
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరో అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సౌత్ సినిమా వందకోట్ల మార్క్‌ను అందుకోవటమే కష్టమనుకుంటున్న సమయంలో ఏకంగా నాలుగు సినిమాలకు రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించాడు. రజనీ, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన విజువల్ వండర్ రోబో తొలిసారిగా 200 కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించింది.
తరువాత కబాలి, 2.ఓ సినిమాలతో అదే ఫీట్‌ను రిపీట్ చేసిన రజనీకాంత్, తాజాగా పేట సినిమాతోనూ మరోసారి 200 కోట్ల మార్క్‌ను అందుకున్నాడు. దీంతో నాలుగు 200 కోట్ల సినిమాలు ఉన్న సౌత్ స్టార్‌గా రజనీ రికార్డ్ సృష్టించాడు. 200 కోట్ల క్లబ్‌లో సౌత్ నుంచి ప్రభాస్, విజయ్, అజిత్, కమల్ హాసన్ లాంటి నటులున్నా ఈ క్లబ్‌లో నాలుగు సినిమాలున్న ఏకైక హీరో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంతే.
Comments
Please login to add a commentAdd a comment