మరోసారి భయపెడతా | Anjali in Another Horror Comedy Movie | Sakshi
Sakshi News home page

మరోసారి భయపెడతా

Published Fri, Mar 16 2018 1:05 AM | Last Updated on Fri, Mar 16 2018 1:05 AM

Anjali in Another Horror Comedy Movie - Sakshi

అవును.. తెలుగమ్మాయి అంజలి మరోసారి భయపెట్టనున్నారు. ఆమె టైటిల్‌ రోల్‌లో రాజ్‌ కిరణ్‌ దర్శకత్వంలో కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘గీతాంజలి’. మూడేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే. ఇందులో రెండు పాత్రల్లో అంజలి నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అందులో దెయ్యం పాత్ర ఒకటి. ఈ పాత్రలో ప్రేక్షకులను భయపెట్టి, మంచి మార్కులు కొట్టేసిన అంజలి మళ్లీ భయపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.

‘గీతాంజలి’ సినిమా నిర్మాతలు ఆ సినిమాకి సీక్వెల్‌ ప్లాన్‌ చేశారు. ఇందులోనూ టైటిల్‌ రోల్‌లో అంజలి నటించ నున్నారు.  అయితే.. ఈ చిత్రానికి రాజ్‌ కిరణ్‌ దర్శకత్వం వహించడం లేదు. ఎవరు దర్శకత్వం వహిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ‘గీతాంజలి’లో హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి మెయిన్‌ క్యారెక్టర్‌ చేశారు. సీక్వెల్‌లో నటిస్తారా? లేదా? అనే విషయంపైనా స్పష్టత లేదు. హారర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం స్క్రిప్ట్‌ రెడీ అయ్యిందట. ఏప్రిల్‌లో షూటింగ్‌ ప్రారంభం అవుతుందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement