రజనీ ‘పేట్టా’ సంక్రాంతికి రావడం లేదు! | Rajinikanth Petta Movie may be Postponed | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 12 2018 12:29 PM | Last Updated on Mon, Nov 12 2018 1:51 PM

Rajinikanth Petta Movie may be Postponed - Sakshi

ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. యువ దర్శకులతో పనిచేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్న సంగతి తెలిసిందే. కబాలి, కాలా వంటి సినిమాలు యువదర్శకుడైన పా. రంజిత్‌ తెరకెక్కించగా... ప్రస్తుతం తలైవాతో కార్తీక్‌ సుబ్బరాజ్‌ ‘పేట్టా’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇటీవలె ఈ సినిమా షూట్‌ను కంప్లీట్‌ చేసింది చిత్రయూనిట్‌. 

‘పేట్టా’ సినిమాలో సిమ్రాన్, త్రిష, విజయ్‌ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, మేఘా ఆకాష్, సతన్‌రెడ్డి, మాళవికా మోహనన్‌లతో పాటు డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, రజనీకాంత్‌ క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని టాక్‌.

అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలచేయాలని మేకర్స​ నిర్ణయించారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఇప్పటికే ‘2.ఓ’ను నవంబర్‌ 29న విడుదల చేసేందుకు రెడీ అవ్వగా.. మరీ అంత తక్కువ గ్యాప్‌తో ‘పేట్టా’ను తీసుకురావడానికి సుముఖంగా లేరని సమాచారం. అందుకే పేట్టాను సంక్రాంతి బరిలోంచి తప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌పై చిత్రబృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement