
‘‘ఎప్పుడూ వర్క్ వర్క్ అంటూ రోబోలా ఉండటం నాకు ఇష్టం లేదు. స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను’’ అని అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్. ఈ ఏడాది ‘వీరే దే వెడ్డింగ్’ సినిమాతో వెండితెరపై మెరిసిన ఈ బ్యూటీ నెక్ట్స్ అక్షయ్ కుమార్ సరసన ‘గుడ్ న్యూస్’ అనే చిత్రంలో నటించనున్నారు.
ఇప్పుడు ‘వాట్ విమెన్ వాంట్ ఆన్ ఇష్క్’ అనే రేడియో షోకు రెడీ అవుతున్నారు. అటు సినిమాలు ఇటు రేడియో షో. మరి.. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అని కరీనాను అడిగితే... ‘‘వారంలో వరసగా నేను నాలుగు రోజులు పనిచేస్తే తర్వాతి మూడు రోజులు వర్క్ చేయను. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కు టైమ్ కేటాయిస్తాను. ఎందుకంటే నా లైఫ్ వారి చుట్టూనే తిరుగుతుంది’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment