కత్తులతో పొడుచుకున్న అభిమానులు.. పరిస్థితి విషమం | Rajinikanth And Ajith Kumar Fans War | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 10 2019 10:04 AM | Last Updated on Thu, Jan 10 2019 5:48 PM

Rajinikanth And Ajith Kumar Fans War - Sakshi

సంక్రాంతి పండుగ సీజన్‌ కావటంతో స్టార్‌ హీరోల సినిమాలు క్యూ కట్టాయి. బడా స్టార్స్‌ ఒకేసారి థియేటర్లలో సందడి చేస్తుండటంతో ఫ్యాన్స్‌ మధ్య గొడవలు మాటల యుద్ధాన్ని దాటి ప్రత్యక్ష దాడులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఇద్దరు టాప్ హీరోల సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పేట, అజిత్‌ ద్విపాత్రాభినయం చేసిన విశ్వాసం సినిమాలు ఈ రోజు(గురువారం) రిలీజ్‌ అయ్యాయి.

దీంతో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పలు చోట్ల ఫ్యాన్స్‌ ఘర్షణలకు దిగటంతో పరిస్థితి చేయిదాటిపోయింది. వేలూరులోని ఓ థియేటర్‌ ముందు ఇరువర్గాల అభిమానులు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. రెండు సినిమాలకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా.. అభిమానుల మాత్రం తమ హీరో గ్రేట్ అంటే తమ హీరో గ్రేట్‌ అంటూ దాడులకు తెగబడుతున్నారు.

అజిత్‌ అభిమానుల హల్‌చల్‌
తమ హీరో సినిమా విడుదల సందర్భంగా ధియేటర్ల దగ్గర అజిత్‌ అభిమానులు హల్‌చల్‌ చేశారు. తమ అభిమాన నటుడి సినిమా పాటలకు డాన్సులు చేస్తూ హంగామా సృష్టించారు. నాలుకపై కర్పూరం వెలిగించుకుని హారతులు పట్టారు.

ధనుష్‌తో కలిసి సినిమా చూసిన త్రిష
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పేట సినిమాను హీరోయిన్‌ త్రిష, హీరో ధనుష్‌, ఇతర ప్రముఖులు చెన్నైలోని ధియేటర్‌లో వీక్షించారు. తెలుగులో కూడా పేట సినిమా నేడు విడుదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement