భయపెట్టే నాయిక | heroine movie audio released | Sakshi
Sakshi News home page

భయపెట్టే నాయిక

Published Sun, Feb 1 2015 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

భయపెట్టే నాయిక

భయపెట్టే నాయిక

హారర్ కామెడీ తరహాలో ఇప్పటిదాకా చాలా చిత్రాలు వచ్చాయి. ఆ కోవలోనే వస్తున్న చిత్రం ‘హీరోయిన్’. అంజన్, అనుస్మృతి జంటగా నటిస్తున్న  ఈ చిత్రాన్ని జె.వి.ఆర్ సినిమా పతాకంపై జల్లెపల్లి వెంకటేశ్వర్లు నిర్మించారు. భరత్ పారేపల్లి దర్శకుడు. హైదరాబాద్‌లో జరిగిన పాటల వేడుకలో దర్శకుడు మారుతి తొలి సీడీ ఆవిష్కరించి, నటుడు సంపూర్ణేష్‌బాబుకు అందజేశారు. భరత్ పారేపల్లి మాట్లాడుతూ -‘‘అనుస్మృతి టైటిల్ రోల్ చేశారు. సినిమా  ఫస్ట్‌కాపీ చూసి మారుతీ విడుదల చేయడానికి ముందుకొచ్చారు’’ అని చెప్పారు. ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలున్న  చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement