
పేట సినిమాతో మరోసారి వింటేజ్ రజనీకాంత్‌ను గుర్తు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్, తన తదుపరి చిత్రంలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం పేట సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రజనీ, నెక్ట్స్ సినిమా మురుగదాస్ దర్శకత్వంలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సర్కార్ సినిమాతో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మురుగదాస్ కోసం మాస్ యాక్షన్ సినిమాను రెడీ చేస్తున్నాడు.
ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఎక్కువగా డాన్ తరహా పాత్రలు మాత్రమే చేస్తున్న రజనీ దాదాపు 30 ఏళ్ల తరువాత పోలీస్ డ్రెస్‌లో కనిపించనున్నారట. అంతేకాదు ఇది రజనీ చివరి చిత్రం అన్న ప్రచారం కూడా జరుగుతుండటంతో అభిమానులు మురుగదాస్, రజనీ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment