రామాగా 1992లో తెరకెక్కిన ‘జో జీతా హై వొహీ సికందర్’ నేటి కాలానికి కూడా సరిపోయే గొప్ప సినిమా. ఆ తరహా కథలతో వచ్చే సినిమాలకు నేడు మంచి ఆదరణ ఉంది. కథలో వైవిధ్యం ఉన్న సినిమాలు బాక్సాఫీసు దగ్గర మంచి విజయాలు సాధిస్తున్నాయ’ని ఆమిర్ అన్నారు. ‘కేవలం కథను నమ్మి సినిమా చేయడం కత్తి మీత సామే. నా వరకైతే అది కమర్షియల్ సినిమానా, కథ ప్రధానంగా రూపొందే సినిమానా అని చూసుకోను. మంచి కథతో సినిమా చేయాలి. సినిమాను ఎక్కువ మంది ఇష్టపడాలి’ అని మాత్రామే ఆలోచిస్తానని ఆమిర్ వివరించారు. ‘కానీ, ఈ రోజుల్లో ఫలానా మూవీ మంచి సినిమా అని చెప్పడం కష్టం. ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాను గొప్ప సినిమాగా లెక్కేస్తున్నామ’ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా కథ గురించి సగటు ప్రేక్షకుడిగా ఆలోచిస్తాని అన్నారు. వాణిజ్య పరంగా సినిమా నిలదొక్కుకోవడానికి కొన్ని మెళకువలు కూడా పాటిస్తానన్నారు. సినీ రంగంలో చాలా మంది హీరోలు ప్రయోగాలకు దూరంగా ఉన్నారు. కొందరు మాత్రమే కథను నమ్మి సినిమాలు చేస్తున్నారని ఆమీర్ అభిప్రాయ పడ్డారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారు అటు వాణిజ్య విలువలు, ఇటు విభిన్న కథాంశాలను మిళితం చేస్తూ పలు సినిమాలు చేశారు. స్వదేశ్, రాయీస్, భజరంగీ భాయ్‌జాన్ వంటి సినిమాలు ఆ కోవకు చెందినవేనని ఆయన అన్నారు. కథ ప్రధానంగా తెరకెక్కిన తారే జమీన్ పర్, రంగ్ దే బసంతి, దిల్ చాహ్తా హై వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించినా.. వసూళ్లు సాధించలేదని అన్నారు. ‘నా కెరీర్లో తొలి కమర్షియల్ హిట్ ‘ఖయామత్ సే ఖయామత్ తక్’. అప్పటికీ నాకు సొంత కారు కూడా లేదు. ప్రయాణం బస్సుల్లోనే సాగేద’ని ఆమిర్ గుర్తు చేసుకున్నారు. నెలకు వెయ్యి రూపాయల సంపాదనతో కెరీర్ ప్రారంభించాననీ.. ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రానికి తన సంపాదన పదకొండు వేలు మాత్రమేనని ఆయన తెలిపారు. ఎప్పుడూ వైవిధ్యం కోసం ఆరాటపడే ఆమిర్ ఖాన్ నటించిన గజిని సినిమా 2008లో విడుదలై ఘనవిజయం సాధించింది. రూ.100 కోట్ల వసూళ్లు సాధించి భారతీయ సినిమా రంగంలో వసూళ్ల పరంగా ‘వంద కోట్ల సినిమా క్లబ్’కు నాంది పలికింది. -
పంటి చికిత్స కోసం వెళ్లి గజినీ అయ్యాడు
లండన్: గజిని చిత్రం గుర్తుందిగా.. అందులో హీరోకి ఏ విషయమూ 15 నిమిషాలకంటే ఎక్కువ సేపు గుర్తుండదు. ఆ కాసేపట్లోనే అన్నీ మర్చిపోతుంటాడు. దీన్ని షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటారనే విషయం అప్పుడే అందరికీ తెలిసింది. అయితే అది సినిమా... కానీ ఇప్పుడు లండన్‌లో నిజంగానే ఓ గజిని అవతరించాడు. బ్రిటన్‌కు చెందిన ఓ 38 ఏళ్ల వ్యక్తి అచ్చం గజిని సినిమాలోలాగే కొత్త విషయమేదీ ఎక్కువ సేపు గుర్తుంచుకోడు. ఇతడి జ్ఞాపకశక్తి కేవలం 90 నిమిషాలే. ఆ తర్వాత అన్నీ కొత్తగానే ఉంటాయి. అయితే ఇతడు గజినిగా మారడానికి దోహదపడిన కారణం తెలిస్తే మాత్రం జాలేస్తుంది. దాదాపు పదేళ్ల క్రితం ఇతడు పంటి నొప్పితో ఓ వైద్యుడి వద్దకు వెళ్లాడు. అక్కడ వైద్యుడు అతడ్ని పరీక్షించి రూట్ కెనాల్ చికిత్స చేయాలని నిర్ణయించి, మత్తుమందు ఇచ్చాడు. చికిత్స పూర్తి అయినప్పటి నుంచి అతడు గతాన్ని మర్చిపోయాడు. ఇక అప్పటినుంచి అతడి జ్ఞాపకశక్తి కేవలం 90 నిమిషాలుగానే మారిపోయింది. పదేళ్ల నుంచి అతడు ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాడు. నిద్రలేవగానే ప్రతిరోజూ ఉదయం తనకు దంతవైద్యుడి దగ్గరకు వెళ్లాలనుకుంటాడు. అప్పటివరకే అతడికి గుర్తుంది. అయితే తన పేరు, వివరాలు మాత్రం ఇప్పటికీ గుర్తున్నాయని అతడు తెలిపాడు. -
హైదరాబాద్‌లో గజినీ !
హీరో సూర్య చిత్రం గజినీ గుర్తుండే ఉంటుంది. తాజాగా హైదరాబాద్‌లో కూడా అలాంటి ఓ అభినవ గజినీ హల్చల్ చేశారు. వారం క్రితం పుణె నుంచి ఓ యువకుడు నగరానికి వచ్చాడు. స్టార్ హోటళ్లలో బస చేశాడు.. గుండెపోటంటూ హడావుడి చేసి అపోలో ఆస్పత్రిలో చేరాడు. ఖరీదైన వైద్యం పొందాడు. తీరా బిల్లు చెల్లించమంటే ‘నేనెవరు?... నన్నెవరు తీసుకొచ్చారు' అంటూ రివర్స్ తిరిగాడు. విస్తుపోయిన ఆస్పత్రి వర్గాలు ఈ గజనీని పోలీసులకు అప్పగించారు. గుండెపోటు వచ్చిందంటూ పుణెకు చెందిన ఓ యువకుడు అపోలో ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేరాడు. చూసేందుకు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌లాగా కనిపించడమే కాకుండా ఇంగ్లిష్‌లో అదరగొట్టాడు. అతగాడి డాబూ దర్పం చూసిన అపోలో వైద్యులు సకల మర్యాదలతో పాటు చికిత్స అందించారు. ఖరీదైన మందులిచ్చారు. రెండు రోజులు డీలక్స్ రూమ్‌లో సపర్యలు చేశారు. డిశ్చార్జ్ చేసే ముందు రూ. 29 వేల బిల్లు ను చేతిలో పెట్టారు. బిల్లు నాకెందుకిస్తున్నారని, అసలు నన్నిక్కడికి ఎవరు తీసుకువచ్చారంటూ యువకుడు ఎదురు ప్రశ్నించేసరికి ఆస్ప త్రి వర్గాలు నోరెల్లబెట్టాయి. ఆ యువకుడికి మతిస్థిమితం సరిగా లేదని భావించి.. ఆస్పత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జగదీష్ సింగ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. అతని పేరు సామ్రాట్ గుప్తా (35), స్వస్థలం పుణెగా గుర్తించారు. ఎంకామ్ చదివినట్టు అతని వద్ద లభించిన ధ్రువపత్రాల ద్వారా తెలిసింది. వారం కిందట సామ్రాట్ వైశ్రాయ్ హోటల్లో నాలుగు రోజులు బస చేసి బిల్లు చేతిలో పెట్టేసరికి తాను ఇక్కడ ఉండనేలేదని, ఎందుకు బిల్లు కట్టాలంటూ ప్రశ్నించి తప్పుకున్నాడు. బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ ఇలాగే టోకరా ఇచ్చినట్లు తేలింది. నగరంలోనూ ఇదే ధోరణితో పలువురిని ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అనుమతితో మానసిక చికిత్సాలయం లో చేర్చి మానసిక స్థితిని తెలుసుకోవాలని నిర్ణయించారు. సామ్రాట్‌కు నిజంగానే మతి తప్పిందా? లేక ఇదంతా బిల్లులు ఎగగొట్టడానికి చేస్తున్న నాటకమా? అన్నది తేలాల్సి ఉంది. -
అంజాన్ స్క్రీన్‌ప్లే హైలెట్
చిత్రానికి కథ ఎంత ముఖ్యమో కథనం అంతకన్నా ముఖ్యం. అంజాన్ చిత్రం స్క్రీన్‌ప్లే హైలెట్‌గా ఉంటుందని ఆ చిత్ర హీరో సూర్య పేర్కొన్నారు. ఈయన చాలా గ్యాప్ తరువాత ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం అంజాన్. చెన్నై చిన్నది సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లింగుస్వామి స్వీయ దర్శకత్వంలో యూటీవీ సంస్థ భాగస్వామ్యంలో నిర్మిస్తున్నారు. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. చిత్ర టీజర్ ఇటీవల యూ ట్యూబ్‌లో విడుదలై ంది. దీనికి విశేష స్పందన వస్తోందని చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడిం చారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో సూర్య మాట్లాడుతూ అంజాన్ చిత్ర ట్రీజర్కు ఇంత డైమండ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంజాన్ చిత్ర కథ, కథనాలు తమిళ సినిమాను కచ్చితంగా కొత్తగా ఉంటాయన్నారు. తానింతవరకు నటించిన చిత్రాల్లో ఇలాంటి స్క్రీన్‌ప్లేను చూడలేదన్నారు. అంజాన్ చిత్రం రెండు మూడు వారాల తరువాత చూసే ప్రేక్షకులకు నచ్చే చిత్రం అన్నారు. అలాగే రెండు, మూడు నెలల తరువాత కూడా అంజాన్ చిత్రాన్ని మళ్ళీ మళ్లీ చూసే ఆడియన్స్‌కు ఏ మాత్రం బోర్కొట్టదని అన్నారు. ఈ చిత్రంలో అలాంటి చిన్న మ్యాజిక్ కూడా ఉంటుం దని తెలిపారు. చిత్రంలో పోరాట సన్నివేశాలు అదుర్స్ అనిపించే స్థాయిలో ఉంటాయని చెప్పారు. గజనిలో గాయపడ్డా : తాను గజని చిత్రం చేస్తున్నప్పుడు ఆ చిత్రంలోని ఫైట్స్ సన్నివేశాల్లో నటించి నప్పుడు గాయాలకు గురయ్యానని,అదే విధంగా ఈ అంజాన్ చిత్ర పోరాట దృశ్యాలను చిన్నగాయాల య్యాయని తెలిపారు. పోరాట దృశ్యాలలో నటించేటప్పుడు స్టంట్ కళాకారులు తీసుకునే రిస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. అలాంటి వారి కోసం ఫిజియోథెరపీ పరీక్షా కేంద్రా న్ని నిర్వహించాలనే ఆలోచన ఉందని సూర్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ గజిని చిత్రంలో లవ్‌ట్రాక్ బాగుంటుం దన్నారు. అదే విధంగా ఈ చిత్రంలో సూర్య, సమంతల మధ్య లవ్ సన్నివేశాలు అలరిస్తాయని అన్నారు. సమంతకు ఈ చిత్రం కెరీర్లో ముఖ్యమైనదిగా నిలిచిపోతుందని దర్శకుడు లింగుస్వామి అన్నారు. అంజాన్ వీడియో గేమ్: యూటీవీ సంస్థ ప్రతినిధి ధనుంజయన్ మాట్లాడుతూ సూర్య పుట్టిన రోజు ( ఈ నెల 23) సందర్భంగా అంజాన్ వీడియో గేమ్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ గేమ్‌లో అంజాన్ చిత్ర థీమ్ ఉంటుందన్నారు. చాలా ఆసక్తిగా ఉండే ఈ గేమ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు చిత్ర సింగిల్ లైన్ స్టోరీ కూడా చోటు చేసుకుంటుందని ఆయన వెల్లడించారు. -
చంద్రబాబు గజిని : చిరంజీవి
తుని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గజిని లాంటి వాడని, ఎప్పుడు అన్నమాటలు అప్పుడే మర్చిపోతారని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు చిరంజీవి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం సీతారామరాజు సెంటర్లో నిర్వహించిన రోడ్‌షోలో ప్రసంగించారు. చంద్రబాబు ఆఖరి పోరాటం చేస్తున్నారని, ఈ ఎన్నికలు కొన్ని పార్టీలకు జీవన్మరణ సమస్య అన్నారు. చంద్రబాబు అధికారం చేజిక్కించుకోకపోతే భవిష్యత్ ఉండదన్నారు.