అంజాన్ స్క్రీన్‌ప్లే హైలెట్
చిత్రానికి కథ ఎంత ముఖ్యమో కథనం అంతకన్నా ముఖ్యం. అంజాన్ చిత్రం స్క్రీన్‌ప్లే హైలెట్‌గా ఉంటుందని ఆ చిత్ర హీరో సూర్య పేర్కొన్నారు. ఈయన చాలా గ్యాప్ తరువాత ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం అంజాన్. చెన్నై చిన్నది సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లింగుస్వామి స్వీయ దర్శకత్వంలో యూటీవీ సంస్థ భాగస్వామ్యంలో నిర్మిస్తున్నారు. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. చిత్ర టీజర్ ఇటీవల యూ ట్యూబ్‌లో విడుదలై ంది. దీనికి విశేష స్పందన వస్తోందని చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడిం చారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో సూర్య మాట్లాడుతూ అంజాన్ చిత్ర ట్రీజర్‌కు ఇంత డైమండ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందన్నారు.
ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంజాన్ చిత్ర కథ, కథనాలు తమిళ సినిమాను కచ్చితంగా కొత్తగా ఉంటాయన్నారు. తానింతవరకు నటించిన చిత్రాల్లో ఇలాంటి స్క్రీన్‌ప్లేను చూడలేదన్నారు. అంజాన్ చిత్రం రెండు మూడు వారాల తరువాత చూసే ప్రేక్షకులకు నచ్చే చిత్రం అన్నారు. అలాగే రెండు, మూడు నెలల తరువాత కూడా అంజాన్ చిత్రాన్ని మళ్ళీ మళ్లీ చూసే ఆడియన్స్‌కు ఏ మాత్రం బోర్‌కొట్టదని అన్నారు. ఈ చిత్రంలో అలాంటి చిన్న మ్యాజిక్ కూడా ఉంటుం దని తెలిపారు. చిత్రంలో పోరాట సన్నివేశాలు అదుర్స్ అనిపించే స్థాయిలో ఉంటాయని చెప్పారు.
గజనిలో గాయపడ్డా : తాను గజని చిత్రం చేస్తున్నప్పుడు ఆ చిత్రంలోని ఫైట్స్ సన్నివేశాల్లో నటించి నప్పుడు గాయాలకు గురయ్యానని,అదే విధంగా ఈ అంజాన్ చిత్ర పోరాట దృశ్యాలను చిన్నగాయాల య్యాయని తెలిపారు. పోరాట దృశ్యాలలో నటించేటప్పుడు స్టంట్ కళాకారులు తీసుకునే రిస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. అలాంటి వారి కోసం ఫిజియోథెరపీ పరీక్షా కేంద్రా న్ని నిర్వహించాలనే ఆలోచన ఉందని సూర్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ గజిని చిత్రంలో లవ్‌ట్రాక్ బాగుంటుం దన్నారు. అదే విధంగా ఈ చిత్రంలో సూర్య, సమంతల మధ్య లవ్ సన్నివేశాలు అలరిస్తాయని అన్నారు. సమంతకు ఈ చిత్రం కెరీర్‌లో ముఖ్యమైనదిగా నిలిచిపోతుందని దర్శకుడు లింగుస్వామి అన్నారు.
అంజాన్ వీడియో గేమ్: యూటీవీ సంస్థ ప్రతినిధి ధనుంజయన్ మాట్లాడుతూ సూర్య పుట్టిన రోజు ( ఈ నెల 23) సందర్భంగా అంజాన్ వీడియో గేమ్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ గేమ్‌లో అంజాన్ చిత్ర థీమ్ ఉంటుందన్నారు. చాలా ఆసక్తిగా ఉండే ఈ గేమ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు చిత్ర సింగిల్ లైన్ స్టోరీ కూడా చోటు చేసుకుంటుందని ఆయన వెల్లడించారు.