మొరాకో వీధుల్లో కరీనా, సైఫ్‌ జంట! | Kareena Kapoor Shares Throwback Photo In Instagram | Sakshi
Sakshi News home page

మొరాకో వీధుల్లో కరీనా, సైఫ్‌ జంట!

Published Sun, May 10 2020 11:13 AM | Last Updated on Sun, May 10 2020 11:23 AM

Kareena Kapoor Shares Throwback Photo In Instagram - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఖాన్ తరచు తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు. ఇక దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. తన భర్త సైఫ్‌ అలీఖాన్‌, ముద్దుల తనయుడు తైమూర్‌తో సరదాగా గడిపిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. తాజాగా కరీనా ఓ త్రోబ్యాక్‌(పాత) ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Saturday Mood: Morocco '09 💯

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

2009లో దిగిన ఈ ఫొటోలో కరీనా, సైఫ్‌లు మొరాకో వీధుల్లో విహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోకు ‘సాటర్‌డే మూడ్‌: మొరాకో ‘09’’ అని కరీనా కామెంట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటో  నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక వీరిద్దరూ 2012లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. ఈ జంట 2016లో తైమూర్‌ అలీఖాన్‌కు జన్మనిచ్చింది. లాక్‌డౌన్‌ సందర్భంగా ఇటీవల సైఫ్‌ ఇంట్లోనే తైమూర్‌ జుట్టు కత్తిరిస్తున్న ఫొటోను కరీనా సోషల్ ‌మీడియాలో పోస్ట్‌  చేసి.. ‘ఎవరైనా జుట్టు కత్తిరించవచ్చు?’ అని కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే. 

Haircut anyone? 💁🏻‍♀️🤭

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement