సూర్య ఎవరు?
నటుడు సూర్య కోలీవుడ్‌లోనే టాలీవుడ్‌లోనూ ప్రముఖ హీరో. రక్త చరిత్ర చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అలాంటి స్టార్ హీరోను సూర్య ఎవరు అంటూ ప్రశ్నించిన బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌పై సూర్య అభిమానులు మండిపడుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ను దక్షిణాది చిత్రాల్లో నటింప చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. అవేవీ సఫలం కాలేదు. ఇటీవల లింగుసామి దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న అంజాన్ చిత్రంలో కరీనా కపూర్‌ను సింగిల్ సాంగ్‌కు నటింప జేసే ప్రయత్నాలు జరిగాయి.
ఈ విషయంపై ముంబాయిలో విలేకరులు కరీనాకపూర్‌ను ప్రశ్నించగా సూర్య సరసన నటిస్తున్నానా? ఆయనెవరు? అంటూ ఎదురు ప్రశ్నించడంతో విలేకరులు అవాక్కయ్యూరట. ఇంకా కరీనా కపూర్ మాట్లాడుతూ తనకు దక్షిణాది చిత్రాల్లో నటించే ఆసక్తే లేదన్నారు. అలాంటిది తమిళ చిత్రంలో సింగిల్ సాంగ్‌లో నటించడానికి ఎలా అంగీకరిస్తానని ప్రశ్నించారు. అయితే సూర్య ఎవరో తెలియదన్న కరీనాకపూర్‌పై ఆయన అభిమానులు ఆన్‌లైన్‌తోపాటు, సోషియల్ నెట్‌వర్క్ సైట్లలో ఫైర్ అవుతున్నారు.