Petta Movie
-
పేట నటికి లక్కీచాన్స్
పేట చిత్రం ఫేమ్ మాళవికమోహన్ లక్కీచాన్స్ కొట్టేసిందన్నది తాజా సమాచారం. పేట చిత్రంలో నటుడు శశికుమార్‌కు జంటగా నటించిన మలయాళ కుట్టి ఈ అమ్మడు. అయితే తొలుత మాతృభాషలో 2013లో నటిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత హిందీ, తమిళ్, తెలుగు భాషల్లోనూ పరిచయమైంది. తాజాగా ఈ బ్యూటీకి ఒక్కసారిగా దళపతి విజయ్‌తో రొమాన్స్ చేసే చాన్స్ వరించినట్లు తాజా సమాచారం. విజయ్ ప్రస్తుతం నటిస్తున్న బిగిల్ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న బిగిల్ చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా నటుడు విజయ్ కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి విదేశీయానంలో ఉన్నారు. తిరిగి రాగానే కొత్త చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారు. ఇది ఆయన నటించే 64వ చిత్రం అవుతుంది. మానగరం, ఖైదీ చిత్రాల ఫేమ్ లోకేశ్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఎక్స్‌బీ.ఫిలింస్ క్రియేషన్స్ పతాకంపై జవీర్ బ్రిటో నిర్మించనున్నారు. కాగా ఇందులో విజయ్ సరసన నటించే నటి ఎవరన్న విషయం గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో మొదట నటి రష్మికమందన నటించబోతోందనే ప్రచారం జరిగింది. ఆ తరువాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. తాజాగా మలయాళీ గ్లామరస్ నటి మాళవికమోహన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. విజయ్ చిత్రాల్లో ఒకరికి మించి హీరోయిన్లు ఉండడం పరిపాటిగా మారింది. కాబట్టి ఇందులోనూ మరో హీరోయిన్ మాళవికమోహన్ నటించనుందని సమాచారం. ఇకపోతే కియారాఅద్వాని ప్రధాన హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సత్యన్ సూర్యన్ సంగీతాన్ని అందించనున్నారు. అయితే ఈ భారీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
ఇంకా కలగానే ఉందంటోన్న హీరోయిన్
అది ఇంకా కలగానే ఉంది అంటోంది నటి మేఘాఆకాశ్. ఒరు పక్క కథై చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తరువాత టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అక్కడ చల్ మోహనరంగా, లై వంటి రెండు చిత్రాలు చేసినా అవి ఆశించిన విజయాలను సాధించలేదు. అదేవిధంగా తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్లో అవకాశాన్ని అందుకుంది. అక్కడ శాటిలైట్ శంకర్ అనే చిత్రంలో నటిస్తోంది. అయితే ప్రస్తుతం కోలీవుడ్‌పైనే ఆశలు పెట్టుకుంది. కోలీవుడ్‌లో జీవితంలో గుర్తుండిపోయే అవకాశాన్ని అందుకుంది. అదే సూపర్‌స్టార్‌తో పేట చిత్రంలో నటించడం. ప్రస్తుతం అధర్వతో రోమాన్స్ చేసిన బూమరాంగ్ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఈ సందర్భంగా మేఘాఆకాశ్తో చిన్న భేటీ.. ప్ర: సినీ రంగప్రవేశం గురించి? జ: చిన్న వయసు నుంచే సినిమారంగం అంటే చాలా ఇష్టం. అందుకే నటి కావాలని ఆశపడ్డాను. కళాశాలలో చదువుతున్నప్పుడు దర్శకుడు బాలాజీధరణీధరన్ ఒరు పక్క కథై చిత్రంలో నటించే అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామా, చదువును పూర్తి చేద్దామా? అన్న సందిగ్ధ పరిస్థితిలో ఉన్నా, చివరికి నటనకే మొగ్గు చూపాను. ఆ చిత్రంలో నటించడం నచ్చడంతో నటిగానే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. ప్ర: పేట చిత్రంలో నటించే అవకాశం వరించడం గురించి? జ: రజనీకాంత్‌తో నటించాలన్నది ప్రతి ఒక్క నటి కల. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిననే భావిస్తున్నాను. పేట చిత్రం అలా కుదిరింది. తొలి రోజుల్లోనే రజనీకాంత్ చిత్రంలో నటించే అవకాశం రావడం సాధారణ విషయం కాదు. ఆ చిత్రం తరువాత శింబుతో నటించిన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రం తెరపైకి వచ్చింది. త్వరలో ధనుష్‌తో జతకట్టిన ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా, అధర్వకు జంటగా నటించిన బూమరాంగ్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. పేట చిత్రం నాకు చాలా లక్కీ. ఇప్పటికీ రజనీకాంత్‌తో కలిసి నటించానన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా. అది ఇంకా కలగానే ఉంది. ప్ర: శింబు సరసన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రంలో నటించిన అనుభవం గురించి? జ: తెలుగులో నేను నటించిన చిత్రాలు చూసి దర్శకుడు సుందర్.సీ ఈ నటే నా చిత్రంలో మాయ పాత్రకు బాగుంటుందని నిర్ణయించుకున్నారట. ఆయన దర్శకత్వం వహించిన చాలా చిత్రాలు నేను చూశాను. సుందర్.సీ చిత్రాలు చాలా జాలీగా, ఎంటర్‌టెయిన్‌మెంట్‌గా ఉంటాయి. అదే విధంగా వందా రాజావాదాన్ వరువేన్ చిత్రంలో మాయ పాత్ర లభించింది. ఇక శింబు పాత్ర కూడా చాలా వరకు జాలీగా ఉండటంతో షూటింగ్ సెట్లో అంతా సందడి వాతావరణమే. ఆ చిత్ర టీమ్‌తో కలిసి పని చేయడం కొత్త అనుభవం. ప్ర: బూమరాంగ్ చిత్రం గురించి? జ: నేను ఇప్పటి వరకూ నటించిన చిత్రాల కంటే భిన్నమైన చిత్రం బూమరాంగ్. ఈ చిత్రంలో నా పాత్ర పేరు జీజీ. విజువల్ కమ్యునికేషన్ విద్యార్థినిగా నటించాను. చిత్రంలో ప్రేమ ఉంటుంది. అదే సమయంలో సమాజానికి అవసరమైన సందేశం ఉంటుంది. ఒక పక్క వినోదంగా ఉంటూనే మరో పక్క చాలా సీరియస్‌గా సాగుతుంది. అలా పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో కూడిన కమర్షియల్ కథాంశంతో కూడిన చిత్రం. ఇందులో నటించడం నాకు సరికొత్త అనుభవం. అధర్వ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాత్ర కోసం కఠినంగా శ్రమిస్తారు. ఆధర్వ, నటుడు సతీశ్ కలిస్తే ఆట పట్టించడం, జోకులు అంటూ సరదాల సందడే. వారు నన్నూ ఆట పట్టించారు. ప్ర: సరే ఎలాంటి పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నారు? జ: నిజం చెప్పాలంటే నాకు కథతో పయనించే పాత్రలు లభిస్తే చాలు. ఫలాన పాత్రల్లో నటించాలన్న కోరికలు నాకు లేవు. వైవిధ్యభరిత పాత్రలు, సవాల్‌తో కూడిన పాత్రల్లో నటించాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. -
ఆన్ ద వే!
అంతా సవ్యంగా సాగి ఉంటే ధనుష్ హీరోగా ‘పేట’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం ఈ పాటికే వెండితెరపైకి వచ్చి ఉండేది. కానీ, కొన్ని కారణాలవల్ల ఈ చిత్రం బాగా ఆలస్యం అయ్యింది. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ చిత్రం ఆగలేదు. ఆన్ ద వేలో ఉందని తాజా కోలీవుడ్ ఖబర్. కార్తీక్ సుబ్బరాజ్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌పైనే వర్క్ చేస్తున్నారని సమాచారం. ధనుష్ ప్రస్తుతం వెట్రీ మారన్ దర్శకత్వంలో ‘అసురన్’ అనే సినిమా చేస్తున్నారు. ఇంకా సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మాణసంస్థలో రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. దర్శకునిగా ఓ సినిమా ఉంది. ఇలా వరుస కమిట్మెంట్స్తో ధనుష్ బిజీగా ఉన్నారు. మరి.. ఈ కమిట్మెంట్స్ అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ చిత్రం స్టార్ట్ అవుతుందా? లేక ఈ ఏడాదే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందా? వెయిట్ అండ్ సీ. -
మామ తర్వాత అల్లుడితో
యువ దర్శకుల్లో కార్తీక్ సుబ్బరాజ్ శైలి భిన్నంగా ఉంటుంది. ఆయన తయారు చేసుకునే కథలు కూడా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటాయి. జిగర్తండా, కాదల్ సొల్పవదు ఎప్పడి, మెర్కూరి, ఇరైవి ఇలా ఏ చిత్రానికి ఆ చిత్రం భిన్నంగా ఉంటాయి. ఇక ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు పేట చిత్రంతో సూపర్‌హిట్ చిత్రాన్ని ఇచ్చాడు కార్తీక్. అందులో రజనీ వయసు 20 ఏళ్లు తగ్గించేశారనే ప్రశంసలను అందుకున్నారు. అలా రజనీకాంత్‌కు సూపర్ సక్సెస్ ఇచ్చిన కార్తీక్‌సుబ్బరాజ్.. ఇప్పుడు ఆయన అల్లుడు, ధనుష్‌తో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. వును నిజానికి వీరి కాంభినేషన్లో ఇంతకు ముందే చిత్రం రూపొందాల్సి ఉంది. ఆ సమయంలో ధనుష్ వడచెన్నై, మారి–2 చిత్రాలతో బిజీగా ఉండడంతో వాయిదా పడింది. దీంతో వీరి కాంభినేషన్లో చిత్రం ఆగిపోయ్యిందనే ప్రచారం కూడా జరిగింది. అలాంటిది ఇప్పుడు కార్తీక్సుబ్బ రాజ్.. ధనుష్‌తో చిత్రం చేయడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆయన కథ రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. జూన్‌లో ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను వైనాట్ స్టూడియోస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించనుంది. చిత్ర షూటింగ్‌ను అధిక భాగం న్యూయార్క్ నగరంలో చిత్రీకరించనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా ధనుష్ ప్రస్తుతం వెట్ట్రిమారన్ దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న అసురన్ చిత్రంలో నటిస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్‌తో విడుదలకు సిద్ధంగా ఉంది. -
నలుపే నాకిష్టం!
తమిళసినిమా: నలుపే నాకిష్టం అంటోంది నటి త్రిష. నటిగా రెండు దశాబ్దాలను టచ్ చేసిన చెన్నై సుందరి.. మోడలింగ్ రంగం నుంచి వెండితెరకు పరిచయమై పలు భాషల్లో అనేక రకాల పాత్రల్లో నటించింది. అయితే తమిళ ప్రేక్షకులకు మాత్రం ఒక జెస్సీ గానూ ఒక జానూ గానూ చిరకాలం నిలిచిపోతుంది. విన్నైతాండివరువాయా చిత్రంలో జెస్సీగా జీవించిన ఈ బ్యూటీ ఇటీవల 96 చిత్రంలో జానూ పాత్రకు ప్రాణం పోసింది. ఇక కమర్షియల్ చిత్రాల్లో అందాలనూ బాగానే ఆరబోసింది. ఈ సందర్భంగా త్రిషతో చిన్న ఇంటర్వ్యూ. ప్రేమ కథా పాత్రల్లో మిమ్మల్ని ప్రేక్షకులు చాలా చిత్రాల్లో చూశారు. మాస్ కథా పాత్రల్లో వారిని అలరించే అవకాశం ఉందా? మాస్ కథానాయకులకు జంటగా నటిస్తేనే మాస్ కథానాయికలుగా పేరు తెచ్చుకుంటారు. అలా నేను చాలా చిత్రాల్లో నటించాను. ఇక హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉన్న కథా పాత్రలు ఇప్పుడే రావడం ప్రారంభించాయి. అవి విజయం సాధించిన తరువాత మీరు అంటున్న పాత్రల గురించి ఆలోచిద్దాం. 96 చిత్రం సక్సెస్ తరువాత ప్రేమ కథా చిత్రాల అవకాశాలు చాలా వస్తున్నాయి. చిత్రం చూసి ఇంటికి వెళ్లిన తరువాత ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తిరగాలి. అలాంటి కథా చిత్రాల కోసం ఎదురుచూస్తున్నాను. కోలీవుడ్‌లో ప్రముఖ హీరోలందరితోనూ నటించారు. ఇంకా ఎవరితోనైనా నటించాలన్న కోరిక ఉందా? కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్ లాంటి ఇతర భాషల్లోనూ ప్రముఖ హీరోలందరితోనూ నటించాను. రజనీకాంత్‌తో నటించాలన్న కోరిక మేరకే పేట చిత్రంలో నటించాను. అందులో పాత్ర చిన్నదే అయినా చాలా సంతృప్తి కలిగించింది. నటుడు విజయ్‌తో గిల్లీ, తిరుపాచ్చి, ఆది, కురువి చిత్రాల్లో నటించారు. మరోసారి ఆయనతో జత కట్టే అవకాశం ఉందా? విజయ్‌తో నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రం? విజయ్‌తో నటించడానికి నేనెప్పుడూ రెడీనే. నాకు నప్పే పాత్ర అయితే రెట్టింపు సంతోషం. విజయ్‌తో నటించిన చిత్రాల్లో గిల్లీ చాలా ఇష్టం. అందులో కథా పాత్ర అలాంటిది. ఇప్పటికీ చాలా స్లిమ్‌గా ఉన్నారు. మీ సౌందర్య రహస్యం? నేను స్లిమ్‌గా ఉండడానికంటూ ప్రత్యేకంగా ఎలాంటి కసరత్తులూ చేయను. పుష్టిగా లాగిస్తాను. పేట చిత్రంలో రజనీకాంత్‌తో నటించిన అనుభవం గురించి? ఆయనతో పూర్తి స్థాయి హీరోయిన్ పాత్రలో నటించాలని కోరుకుంటున్నారా? 96 చిత్రంలో చాలా బాగా నటించావని రజనీకాంత్ ఫోన్ చేసి అభినందించారు. ఇక పేట చిత్రంలో నేను చిన్న పాత్రనే చేశాను. ఆయనతో మరోసారి నటించే అవకాశం వస్తే కథానాయకిగా చిత్రం అంతా ఉండే పాత్రలో నటించాలని కోరుకుంటున్నాను. పేట చిత్ర షూటింగ్లో రజనీకాంత్ పక్కన కూర్చుని మాట్లాతుంటే అప్పుడే ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తో అర్థమైంది. చిత్ర జయాపజయాలను ఎలా స్వీకరిస్తారు? విజయం వస్తే సంతోషిస్తాను. అపజయం అయితే అదీ గడిచి పోతుందని భావిస్తాను. తరచూ విదేశాలకు వెళ్తుంటారు. ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? నాకు ప్రయాణమంటే చాలా ఇష్టం. ఇప్పుటికే ప్రపంచం అంతా చుట్టేశాను. సహ నటీమణులు చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు.మీకు పెళ్లి కాలేదన్న చింత లేదా? నేనెప్పటికైనా ప్రేమ వివాహమే చేసుకుంటాను. అయితే నాకిప్పటి వరకూ ప్రేమ పుట్టలేదు. నా మనసుకు నచ్చిన వాడిని కలిస్తే, ఆయనపై నాకు, నాపై తనకూ ప్రేమ పుడితే అది ఈ రోజైనా, రేపైనా పెళ్లి చేసుకుంటాను. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారు? నాకు కాబోయే భర్త ఎర్రగానో, తెల్లగానో ఉండాలన్న కోరికలేమీ లేవు. ఇంకా చెప్పాలంటే నాకు నలుపంటేనే చాలా ఇష్టం. తెల్లగా ఉంటేనే అందం అని అనుకోను. నలుపురంగూ అందమే. -
ఇరవై ఏళ్ల తరువాత ఇలా..
తమిళసినిమా: ఎవరైనా కాలం చూపిన దారిలో నడవాల్సిందే. ఆ దారులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎవరు ఎప్పుడు ఎలా కలుస్తారో? ఎప్పుడు విడిపోతారో? తెలియదని ఒక కవి అన్నట్టు మనిషి జీవితంలో ఎన్నో మజిలీలు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకుంటే రెండు దశాబ్దాల క్రితం నటి సిమ్రాన్, త్రిష కలిసి ఒక చిత్రంలో నటించారు. ఆ చిత్రం జోడి. అందులో నటి సిమ్రాన్ కథానాయకి. త్రిష ఆమె స్నేహితురాలిగా ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపిస్తుంది. అలా సిమ్రాన్ ఒక శకం వెలిగింది. నటి త్రిష అలా నాలుగేళ్లు పోరాడి హీరోయిన్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 16 ఏళ్లుగా కథానాయకిగా రాణిస్తూనే ఉంది. నటి సిమ్రాన్ కథానాయకిగా నటిస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. అలా కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్న సిమ్రాన్ రీ ఎంట్రీ అయ్యి అక్క, వదిన వంటి పాత్రలు కొన్ని చేసినా అవి అంతగా క్లిక్ అవ్వలేదు. ఇటీవల రజనీకాంత్‌తో పేట చిత్రంలో నటించింది. ఇదే చిత్రంలో నటి త్రిష కూడా నటించడం విశేషం. అలా 20 ఏళ్ల తరువాత సిమ్రాన్, త్రిష ఒకే చిత్రంలో నటించారు. ఇందులో ఇద్దరూ కలిసి నటించిన సన్నివేశాలు ఉండవు. అంతే కాదు. ఇద్దరి పాత్రలు రెండు మూడు సన్నివేశాలకే పరిమితం. అసలు విషయం ఏమిటంటే ఈ ప్రౌఢ అందగత్తెలిద్దరూ కలిసి మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ఇది మంచి సాహసాలతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. నవ దర్శకుడు సనత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
రజనీకి మాత్రమే సాధ్యం..!
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరో అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సౌత్ సినిమా వందకోట్ల మార్క్‌ను అందుకోవటమే కష్టమనుకుంటున్న సమయంలో ఏకంగా నాలుగు సినిమాలకు రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించాడు. రజనీ, శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కిన విజువల్ వండర్ రోబో తొలిసారిగా 200 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించింది. తరువాత కబాలి, 2.ఓ సినిమాలతో అదే ఫీట్‌ను రిపీట్ చేసిన రజనీకాంత్, తాజాగా పేట సినిమాతోనూ మరోసారి 200 కోట్ల మార్క్‌ను అందుకున్నాడు. దీంతో నాలుగు 200 కోట్ల సినిమాలు ఉన్న సౌత్ స్టార్‌గా రజనీ రికార్డ్ సృష్టించాడు. 200 కోట్ల క్లబ్లో సౌత్ నుంచి ప్రభాస్, విజయ్, అజిత్, కమల్ హాసన్ లాంటి నటులున్నా ఈ క్లబ్లో నాలుగు సినిమాలున్న ఏకైక హీరో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంతే. -
నాన్ నన్చాకు తిప్పితే..!
రజనీకాంత్... సింపుల్‌గా సింగిల్ టేక్‌లో బబుల్గమ్ని చేతిలోకి విసిరి నోట్లో వేసుకోగలరు. రూపాయి బిళ్లను గాల్లో విసిరి జేబులో పడేయగలరు. సిగిరెట్‌ను ఎగరేసి అవలీలగా నోటితో క్యాచ్ చేయగలరు. ఇదంతా ఆన్‌స్క్రీన్ మీద మనకు కనిపించేది. కానీ ఆఫ్‌స్క్రీన్ ఎన్నో రోజుల ప్రాక్టీస్ ఉంటుందట. అలాంటి ఓ విషయాన్నే పంచుకున్నారు ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్. రజనీకాంత్ నటించిన ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇంటర్వెల్ ముందొచ్చే ఫైట్‌లో రజనీకాంత్ ‘నాన్ (నేను) ‘నన్చాకు’ (కరాటే స్టిక్స్)ని తిప్పితే అనే డైలాగ్ చెప్పలేదు కానీ.. తిప్పుతూ విలన్స్‌ను రఫ్ ఆడిస్తారు. ఆ సన్నివేశాలకు థియేటర్లు విజిల్స్‌తో దద్దరిల్లిపోయాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సీన్ ఇంత బాగా రావడానికి సుమారు 50 రోజుల కష్టం ఉందట. 50 రోజులపాటు నన్చాకు తిప్పడం ప్రాక్టీస్ చేశారట రజనీకాంత్. ఈ ఫైట్ గురించి పీటర్ హెయిన్ మాట్లాడుతూ – ‘‘పేట్టాలో ఒక ఫైట్ సన్నివేశానికి ఏదైనా స్పెషల్‌గా, రజనీకాంత్ గారు ఇంతకు ముందు ఎప్పుడూ చేయనిది చేయాలని ప్లాన్ చేశాం. కొన్నిరోజులు ఆలోచించాక నన్చాకుతో ఫైట్ ప్లాన్ చేశాను. ఈ ఐడియా చిత్రదర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు చాలా నచ్చింది. షూటింగ్‌కు రెండు నెలల ముందు రజనీసార్‌తో చెప్పాను. సుమారు 50 రోజుల పాటు తీవ్రంగా ప్రాక్టీస్ చేశారాయన. స్క్రీన్ మీద చాలా ఈజీగా కనిపిస్తున్నా చాలా ప్రాక్టీస్ దాగి ఉంది అందులో. ప్రస్తుతం ఆ ఫైట్‌కు ఫ్యాన్సంతా విజిల్ కొడుతున్నారు, సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారాయన. ∙రజనీకాంత్ ∙రజనీతో పీటర్ -
బ్యాడ్ లక్
‘పేట్టా’ సినిమాతో తమిళ పరిశ్రమకు పరిచయమయ్యారు బాలీవుడ్ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ. తన పాత్రకు మంచి అభినందనలు అందుకుంటున్నారాయన. తమిళ సూపర్ స్టార్ రజనీతో యాక్ట్ చేశారు. మరి కమల్‌తో ఎప్పుడు యాక్ట్ చేస్తారు అని ఇటీవల ఓ సందర్భంలో నవాజుద్దిన్ని అడగ్గా ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ‘‘నేను ఆల్రెడీ కమల్ హాసన్‌తో నటించాను. ‘హే రామ్’ సినిమాలో నాకు ఆ అవకాశం దొరికింది. కానీ, నా బ్యాడ్ లక్ ఆ సీన్స్ ఎడిటింగ్‌లో కట్ అయిపోయాయి. ఆ తర్వాత ‘అభయ్’ సినిమాకి హిందీ డైలాగ్ కోచ్‌గా పని చేశాను కూడా’’ అని పేర్కొన్నారు నవాజుద్దిన్. -
30 ఏళ్ల తరువాత రజనీకాంత్..!
పేట సినిమాతో మరోసారి వింటేజ్ రజనీకాంత్‌ను గుర్తు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్, తన తదుపరి చిత్రంలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం పేట సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రజనీ, నెక్ట్స్ సినిమా మురుగదాస్ దర్శకత్వంలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సర్కార్ సినిమాతో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మురుగదాస్ కోసం మాస్ యాక్షన్ సినిమాను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఎక్కువగా డాన్ తరహా పాత్రలు మాత్రమే చేస్తున్న రజనీ దాదాపు 30 ఏళ్ల తరువాత పోలీస్ డ్రెస్‌లో కనిపించనున్నారట. అంతేకాదు ఇది రజనీ చివరి చిత్రం అన్న ప్రచారం కూడా జరుగుతుండటంతో అభిమానులు మురుగదాస్, రజనీ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - పేట
-
వసూళ్ల వార్
చెన్నై, పెరంబూరు: కోలీవుడ్‌లో ఇప్పుడు రెండు చిత్రాల వసూళ్లపై బహిరంగ యుద్ధం జరుగుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఈ సంక్రాంతి బరిలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన పేట, అజిత్ కథానాయకుడిగా నటించిన విశ్వాసం చిత్రాలు తెరపైకి వచ్చాయి. రజనీకాంత్ చిత్రంతో అజిత్ చిత్రం డీ కొనడం సాధారణ విషయం కాదు. విశేషం ఏమిటంటే ఈ నెల 10వ తేదీన విడుదలైన ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల మధ్య సక్సెస్ టాక్‌ను తెచ్చుకున్నాయి. అంతే కాదు పేట, విశ్వాసం చిత్రాలు వసూళ్లలోనూ పోటీ పడుతున్నాయి. ఈ రెండు చిత్రాల కలెక్షన్లను ప్రతిరోజూ సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తున్నారు. మీరెలా ప్రతి రోజూ తమిళనాడులోని 600 థియేటర్ల కలెక్షన్లను వెల్లడించగలుగుతున్నారు అని పేట చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్వాహకులు ఆశ్యర్యాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు పేట, విశ్వాసం చిత్రాల నిర్మాణ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 11 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్లో పేట ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియం పేట చిత్ర వసూళ్ల వివరాలను ఒక వీడియో ద్వారా ఇటీవల వెల్లడించారు. అందులో ఆయన ఈ ఆదివారానికి అంటే 11 రోజులకు పేట వసూళ్లు రూ.100 కోట్ల క్లబ్లో చేరతాయని పేర్కొన్నారు. ఇలా డిస్ట్రిబ్యూటర్ ద్వారా వసూళ్ల వివరాలను అధికారికపూర్వకంగా వెల్లడించడం అన్నది మొదటి సారి అవుతుందని, పొంగల్ పండగకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియోను సన్ పిక్చర్స్ సంస్థ ప్రచారం చేస్తూ 11 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తొలి తమిళ చిత్రంగా పేట రికార్డు సాధించిందని పేర్కొన్నారు. అంతే కాదు ఒక ప్రోమోను తయారు చేసి అందులో పేట చిత్రంలోని కెక్కే పీక్కే అనే హాస్య సన్నివేశాలను పొందుపరచి చివరలో మీరంతా మారరురా. పొండిరా రే అని రజనీకాంత్ చెప్పే డైలాగ్‌తో ముగించారు. అందుకు బదులిచ్చే విధంగా విశ్వాసం చిత్ర వర్గాలు రెడీ చేసిన ప్రోమోలో మీపై చంపేంత కోపం రావాలి. అయినా మీరు నాకు నచ్చారు సార్. అందుకే లాంగ్ లీవ్. హ్యాపీ లైఫ్ అని అజిత్ చెప్పిన సంభాషణలను పేర్కొన్నారు. ఇప్పటికే విశ్వాసం వసూళ్లు రూ.125 కోట్లు కాగా సన్ పిక్చర్స్ పేర్కొన్న 5 నిమిషాల్లోనే విశ్వాసం చిత్ర తమిళనాడులో విడుదల చేసిన కేజీఆర్.స్టూడియోస్ అధినేత గురువారానికే విశ్వాసం చిత్రం రూ. 125 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. విశ్వాసం వసూళ్లను ప్రకటించగానే అజిత్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అయితే విశ్వాసం చిత్ర వసూళ్ల వివరాలను ప్రకటించడంతో పేట చిత్ర వర్గాలు ట్విట్టర్లో ఎగతాళి చేయడం మొదలెట్టారు. ఇలా పేట, విశ్వాసం చిత్రాల వసూళ్లను వెల్లడి పోటీగా మారింది. ఇద్దరు నటుల అభిమానులు ఒకరిపై ఒకరు వెటకారం మాటలతో ట్వీట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇంతకు ముందు విజయ్, అజిత్ అభిమానుల మధ్య ఇలాంటి పోరు ఉండేది. ఇప్పుడు అది రజనీకాంత్, అజిత్ అభిమానుల మధ్య ఏర్పడడం విశేషం. మరి ఈ పోరు ఏటు వైపు దారి తీస్తుందో చూడాలి. -
మంచి దూకుడు మీదున్న త్రిష!
‘96’ సినిమాకు తమిళనాట ఊహించని విజయం దక్కింది. ఈ మూవీలో డీసెంట్ లుక్‌లో కనబడిన త్రిషకు మంచి మార్కులు పడ్డాయి. చాలాకాలంపాటు సరైన హిట్ కోసం ఎదురుచూసిన త్రిషకు సూపర్ హిట్ సినిమా దొరికింది. దీంతో తన హవా మళ్లీ మొదలైంది. అంతలోపే తలైవా రజనీ కాంత్ ‘పేట’లో కూడా అవకావం లభించింది. ఈ చిత్రం కూడా తమిళనాట మంచి విజయాన్ని సొంతం చేసుకుని వంద కోట్ల క్లబ్‌లోకి దూసుకుపోయింది. ఈ సినిమా కూడా సక్సెస్ కావడంతో త్రిషకు ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయట. ఇప్పటికే ఐదారు సినిమాలతో బిజీగా ఉన్న త్రిషకు.. చాలా కథలు వినిపించారట దర్శక నిర్మాతలు. ఇక ఈ ఏడాది త్రిష డైరీ కూడా ఫుల్ కానుందని సమాచారం. సీనియర్ హీరోయిన్స్ అందరిలోకెల్లా త్రిష మాత్రమే ప్రస్తుతం ఇంత బిజీగా ఉన్నారు. -
రజనీ Vs అజిత్.. ఎవరిది పైచేయి..?
చెన్నై సినీ ప్రియులు పేట చిత్రానికే వసూళ్ల పట్టం కడుతున్నారు. అయితే తమిళనాడు వ్యాప్తంగా చూస్తే విశ్వాసం చిత్రానికే కలక్షన్లను ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. సినీ ప్రేక్షకుల నాడి పట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఏ చిత్రానికి విజయాన్ని, ఏ చిత్రానికి అపజయాన్ని కట్టబెడతారో చెప్పడం కష్టం.మొత్తం మీద చిత్రాల జయాపజయాలనేవి ప్రేక్షక దేవుళ్ల చేతిలోనే ఉంటుంది. అందుకే సినీ వర్గాలకు సినిమా ఒక జూదం. ప్రేక్షకులకది వినోదం మాత్రమే. అలా వారిని మెప్పించడానికి ఈ పొంగల్ పండగ సందర్భంగా రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రం కాగా మరొకటి అల్టిమేట్స్టార్ అజిత్ నటించిన విశ్వాసం. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాలు రెండూ వసూళ్ల మోత మోగిస్తున్నాయి. అయితే ఏ చిత్రం ఎంత సాధిస్తుందన్న వివరాలను తెలుసుకోవాలన్న ఆసక్తి సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ కలగక మానుతుందా? ఇద్దరి అభిమానుల మధ్య పోరు జరగకుండా ఉంటుందా మా హీరో చిత్ర వసూళ్లే ఎక్కువని ఎవరికి వారు గొప్పలు చెప్పుకోకుండా ఉండడం సాధ్యం కాదు. ఇలా అభిమానులు సామాజిక మాధ్యమాల్లోనూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వీరి రగడ గురించి అటుంచితే డిస్ట్రిబ్యూటర్లు చెప్పిన వివరాలను బట్టి చెన్నైలో రజనీకాంత్‌కే వసూళ్లరాజా పట్టం కట్టారు. అయితే తమిళనాడు వ్యాప్తంగా చూస్తే అజిత్‌నే కలెక్షన్ కింగ్‌గా నిలబెట్టారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సూపర్‌స్టార్‌దే హవా. ఆ వివరాలను ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తెలుపుతూ పేట, విశ్వాసం రెండు చిత్రాలు సక్సెస్ టాక్‌తో ప్రదర్శింపబడుతున్నాయని చెప్పారు. అయితే తమిళనాడు వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికి విశ్వాసమే వసూళ్లలో పై చెయ్యిని సాధించిందని, ఇది రూ. 26 కోట్ల కలెక్షన్లను సాధించిందన్నారు. పేట రూ.23 కోట్ల వసూళ్లనే సాధించి విశ్వాసం కంటే రూ.3 కోట్లు తక్కువ సాధించిందని చెప్పారు. ఇక చెన్నై వరకూ చూస్తే పేటదే కలక్షన్ల హవా అని చెప్పారు. చెన్నైలోని మల్టీఫ్లెక్స్ థియేటర్లలో అధికంగా పేట చిత్రమే ప్రదర్శింపబడుతుండడం విశేషం అన్నారు. ఇక్కడ పేట చిత్రం రూ. 1.18 కోట్లు వసూల్ చేయగా విశ్వాసం రూ. 86 లక్షలనే వసూలు చేసిందని తెలిపారు. బీ అండ్ సీ థియేటర్లలో విశ్వాసం చిత్రం అధిక వసూళ్లను సాధిస్తుందదని చెప్పారు. విదేశాల్లో పేటదే అగ్రస్థానం ఇక ఇతర దేశాల్లో సూపర్‌స్టార్‌కు సాటి ఎవరూ రారన్నది తెలిసిందే. దాన్ని పేట చిత్రం మరోసారి రుజువు చేసింది. అక్కడ పేట చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను సాధిస్తోంది.ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజునే రూ.48 కోట్లు సాధించిదని తెలిపారు. విశ్వాసం రూ. 43 కోట్లను సాధించిందని చెప్పారు. ఒక్క అమెరికాలోనే పేట ఒక మిలియన్ డాలర్లు వసూల్ చేయగా, విశ్వాసం 83 వేల డాలర్లనే వసూలు చేసిందన్నారు. మొత్తం మీద రజనీకాంత్ పేట, అజిత్ విశ్వాసం చిత్రాలకు ప్రేక్షకులు భారీ వసూళ్లనే కట్టబెడుతున్నారు. వీటిలో ఏ చిత్రం ముందంజలో ఉంటుందన్నది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. -
మీకంటే మేమే గ్రేట్!
సినిమా: పురుషులు ఆ విషయాన్ని గ్రహించాలి అంటోంది నటి సిమ్రాన్. ఈ పేరు విని చాలా కాలమైంది కదూ. అవును మరి ఈమె తమిళ సినిమాల్లో నటించి చాలా కాలమే అయ్యింది. 1990 ప్రాంతంలో కోలీవుడ్, టాలీవుడ్ అంటూ తారతమ్యం చూపకుండా కథానాయకిగా దున్నేసిన నటి సిమ్రాన్. ఆ తరువాత తన చిరకాల బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని కుటుంబ జీవితానికి పరిమితమైంది. అయితే కోడిట్ట ఇడంగళ్ నిరంబుగా వంటి ఒకటి రెండు చిత్రాల్లో గుర్తింపు లేని పాత్రల్లో కనిపించినా, ఆ తరువాత మళ్లీ సినిమాకు దూరమైంది. అలాంటిది పేట చిత్రంలో రజనీకాంత్‌తో నటించింది. ఇందులోనూ పాత్ర పరిధి చాలా తక్కువే అయినా, అందంగా కనిపించింది. పేట చిత్రం తనకు మంచి రీఎంట్రీ అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న నటి సిమ్రాన్ ఇంకా చాలా విషయాలను చెప్పుకొచ్చింది. అందులో కాస్త మగవారిపై తన అసంతృప్తిని వెళ్లగక్కింది కూడా. ఇంతకీ ఈ భామ ఏం అందో చూద్దాం. 90 ప్రాంతంలో నటిగా నేను చాలా బిజీ. ఎంత బిజీ అంటే పూర్తిగా సినిమాల్లోనే మునిగితేలాను. ఆ సమయంలో బయట ప్రప్రంచం గురించి గానీ, కుటుంబ గురించి గానీ ఒక్క రోజు కూడా ఆలోచించలేదు. ఆ సమయంలో నేను చాలా విషయాలను కోల్పోయాను. అయితే ఇప్పుడలా కాదు. పండగలు వస్తే అందుకు సమయాన్ని కేటాయిస్తున్నాను. అదే విధంగా పిల్లలు, కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపడంపై శ్రద్ధ చూపుతున్నాను. నేనిప్పుడు సంతోషంగా ఉండటానికి కారణం ఇదే. కాగా మగవారు జయిస్తున్నారంటే అందుకు వారి వెనుక స్త్రీలు ఉంటున్నారు. ఈ విషయాన్ని వారు గ్రహించాలి. స్త్రీలు అన్ని విషయాల్లోనూ బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కదిద్దడంతోనే మగవారు జయించగలుగుతున్నారు. అందుకే నేనంటా మగవారి కంటే ఆడవారే ఉన్నతమైనవారు అని పేర్కొంది. అయినా సిమ్రాన్ సడన్‌గా పురుష పుంగవులపై దాడి చేయడానికి నేపథ్యం ఏముంటుందనే ఆరాలు తీసే పనిలో సినీ వర్గాలు బిజీ అయిపోతున్నాయి. -
ఖుషీ ఖుషీగా..
సినిమా: అనుకున్నవి జరగకపోవడం, ఊహించనివి జరగడం ఇదే జీవితం. అదృష్టం చెప్పిరాదు. దురదృష్టం చెప్పిపోదు. అలా ఎన్నో ఏళ్లుగా సూపర్‌స్టార్‌తో ఒక్క సన్నివేశంలోనైనా నటించే అవకాశం కోసం నటి త్రిష జపం చేసిందనే చెప్పవచ్చు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి ప్రకటించగానే కాలానే చివరి చిత్రం అనే ప్రచారం జరగడంతో పాపం త్రిష ఇక తన కల కల్లే అనుకున్నారంతా. అదేవిధంగా ఆమె కంటే సీనియర్ నటి సిమ్రాన్. ఆమె ఒక్క రజనీకాంత్ మినహా కోలీవుడ్‌లో ప్రముఖ హీరోలందరితోనూ నటించింది. సూపర్‌స్టార్‌తో నటించలేదన్న కొరత ఈ అమ్మడికీ ఉండేది. అలా సిమ్రాన్, త్రిషలిద్దరి ఆకాంక్షలను రజనీకాంత్ పేట చిత్రంతో తీర్చారు. రెండు మూడు సన్నివేశాల్లో వచ్చి పోయే పాత్రలే అయినా త్రిష, సిమ్రాన్ ఇద్దరూ హ్యాపీ. ఇక వీరిద్దరికంటే యమ ఖుషీ అయిపోతున్న మరో నటి ఉంది. ఆమె మేఘాఆకాశ్. పేట చిత్రం ఈ జాణ జీవితంలో మరపురాని చిత్రంగా నిలిచిపోతోంది. తెలుగులో రెండు మూడు చిత్రాలు చేసిన మేఘాఆకాశ్ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయ్యింది. ఒరు పక్క కథై చిత్రంతో పరిచయమై, ధనుష్‌తో ఎన్నై నోక్కి పాయుంతోట్టా చిత్రంలో రొమాన్స్ చేసింది. ఇక శింబుతో వందా రాజావాదాన్ వరువేన్ చిత్రంలోనూ డ్యూయెట్లు పాడింది. అయితే ఈ మూడు చిత్రాలు ఇంకా వెండితెరపైకి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పేట చిత్రంలో కళాశాల విద్యార్థినిగా నటించే లక్కీచాన్స్‌ను కొట్టేసింది. పేట చిత్రం గురువారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ కోలీవుడ్‌లో నటించిన ఈ పేట చిత్రం ఆమె జీవితంతో విడుదలైన తొలి తమిళ చిత్రంగా నమోదైంది. ఇది మేఘాఆకాశ్ ఊహించనిదే. అయినా జరిగి మధురమైన అనుభూతిని మిగల్చడంతో మేఘ యమ ఖుషీగా పొంగళ్ పండగ చేసుకుంటోంది. అంతేకాదు ఈ విషయాన్ని తన స్నేహితులతో చెప్పుకుని తెగ ఆనందపడిపోతోంది. ఈమె సంతోష పడుతున్న మరో విషయం అమ్మడు పనిలో పనిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చేసింది. అక్కడ శాట్‌లైట్ శంకర్ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అలా 2018 రెండు మరచిపోలేని అవకాశాలను అందించి పోగా, 2019 పేట తొలిచిత్రంగా విడుదలై విజయానందానిచ్చింది. ఇక శింబుతో నటించిన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. మొత్తం మీద మేఘాఆకాశ్ ఫుల్‌జోష్‌లో ఉంది. -
‘పేట’ ముహూర్తానికే పెళ్లి..!
-
‘పేట’ ముహూర్తానికే పెళ్లి..!
చెన్నై: ఫ్యాన్స్‌నందు సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ వేరయా..! అనే విశేషం గురువారం ‘పేట’ సినిమా విడుదల సందర్భంగా చోటుచేసుకుంది. రజనీ సినిమా రిలీజ్ అంటే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆయన తమ అభిమాన సినీనటుడు మాత్రమే కాదు.. ‘అంతకు మించి’ అని నిరూపించారు ఓ జంట. అంబసు, కమాచి అనే యువతీ యువకులు ‘పేట’ సినిమా విడుదల సమయాన్నే అద్భుత ముహూర్తంగా ఖరారు చేసుకున్నారు. సినిమా విడుదల సమయానికే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరూ రజనీ వీరాభిమానులే కావడం మరో విశేషం. అలాగని ఈ పెళ్లి ఏ ఫంక్షన్ హాల్లోనో, గుడిలోనో జరగలేదు. ‘పేట’ సినిమా రిలీజ్ అయిన ఉడ్‌లాండ్స్ సినిమా హాల్ వద్దే జరిగింది. అక్కడే వివాహ వేదికను ఏర్పాటు చేసుకుని, ఈ జంట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. రజనీ నటించిన సినిమా పోస్టర్లతో ఏర్పాటు చేసిన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెళ్లికి రజనీ అభిమానులందరూ ఆహ్వానితులే. సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులందరూ ఈ పెళ్లి చూసి హర్షం వ్యక్తం చేశారు. అక్షితలు వేసి దీవెనలు అందించారు. వివాహం అనంతరం అభిమానులకు భోజన ఏర్పాట్లు కూడా చేశారు. సూపర్‌స్టార్‌పై తమ అభిమానాన్ని అంబసు, కమాచి ఇలా చాటుకున్నారు. -
పేట కోసం జపాన్ నుంచి
చెన్నై : రజనీకాంత్‌కు జపాన్‌లో కూడా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఆయన నటించిన పేట చిత్రాన్ని చూడడానికి బుధవారం జపాన్ నుంచి పలువురి అభిమానులు పేట చిత్రంలోని బొమ్మలతో కూడిన టీషర్ట్ ధరించి చెన్నైకు వచ్చారు. స్థానిక కాశి థియేటర్లోని పోస్టర్‌ను తిలకించారు -
‘పేట’ మూవీ రివ్యూ
టైటిల్ : పేట జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : రజనీకాంత్, త్రిష, సిమ్రన్, విజయ్ సేతుపతి, నవాజుద్ధీన్ సిద్ధిఖీ సంగీతం : అనిరుధ్ దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాత : అశోక్ వల్లభనేని, కళానిథి మారన్ 2.ఓ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పేట. కోలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఎన్నో వివాదాల మధ్య అతి కష్టం మీద రిలీజ్ అయ్యింది. తెలుగులో భారీ చిత్రాలు బరిలో ఉండటంతో పేటకు సరైన స్థాయిలో థియేటర్లు దక్కలేదు. అయితే రజనీ మేనియా కారణంగా అంచనాలైతే భారీగానే ఉన్నాయి. మరి ఇన్ని కష్టాల మధ్య పేట తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది.? రజనీ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా..? కథ : కాళీ (రజనీకాంత్) ఓ హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తుంటాడు. అక్కడే ప్రాణిక్ హీలర్గా పనిచేసే డాక్టర్(సిమ్రన్)తో కాళీకి పరిచయం అవుతుంది. అంతా సరదాగా గడిచిపోతున్న సమయంలో కాళీకి లోకల్ గూండాతో గొడవ అవుతుంది. ఆ గొడవ కారణంగా కాళీ అసలు పేరు పేట అని, అతను ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడకు వచ్చాడని తెలుస్తోంది. అసలు పేట, కాళీగా ఎందుకు మారాడు..? సింహాచలం(నవాజుద్ధీన్ సిద్ధిఖీ)కు, పేటకు మధ్య గొడవ ఏంటి.? పేట తిరిగి ఉత్తరప్రదేశ్ వెళ్లాడా.. లేదా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : రజనీకాంత్ మరోసారి తనదైన స్టైలిష్, మాస్ యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. పెద్దగా పర్ఫామెన్స్‌కు అవకాశం లేకపోయినా.. అభిమానులను అలరించే స్టైల్స్‌కు మాత్రం కొదవేలేదు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా ఎవరికీ పెద్దగా ప్రాదాన్యం లేదు. ప్రతినాయక పాత్రలను కూడా అంత బలంగా తీర్చి దిద్దకపోవటంతో విజయ్ సేతుపతి, నవాజుద్ధిన్ సిద్ధిఖీ లాంటి నటులు ఉన్నా ఆ పాత్రలు గుర్తుండిపోయేలా లేవు. సినిమా అంతా రజనీ వన్‌మేన్ షోలా సాగటంతో ఇతర పాత్రలు గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. శశికుమార్, బాబీ సింహా, మేఘా ఆకాష్, నాగ్ తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : పేట పక్కా కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కిన సినిమా హీరో వేరే ప్రాంతంలో తన ఐడెంటినీ దాచి బతుకుతుండటం. ఓ భారీ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ఇలాంటి కాన్సెప్ట్‌తో సౌత్ లో చాలా సినిమాలు వచ్చాయి. రజనీ కూడా గతంలో ఇలాంటి సినిమాలు చేశాడు. అయితే మరోసారి అదే ఫార్ములాకు రజనీ స్టైల్‌ను జోడించి తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. తొలి భాగానికి ఇంట్రస్టింగ్ ట్విస్ట్‌లతో నడిపించిన కార్తీక్, ద్వితియార్థంలో కాస్త తడబడ్డాడు. రజనీ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకున్న కథలో పెద్దగా కొత్తదనమేమీ లేదు. పూర్తిగా తమిళ నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించటం కూడా తెలుగు ప్రేక్షకులకు నిరాశకలిగిస్తుంది. అనిరుధ్ అందించిన పాటలు తమిళ ప్రేక్షకులను అలరించినా తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకోవటం కష్టమే. నేపథ్య సంగీతం మాత్రం సూపర్బ్ అనిపిస్తుంది. తిరు సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్ లుక్ తీసుకువచ్చింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రజనీకాంత్ నేపథ్య సంగీతం కొన్ని ట్విస్ట్‌లు మైనస్ పాయింట్స్ : రొటీన్ కథ సెకండ్ హాఫ్ తమిళ నేటివిటి -
అజిత్ అభిమానుల హల్చల్
-
కత్తులతో పొడుచుకున్న అభిమానులు.. పరిస్థితి విషమం
సంక్రాంతి పండుగ సీజన్ కావటంతో స్టార్ హీరోల సినిమాలు క్యూ కట్టాయి. బడా స్టార్స్ ఒకేసారి థియేటర్లలో సందడి చేస్తుండటంతో ఫ్యాన్స్ మధ్య గొడవలు మాటల యుద్ధాన్ని దాటి ప్రత్యక్ష దాడులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఇద్దరు టాప్ హీరోల సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పేట, అజిత్ ద్విపాత్రాభినయం చేసిన విశ్వాసం సినిమాలు ఈ రోజు(గురువారం) రిలీజ్ అయ్యాయి. దీంతో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పలు చోట్ల ఫ్యాన్స్ ఘర్షణలకు దిగటంతో పరిస్థితి చేయిదాటిపోయింది. వేలూరులోని ఓ థియేటర్ ముందు ఇరువర్గాల అభిమానులు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అభిమానుల మాత్రం తమ హీరో గ్రేట్ అంటే తమ హీరో గ్రేట్ అంటూ దాడులకు తెగబడుతున్నారు. అజిత్ అభిమానుల హల్చల్ తమ హీరో సినిమా విడుదల సందర్భంగా ధియేటర్ల దగ్గర అజిత్ అభిమానులు హల్చల్ చేశారు. తమ అభిమాన నటుడి సినిమా పాటలకు డాన్సులు చేస్తూ హంగామా సృష్టించారు. నాలుకపై కర్పూరం వెలిగించుకుని హారతులు పట్టారు. ధనుష్‌తో కలిసి సినిమా చూసిన త్రిష రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పేట సినిమాను హీరోయిన్ త్రిష, హీరో ధనుష్, ఇతర ప్రముఖులు చెన్నైలోని ధియేటర్లో వీక్షించారు. తెలుగులో కూడా పేట సినిమా నేడు విడుదలైంది. -
‘పేట్టా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
థియేటర్ల మాఫియా ఉంది
‘‘సినిమా కళకి కులం, మతం, జాతి, ప్రాంతం.. ఉండవని నిరూపించారు రజనీగారు. స్వయంకృషితో వరల్డ్ సూపర్‌స్టార్‌గా ఎదిగారంటే అది రజనీగారొక్కరే. మన ఎన్టీ రామారావుగారు కూడా చరిత్ర సృష్టించారు. శ్రీకాంత్కూడా స్వయంశక్తితో ఈ స్థాయికి ఎదిగాడు’’ అని నిర్మాత టి.ప్రసన్న కుమార్ అన్నారు. రజనీకాంత్ హీరోగా, త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పేట్టా’. ఈ చిత్రాన్ని ‘పేట’ పేరుతో వల్లభనేని అశోక్ ఈ నెల 10న తెలుగులో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రసన్నకుమార్ మాట్లాడుతూ– ‘‘సినిమా బావుంటే ఎవ్వడూ ఆపలేడు. ఈరోజు థియేటర్స్ మాఫియా ఎలా ఉందంటే మాఫియా డాన్స్ కంటే దారుణాతి దారుణంగా ఉంది. కేవలం ముగ్గురు నలుగురు చేస్తున్న సినిమాలకి మొత్తం థియేటర్స్ పెట్టుకుంటున్నారు. సాంకేతిక నిపుణులను బతకనిచ్చే పరిస్థితిగానీ, కొత్తవాళ్లు వచ్చే పరిస్థితిగానీ లేకుండా చాలా నీచాతి నీచంగా చేస్తున్నారు. సంక్రాంతి అంటే ఆరేడు సినిమాలు రిలీజ్ అయినా చూడగలిగే ప్రేక్షకులున్నారు. కానీ, చూడ్డానికి ఒకటి లేదా రెండు సినిమాలు తప్పితే మిగతా సినిమాలకు అవకాశం లేకుండా చేస్తున్న మాఫియా ఉంది. ఈ మాఫియా ఎండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడుగార్లకు చెబుతాం. వాళ్ల సినిమాలే ఆడాలని చూస్తున్నారు. మిగతా వాళ్లందర్నీ తొక్కి పారేస్తున్నారు. మా సినిమాలే ఉండాలి అనే ధోరణిలో వెళుతున్నారు. ఇది మంచిది కాదు. దయచేసి ఇది మీకు విజ్ఞప్తి అనుకోండి.. కాదంటే వార్నింగ్ అనుకోండి.. అయిపోతారు... చాలా మందిని చూశాం. విర్రవీగినోళ్లంతా ఆకాశంలోకి వెళ్లిపోయారు.. మీరు కూడా పోతారు. కొంచెం తెలుసుకుని కరెక్టుగా ఉండండి’’ అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల మధ్య.. ‘పేట’ కూడా పెద్ద సినిమానే. వాటి మధ్య ఈ సినిమా విడుదల చేస్తున్నాడు అశోక్. ఆ సినిమాలతో పాటు ‘పేట’ కూడా ఆడాలని కోరుకుంటున్నా. రజనీకాంత్‌గారి సినిమాలు చూస్తూ పెరిగాం. చిరంజీవిగారు, రజనీగారు నటీనటులకు స్ఫూర్తి’’ అన్నారు. చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ మాట్లాడుతూ–‘‘ఎందరో మహానుభావులు.. ఇక్కడికి వచ్చిన వారందరికీ వందనాలు. పిలిచినా వస్తానని రాకుండా మమ్మల్ని ఆనందపెట్టిన ఇంకొందరు మహానుభావులకు నా రెండేసి వందనాలు. ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి మధ్య మన సినిమా ‘పేట’ కి థియేటర్స్ తక్కువైనా, బిజినెస్ జరిగినా, జరక్కపోయినా సొంతంగా రిలీజ్ చేద్దామని రిస్క్ తీసుకుని విడుదల చేస్తున్నా’’ అన్నారు. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ– ‘‘రజనీగారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓ చరిత్ర. అలాంటివాళ్లు అక్కడక్కడా వస్తుంటారు. మనకి మన ఎన్టీ రామారావుగారు. ఆయన ఓ చరిత్ర. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో జపాన్‌లో ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న మొదటి వ్యక్తి రజనీ. సౌత్ ఇండియాలోనూ హీరోలు ఉన్నారని ప్రపం చానికి చాటిన మొదటి హీరో రజనీ ’’అన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ– ‘‘పేట’ చిత్రం మా అందరి డ్రీమ్ ప్రాజెక్ట్. రజనీసార్ అభిమానులకే కాదు, ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుంది. మంచి కథ. ఈ పండక్కి చాలా పెద్ద సినిమాల మధ్య మా సినిమా విడుదలవుతోంది. ఆ సినిమాలతో పాటు మా ‘పేట’ కూడా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరి, నిర్మాత కిరణ్, సంగీత దర్శకుడు అనిరు«ద్, నటీనటులు బాబీ సింహా, మేఘా ఆకాశ్, మాళవికా మోహన్, పాటల రచయితలు భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
సూపర్‌స్టార్‌తో జతకట్టే చాన్స్ మిస్ అయ్యా!
సూపర్‌స్టార్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని కొద్దిలో మిస్ అయ్యానంటోంది అందాలభామ మీరామిథున్. మోడలింగ్ రంగంలో అంతర్జాతీయస్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న మీరామిథున్ ఇటీవలే సినీరంగానికి పరిచయమైంది. నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన తానాసేర్నద కూట్టం చిత్రంలో నటుడు కలైయరసన్‌కు జంటగా నటించింది. అదేవిధంగా 8 తూట్టాగళ్ చిత్రంలోనూ ముఖ్యపాత్రను పోషించింది. మిస్ సౌత్ ఇండియా సుందరి కిరీటాన్ని గెలుచుకున్న మీరామిథున్ చెన్నై అగ్మార్క్ చిన్నది. చదువు, నాట్యంపైనే దృష్టి పెట్టిన మీరామిథున్‌ను ఆమె పొడవు, మేని ఛాయ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టేలా చేశాయట. ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ అమ్మడిని చూసిన కొందరు మీరు మోడలా అని అడిగారట. అంతే మీరా మిథున్‌కు మోడలింగ్ రంగంపై ఆసక్తి పెరిగిందట. అయితే ఈమె తండ్రి కూడా మిస్టర్ మెడ్రాస్, మిస్టర్ తమిళనాడు పోటీల్లో గెలుపొందారు. ఆయన కూడా మీరామిథున్‌కు స్ఫూర్తిగా నిలవడంతో కో ఆప్‌టెక్స్‌కు మోడల్‌గా తన పయనానికి శ్రీకారం చుట్టి ఆ తరువాత ప్రముఖ వ్యాపార సంస్థలకు మోడల్‌గా మారిపోయింది. దీంతో పలువురు ఒత్తడితో నటిగా సినీరంగప్రవేశం చేసింది. అలా మొట్టమొదటి సారిగా గ్రహణం చిత్రంలో మోడల్‌గా ఎంట్రీ ఇచ్చింది. పలు అవకాశాలు మీరామిథున్‌ను వెతుక్కుంటూ వస్తున్నా, అవి సంతృప్తినివ్వకపోవడంతో అంగీకరించడం లేదట. సెలక్టివ్ చిత్రాలనే చేస్తున్న మీరామిథున్ 2019లో తెరపైకి రానున్న తాను నటించిన చిత్రాలు మంచి పేరు తెచ్చిపెడతాయనే ఆశాభావంతో ఉంది. ఇకపై కూడా హీరోయినా, క్యారెక్టర్ ఆర్టిస్టా అన్నది చూడకుండా నటనకు అవకాశం ఉన్న ఏలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అంటున్న మీరామిథుల సమీప కాలంలో చేసిన ఒక వాణిజ్య ప్రకటనలో చాలా గ్లామరస్‌గా నటించడంతో విమర్శలను ఎదుర్కొంది. చాలా గ్లామర్‌గా ఉన్నావంటూ ప్రశంసించిన వారు ఉన్నారంటోంది ఈ అమ్మడు. అయితే ఆ ప్రకటనలో ఎందుకు నటించాల్సి వచ్చిందన్న విషయాన్ని మీరామిథున్ తెలుపుతూ తనను ఫొటో తీసిన ఒక ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఒక యాడ్ ఉంది నటిస్తావా అని అడిగి నువ్వు చేయకపోతే ఏ నైజీరియాకో, ఆఫ్రికాకో చెందిన మోడల్‌తో నటింపజేస్తానని, అయితే మీరైతే బాగుంటుందని అన్నాడంది. దీంతో ఆ అవకాశాన్ని వదులుకోవడానికి తనకు మనసంగీకరించకపోవడంతో ఒప్పుకున్నానని, అయినా మోడలింగ్ అన్నది ఒక కళ అని దాన్ని ఆ దృష్టితోనే చూడాలని పేర్కొంది. మరో విషయం ఏమిటంటే తనను సినిమాల్లోకి రావాలని చెప్పింది నటుడు విశాలే అని చెప్పింది. పేట చిత్రంలో రజనీకాంత్‌కు జంటగా త్రిష పాత్రలో తానే నటించాల్సిందని, లుక్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ వరకూ వెళ్లిన తరువాత ఏవో కొన్ని కారణాలతో ఆ అవకాశాన్ని మిస్ అయ్యానని చెప్పింది. అదేవిధంగా విక్రమ్ హీరోగా కమలహాసన్ నిర్మిస్తున్న గడారం కొండాన్ చిత్రంలోనూ ముఖ్యపాత్రలో నటించడానికి ఒప్పందం చేసినా, అదీ చివరి క్షణంలో మిస్ అయ్యిందని చెప్పింది. అయితే మిస్ అయిన అవకాశాలు మరో రూపంలో తనను వెతుక్కుంటూ వస్తాయన్న నమ్మకాన్ని నటి మీరామిథున్ వ్యక్తం చేసింది. -
జెట్ స్పీడ్!
సినిమా సినిమాకు మధ్యలో గ్యాప్ ఇవ్వడం లేదు. నాలుగైదు నెలల గ్యాప్‌లోనే స్క్రీన్‌పై కనిపిస్తున్నారు రజనీకాంత్. ‘కాలా, 2.0, పేట్టా’ మూడు చిత్రాలు ఏడు నెలల గ్యాప్‌లో రిలీజŒ అయ్యాయి. ఈ స్పీడ్ చూసి ఆశ్చర్యపడకమానలేం. సంక్రాంతికి కొత్త సినిమా ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’)తో బరిలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి నెలలో మురుగదాస్‌తో చేయనున్న ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్లు కోలీవుడ్ సమాచారం. ఇది పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా, రజనీను ఆయన ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఉండబోతోందని ఆ మధ్య ఓ ఫంక్షన్లో పేర్కొన్నారు మురగదాస్. ఆల్రెడీ మురుగదాస్‌తో ‘సర్కార్’, రజనీతో ‘పేట్టా’ సినిమాలను నిర్మించిన సన్ నెట్వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రజనీకాంత్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ప్రవేశించాక సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టొచ్చనే టాక్ కూడా తమిళనాడులో ఉంది. అందుకోసమే ఇలా గ్యాప్ లేకుండా జెట్ స్పీడ్‌తో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నారా? -
సెన్సార్ పూర్తి.. బరిలోకి దిగడానికి రెడీ!
ఈ సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తున్నా.. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ఎఫ్2, సూపర్‌స్టార్ రజనీకాంత్ పేట కూడా రంగంలోకి దిగడానికి సిద్దమయ్యాయి. అయితే వీటిలో ఏ సినిమాలకు ప్రేక్షకులు పట్టంకడతారో చూడాలి. ఎన్టీఆర్ జీవిత చరిత్రగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ కథానాయకుడిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక బోయపాటి శ్రీను సినిమా అంటే మాస్కు పండుగే. భారీయాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన వినయ విధేయ రామపై మాస్లో భారీ హైప్ క్రియేట్ అయింది. వినోధ భరితంగా రాబోతోన్న ఎఫ్2, రజనీ తనదైన స్టైల్, మ్యానరిజంతో నటిస్తూ వస్తున్న పేట ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. అయితే వీటిలో ఎలాంటి కట్లు లేకుండా ఎన్టీఆర్ కథానాయకుడు మూవీకి యూ.. పేటా, ఎఫ్2లకు యూ/ఏ సర్టిఫికేట్లు లభించాయి. ఇక వినయ విధేయ రామ చిత్రం సెన్సార్ పూర్తి కావాల్సిఉంది. కథానాయకుడు అన్నింటికంటే ముందుగా (జనవరి 9న) విడుదల కానుండగా.. పేట జనవరి 10న, వినయ విధేయ రామ జనవరి 11న, ఎఫ్2 జనవరి 12న విడుదల కానున్నాయి. -
‘చూడ్డానికి చిన్నపిల్లాడిలా.. చాలా స్టైల్‌గా ఉన్నారు’
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పేట్టా’. త్రిష, సిమ్రాన్, విజయ్‌సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని... ‘పేట’ పేరుతో నిర్మాత వల్లభనేని అశోక్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కాగా ఇటీవలే తమిళ ‘పేట్టా’ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో రజనీ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘చూడ్డానికి చిన్నపిల్లాడిలా చాలా స్టైల్‌గా ఉన్నారంటూ’ మేఘా ఆకాశ్ ఇచ్చిన కాంప్లిమెంట్‌కు.. ‘స్టైల్‌గా ఉన్నానట నాచురల్లీ’ అంటూ రజనీ తన మార్కు డైలాగ్‌తో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా కాలేజీ వార్డన్‌గా స్టైలిష్ లుక్‌లో మెరిసిన తలైవా... యాక్షన్ సీన్స్‌లో ఫుల్ టూ మాస్ డైలాగ్స్‌తో అదరగొట్టారు. -
ఇట్స్ ఫ్యామిలీ టైమ్
ఒకవైపు రజనీకాంత్ తాజా చిత్రం ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’) విడుదల పనులు జోరుగా సాగుతుంటే అంతే జోరుగా యూఎస్‌లో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు సూపర్ స్టార్. అక్కడికి ఫ్యామిలీతో కలిసి రజనీకాంత్ వెళ్లిన సంగతి తెలిసిందే. క్రిస్మస్ వేడుకలను రజనీ ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్లోని ఓ ఫొటోను ఆయన అల్లుడు దర్శక–నిర్మాత–నటుడు ధనుశ్ ‘‘హ్యాపీ హాలీడేస్.. ఫ్యామిలీ టైమ్’’ అంటూ షేర్ చేశారు. ఇక ‘పేట్టా’ దగ్గరకు వస్తే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీ గురువారం అధికారికంగా వెల్లడైంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. వల్లభనేని అశోక్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదల కానుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. -
విదేశాల్లో వేడుకలు!
గత ఐదేళ్లతో పోలిస్తే సినిమాల విషయంలో రజనీకాంత్ ఈ ఏడాది స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. ‘కాలా, 2.ఓ’ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తేవడమే కాకుండా ‘పేట్టా’ అనే మరో సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసి ఈ ఏడాదిని బిజీ బిజీగా గడిపారు రజనీకాంత్. అందుకే ఇప్పుడు ఆయన హాలీడేను ప్లాన్ చేసుకున్నట్లు కోలీవుడ్ టాక్. ఫ్యామిలీతో కలిసి రజనీ న్యూయార్క్ వెళ్లారన్నది తాజా సమాచారం. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను రజనీ కుటుంబం అక్కడే జరుపుకుంటుందట. ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ కానున్న ఆయన తాజా చిత్రం ‘పేట్టా’ ప్రమోషన్ కోసం జనవరి మొదటివారంలో రజనీ ఇండియాకి తిరిగొస్తారని టాక్. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘పేట్టా’. తెలుగులో ‘పేట’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇందులో త్రిష, సిమ్రాన్ కథానాయికలుగా నటించారు. విజయ్ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మాళవిక మోహనన్ నటించిన ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చారు. రజనీకాంత్ నెక్ట్స్ మూవీ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
గురువుతో శిష్యుడు
గురువుతో పాటు శిష్యుడు ఆటపాటలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌కు మధ్య ఉన్న గురుశిష్యుల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాఘవ లారెన్స్‌ను డాన్సర్‌గా సిఫార్సు చేసింది రజనీకాంత్నేనన్న విషయం తెలిసిందే. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం పేట్ట పొంగల్‌కు భారీ ఎత్తున తెరపైకి రానుంది. అదే రోజున లారెన్స్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న కాంచన 3 చిత్ర గీతాలను విడుదల చేయనున్నారు. లారెన్స్ ఇంతకు ముందు హీరోగా నటించి, తెరకెక్కించిన కాంచన–1, కాంచన–2 చిత్రాలు హర్రర్, కామెడీ బ్యానర్లో రూపొంది మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో వాటికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న చిత్రం కాంచన –3. ఈ చిత్రం పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రానికి విడుదల తేదీ ఇప్పుడు ఖరారైంది. లారెన్స్‌కు జంటగా నటి ఓవియ, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తుది ఘట్ట సన్నివేశాలను త్వరలో చిత్రీకరించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. లారెన్స్‌నే నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ కాంచన–3 చిత్ర విడుదల హక్కులను తాజాగా సన్ పిక్చర్స్ సంస్థ పొందింది. పేట చిత్రం ఈ సంస్థ నుంచే వస్తున్న విషయం తెలిసిందే. పేట చిత్ర విడుదలతో కాంచన–3 చిత్ర గీతాలను, చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ నెలలోనూ విడుదల చేయడానికి సన్ పిక్చర్స్ సంస్థ సన్నాహాలు చేస్తోందట. -
మరోసారి అమెరికాకు రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబసభ్యులతో కలిసి విశ్రాంతి కోసం అమెరికాకు పయనమయ్యారు. రజనీకాంత్ జీవన శైలి గురించి అందరికీ తెలిసిందే. ఆయన తాను నటించిన చిత్రం పూర్తి కాగానే విశ్రాంతి కోసం తప్పనిసరిగా విదేశాలకు వెళుతుంటారు. ఈ సారి ఆయన కుటుంబ సమేతంగా అమెరికాకు వెళ్లారు. రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్రం గత నెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్ పూర్తి అయిన సమయంలోనూ ఆయన విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారు. తాజాగా పేట చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రం జనవరిలో సంక్రాంతికి తెరపైకి రానుంది. దీంతో రజనీకాంత్ విశ్రాంతి కోసం కుటుంబసభ్యులతో సహా శనివారం సాయంత్రం చెన్నై నుంచి బయలుదేరి అమెరికాకు పయనం అయ్యారు. అక్కడ 10 రోజులు ప్రశాంతంగా గడిపి జనవరి తొలి వారంలో చెన్నైకి తిరిగిరానున్నారు. రజనీ రాజకీయాల్లోకి రానున్నట్లు గత ఏడాది డిసెంబర్లో బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏడాది గడుస్తున్నా ఇంకా పార్టీ పేరును కూడా వెల్లడించని పరిస్థితి. దీంతో ఈ నెలలో రజనీకాంత్ పార్టీని ప్రకటిస్తారని ఆశించిన ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కొత్త సంవత్సం ప్రథమార్థంలోనైనా ప్రకటిస్తారనే ఆశాభావంతో ఉన్నారు. అయితే రజనీకాంత్ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపారనే ప్రచారం జరుగుతుండడంతో ఆయన అమెరికా నుంచి రాగానే ఆ చిత్ర షూటింగ్‌కు సిద్ధం అవుతారనే టాక్ వినిపిస్తోంది. -
సంక్రాంతికి ఫిక్స్
ఇందుమూలంగా యావన్మంది ప్రేక్షక లోకానికి తెలియజేయడం ఏమనగా రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘పేట’ సంక్రాంతికి విడుదల అవుతోందహో.. రజనీకాంత్ హీరోగా, త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పేట్టా’. ఈ చిత్రాన్ని ‘పేట’ పేరుతో నిర్మాత వల్లభనేని అశోక్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సర్కార్, నవాబ్’ వంటి భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన మా బ్యానర్లో ‘పేట’ సినిమా హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. రజనీ అభిమాని అయిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. అనిరు«ద్ చక్కటి సంగీతం ఇచ్చారు. అటు మాస్, ఇటు క్లాస్ ఆడియన్స్‌ని కట్టిపడేసే కమర్షియల్ అంశాలున్న మా చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నాం’’ అన్నారు. విజయ్ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు నటించారు. -
సొంత చానెల్ పెట్టనున్న సూపర్ స్టార్..?
ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీలు మనుగడలో ఉండాలంటే వాటికంటూ సొంత టీవీ చానెల్ ఉండటం తప్పనిసరిగా మారింది. ఇదే అంశాన్ని ఫాలో అవుతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. అభిమానులు ఎన్నో ఏళ్లుగా తలైవా రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 31 తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటించారు రజనీకాంత్. ‘మక్కల్ మంద్రమ్’ అనే పార్టీని స్థాపించిన రజనీకాంత్.. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తన పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతానని కూడా ప్రకటించారు. పార్టీ పేరును అనౌన్స్ చేశారు. కానీ అది ఇంకా పూర్తిస్థాయిలో రూపుదాల్చలేదు. ప్రస్తుతం రజనీ పార్టీ నిర్మాణ కార్యకలపాలను ఓ ప్రముఖునికి అప్పజెప్పారనే వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ క్రమంలో త్వరలోనే రజనీకాంత్ పేరు మీద ఓ టీవీ చానెల్‌ను కూడా ప్రారంభించబోతున్నారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రజనీ టీవీ పేరుతో ఓ ట్రేడ్ మార్క్‌ను కూడా రిజిస్టర్ చేయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాక ప్రస్తుతం ట్రేడ్ మార్క్ లోగోకు సంబంధించిన ఫోటో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇప్పటివరకూ ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక సమాచారం తెలియలేదు. ఇక సినిమాల విషయానికోస్తే రజనీకాంత్ నటించిన పేట్టా విడుదలకు సిద్ధంగా ఉంది. -
పండక్కి పేట లేనట్టే
రజనీకాంత్ సినిమా అంటే హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్, చెన్నైలోని టీ నగర్లో ఏకకాలంలో రిలీజ్ కావాల్సిందే. అది రజనీ క్రేజ్. అదేనండీ.. అక్కడా ఇక్కడా అన్ని ఏరియాల్లోనూ ఆయన బొమ్మ పడాల్సిందే. తమిళ, తెలుగు భాషల్లో రజనీకాంత్‌కి అంత క్రేజ్ ఉంది. ‘బాబా’ (2002) నుంచి దాదాపు రజనీకాంత్ ప్రతి సినిమా తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కావడం ఆనవాయితీ అయ్యింది. కానీ ఈసారి పండక్కి (సంక్రాంతికి) ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’) లేనట్టే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన చిత్రం ‘పేట్టా’. సన్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో త్రిష, సిమ్రాన్ కథానాయికలు. ఈ సినిమాను తమిళంలో పొంగల్‌కి రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ తెలుగులో సంక్రాంతికి ఈ చిత్రం విడుదలపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఆల్రెడీ సంక్రాంతి సీజన్‌కు బాలకృష్ణ ‘ఎన్టీఆర్: కథానాయకుడు’, రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’, వెంకటేశ్, వరుణ్‌తేజ్ ‘ఎఫ్2’(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చిత్రాలు రిలీజ్ కానున్నాయి. థియేటర్స్ ఇబ్బంది అవుతుందనో లేక మరేదైనా కారణమో కానీ ‘పేట’ను జనవరి 25 లేదా ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం తెలుగు ఆడియో గురువారం రిలీజ్ అయింది. కాగా ఈ చిత్రం తెలుగు విడుదల హక్కులు సి. కల్యాణ్ పొందారని వార్త వచ్చింది. అది నిజం కాదని కల్యాణ్ స్పష్టం చేశారు. -
‘పేట్ట’ తెలుగు రిలీజ్ ఎప్పుడు?
ఇటీవల 2.ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌స్టార్ రజనీకాంత్ షార్ట్ గ్యాప్‌లో మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. 2.ఓ ఆలస్యంగా రిలీజ్ కావటంతో కేవలవం రెండు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు రజనీ. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీ హీరోగా తెరకెక్కిన పేట్ట సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తెలుగు రిలీజ్‌పై మాత్రం అనుమానాలు ఏర్పడ్డాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంతవరకు తెలుగు వర్షన్ ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం ప్రారంభించలేదు. దీంతో తమిళ్‌తో పాటు తెలుగులోనూ పేట్ట రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ ఈ సినిమా తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్నారు. తెలుగులో యన్.టి.ఆర్, వినయ విధేయ రామ, ఎఫ్ 2 సినిమాలు సంక్రాంతి బరిలో పోటి పడుతున్నాయి. దీంతో పేట్ట టీం టాలీవుడ్లో రిలీజ్ ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రజనీ సరసన త్రిష, సిమ్రాన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహాలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
రాజకీయం లేదు
‘పేట్టా’తో కెరీర్లో 165 సినిమాలను కంప్లీట్ చేశారు రజనీకాంత్. ఇప్పుడు 166వ చిత్రం కోసం రెడీ అవుతున్నారాయన. ఈ చిత్రానికి ‘గజినీ, తుపాకీ, కత్తి’ చిత్రాల ఫేమ్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఇది పొలిటికల్ థ్రిల్లర్ మూవీ అని, రజనీ కెరీర్లో చివరి సినిమా అవుతుందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఇదే విషయమై మురుగదాస్‌ను అడగ్గా... ‘‘రజనీకాంత్‌గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో నేను చేయబోయేది పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కాదు. అన్ని రకాల ప్రేక్షకులను అలరించే మంచి మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుంది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్’’ అని స్పష్టం చేశారు. సో.. రజనీకాంత్ నెక్ట్స్ మూవీ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ కాదని క్లారిటీ వచ్చేసింది. ఇక ఇది రజనీకాంత్ కెరీర్లో చివరి మూవీ అవుతుందా? కాదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమాలో కథానాయికలుగా కాజల్ అగర్వాల్, కీర్తీ సురేశ్ పేర్లు తెరపైకి వచ్చాయి. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘కత్తి’ చిత్రంలో కాజల్, లేటెస్ట్ ‘సర్కార్’ చిత్రంలో కీర్తీ సురేశ్ కథానాయికలుగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి.. కాజల్, కీర్తీలో ఎవరో ఒకరు ఫిక్స్ అవుతారా? లేక మరో హీరోయిన్ ఎవరైనా తెరపైకి వస్తారా? వెయిట్ అండ్ సీ. -
తలైవా బర్త్‌డే గిఫ్ట్ : పేట్ట టీజర్
2.ఓ లాంటి ఘన విజయం తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పేట్ట. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించగా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఆడియోను రిలీజ్ చేసిన పేట్ట టీం.. తాజాగా రజనీ పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఒకటిన్నర నిడివితో రిలీజ్ చేసిన ఈ టీజర్లో పూర్తిగా రజనీ స్టైల్స్ లుక్ మాత్రమే రివీల్ చేశారు. అనిరుథ్ నేపథ్య సంగీతంలో పాటు కార్తీక్ టేకింగ్ సూపర్బ్ అనిపించేలా ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మరో రజనీ రారు
పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో కథానాయికగా కొనసాగుతున్నారు త్రిష. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె భాగమయ్యారు. మంచి అవార్డులనూ సొంతం చేసుకున్నారు. నటన పట్ల ఎంతో తపన, ఇష్టం, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే కానీ ఈ ఫీట్స్ సాధ్యం కావు. కానీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌లో ఉన్న క్వాలిటీస్లో తనకు పది శాతం ఉన్నా ఇంకా బెటర్‌గా ఉండేదాన్నని అంటున్నారు త్రిష. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట్టా’ చిత్రంలో నటించారు త్రిష. ఈ సినిమా ఆడియో వేడుక చెన్నైలో జరిగింది. అక్కడ త్రిష మాట్లాడుతూ– ‘‘కోలీవుడ్‌లో మరో రజనీకాంత్ రారు. ఆయనలో ఉన్న క్యాలిటీస్లో కనీసం పది శాతం నాలో ఉన్నా నేనూ ఇంకా బెటర్ పర్సన్ అయి ఉండేదాన్ని. ‘ఏదైనా పనికి ఒకసారి నువ్వు కమిట్ అయితే దాన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే తిరిగి వెళ్లాలి’ అని రజనీకాంత్‌గారు షూటింగ్ టైమ్‌లో చెప్పిన విషయం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది’’ అని పేర్కొన్నారు. విశేషం ఏంటంటే.. ‘పేట్టా’లో తొలిసారి రజనీకాంత్‌తో కలిసి నటించారు త్రిష. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘పేట్టా’ సినిమా టీజర్ ఈ రోజు ఉదయం 11గంటలకు రిలీజ్ కానుంది. -
చూడరా కాళీ ఆట
‘పాక్కదాన పోర ఇంద కాళీయోడ ఆట్టత్త...’ అంటూ డ్యాన్స్ చేస్తున్నారు రజనీకాంత్. అంటే ‘చూడబోతున్నావు కదా ఈ కాళీ ఆట..’ అని అర్థం. రజనీ లేటెస్ట్ చిత్రం ‘పేట్టా’లో టైటిల్ సాంగ్ ఇలానే స్టార్ట్ అవుతుంది. ‘మరణ మాస్...’ అనే పదాలతో సాగే ఈ మాస్ సాంగ్ విని రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సంగీత దర్శకుడు అనిరు«ద్ స్వరపరచిన ఈ మాస్ సాంగ్‌ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత రజనీకాంత్‌కు ఎస్పీబీ పాడిన పాట ఇది. ఈ పాటలో సూపర్‌స్టార్ సూపర్ ఎనర్జీతో స్టెప్పులేశారని చిత్రబృందం పేర్కొంది. కాగా, ఈ పాటలో కొన్ని లైన్స్‌ని మాత్రమే ఎస్పీబీ పాడారని కొందరు బాధపడుతున్నారు. రజనీ వీరాభిమానులైతే సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఎస్పీబీ స్పందిస్తూ– ‘‘చాలాకాలం తర్వాత రజనీకాంత్‌కి పాట పాడినందుకు ఆనందంగా ఉంది. ఈ పాటలో నా భాగం కొంత మాత్రమే. అయినా నాకేం ఇబ్బంది లేదు. ‘పేట్టా’ టీమ్ నా వాయిస్ కావాలనుకున్నారు. పాట పాడించటానికి నన్ను ఎన్నుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేట్టా’. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. త్రిషా, సిమ్రాన్ కథానాయికలు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో రజనీ రెండు గెటప్స్‌లో కనిపిస్తారు. -
మిస్టర్ సింగార్ సింగ్
విలక్షణ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘పేట్టా’ సినిమాతో సౌత్‌కు వస్తున్నారు. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘పేట్టా’ చిత్రాన్ని ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమాలో కీలక పాత్రలు చేసిన నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్‌సేతుపతి, బాబీ సింహా ఇలా ఒక్కొక్కరి లుక్‌ను విడుదల చేస్తున్నారు. ఇటీవల విజయ్‌సే తుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ లుక్స్‌ను రిలీజ్ చేశారు. జీతూ పాత్రలో విజయ్‌సేతుపతి నటించగా, సింగార్ సింగ్ పాత్రలో నవాజ్ కనిపిస్తారు. అలాగే ఈ సినిమాలోని ‘మరణ మాస్..’ అనే సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇప్పుడు ఈ సినిమాలోని మరో సాంగ్ ‘ఉల్లాలా...’ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ కానుంది. త్రిష, సిమ్రాన్, మేఘా ఆకాష్, మాళవికా మోహనన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. -
సూపర్ స్టార్ మరో సినిమాకు ఓకె చెప్పాడా..?
2.ఓ సినిమాతో సంచనాలు నమోదు చేస్తున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పేట్ట షూటింగ్ పూర్తి చేసిన రజనీ, మరో సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీ 166వ చిత్రం తెరకెక్కనుంది. విజయ్ హీరోగా సర్కార్ సినిమాతో కమర్షియల్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న మురుగదాస్ తొలిసారిగా రజనీ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న రజనీ, సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు చేసే మురుగదాస్ తోడైతే రజనీ పొలిటికల్ ఎంట్రీకి కూడా ప్లస్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. -
పొంగల్‌కు పేట్ట
ఈ నెలాఖరు నుంచి రజనీకాంత్ వారోత్సవాలు మొదలవుతున్నాయి. ఆయన అభిమానులకు పండగలే పండగలు. రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటన గురించి ఏమోగానీ, ఆయన సినీ అభిమానులకు మాత్రం ఇక ఖుషీనే. సూపర్‌స్టార్ నటించిన కాలా చిత్రం కాస్త నిరాశ పరచినా, దాన్ని మరపించేందుకు వరసుగా రెండు భారీ చిత్రాలు తెరపైకి వచ్చి పండగ వాతావరణాన్ని తీసుకురానున్నాయి. రజనీకాంత్, శంకర్ల కాంబినేషన్లో భారీ, బ్రహ్మాండ చిత్రం 2.ఓ ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. సూపర్‌స్టార్ నటించిన మరో చిత్రం పేట్ట కూడా వెనువెంటనే తెరపై సందడి చేయనుంది. యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ తెరకెక్కించిన ఇందులో రజనీకాంత్‌కు జంటగా నటి త్రిష, సిమ్రాన్ నటించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను యమ స్పీడ్‌గా జరుపుకుంటోంది. ఈ చిత్ర సింగిల్ ట్రాక్‌ను డిసెంబర్ 3న, రెండో సింగిల్‌ట్రాక్ పాటను అదే నెల 7న విడుదల చేయనున్నారు. ఇక చిత్ర ఆడియోను రజనీకాంత్ పుట్టినరోజు పురస్కరించుకుని డిసెంబర్ 9న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. పేట్ట చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుందని ఇంతకు ముందే చిత్ర వర్గాలు వెల్లడించినా, ఆ తరువాత చిత్రం వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. పేట్ట చిత్ర విడుదల పొంగల్‌కు ఖాయం అని తాజాగా చిత్ర దర్శకుడు స్పష్టం చేశారు. 2.ఓ విజువల్స్ ట్వీట్ అయితే పేట్ట రజనీ స్టైల్స్ ట్వీట్‌గా ఉంటుంది. దీంతో రజనీకాంత్ అభిమానులకు ఈ నెల 29 నుంచి పొంగల్ వరకూ పండగే పండగన్న మాట. -
ఈ నెలాఖరు నుంచి రజనీ వారోత్సవాలు
తమిళసినిమా: ఈ నెలాఖరు నుంచి రజనీకాంత్ వారోత్సవాలు మొదలవుతున్నాయి. ఆయన అభిమానులకు ఇక సినిమాల పండగే. ఒకవైపు రజనీ రాజకీయ ఆరంగేట్రం గురించి చర్చ జరుగుతుండగా.. మరోవైపు ఆయన సినిమాలు వరుసబెట్టి వస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. సూపర్‌స్టార్ నటించిన కాలా చిత్రం కాస్త నిరాశ పరచినా, దాన్ని మరిపించేందుకు వరుసగా రెండు భారీ చిత్రాలు వస్తున్నాయి. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో భారీ చిత్రం 2.వో.. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక, రజనీ మరో చిత్రం ‘పేట’ కూడా వెనువెంటనే వచ్చేందుదకు సిద్ధమవుతోంది. యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీకి జంటగా నటి త్రిష, సిమ్రాన్ నటించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను యమ స్పీడ్‌గా జరుపుకుంటోంది. ఈ చిత్ర సింగిల్ ట్రాక్‌ను డిసెంబర్ 3న, రెండో సింగిల్ ట్రాక్‌ను అదే నెల 7న విడుదల చేయనున్నారు. ఇక రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9న ఆడియో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ ట్విటర్లో వెల్లడించారు. ఈ సినిమా సంక్రాంతికి తెరపైకి రానుందని గతంలో చిత్రవర్గాలు వెల్లడించినా, ఆ తరువాత చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. పేట పొంగల్‌కు రావడం ఖాయమని తాజాగా కార్తీక్‌సుబ్బరాజు స్పష్టం చేశారు. 2.వో శంకర్ స్టైల్ విజువల్ ట్రీట్ అయితే పేట రజనీ స్టైల్ ట్రీట్‌గా ప్రేక్షకులను అలరించనుంది. మొత్తానికి రజనీ అభిమానులకు ఈ నెల 29 నుంచి పొంగల్ వరకు పండగే పండగన్న మాట. -
తలైవరిజమ్తో నింపాం
సరికొత్త ట్యూన్స్‌తో తమిళ ఇండస్ట్రీని డ్యాన్స్ చేయిస్తున్న సంగీత దర్శకుడు అనిరుద్. సినిమాలోని పాటలను తనదైన మేనరిజమ్‌తో మరో లెవల్‌కు తీసుకెళ్లే హీరో రజనీకాంత్. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘పేట్టా’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 9న విడుదల కానుంది. డిసెంబర్ 3న ఫస్ట్ సాంగ్, 7న రెండో సాంగ్, 9న మొత్తం ఆల్బమ్‌ను రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. ‘‘పేట్టా ఆల్బమ్‌తో తలైవరిజమ్ చూపిస్తాం. సిద్ధంగా ఉండండి’’ అని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ ఆరోగ్యం బాగాలేక చెన్నెలోని హాస్పిటల్లో జాయిన్ అయ్యారని కోలీవుడ్‌లో ఓ వార్త షికారు చేసింది. అయితే రజనీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. -
రజనీ ‘పేట్టా’ ఆడియో వస్తోంది!
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘2.ఓ’తో ఇంకొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల ముందకు రానున్నాడు. శంకర్ డైరెక్షన్లో రాబోతోన్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక దీని తరువాత రజనీ తదుపరి సినిమాను కూడా లైన్లో పెట్టేస్తున్నాడు. పిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రాబోతోన్న ‘పేట్టా’ చిత్రం ఆడియో రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. డిసెంబ ర్ 9న పాటలను విడుదలచేయనున్నట్లు ప్రకటించారు. సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. #PettaAudiofromDec9th The first single will be released on 3rd and second single on 7th!@rajinikanth @karthiksubbaraj @anirudhofficial @VijaySethuOffl @SimranbaggaOffc @Nawazuddin_S @SasikumarDir @trishtrashers pic.twitter.com/DzI1V2K58Z — Sun Pictures (@sunpictures) November 23, 2018 -
పొంగల్ పోరులో...
సినిమా రిలీజ్‌లకు ‘బెస్ట్ సీజన్స్’లో సంక్రాంతి ఒకటి. తెలుగువారికి సంక్రాంతి అంటే తమిళంలో ‘పొంగల్’. మూడు నాలుగు రోజుల స్కూల్ సెలవులను, ఆఫీస్ సెలవులను క్యాష్ చేసుకోవడానికి సరైన సమయం. వచ్చే ‘పొంగల్ పోరు’లో నిలిచేది ఎవరు? అనేది ఇప్పుడు తమిళనాడు కోడంబాక్కమ్ ఏరియాలో హాట్ టాపిక్. మనకు ఫిల్మ్ నగర్ అయితే.. అక్కడ కోడంబాక్కమ్ అన్నమాట. ఇక.. పొంగల్ సందడి గురించి తెలుసుకుందాం. 4 రోజుల ముందే పండగ పండగ స్టార్ట్ అవ్వడానికి 4 రోజులు ముందే ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు సూపర్ స్టార్ రజనీకాంత్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘పేట్టా’ చిత్రం జనవరి 10న విడుదల కానుందని సమాచారం. ‘బాషా’ (1995) సినిమా తర్వాత రజనీకాంత్ నటించిన ఏ సినిమా కూడా పొంగల్‌కి రిలీజ్ కాలేదు. అందుకే పొంగల్‌కి ‘పేట్టా’ అనగానే అభిమానుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి. ‘బాషా’ సినిమాలో రజనీకాంత్ రెండు క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. ‘పేట్టా’ సినిమాలో కూడా రజనీకాంత్‌కు చెందిన రెండు డిఫరెంట్ లుక్స్‌ను ఆల్రెడీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరి.. ‘బాషా’ రేంజ్లో ‘పేట్టా’ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందా? లేదా అని తెలియడానికి కాస్త టైమ్ ఉంది. ఇంకో విశేషం ఏంటంటే... దాదాపు 15ఏళ్లుగా ఇండస్ట్రీలో కథానాయికగా ఉన్న త్రిష కెరీర్లో తొలిసారి రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రమిది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తొలిసారి తమిళ సినిమాలో నటించారు. సిమ్రాన్, విజయ్ సేతుపతి, మాళవికా మోహనన్, మేఘా ఆకాష్, సనత్‌రెడ్డి, బాబీ సింహాలతో పాటు డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్ నటించిన ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ ఏడాది జూన్‌లో ‘కాలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్ ‘2.ఓ’ సినిమాతో ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మళ్లీ 45 రోజులకే థియేటర్స్‌లో కనిపించనుండటం విశేషం. సంక్రాంతికి ‘పేట్టా’గా వస్తున్నారు. జస్ట్ ఏడు నెలల్లో రజనీకాంత్ నటించిన మూడు సినిమాలు రావడం అంటే ఫ్యాన్స్‌కు పండగే కదా. తలైవర్ వర్సెస్ తల? అజిత్ ‘విశ్వాసం’ సినిమాతో పొంగల్‌కి రాబోతున్నారు. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నయనతార కథానాయిక. ‘వీరమ్, వేదాలం, వివేగమ్’ వంటి హిట్ మూవీస్ తర్వాత అజిత్–శివ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బట్టి అజిత్ ‘విశ్వాసం’ సినిమాలో డ్యూయల్ రోల్ చేశారని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మరి.. బాక్సాఫీస్ వద్ద తలైవర్ రజనీకాంత్‌తో తల అజిత్‌కు పోరు తప్పదా? అంటే అదేం లేదు అంటున్నాయి కోడంబాక్కమ్ వర్గాలు. ‘పేట్టా’ సినిమా జవనరి 10కి రిలీజ్ కానుందట. ‘విశ్వాసం’ చిత్రాన్ని జనవరి 14కి ప్లాన్ చేస్తున్నారు. సో.. 4 రోజులు గ్యాప్ ఉంది. ‘నో వార్’ అని జోస్యం చెబుతున్నారు. కానీ అధికారికంగా విడుదల తేదీని రెండు చిత్రవర్గాలూ ప్రకటించలేదు. అయితే రెండూ జనవరిలో విడుదలవ్వడం ఖాయం. ‘విశ్వాసం’లో అజిత్ రాజులా వస్తాను శింబు హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వందా రాజావాదాన్ వరువేన్’. తెలుగు హిట్ ‘అత్తారింటికి దారేది’ సినిమాకు ఇది రీమేక్. ఇందులో మేఘా ఆకాష్, కేథరిన్ కథానాయికలు. ఈ సినిమా కూడా పొంగల్ రేస్‌లో నిలిచింది. అయితే పేట్టా, విశ్వాసం సినిమాలు పొంగల్‌కి వస్తున్నాయి కాబట్టి ‘వందా రాజావాదాన్ వరువేన్’ సినిమా పొంగల్ తర్వాత రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ పొంగల్‌కి వరోమ్ (పొంగల్‌కి వస్తున్నాం) అని ఓ స్టేట్మెంట్ను రిలీజ్ చేశారు శింబు. అలాగే తన గురించి కోలీవుడ్‌లో వినిపిస్తున్న రెడ్ కార్డ్ (‘ఏఏఏ’ సినిమాకి సంబంధించిన సమస్యని ఉద్దేశించి) గురించి కూడా ఆందోళన చెందవద్దని కూడా ఆ స్టేట్మెంట్లో పేర్కొన్నారు శింబు. ‘వందా రాజావాదాన్ వరువేన్’లో శింబు బాలాజీ ఎల్కేజీ ఇంతకాలం హాస్యనటుడిగా వెండితెరపై ప్రేక్షకులను నవ్వించారు ఆర్జే బాలాజీ. ఇంతకు ముందు రేడియో జాకీగా వర్క్ చేశారు. ప్రస్తుతం ఆయన లీడ్ రోల్ చేస్తున్న సినిమా ‘ఎల్.కే.జీ’. టైటిల్ బట్టి ఇదేదో చిన్న పిల్లల సినిమా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది పొలిటికల్ సెటైరికల్ మూవీ. ఇందులో ప్రియా ఆనంద్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పొంగల్‌కి రిలీజ్ చేస్తున్నట్లు ఆర్జే బాలాజీ తెలిపారు. మరి... రజనీకాంత్, అజిత్, శింబు వంటి స్టార్స్ సినిమాలు వస్తున్న టైమ్‌లో బాలాజీ ‘ఎల్.కే.జీ’ వస్తే? రావాలంటే దమ్ముండాలి. సినిమా మీద బోలెడంత నమ్మకం ఉండాలి. ఈ చిత్రబృందానికి ఈ రెండూ ఉన్నట్లున్నాయి. అందుకే పొంగల్ పోరుకి రెడీ అవుతున్నారు. ‘ఎల్కేజీ’లో ఆర్జే బాలాజీ -
‘రజనీతో నేను.. నమ్మలేకపోతున్నా’
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పెట్ట. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. రజనీ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా సీనియర్ హీరోయిన్ సిమ్రన్ రజనీకాంత్ సరసన హీరోయిన్గా నటిస్తున్నారు. రజనీతో తాను ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియా పేజ్‌లో ట్వీట్ చేసిన సిమ్రన్ ‘నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. నన్ను నేను గిచ్చుకొని చూసుకున్నా’ అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నవాజుద్ధీన్ సిద్ధిఖీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. I'm super happy OMG I can't believe its happening just pinched myself 😊😊💃💃💃💃#PettaPongalParaak @rajinikanth @karthiksubbaraj @anirudhofficial @VijaySethuOffl @Nawazuddin_S @SasikumarDir @trishtrashers @sunpictures pic.twitter.com/0XzUDZEfZs — Simran (@SimranbaggaOffc) 14 November 2018 -
రజనీ ‘పేట్టా’ సంక్రాంతికి రావడం లేదు!
ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్.. యువ దర్శకులతో పనిచేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్న సంగతి తెలిసిందే. కబాలి, కాలా వంటి సినిమాలు యువదర్శకుడైన పా. రంజిత్ తెరకెక్కించగా... ప్రస్తుతం తలైవాతో కార్తీక్ సుబ్బరాజ్ ‘పేట్టా’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇటీవలె ఈ సినిమా షూట్‌ను కంప్లీట్ చేసింది చిత్రయూనిట్. ‘పేట్టా’ సినిమాలో సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మేఘా ఆకాష్, సతన్‌రెడ్డి, మాళవికా మోహనన్‌లతో పాటు డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, రజనీకాంత్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని టాక్. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలచేయాలని మేకర్స నిర్ణయించారు. సన్ పిక్చర్స్ సంస్థ ఇప్పటికే ‘2.ఓ’ను నవంబర్ 29న విడుదల చేసేందుకు రెడీ అవ్వగా.. మరీ అంత తక్కువ గ్యాప్‌తో ‘పేట్టా’ను తీసుకురావడానికి సుముఖంగా లేరని సమాచారం. అందుకే పేట్టాను సంక్రాంతి బరిలోంచి తప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌పై చిత్రబృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. -
ఒకే సీజన్లో ఇద్దరు టాప్ స్టార్స్
2019 పొంగల్‌కి రసవత్తరంగా మారనుంది. భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ మరింత వేడెక్కనుంది. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పేట్ట సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రజనీ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. అదే సమయంలో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్న విశ్వాసం సినిమాను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వివేగం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అజిత్ వీలైనంత త్వరగా విశ్వాసం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. రజనీ పేట్ట షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా విశ్వాసం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో రెండు సినిమాలో ఓకేసారి రిలీజ్ రెడీ అవ్వటం కన్ఫమ్ అంటున్నారు ఫ్యాన్స్. మరి ఇద్దరు ఒకేసారి బరిలో దిగుతారా. లేక ఎవరైన వెనక్కి తగ్గుతారా తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
దేవుడిలాంటి మంచి మనసు
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘పేట్టా’. ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్లో త్రిష కూడా జాయిన్ అయ్యారు. తొలిసారి రజనీతో నటిస్తున్నారు త్రిష. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో కాస్త గ్యాప్ దొరకడంతో రజనీ, త్రిష కలిసి వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లారు. ఆ టైమ్‌లో కెమెరా క్లిక్‌మనిపించిన ఓ పిక్‌ను షేర్ చేశారు త్రిష. ‘‘దేవుడి లాంటి మంచి మనసు ఉన్న రజనీకాంత్‌గారితో కలిసి కాశీ విశ్వనాథ దేవాలయానికి రావడం ఆనందంగా ఉంది’’ అనే కామెంట్ కూడా పెట్టారు త్రిష. ఇక ‘పేట్టా’ సినిమా విషయానికొస్తే... ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ, విజయ్‌సేతుపతి, డైరెక్టర్ మహేంద్రన్, డైరెక్టర్ శశి, సిమ్రాన్, మేఘా ఆకాష్, బాబీసింహా, సనత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రజనీ రెండు డిఫరెంట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుందని టాక్. -
ఇప్పుడు కో–స్టార్‌గా...
రజనీకాంత్ ‘పేట్టా’లోని తారాగణం రోజు రోజుకీ భారీగా మారుతోంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహాలు ఎంటరయ్యారు. తాజాగా ఈ టీమ్‌లోకి తమిళ దర్శకుడు మహేంద్రన్ కూడా జాయిన్ అయ్యారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పేట్టా’. రజనీకాంత్‌తో ‘ముల్లుమ్ మలరుమ్, జానీ’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన మహేంద్రన్ ఈ సినిమాలో మంచి పాత్ర పోషిస్తున్నారు. పదేళ్లుగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న మహేంద్రన్ విజయ్ ‘తేరీ’తో నటుడిగా ఇండస్ట్రీకు కమ్ బ్యాక్ ఇచ్చారు. అంతకుముందు ఆయన దర్శకుడిగా మాత్రమే చేసేవారు. కమ్‌బ్యాక్‌లో ఒకప్పుడు తాను సూపర్ హిట్ సినిమాలు తీసిన హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మహేంద్రన్‌కి ఓ కొత్త ఎక్స్పీరియన్స్. ప్రస్త్రుతం వారణాసీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. -
మార్కెట్లో మస్తీ
రజనీకాంత్ తన స్టైల్లో పాటలకు స్టెప్పులు వేస్తే థియేటర్స్‌లో అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవాల్సిందే. ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా కోసం కూడా ఇలాంటి స్టెప్స్ వారణాసిలో వేస్తున్నారట. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పేట్టా’. సిమ్రాన్, త్రిష కథానాయికలు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వారణాసిలో జరుగుతోంది. రీసెంట్గా ఫైట్ సీన్స్‌ను కంప్లీట్ చేసిన చిత్రబృందం తాజాగా రజనీకాంత్‌పై మార్కెట్ సెట్లో ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట. ఇది రజనీకాంత్ పరిచయ గీతం అని టాక్. ఈ పాటలో రజనీతో పాటు విజయ్ సేతుపతి కూడా ఉన్నారట. ఆల్రెడీ రిలీజ్ చేసిన లుక్స్‌లో రజనీ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు అని ఆయన ఫ్యాన్స్ పుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు షూటింగ్ స్పాట్లో ఫొటోలు లీక్ అవ్వడంతో చిత్రబృందం టెన్షన్ అవుతోంది. ‘ఈ ఫొటోలను షేర్ చేయొద్దు అని కోరుకుంటున్నాను. కొన్ని చానల్స్ ఈ షూటింగ్ వీడియోలు చూపించడం బాధాకర ం. కొన్ని రోజుల తర్వాత సినిమాని పైరసీ చేసేసి చానల్స్‌లో వేసేస్తారేమో’’ అని చిత్రదర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీత దర్శకుడు. -
అదిరింది తలైవా
రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పేట్టా’. సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్నారు. సన్‌పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అండ్ టైటిల్‌ను సెప్టెంబర్‌లో రిలీజ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా రజనీకాంత్ సెకండ్ లుక్‌ను గురువారం రిలీజ్ చేసి రజనీ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు టీమ్. ఫస్ట్ లుక్‌లో రజనీకాంత్ ఫుల్ మాస్‌గా కనిపిస్తే, సెకండ్ లుక్‌లో క్లాస్‌గా కనిపించారు. ఈ లుక్స్‌ని బట్టి సినిమాలోని రజనీకాంత్ క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయని అర్థం అవుతుంది. అలాగే సెకండ్ లుక్ 1980 కాలంనాటిదిగా ఉంది. అంటే ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోందా? అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం ‘పేట్టా’ సినిమా చిత్రీకరణ వారణాసిలో జరుగుతోందని సమాచారం. రజనీ, విజయ్‌సేతుపతి, త్రిషలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని కోలీవుడ్ టాక్. నవాజుద్ధీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, డైరెక్టర్ శశి, మేఘా ఆకాశ్, సనత్ రెడ్డి కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరు«ద్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఇక ఆ బాధ అక్కర్లేదు
‘‘రజనీకాంత్‌గారితో కలిసి నేనెప్పుడు పని చేస్తాననే ప్రశ్న నన్ను ఎంతకాలం నుంచో బాధపెడుతోంది. ఇక బాధపడక్కర్లేదు. ‘పేట్టా’ సినిమాలో ఆయనతో కలిసి సిల్వర్ స్క్రీన్ పంచుకునే అవకాశం నాకు దక్కింది. సోమవారం నుంచి వారణాసిలో జరిగే తాజా షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటాను’’ అన్నారు త్రిష. ఎందుకు ఇంతలా ఆమె భావోద్వేగానికి గురయ్యారంటే... త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు గడిచిపోయాయి. కానీ ఇప్పటివరకు రజనీకాంత్‌తో త్రిష కలిసి నటించలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆ అవకాశం వచ్చినందుకు ఆనందపడుతున్నారామె. అన్నట్లు.. ఈ చిత్రంలో సిమ్రాన్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అసలు సిమ్రాన్, త్రిష కాంబినేషన్ సన్నివేశాలు లేవట. దీన్నిబట్టి ఈ చిత్రం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ఓ కథానాయిక ఉంటారని ఊహించవచ్చు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధికీ, బాబీ సింహా, మేఘా ఆకాశ్, మాళవికా మోహనన్ కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
నవ్వు చెబుతోంది
అభిమాన తారలతో ఫొటోలో బందీ అయిపోవాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ అందరి కలలు నిజం కావు. అయితే కథానాయిక మేఘా ఆకాశ్ కల నిజమైంది. ఆమెకు ఎంతో ఇష్టమైన సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఫొటో దిగారు. ‘‘నా కల నిజమైంది. కొన్ని సార్లు నక్షత్రాలను అందుకునే అవకాశం వస్తుంది. నా ఆనందాన్ని నా నవ్వు చెబుతోంది’’ అంటూ ఇక్కడ ఉన్న ఫొటోను షేర్ చేశారు మేఘా ఆకాశ్. ఈ సంగతి ఇలా ఉంచితే... కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘పేట్టా’ సినిమాలో మేఘా ఆకాశ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోతో ఆ విషయం కన్ఫార్మ్ అయ్యిందని కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ సినిమాలో సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా తదితరులు నటిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుందట. -
అదే కొత్త సినిమా... అదే చివరి సినిమా?
ఇది గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా? అనే కన్ఫ్యూజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌కు స్టార్ట్ అయ్యింది. ఇంతకీ ఈ న్యూస్ ఏంటో తెలుసుకోవాలంటే ఇది మొత్తం చదవాల్సిందే. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ వార్తలు బాగా ఊపందుకున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘పేట్టా’ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తి కావొస్తుండటం, విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్కార్’ సినిమా విడుదలకు రెడీ అవ్వడమే ఇందుకు కారణాలని ఊహించవచ్చు. అంతేకాదు ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో స్టార్ట్ అవుతుందని టాక్. ‘పేట్టా, సర్కార్’ చిత్రాల నిర్మాణ బాధ్యతలను స్వీకరించిన సన్ పిక్చర్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుందట. అయితే మురుగదాస్ దర్శకత్వంలో నటించిన తర్వాత రజనీకాంత్ సినిమాలకు బై బై చెబుతారని, ఈ సినిమా స్క్రిప్ట్ కూడా రాజకీయాలకు దగ్గరగా ఉంటుందని కొందరి అంచనా. ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే లెక్కల పరంగా రజనీ కెరీర్లో ఇది 166వ సినిమా. అభిమాన హీరో ఎప్పటికీ సినిమాలు చేస్తుండాలని అభిమానులు కోరుకుంటారు. అందుకే కొత్త సినిమా గురించి వార్త వస్తే ఆనందపడతారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓకే అయిందని ఆనందపడాలో, ఇదే రజనీకాంత్‌కి చివరి సినిమా అవుతుందనే వార్తలకు బాధపడాలో తెలియని అయోమయంలో పడిపోయారట ఫ్యాన్స్. ఇక కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రజనీ తాజా చిత్రం ‘పేటా’్టలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, సిమ్రాన్, త్రిష తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరు«ద్ స్వరకర్త. మరోవైపు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా రూపొందిన ‘యందిరిన్’ (తెలుగులో ‘రోబో’) సీక్వెల్ 2.0 ఈ నవంబర్ 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
లీకైన సూపర్ స్టార్ సినిమా సీన్స్..!
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెట్ట’. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. భారీ సెక్యూరిటీ మధ్య చిత్రీకరణ జరుగుతున్నా.. ఈ సినిమాకు కూడా లీకుల బెడద తప్పటం లేదు. గతంలో సినిమాలో రజనీ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా లక్నోలో జరుగుతున్న షూటింగ్ లొకేషన్ నుంచి రెండు సీన్స్ కూడా లీకైనట్టుగా చిత్రయూనిట్ గుర్తించారు. దీంతో షూటింగ్ లోకేషన్లో సెక్యూరిటీని మరింత పెంచినట్టుగా తెలుస్తోంది. దాదాపు 500 మంది నటీనటులు సాంకేతిక నిపుణులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు.