
త్రిష, రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘పేట్టా’. ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో త్రిష కూడా జాయిన్ అయ్యారు. తొలిసారి రజనీతో నటిస్తున్నారు త్రిష. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో కాస్త గ్యాప్ దొరకడంతో రజనీ, త్రిష కలిసి వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లారు. ఆ టైమ్‌లో కెమెరా క్లిక్‌మనిపించిన ఓ పిక్‌ను షేర్ చేశారు త్రిష. ‘‘దేవుడి లాంటి మంచి మనసు ఉన్న రజనీకాంత్‌గారితో కలిసి కాశీ విశ్వనాథ దేవాలయానికి రావడం ఆనందంగా ఉంది’’ అనే కామెంట్ కూడా పెట్టారు త్రిష.
ఇక ‘పేట్టా’ సినిమా విషయానికొస్తే... ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ, విజయ్‌సేతుపతి, డైరెక్టర్ మహేంద్రన్, డైరెక్టర్ శశి, సిమ్రాన్, మేఘా ఆకాష్, బాబీసింహా, సనత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రజనీ రెండు డిఫరెంట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment