దీపికా పదుకోన్, త్రిష, అంజలి, రజనీకాంత్
బీటౌన్ బ్యూటీనా..! చెన్నై పొన్నా! అచ్చ తెలుగు అమ్మాయా! సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించబోయేది ఎవరు? అనే చర్చ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రజనీకాంత్ హీరోగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సన్‌పిక్చర్స్ పతాకంపై ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా స్క్రిప్ట్ వర్క్ గురించి రజనీకాంత్‌ను కలిశారట సుబ్బరాజ్. ఈ సినిమాలో కథానాయికప్లేస్ కోసం రేస్ మొదలైంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్, చెన్నై సుందరి త్రిష, తెలుగు అమ్మాయి అంజలి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఆల్రెడీ ‘కొచ్చడయాన్’ సినిమాలో రజనీకాంత్ సరసన దీపికా పదుకోన్ నటించారు. త్రిష, అంజలి ఇంతవరకు ఆయన సరసన నటించలేదు. కాకపోతే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిర ‘ఇరైవి’ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు అంజలి. మరి.. ఈ ముగ్గురి ముద్దుగుమ్మల్లో రజనీతో జోడీ కట్టేదెవరు? అనేది చూడాలి. లేక కొత్తగా ఎవరైనా వచ్చి ఈ చాన్స్‌ను కొట్టేస్తారా? అన్న డౌట్స్‌కు ఫుల్‌స్టాప్ పడాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్ రవిచంద్రన్.
Comments
Please login to add a commentAdd a comment