Bollywood Couples Saif Ali Khan And Kareena Kapoor Diwali Festival Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Saif Ali Khan-Kareena Kapoor: పిల్లాడి కంటే ఫోటో ముఖ్యమా.. బాలీవుడ్ జంటపై మండిపడుతున్న నెటిజన్స్

Published Tue, Oct 25 2022 3:55 PM | Last Updated on Tue, Oct 25 2022 6:21 PM

Bollywood Couples Saif Alikhan and Kareena kapoor Diwali Photo Viral - Sakshi

బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ దీపావళి సందర్భంగా అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ ఈ బాలీవుడ్ జంట సంప్రదాయ దుస్తులు ధరించి ఫోటోకు ఫోజులిచ్చారు. అంతా బాగానే ఉన్నా ఆ ఫోటో దిగిన సందర్భాన్ని కొందరు ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. ఎందుకంటే అందులో వారిద్దరి కుమారుల్లో ఒకరు కిందపడి ఏడుస్తూ కనిపించారు. అయినప్పటికీ ఈ జంట అవేం పట్టించుకోకుండానే నవ్వుతూ ఫోటోకు ఫోజులిచ్చారు. దీంతో వీరిద్దరి వ్యవహారంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. 

ఏది ఏమైనా సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఆ విధంగా చేయకూడదన్నది కొందరి అభిమానుల వాదన. మరి కొందరేమో పండగ వేళ సంతోషంలో అలా చేసి ఉంటారని సమర్థిస్తున్నారు. మరీ చిన్న పిల్లాడు ఏడుస్తుంటే అంత ఫోటో పిచ్చి ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా చిన్నపిల్లలను అలా వదిలేసి మనం ఆనందంలో మునిగిపోవడం ఎంతవరకు సమంజసం అని సగటు అభిమాని మండిపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement