Horror Comedy
-
Bhool Bhulaiyaa 3: ఆమె కళ్లు వేటాడతాయి!
బాలీవుడ్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో ‘భూల్ భూలయ్యా’ ఒకటి. 2007లో విడుదలైన ‘భూల్ భూలయ్యా’, 2022లో విడుదలైన ‘భూల్ భూలయ్యా 2’ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ‘భూల్ భూలయ్యా 3’ చిత్రీకరణ జరుగుతోంది. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ‘భూల్ భూలయ్యా’ ఫ్యామిలీలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ చేరారు. ‘‘ఆమె నవ్వు భయం పుట్టిస్తుంది. ఆమె కళ్లు వేటాడతాయి... అలాగే !భయపెడతాయి. మిస్టరీ గాళ్’’ అంటూ ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ పాత్రను వివరించారు మేకర్స్. -
రాశీఖన్నా కెరీర్లోనే తొలిసారిగా అలాంటి పాత్రలో..
Raashi Khanna First Ever Horror Comedy Film Aranmanai All Set To Release:సుందర్ సి, ఆర్య, రాశీ ఖన్నా, ఆండ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం ‘అరణ్మణై 3’. సుందర్ సి. దర్శకత్వం వహించారు. ఉదయనిధి స్టాలిన్, ఎ.సి.ఎస్. అరుణ్ కుమార్, ఖుష్బూ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ‘అంతఃపురం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. గంగ ఎంటర్టైన్మెంట్స్పై ఈ నెల 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సుందర్ సి. మాట్లాడుతూ– ‘‘రాశీ ఖన్నా నటించిన తొలి హారర్ కామెడీ సినిమా ‘అంతఃపురం’. తెలుగులో ‘చంద్రకళ’గా వచ్చిన ‘అరణ్మణై’, ‘కళావతి’గా విడుదలైన ‘అరణ్మణై 2’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ‘అరణ్మణై 3’కి తమిళంలో మంచి స్పందన రావడంతో ‘అంతఃపురం’ పై తెలుగులోనూ అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. సాక్షీ అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల నటించిన ఈ చిత్రానికి కెమెరా:యు.కె. సెంథిల్ కుమార్, సంగీతం: సత్యసి. -
డబ్బు కోసం కాదు.. కథ నచ్చి చేశా
‘‘సక్సెస్, ఫెయిల్యూర్ గురించి నేను ఆలోచించను. కొన్ని సినిమాలు ఆడతాయి.. మరికొన్ని ఆడవు. మంచి సినిమా చేశామా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఇండస్ట్రీలో నా ఏజ్ ఉన్నవాళ్లలో కొందరు ఇప్పటికీ సినిమాలు లేక ఖాళీగా ఉన్నారు. అలాగని సక్సెస్ అవసరం లేదని చెప్పను’’ అని అదిత్ అరుణ్ అన్నారు. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. అదిత్ అరుణ్, నిక్కీ తంబోలి జంటగా, హేమంత్, ‘తాగుబోతు’ రమేష్ ప్రధానపాత్రల్లో నటించారు. బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అదిత్ అరుణ్ మాట్లాడుతూ– ‘‘ఓ అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుని అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. హారర్ కామెడీ స్టోరీకి ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ టైటిల్ కరెక్ట్‌గా సరిపోతుంది. సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, కామెడీ ఉంటాయే కానీ, ఫిజికల్‌గా అసభ్యకరంగా ఉండదు. ‘డబ్బుల కోసం ఈ సినిమా చేశావా?’ అని చాలామంది అడుగుతున్నారు. డబ్బు కోసం కాదు.. కథ బాగా నచ్చి చేశా. ప్రస్తుతం ‘డ్యూడ్’ అనే సినిమా చేస్తున్నా. మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేశాను’’ అన్నారు. -
క్యారెక్టర్ ముఖ్యం
మంచి నటుడిగా బాలీవుడ్లో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు రాజ్‌కుమార్ రావు. హీరోగా ఈ ఏడాది ‘స్త్రీ’ చిత్రంతో బంపర్ హిట్ అందుకున్నారాయన. ఇప్పుడు దీపికా పదుకోన్ కోసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారబోతున్నారట. ‘తల్వార్, రాజీ’ చిత్రాల ఫేమ్ మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపికా పదుకోన్ ప్రధాన పాత్రలో ఓ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించారని బాలీవుడ్ తాజా సమాచారం. ఒకవైపు హీరోగా చేస్తున్నప్పటికీ క్యారెక్టర్ బాగుంటే చాలు.. నిడివి తక్కువ అయినా వేరే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటారట రాజ్‌కుమార్. ఢిల్లీ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాతో దీపికా నిర్మాతగా మారనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రాజ్‌కుమార్ నటించిన ‘మెంటల్ హై క్యా, మేడ్ ఇన్ చైనా, ఏక్ లడ్కీ కో దేఖాతో ఏసా లగా’ చిత్రాలు వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రానున్నాయి. -
హీరోయిన్ లుక్‌పై జోకులు
బ్యూటీ క్వీన్ శ్రద్ధాకపూర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావుతో కలిసి ‘స్త్రీ’ అనే చిత్రంలో నటిస్తుండగా.. ఆ మధ్య టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. 90వ దశకంలో దక్షిణ భారతదేశంలో ‘ఓ స్త్రీ రేపు రా’ నేపథ్యంలో బోలెడన్నీ కథలు ప్రచారమైన విషయం తెలిసిందే. ఈ కాన్సెప్ట్‌తోనే ‘స్త్రీ’ హర్రర్ కామెడీగా తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో శ్రద్ధా లుక్‌ను రాజ్‌కుమార్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రివీల్ చేశాడు. ముసుగులో దెయ్యం మాదిరి భయానకంగా శ్రద్ధా లుక్ ఉంది. అయితే హాలీవుడ్లో నన్.. కంజూరింగ్-2 లాంటి చిత్రాల్లో ఇలాంటి లుక్‌ను అల్రెడీ చాలా మంది చూసి ఉన్నారు. దీంతో శ్రద్ధా లుక్కును పోలుస్తూ పలువురు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పలు చిత్రాల్లోనే పోస్టర్లను.. శ్రద్ధా లుక్కు అన్వయించి ఫన్ పోస్టులు పెడుతున్నారు. కర్ణాటకలో కలకలం రేపిన నలె బా(ఓ స్త్రీ రేపు రా..) ప్రధానాంశంగా అమర్ కౌశిక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ సరసన శ్రద్ధా సాహోలో సైతం నటిస్తున్నారు. -
‘దమ్ముంటే సొమ్మేరా’ మూవీ రివ్యూ
టైటిల్ : దమ్ముంటే సొమ్మేరా జానర్ : హర్రర్ కామెడీ తారాగణం : సంతానం, అంచల్ సింగ్, ఆనంద్ రాజ్, సౌరభ్ శుక్లా, రాజేంద్రన్ సంగీతం : తమన్ నేపథ్య సంగీతం : కార్తీక్ రాజా దర్శకత్వం : రామ్ బాలా నిర్మాత : నటరాజ్ సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ సినిమా ఫార్ములా కామెడీ హర్రర్. ఈ జానర్ లో తెరకెక్కిన చాలా సినిమాలు ఘనవిజయాలు సాధించాయి. ఒక దశలో అన్నీ ఇదే తరహా సినిమాలు రావటంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యారు. దీంతో వెండితెర మీద హర్రర్ కామెడీల జోరుకు బ్రేక్ పడింది. కొంత గ్యాప్ తరువాత మరో సారి అదే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా దమ్ముంటే సొమ్మేరా. కోలీవుడ్ కామెడీ స్టార్ సంతానం హీరోగా తెరకెక్కిన దిల్లుకు దుడ్డు సినిమాను దమ్ముంటే సొమ్మేరా పేరుతో తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు కమెడియన్‌గా పరిచయం అయిన సంతానం, హీరోగా ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? హర్రర్ కామెడీ జానర్ మరోసారి సక్సెస్ ఫార్ములాగా ప్రూవ్ చేసుకుందా..? కథ : కుమార్ (సంతానం), కాజల్ (అంచల్ సింగ్) స్కూల్ ఫ్రెండ్స్. చిన్న వయసులోనే కాజల్‌కు కుమార్ అంటే ఇష్టం కలుగుతుంది. (సాక్షి రివ్యూస్) కానీ కాజల్ తల్లిదండ్రులు ఆమెను విదేశాలకు పంపించటంతో ఇద్దరు దూరమవుతారు. చాలా ఏళ్ల తరువాత తిరిగి వచ్చిన కాజల్.. కుమార్ కలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఓ గొడవ కారణంగా కలుసుకున్న కుమార్, కాజల్‌లు గతం తెలుసుకొని ప్రేమలో పడతారు. కానీ కాజల్ తండ్రి సేట్ (సౌరబ్ శుక్లా) వారి ప్రేమను అంగీకరించడు. ఎలాగైనా కుమార్ అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ మణి (రాజేంద్రన్)తో కలిసి కుమార్‌ను చంపేందుకు ప్లాన్ చేస్తాడు. సిటీలో చంపితే అందరికీ అనుమానం వస్తుందని నగరానికి దూరంగా శివగంగ పర్వతం మీద ఉన్న పాత బంగ్లాకు తీసుకెళ్లి చంపాలని నిర్ణయించుకుంటారు. కాజల్, కుమార్‌లకు పెళ్లి చేస్తానని అబద్ధం చెప్పి రెండు కుటుంబాలను దెయ్యాల బంగ్లాకు తీసుకెళతాడు. అలా బంగ్లాలోకి వెళ్లిన వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు..? ఆ బంగ్లా కథ ఏంటి..? దెయ్యాల భారీ నుంచి వారిని ఎవరు కాపాడారు..? చివరకు కాజల్, కుమార్‌లు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : తెలుగు తెర మీద హర్రర్ కామెడీ సినిమాలు చాలానే వచ్చాయి. దమ్ముంటే సొమ్మేరా కూడా దాదాపు అదే తరహాలో సాగుతుంది. కథ పరంగా కొత్తదనమేమీ లేకపోయినా కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఫస్ట్ హాప్ కాస్త నెమ్మదిగా సాగినా.. కథ బంగ్లాలోకి ఎంటర్ అయిన తరువాత కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. (సాక్షి రివ్యూస్) హీరోయిజం ఎలివేట్ చేసే సీన్స్‌లో సో సోగా అనిపించినా.. కామెడీ సీన్స్ లో మాత్రం సంతానం కడుపుబ్బా నవ్వించాడు. ముఖ్యంగా పంచ్ డైలాగ్స్‌తో తన మార్క్ చూపించాడు. హీరోయిన్గా పరిచయం అయిన అంచల్ సింగ్ ఆకట్టుకుంది. గ్లామర్‌తో పాటు నటనలోనూ మెప్పించింది. కామెడీ హర్రర్ జానర్ కావటంతో ప్రతీ పాత్రలో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అందుకు తగ్గట్టుగా హీరో తండ్రి పాత్రలో ఆనంద్ రాజ్, హీరోయిన్ తండ్రిగా సౌరభ్ శుక్లా, కాంట్రక్ట్ కిల్లర్ గా రాజేంద్రన్ తమ పరిధి మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సెకండ్ హాప్లో వచ్చే రాజేంద్రన్ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. తమన్ సంగీతమందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా.. కార్తీక్ రాజా అందించిన నేపథ్య సంగీతం హర్రర్ సినిమాకు కావాల్సిన ఎఫెక్ట్ తీసుకువచ్చింది. హర్రర్ చిత్రాలకు సినిమాటోగ్రఫి ఎంతో కీలకం. దీపక్ కుమార్ తన విజువల్స్‌తో ఆడియన్స్‌ను భయపెట్టడంలో సక్సెస్ అయ్యారు. (సాక్షి రివ్యూస్) ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తొలి భాగం కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : కామెడీ నేపథ్య సంగీతం సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ పాటలు సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మరోసారి భయపెడతా
అవును.. తెలుగమ్మాయి అంజలి మరోసారి భయపెట్టనున్నారు. ఆమె టైటిల్ రోల్లో రాజ్ కిరణ్ దర్శకత్వంలో కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘గీతాంజలి’. మూడేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇందులో రెండు పాత్రల్లో అంజలి నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అందులో దెయ్యం పాత్ర ఒకటి. ఈ పాత్రలో ప్రేక్షకులను భయపెట్టి, మంచి మార్కులు కొట్టేసిన అంజలి మళ్లీ భయపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ‘గీతాంజలి’ సినిమా నిర్మాతలు ఆ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేశారు. ఇందులోనూ టైటిల్ రోల్లో అంజలి నటించ నున్నారు. అయితే.. ఈ చిత్రానికి రాజ్ కిరణ్ దర్శకత్వం వహించడం లేదు. ఎవరు దర్శకత్వం వహిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ‘గీతాంజలి’లో హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి మెయిన్ క్యారెక్టర్ చేశారు. సీక్వెల్లో నటిస్తారా? లేదా? అనే విషయంపైనా స్పష్టత లేదు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ రెడీ అయ్యిందట. ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం అవుతుందట. -
భయపెడతాం... నవ్వుకోండి!
నవ్వుతూ నీళ్లు తాగడం కష్టం. నవ్వుతూ భయపడటం కూడా అంతే. అయితే ‘మేం భయపెడతాం.. మీరు నవ్వుకోండి’ అంటున్నారు శ్రద్ధా కపూర్. రాజ్‌కుమార్ రావు హీరోగా ఓ హారర్ కామెడీ సినిమా రూపొందనుంది. అంటే.. భయంలోంచి నవ్వు పుట్టుకొస్తుందన్న మాట. ఇందులో కథానాయికగా నటించబోతున్నారు శ్రద్ధా. నాలుగేళ్ల క్రితం వరుణ్ సందేశ్, సందీప్ కిషన్ కలిసి తెలుగులో నటించిన ‘డీ ఫర్ దోపిడి’ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించిన నిడిమోరు రాజ్, కృష్ణ డీకే ఈ సినిమాకు దర్శకులు. కథ కూడా వాళ్లదే. స్మాల్ టౌన్ గాళ్‌గా నటించబోయే శ్రద్ధా కపూర్ క్యారెక్టర్ చుట్టూ ఈ సినిమా సాగుతుందని బీ టౌన్ టాక్. అయితే ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘సాహో’ సినిమాలో తన వంతు సీన్స్‌ను కంప్లీట్ చేసిన తర్వాతే శ్రద్ధ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారట. ‘‘ఇప్పటి వరకు నేను చేయని హారర్ జోనర్లో నటించబోతున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉంది. సూపర్ అమేజింగ్ యాక్ట్రస్ శ్రద్ధా కపూర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు రాజ్‌కుమార్ రావు. ‘‘నా అభిమాన నటుల్లో ఒకరైన రాజ్‌కుమార్ రావుతో నటించబోతున్నాను. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేలతో సినిమా చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రద్ధా. -
వస్తా.. ఓ థ్రిల్!
తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ సినిమాల హవా కొనసాగుతోంది. ఈ కోవలో ‘వస్తా’ అనే సినిమా రానుంది. సీనియర్ నటుడు భానుచందర్, జీవా, ‘అదిరే’ అభి, ఫణి ముఖ్య పాత్రల్లో జంగాల నాగబాబు దర్శకత్వంలో దమిశెల్లి రవికుమార్, మొహ్మద్ ఖలీల్ నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఈ జోనర్లో వచ్చిన ఎన్నో చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. అదే స్ఫూర్తితో ‘వస్తా’ సినిమా చేస్తున్నాం. థ్రిల్‌కు గురి చేసే సినిమా ఇది’’ అన్నారు. -
దెయ్యాలు భయపడితే!
హారర్ ప్లస్ కామెడీ... నటీనటులకు మాంచి విజయాలు అందిస్తూ, దర్శక–నిర్మాతలకు కాసులు కురిపిస్తున్న హిట్ ఫార్ములా ఇది. ఇప్పుడు ఢిల్లీ భామ తాప్సీ కూడా ఇటువంటి తెలుగు సినిమాలో నటించనున్నారు. కానీ, ఆమె చేయబోయేది కామెడీ హారర్ సినిమా. మాములుగా మనోళ్లు ‘హారర్ కామెడీ’ అంటుంటారు కదా.. రివర్స్‌లో ‘కామెడీ హారర్’ అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు మతలబు. రొటీన్‌గా ప్రతి హారర్ కామెడీ సినిమాలోనూ దెయ్యాలను చూసి మనుషులు భయపడుతారు. కానీ, ఇందులో మనుషులను చూసి దెయ్యాలు భయపడతాయట! రెగ్యులర్ ఫార్ములాకి రివర్స్‌లో పూర్తి వినోదాత్మక చిత్రమిది. ‘పాఠశాల’ ఫేమ్ మహి వి.రాఘవ్ ఈ కొత్త జానర్‌ను తెలుగుకి పరిచయం చేయబోతున్నారు. ‘భలే మంచిరోజు’ నిర్మాతలు విజయ్‌కుమార్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఆల్రెడీ తాప్సీకి కథ చెప్పడం, ఆమె అంగీకరించడం జరిగాయి. తాప్సీ ముఖ్యతారగా నటించనున్న ఈ సినిమాలో జయప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్లు కీలక పాత్రలు చేయనున్నారు. ‘‘ఈ నెల 22న తాప్సీ హైదరాబాద్ వస్తారు. దర్శకుడితో ఆమె తన లుక్ గురించి డిస్కస్ చేయడంతో పాటు సినిమాకి సంతకం చేస్తారు’’ అని సమాచారం. ఆత్మలు, దెయ్యాలు మనుషులను భయపెట్టడమనేది ప్రతి హారర్ కామెడీ సినిమాలోనూ చూస్తున్నాం. బట్ ఫర్ ఏ ఛేంజ్... మనుషులను చూసి దెయ్యాలు, ఆత్మలు భయపడితే? తాప్సీ ముఖ్యతారగా ‘పాఠశాల’ ఫేమ్ మహి వి.రాఘవ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా మూలకథ ఇదేనట!! -
చూస్తే...భయమేస్తుంది!
‘‘హారర్ చిత్రాలంటే నేనంత భయపడను. దెయ్యాలను చూసి నవ్వుకుంటాను. ఈ చిత్రం మామూలు హారర్ కాదు... చాలా భయపెట్టేలా ఉంటుంది. థియేటర్లో సినిమా చూసినప్పుడు నాలుగైదుసార్లు సీట్లో నుంచి ఎగిరిపడ్డా’’ అన్నారు కన్నడ హీరో ఉపేంద్ర. ఆయన సతీమణి ప్రియాంక కీలక పాత్ర చేసిన ‘చిన్నారి’ ఈ నెల 16న విడుదలవుతోంది. తెలుగు, కన్నడ భాషల్లో కె. రవికుమార్, ఎం.ఎం.ఆర్. సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి లోహిత్ దర్శకుడు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ – ‘‘ఇప్పుడు నేనూ ఓ హారర్ కామెడీ సినిమా చేస్తున్నా. కానీ, ఈ ట్రైలర్ భయపెట్టే విధంగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రియాంక ఎక్కువ సినిమాలు చేయాలి. (నవ్వుతూ...) ‘రా’తో తనను నేను తీసుకువెళ్లానంటున్నారు. ఇప్పుడు పొమ్మంటున్నా’’ అన్నారు ఉపేంద్ర. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా కన్నడ ప్రేక్షకులకు నచ్చింది. తెలుగులోనూ హారర్ ప్రియులకు నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు ప్రియాంక. -
విజయ్ హీరోగా హారర్ కామెడీ
ప్రస్తుతం సౌత్ ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలో హారర్ కామెడీల ట్రెండ్ నడుస్తోంది. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరోలకు ఈ జానర్ సినిమాలు బాగా కలిసొస్తున్నాయి. అందుకే దర్శకులు కూడా ఈ తరహా కథలతో సినిమాలు తెరకెక్కించేందుకు దర్శకులు కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలైన ఎక్కడికి పోతావు చిన్నవాడా కూడా ఇదే జానర్లో సక్సెస్ అయ్యింది. తాజాగా ఇదే జానర్లో మరో ఇంట్రస్టింగ్ సినిమా పట్టాలెక్కనుంది. సక్సెస్ఫుల్ బ్యానర్ యువి క్రియేషన్స్ నిర్మాణంలో పెళ్లి చూపులు ఫేం విజయ్ దేవరకొండ హీరోగా ఓ హారర్ కామెడీ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉన్న ద్వారకతో పాటు మరో సినిమా చేస్తున్న విజయ్, ఆ సినిమాలు పూర్తవ్వగానే యువి క్రియేషన్ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. -
షారూఖ్, దీపికా భయపెడతారట..?
ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపి న్యూఇయర్ సినిమాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ హాట్ కపుల్ షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనేలు మరో హిట్ కోసం రెడీ అవుతున్నారు. అయితే తొలి మూడు సినిమాలు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కాగా. నాలుగో సినిమాను మాత్రం హర్రర్ కామెడీగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొద్ది రోజులు వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న బాద్షా, సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో సక్సెస్ ఫార్ములాగా మారిన హార్రర్ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. షారూఖ్ దీపికాల కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ఓం శాంతి ఓం క్లైమాక్స్‌లో దీపికా దెయ్యంగా కనిపిస్తోంది. అదే ఇన్సిపిరేషన్‌తో ఇప్పుడు సినిమా అంతా దీపికాను దెయ్యంగా చూపించేందుకు రెడీ అవుతున్నారు. చెన్నైఎక్స్ప్రెస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రొహిత్ శెట్టి మరోసారి ఈ సినిమాతో హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
హత్య చేసిందెవరు?
జై, వసుంధర జంటగా తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘హౌస్’. రాజుశెట్టి దర్శకత్వంలో బోయిన కృష్ణారావు నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘హైదరాబాద్‌లో ఒక ఇంట్లో జరిగే కథ ఇది. ఎన్ఆర్ఐ అయిన హీరో ఓ పనిపై ఆ ఇంటి కొస్తాడు. ఆ ఇంటి ఓనరు హత్యకు గురవుతాడు. ఎవరు చంపారు? అనేది ఆసక్తికరమైన అంశం. ప్రేక్షకులు ఉత్కంఠకు గురయ్యేలా సన్నివేశాలుంటాయి. అనంతగిరి హిల్స్‌లో పాటలను చిత్రీకరించాం. ఈ నెలలో ఆడియో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మట్టి మహేశ్, సంగీతం: శశాంక్ భాస్కరుని. -
మాయా మాల్లో ఏం జరిగింది?
‘హోరా హోరీ’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన దిలీప్ నటిస్తోన్న రెండో చిత్రం ‘మాయా మాల్’. ఇషా హీరోయిన్. సోనియా, దీక్షాపంత్ తదితరులు ముఖ్య తారలుగా గ్రీష్మ ఆర్ట్స్ సమర్పణలో వైష్ణవి మూవీ మేకర్స్ రూపొందిస్తోన్న ఈ చిత్రానికి గోవింద్ లాలం దర్శకుడు. యార్లగడ్డ జీవన్‌కుమార్, కేవీ హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మాతలు. ‘‘మాయా మాల్లో ఏం జరిగింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. లవ్ అండ్ హారర్ కామెడీ నేపథ్యంలో సినిమా ఉంటుంది. గోవింద్ లాలం మంచి కథ-కథనం తయారు చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
బంగళాలో మంచి దెయ్యం!
ఈ లోకంలో చెడ్డ దెయ్యాలు మాత్రమే ఉండవు, మంచి దెయ్యాలు కూడా ఉంటాయంటున్నారు బాలాజీ నాగలింగం. ఆయన సమర్పణలో విసినీ స్టూడియో పతాకంపై వి.లీనా నిర్మించిన చిత్రం ‘రాణిగారి బంగళా’. ఆనంద్ నందా, రష్మీ గౌతమ్ జంటగా నటించారు. డి.దివాకర్ దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బాలాజీ నాగలింగం మాట్లాడుతూ - ‘‘హారర్ కామెడీ చిత్రమిది. ‘రాణిగారి బంగళా’లో మంచి దెయ్యం ఏం చేసింది? ఆ బంగళాలో ఎలాంటి అద్భుతాలు జరిగాయి? అనేది కథ. రష్మి సింగిల్ టేక్ ఆర్టిస్ట్. చాలా బాగా నటించింది. భవిష్యత్తులో శ్రీదేవి అంత పేరు తెచ్చుకుంటుందామె. సీనియర్ నటులు శివకృష్ణ కాటి కాపరి పాత్రలో కనిపిస్తారు. చిత్రంలో రెండే పాటలున్నాయి. ‘ప్రేమకథా చిత్రమ్’ దర్శకుడు ప్రభాకర్‌రెడ్డి ఛాయాగ్రహణం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. కాశీ విశ్వనాథ్, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: వి.లీనా, సహ నిర్మాత: శ్రీనివాసరావు, సంగీతం: ఈశ్వర్ పేరవల్లి. -
అదృశ్య శక్తులుఏం చేస్తాయి?
రెండేళ్ల క్రితం గీతాంజలిగా అంజలి చేసిన హారర్ కామెడీ గుర్తుందా..? ఇప్పుడు ‘చిత్రాంగద’ సినిమాలో టైటిల్ రోల్లో మరోసారి అలరించనున్నారు అంజలి. ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో అంజలి ఓ పాట పాడటం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందీ సినిమా. చిత్రనిర్మాత గంగపట్నం శ్రీధర్ మాట్లాడుతూ- ‘‘కొన్ని అదృశ్య శక్తుల కారణంగా చిత్రాంగద అనే యువతి జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అనే ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం ఉంటుంది. అమెరికాలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. గ్రాఫిక్స్ వర్క్ క్వాలిటీగా చేయడం వల్లే సినిమా ఆలస్యం అవుతోంది. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి. -
వజ్రాలతో వినోదం!
అనిల్, నేహ, నిఖిత జంటగా పి.రాధాకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీపాద ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కిశోర్ కుమార్ కోట నిర్మిస్తున్న నూతన చిత్రం ‘వజ్రాలు కావాలా నాయనా’. షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇటీవల సంచలనం సృష్టించిన ఓ అంశాన్ని కథగా తీసుకుని, దానికి సస్పెన్స్, లవ్, థ్రిల్లింగ్ అంశాలు జోడించి హారర్ కామెడీగా తెరకెక్కిస్తున్నాం. ఇందులో వినోదానికి పెద్దపీట వేశాం’’ అని తెలిపారు. ‘‘సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేసి, జూన్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత పేర్కొన్నారు. హీరో, హీరోయిన్లు, నటులు అమర్, విజయ్‌సాయి, శివకుమార్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమేరా: అమర్, సంగీతం: జాన్, విజయ్ కురాకుల. -
హర్రర్ కామెడీ 'గంగ' మూవీ స్టిల్స్
-
భయపెట్టే నాయిక
హారర్ కామెడీ తరహాలో ఇప్పటిదాకా చాలా చిత్రాలు వచ్చాయి. ఆ కోవలోనే వస్తున్న చిత్రం ‘హీరోయిన్’. అంజన్, అనుస్మృతి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జె.వి.ఆర్ సినిమా పతాకంపై జల్లెపల్లి వెంకటేశ్వర్లు నిర్మించారు. భరత్ పారేపల్లి దర్శకుడు. హైదరాబాద్‌లో జరిగిన పాటల వేడుకలో దర్శకుడు మారుతి తొలి సీడీ ఆవిష్కరించి, నటుడు సంపూర్ణేష్‌బాబుకు అందజేశారు. భరత్ పారేపల్లి మాట్లాడుతూ -‘‘అనుస్మృతి టైటిల్ రోల్ చేశారు. సినిమా ఫస్ట్‌కాపీ చూసి మారుతీ విడుదల చేయడానికి ముందుకొచ్చారు’’ అని చెప్పారు. ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలున్న చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.