
Netizens Trolls Kareena Kapoor Over Her Dressing: సెలబ్రిటీలు ఏం చేసిన అది వార్తల్లో నిలుస్తోంది. ఇక తారలు వారి తీరు, వస్త్రధారణపై సోషల్ మీడియాలో తరచూ ట్రోల్స్‌కు గురవుతారు. ఏ సందర్భంలో అయినా హీరోయిన్లు వస్త్రధారణ కాస్తా భిన్నంగా కనిపిస్తే చాలు ఇక వారిని ఆడేసుకుంటారు నెటిజన్లు. ఇప్పటికే జాన్వి కపూర్ తన యాటిటూడ్‌తో విమర్శలు ఎదుర్కొగా తాజాగా మరో స్టార్ హీరోయిన్ నెటజన్ల ట్రోల్స్‌కు బలైంది. ఎప్పుడూ ట్రెండీ లుక్‌తో అందరిని ఆకర్శించే కరీనా తాజాగా భర్త సైఫ్ అలీ ఖాన్‌తో బయటకు వచ్చిన ఆమె ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ దర్శనమిచ్చింది. బ్లాక్ జీన్స్, నెక్‌లెస్ ఓపెన్ టాప్‌తో ఇలా కరీనాను చూసిన మీడియా తమ కెమెరాలకు పని చెప్పారు.
చదవండి: ట్రైలర్ విడుదలపై క్లారిటీ ఇచ్చిన జక్కన్న, విడుదల తేదీ ప్రకటన
ఇక ఫొటోలు బయటకు కావడంతో నెటిజన్లు కరీనాపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతమంది ‘ఏంటి కరీనా నైటీతో బయటకి వచ్చావు’ అని, కొంతమంది ‘ఈ స్టార్స్ అంతా బాగా డబ్బున్న వాళ్ళు కానీ వారికి బట్టలు ఉండవు. ఇలా నైటీలు వేసుకొస్తారు’ అని, కొంతమంది ‘ఇంట్లో నైటీలు వేసుకోవట్లేదా ఇలా బయటకు నైటీలు వేసుకొచ్చావు’ అని కరీనాని ట్రోల్ చేస్తున్నారు. నైటీ వేసుకుని బయటకు వచ్చింది. ఈ దుస్తులతో ఆమెకు ఉన్న స్టైలిష్ బ్రాండ్ అనే ఇమేజ్ మొత్తం పోయింది. హే భగవాన్ ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చదవండిష: అత్యంత డేంజర్ లుక్‌లో అనసూయ.. భర్తనే చంపేస్తుందట, ఇదిగో ప్రూఫ్