
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పేట్టా’. త్రిష, సిమ్రాన్, విజయ్‌సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని... ‘పేట’ పేరుతో నిర్మాత వల్లభనేని అశోక్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
కాగా ఇటీవలే తమిళ ‘పేట్టా’ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో రజనీ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘చూడ్డానికి చిన్నపిల్లాడిలా చాలా స్టైల్‌గా ఉన్నారంటూ’ మేఘా ఆకాశ్ ఇచ్చిన కాంప్లిమెంట్‌కు.. ‘స్టైల్‌గా ఉన్నానట నాచురల్లీ’ అంటూ రజనీ తన మార్కు డైలాగ్‌తో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా కాలేజీ వార్డన్‌గా స్టైలిష్ లుక్‌లో మెరిసిన తలైవా... యాక్షన్ సీన్స్‌లో ఫుల్ టూ మాస్ డైలాగ్స్‌తో అదరగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment