
రజనీకాంత్
రజనీకాంత్ తన స్టైల్‌లో పాటలకు స్టెప్పులు వేస్తే థియేటర్స్‌లో అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవాల్సిందే. ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా కోసం కూడా ఇలాంటి స్టెప్స్ వారణాసిలో వేస్తున్నారట. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పేట్టా’. సిమ్రాన్, త్రిష కథానాయికలు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వారణాసిలో జరుగుతోంది. రీసెంట్‌గా ఫైట్ సీన్స్‌ను కంప్లీట్ చేసిన చిత్రబృందం తాజాగా రజనీకాంత్‌పై మార్కెట్ సెట్లో ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట. ఇది రజనీకాంత్ పరిచయ గీతం అని టాక్.
ఈ పాటలో రజనీతో పాటు విజయ్ సేతుపతి కూడా ఉన్నారట. ఆల్రెడీ రిలీజ్ చేసిన లుక్స్‌లో రజనీ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు అని ఆయన ఫ్యాన్స్ పుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు షూటింగ్ స్పాట్‌లో ఫొటోలు లీక్ అవ్వడంతో చిత్రబృందం టెన్షన్ అవుతోంది. ‘ఈ ఫొటోలను షేర్ చేయొద్దు అని కోరుకుంటున్నాను. కొన్ని చానల్స్ ఈ షూటింగ్ వీడియోలు చూపించడం బాధాకర ం. కొన్ని రోజుల తర్వాత సినిమాని పైరసీ చేసేసి చానల్స్‌లో వేసేస్తారేమో’’ అని చిత్రదర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీత దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment