బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరో సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. తాజాగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. కుటుంబంలో ఉండే రిలేషన్స్‌ను ఉద్దేశించి కరీనా కపూర్ చేసింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. సమయంతో పాటు ఎవరికైనా నిర్ణయాలు మారవచ్చని తెలిపింది. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి తర్వాత చేసిన పోస్ట్ కావడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందో ఓసారి చూసేద్దాం.
కరీనా కపూర్ తన పోస్ట్‌లో రాస్తూ.. " వివాహాలు, విడాకులు, ఆందోళనలు, పిల్లలు పుట్టడం, ఇష్టమైన వ్యక్తి మరణం, పేరెంటింగ్ గురించి సంఘటనలు నిజంగా అర్థం చేసుకోలేరు. ఇది మీ జీవితంలో నిజంగా జరిగే వరకు మీకు ఇలాంటి విషయాలు అర్థం కావు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలోని పరిస్థితులు, సిద్ధాంతాలు, ఊహలు వాస్తవాలు కావు. జీవితంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడితే అంత తెలివైన వారిగా ఎదుగుతారు" అంటూ రాసుకొచ్చింది.
కాగా.. ఇటీవల ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బాంద్రాలో ఉన్నఇంట్లోకి ఒక ఆగంతకుడు చోరీకి యత్నించాడు. అదే క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన సైఫ్‌ను కత్తితో దాడి చేశాడు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సినిమాల విషయానికొస్తే కరీనా కపూర్ చివరిసారిగా హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ది బకింగ్‌హామ్ మర్డర్స్ చిత్రంలో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment