సూర్యకు జోడీగా నటించడానికి రెడీ! | Kareena Kapoor to act with Surya in Anjan Movie | Sakshi
Sakshi News home page

సూర్యకు జోడీగా నటించడానికి రెడీ!

Published Sun, Apr 13 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM

సూర్యకు జోడీగా నటించడానికి రెడీ!

సూర్యకు జోడీగా నటించడానికి రెడీ!

బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ కోసం దక్షిణాది కథానాయికలందరూ పట్టు విడుపుల్ని సడలిస్తుంటే... బాలీవుడ్ సూపర్‌స్టార్ కరీనా కపూర్ మాత్రం స్పైసీగా కనిపించడం ఇష్టం లేక గొప్పగొప్ప ప్రాజెక్టులనే వదిలేసుకుంటోంది. ఓ ఇంటికి ఇల్లాలైన తర్వాత ఇలాంటి వేషాలు వేయడం నిజంగా కష్టమే మరి. కేవలం గ్లామర్ పాళ్లు ఎక్కువ అయ్యిందనే ఒకే ఒక కారణం చేత ఆమె వదిలేసిన సినిమాలు ఏవో తెలుసా? రామ్‌లీలా, క్వీన్. ఈ చిత్రాల దర్శకులు ఈ కథల్ని చెప్పినప్పుడు... కొన్ని సన్నివేశాలు తనకు అభ్యంతరకరంగా అనిపించాయట. దానికి సదరు దర్శకులు కూడా వెనక్కు తగ్గకపోవడంతో ఆ సినిమాలు వేరే హీరోయిన్లకు అందాయి.
 
 రీసెంట్‌గా ‘శుద్ధి’ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కరణ్‌జోహార్ ఆమెను సంప్రదిస్తే... చేయనని రెడ్ సిగ్నల్ చూపించేసిందట బెబో. కరీనా ఎంత స్టారో అంతటి నటి కూడా. అలాంటి తను ఇలా మంచి మంచి సినిమాలను వదిలేయడం ఆమె అభిమానుల్ని బాధకు గురి చేస్తోంది. ఈ విషయంపై కరీనా స్పందిస్తూ- ‘‘మొన్నటి వరకూ నా జీవితం నా చేతిలో మాత్రమే ఉంది. కానీ... ఇప్పుడు నా జీవితం నా ఒక్కదానిదే కాదు. నా కుటుంబానిది కూడా. వాళ్లకు అగౌరవం కలిగించే ఏ పనినీ నేను చేయలేను. నిజానికి నేను వదిలేసిన పాత్రలు గొప్పవే. కానీ... అందులో కథరీత్యా లిప్ లాక్‌లున్నాయి. టాప్‌లెస్‌గా కూడా కనిపించాల్సిన సన్నివేశాలున్నాయి. పెళ్లయిన తర్వాత అలాంటి పాత్రలు చేయడం సమంజసం కాదు. అందుకే వదిలేశా. నేను వదిలేయడం వల్లే... మరో నటికి తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం వచ్చింది. అది నాకు సంతృప్తి కలిగిస్తున్న విషయం’’ అన్నారు కరీనా.
 
  ‘కోలీవుడ్ స్టార్ సూర్య ఎవరో నాకు తెలీదు’ అని ఇటీవల మీడియాతో కరీనా అన్నదని వినిపిస్తున్న రూమర్లపై ఆమె స్పందిస్తూ- ‘‘నటిగా నాకు భాష తెలియడం ముఖ్యం. తెలీని భాషలో నేను నటించలేను. నిజానికి నన్ను నటించమని కూడా ఎవరూ అడగలేదు. సూర్య తమిళ చిత్రం ‘అంజాన్’లో నన్ను ఐటమ్ సాంగ్ చేయమని వాళ్లు అడిగినట్లు, నేను సూర్య ఎవరు? అన్నట్లు మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తలు ఎలా పుట్టాయో కూడా నాకు తెలీదు. సూర్య కోలీవుడ్‌లో పెద్ద సూపర్‌స్టార్. ఆయన అక్కడ నటించిన సినిమాలు ఇక్కడ రీమేక్ అవుతున్నాయి. అలాంటి సూర్య నాకు తెలీకపోవడం ఏంటి? సూర్య బాలీవుడ్‌లో నటిస్తే ఆయనకు జోడీగా నేను నటించడానికి సిద్ధం’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement