Anjan
-
భయపెట్టే నాయిక
హారర్ కామెడీ తరహాలో ఇప్పటిదాకా చాలా చిత్రాలు వచ్చాయి. ఆ కోవలోనే వస్తున్న చిత్రం ‘హీరోయిన్’. అంజన్, అనుస్మృతి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జె.వి.ఆర్ సినిమా పతాకంపై జల్లెపల్లి వెంకటేశ్వర్లు నిర్మించారు. భరత్ పారేపల్లి దర్శకుడు. హైదరాబాద్‌లో జరిగిన పాటల వేడుకలో దర్శకుడు మారుతి తొలి సీడీ ఆవిష్కరించి, నటుడు సంపూర్ణేష్‌బాబుకు అందజేశారు. భరత్ పారేపల్లి మాట్లాడుతూ -‘‘అనుస్మృతి టైటిల్ రోల్ చేశారు. సినిమా ఫస్ట్‌కాపీ చూసి మారుతీ విడుదల చేయడానికి ముందుకొచ్చారు’’ అని చెప్పారు. ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలున్న చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. -
అంజాన్ స్క్రీన్‌ప్లే హైలెట్
చిత్రానికి కథ ఎంత ముఖ్యమో కథనం అంతకన్నా ముఖ్యం. అంజాన్ చిత్రం స్క్రీన్‌ప్లే హైలెట్‌గా ఉంటుందని ఆ చిత్ర హీరో సూర్య పేర్కొన్నారు. ఈయన చాలా గ్యాప్ తరువాత ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం అంజాన్. చెన్నై చిన్నది సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లింగుస్వామి స్వీయ దర్శకత్వంలో యూటీవీ సంస్థ భాగస్వామ్యంలో నిర్మిస్తున్నారు. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. చిత్ర టీజర్ ఇటీవల యూ ట్యూబ్‌లో విడుదలై ంది. దీనికి విశేష స్పందన వస్తోందని చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడిం చారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో సూర్య మాట్లాడుతూ అంజాన్ చిత్ర ట్రీజర్కు ఇంత డైమండ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంజాన్ చిత్ర కథ, కథనాలు తమిళ సినిమాను కచ్చితంగా కొత్తగా ఉంటాయన్నారు. తానింతవరకు నటించిన చిత్రాల్లో ఇలాంటి స్క్రీన్‌ప్లేను చూడలేదన్నారు. అంజాన్ చిత్రం రెండు మూడు వారాల తరువాత చూసే ప్రేక్షకులకు నచ్చే చిత్రం అన్నారు. అలాగే రెండు, మూడు నెలల తరువాత కూడా అంజాన్ చిత్రాన్ని మళ్ళీ మళ్లీ చూసే ఆడియన్స్‌కు ఏ మాత్రం బోర్కొట్టదని అన్నారు. ఈ చిత్రంలో అలాంటి చిన్న మ్యాజిక్ కూడా ఉంటుం దని తెలిపారు. చిత్రంలో పోరాట సన్నివేశాలు అదుర్స్ అనిపించే స్థాయిలో ఉంటాయని చెప్పారు. గజనిలో గాయపడ్డా : తాను గజని చిత్రం చేస్తున్నప్పుడు ఆ చిత్రంలోని ఫైట్స్ సన్నివేశాల్లో నటించి నప్పుడు గాయాలకు గురయ్యానని,అదే విధంగా ఈ అంజాన్ చిత్ర పోరాట దృశ్యాలను చిన్నగాయాల య్యాయని తెలిపారు. పోరాట దృశ్యాలలో నటించేటప్పుడు స్టంట్ కళాకారులు తీసుకునే రిస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. అలాంటి వారి కోసం ఫిజియోథెరపీ పరీక్షా కేంద్రా న్ని నిర్వహించాలనే ఆలోచన ఉందని సూర్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ గజిని చిత్రంలో లవ్‌ట్రాక్ బాగుంటుం దన్నారు. అదే విధంగా ఈ చిత్రంలో సూర్య, సమంతల మధ్య లవ్ సన్నివేశాలు అలరిస్తాయని అన్నారు. సమంతకు ఈ చిత్రం కెరీర్లో ముఖ్యమైనదిగా నిలిచిపోతుందని దర్శకుడు లింగుస్వామి అన్నారు. అంజాన్ వీడియో గేమ్: యూటీవీ సంస్థ ప్రతినిధి ధనుంజయన్ మాట్లాడుతూ సూర్య పుట్టిన రోజు ( ఈ నెల 23) సందర్భంగా అంజాన్ వీడియో గేమ్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ గేమ్‌లో అంజాన్ చిత్ర థీమ్ ఉంటుందన్నారు. చాలా ఆసక్తిగా ఉండే ఈ గేమ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు చిత్ర సింగిల్ లైన్ స్టోరీ కూడా చోటు చేసుకుంటుందని ఆయన వెల్లడించారు. -
సూర్యకు జోడీగా నటించడానికి రెడీ!
బాలీవుడ్లో స్టార్ స్టేటస్ కోసం దక్షిణాది కథానాయికలందరూ పట్టు విడుపుల్ని సడలిస్తుంటే... బాలీవుడ్ సూపర్‌స్టార్ కరీనా కపూర్ మాత్రం స్పైసీగా కనిపించడం ఇష్టం లేక గొప్పగొప్ప ప్రాజెక్టులనే వదిలేసుకుంటోంది. ఓ ఇంటికి ఇల్లాలైన తర్వాత ఇలాంటి వేషాలు వేయడం నిజంగా కష్టమే మరి. కేవలం గ్లామర్ పాళ్లు ఎక్కువ అయ్యిందనే ఒకే ఒక కారణం చేత ఆమె వదిలేసిన సినిమాలు ఏవో తెలుసా? రామ్‌లీలా, క్వీన్. ఈ చిత్రాల దర్శకులు ఈ కథల్ని చెప్పినప్పుడు... కొన్ని సన్నివేశాలు తనకు అభ్యంతరకరంగా అనిపించాయట. దానికి సదరు దర్శకులు కూడా వెనక్కు తగ్గకపోవడంతో ఆ సినిమాలు వేరే హీరోయిన్లకు అందాయి. రీసెంట్గా ‘శుద్ధి’ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కరణ్‌జోహార్ ఆమెను సంప్రదిస్తే... చేయనని రెడ్ సిగ్నల్ చూపించేసిందట బెబో. కరీనా ఎంత స్టారో అంతటి నటి కూడా. అలాంటి తను ఇలా మంచి మంచి సినిమాలను వదిలేయడం ఆమె అభిమానుల్ని బాధకు గురి చేస్తోంది. ఈ విషయంపై కరీనా స్పందిస్తూ- ‘‘మొన్నటి వరకూ నా జీవితం నా చేతిలో మాత్రమే ఉంది. కానీ... ఇప్పుడు నా జీవితం నా ఒక్కదానిదే కాదు. నా కుటుంబానిది కూడా. వాళ్లకు అగౌరవం కలిగించే ఏ పనినీ నేను చేయలేను. నిజానికి నేను వదిలేసిన పాత్రలు గొప్పవే. కానీ... అందులో కథరీత్యా లిప్ లాక్లున్నాయి. టాప్‌లెస్‌గా కూడా కనిపించాల్సిన సన్నివేశాలున్నాయి. పెళ్లయిన తర్వాత అలాంటి పాత్రలు చేయడం సమంజసం కాదు. అందుకే వదిలేశా. నేను వదిలేయడం వల్లే... మరో నటికి తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం వచ్చింది. అది నాకు సంతృప్తి కలిగిస్తున్న విషయం’’ అన్నారు కరీనా. ‘కోలీవుడ్ స్టార్ సూర్య ఎవరో నాకు తెలీదు’ అని ఇటీవల మీడియాతో కరీనా అన్నదని వినిపిస్తున్న రూమర్లపై ఆమె స్పందిస్తూ- ‘‘నటిగా నాకు భాష తెలియడం ముఖ్యం. తెలీని భాషలో నేను నటించలేను. నిజానికి నన్ను నటించమని కూడా ఎవరూ అడగలేదు. సూర్య తమిళ చిత్రం ‘అంజాన్’లో నన్ను ఐటమ్ సాంగ్ చేయమని వాళ్లు అడిగినట్లు, నేను సూర్య ఎవరు? అన్నట్లు మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తలు ఎలా పుట్టాయో కూడా నాకు తెలీదు. సూర్య కోలీవుడ్‌లో పెద్ద సూపర్‌స్టార్. ఆయన అక్కడ నటించిన సినిమాలు ఇక్కడ రీమేక్ అవుతున్నాయి. అలాంటి సూర్య నాకు తెలీకపోవడం ఏంటి? సూర్య బాలీవుడ్లో నటిస్తే ఆయనకు జోడీగా నేను నటించడానికి సిద్ధం’’ అని చెప్పారు.