ఫ్యాన్స్‌నందు సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ వేరయా..! అనే విశేషం గురువారం ‘పేట’ సినిమా విడుదల సందర్భంగా చోటుచేసుకుంది. రజనీ సినిమా రిలీజ్ అంటే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆయన తమ అభిమాన సినీనటుడు మాత్రమే కాదు.. ‘అంతకు మించి’ అని నిరూపించారు ఓ జంట. అంబసు, కమాచి అనే యువతీ యువకులు ‘పేట’ సినిమా విడుదల సమయాన్నే అద్భుత ముహూర్తంగా ఖరారు చేసుకున్నారు. సినిమా విడుదల సమయానికే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరూ రజనీ వీరాభిమానులే కావడం మరో విశేషం.