sun pictures
-
'జైలర్'కు ఏడాది.. మూడు భాగాలుగా మేకింగ్ వీడియోలతో ఫ్యాన్స్‌కు ట్రీట్
రజనీకాంత్ కథానాయకుడిగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్'. భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియాలో ఈ సినిమా అనేక రికార్డ్స్‌ను క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 620 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అంతటి విజయాన్ని అందుకున్న జైలర్ 2023 ఆగష్టు 10న విడుదలైంది. ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు మేకర్స్.జైలర్ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో సినిమా మేకింగ్ ప్రివ్యూ వీడియోను విడుదల చేసింది. జైలర్ సినిమా మేకింగ్ వీడియోను మూడు భాగాలుగా విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆగష్టు 12న మేకింగ్ వీడియో ప్రివ్యూను తన సోషల్ మీడియా పేజీలో విడుదల చేసింది. ఆపై ఆగష్టు 16న సన్ నెక్ట్స్ ఓటీటీ వేదికగా జైలర్ మేకింగ్ వీడియోను మూడు భాగాలుగా విడుదల చేయనున్నారు.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ చిత్రంలో రజనీకాంత్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ప్రస్తుతం రజనీకాంత్ దర్శకుడు T.S.జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వెట్టయన్' అనే కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. -
రాక్షసుడిలా 'రాయన్'.. అంచనాలు పెంచేసిన ట్రైలర్
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న 'రాయన్' నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.'రాయన్' ట్రైలర్‌తోనే ధనుష్ ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు రాయన్‌తో ఆయనలో దాగివున్న దర్శకత్వం టాలెంట్ అందరినీ మెప్పించేలా ఉంది. ట్రైలర్‌ను కూడా అందరినీ మెప్పించేలా కట్ చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జులై 26న రిలీజ్ కానుంది. -
టైగర్‌తో జైలర్.. సెట్ చేస్తున్న టాప్ డైరెక్టర్
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేసేందుకు కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీ భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది షారుఖ్ ఖాన్‌తో జవాన్ తీసి హిట్ కొట్టిన ఆయనకు బాలీవుడ్లో కూడా క్రేజ్ పెరిగింది. అయితే, ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఒక సినిమా తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ, ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో అట్లీ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.జవాన్ సినిమా తర్వాత మళ్లీ బాలీవుడ్లోనే ఒక భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు అట్లీ. ఈమేరకు వార్తలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్‌తో ఓ మల్టీస్టారర్ చేసేందుకు కథను కూడా ఆయన ఫిక్స్ చేశారట. అయితే, ఈ సినిమాలో సౌత్ ఇండియా టాప్ హీరోను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కథలో కీలకంగా ఉండే ఆ పాత్ర కోసం రజనీకాంత్‌ను ఎంపిక చేస్తే బాగుంటుందని అట్లీ కోరుతున్నాడట. ప్రస్తుతం ఈ విషయం గురించి రజనీతో కూడా ఆయన చర్చలు జరిపినట్లు తెలిసింది. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను దృష్టిలో పెట్టుకొని అట్లీ కథను రెడీ చేశారట. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయట. వచ్చే ఏడాదిలో సినిమాని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ ‘సికందర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడు. రజనీకాంత్ నటించిన 'వేట్టయాన్' విడుదలకు సిద్ధంగా ఉంటే.. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రానున్న 'కూలీ' చిత్రీకరణ ప్రారంభించుకోవాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ల తర్వాత అట్లీ సినిమా ప్రారంభం అవుతుందని సమాచారం. -
ప్రముఖ నిర్మాణ సంస్థకు ఇళయరాజా నోటీసులు.. అసలేం జరిగిందంటే?
ఇటీవల కాలంలో ప్రముఖ సంగీ త దర్శకుడు ఇళయరాజా వ్యవహారం వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. తాను సంగీతం అందించిన పాటలకు చెందిన సర్వహక్కులు తనవే అన్నట్లు ఆయన వ్యవహార ధోరణిని తప్పుబడుతున్నారు. తాజాగా నటుడు రజనీకాంత్ చిత్ర నిర్మాతకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు జారీ చేశారు. దీనికి రజనీకాంత్ ఎలా స్పందించారో తెలుసా?రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చి త్రం వేట్టైయాన్. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో రజనీకాంత్ తాను 151వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సీన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు దర్శకుడు ఇంతకు ముందే తెలిపారు. కాగా దీనికి కూలీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశా రు.కాగా ఇందులో డిస్కో డిస్కో అనే పాట చోటు చేసుకుంటుందట. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఈ పాటకు ఇంతకు ముందు రజినీకాంత్ హీరోగా నటించిన తంగమగన్ చిత్రానికి తాను రూపొందించిన వావా పక్కమ్ వా పాట ట్యూన్‌నే మార్చి రూపొందించారని.. అందుకు తన అనుమతి తీసుకోలేదని ఇళయరాజా సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు పంపారు. కాగా వేట్టైయాన్ చిత్రం కోసం ముంబాయి వెళ్లిన రజనీకాంత్ శనివారం చెన్నైకు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో ఇళయరాజా నోటీసుల వ్యవహారం గురించి పాత్రికేయులు రజనీకాంత్‌ను ప్రశ్నించగా.. అది చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజాకు సంబంధించిన సమస్య అని ఆయన పేర్కొన్నారు. -
'జైలర్' ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అదిరిపోయే టైటిల్‌తో సీక్వెల్
రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్'. అప్పటి వరకు హిట్ సినిమాలు లేని రజనీకాంత్‌కు జైలర్‌తో మంచి విజయాన్ని అందుకున్నారు. గతేడాది అగష్టులో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. నిర్మాతకు కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ వార్త వైరల్ అవుతుంది. జైలర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ పనులను డైరెక్టర్ ప్రారంభించారట. 'హుకుమ్' పేరుతో పార్ట్ 2 పనులను ఆయన మొదలుపెట్టేశారట. ఈ జూన్‌లో ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా ఆయన స్టార్ట్ చేయబోతున్నారని టాక్ ఉంది. #Jailer2, #Hukum హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్‌మీడియాలో ఈ వార్త ట్రెండ్ అవుతుంది. దీంతో జైలర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రజనీకాంత్ ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు ఏప్రిల్ 22న టైటిల్ ఖరారు కానుంది. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరోవైపు టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వేట్టయాన్' చిత్రాన్ని కూడా రజనీ పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. జైలర్‌లో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, మలయాళ నటుడు మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మిర్నా మేనన్, యోగిబాబు కీలక పాత్రలలో మెప్పించారు. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీ హీరోయిజానికి ఫ్యాన్స్ ఫిదా అయితే.. వర్మన్‌గా వినాయకన్ విలనిజానికి కూడా అదే రేంజ్లో విజిల్స్ పడ్డాయి. జైలర్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. HUKUM... TIGER KA #HUKUM 🔥😎 Morattu excited for the re-entry of the character & combo 💥#Jailer2 #Vettaiyan #Thalaivar171 #ThalaivarNirandharam pic.twitter.com/VTdJI7leXq https://t.co/gBS4XMgze8 — Shreyas Srinivasan (@ShreyasS_) April 12, 2024 -
తగ్గేదే లే అంటున్న సన్ పిక్చర్స్.. అజిత్‌కు ఎన్ని వందల కోట్లంటే?
ఆ మధ్య వరుసగా చిత్రాలు నిర్మించి చేతులు కాలడంతో కొంతకాలం చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న సన్ పిక్చర్స్ సంస్థ ఇప్పుడు సత్తా చాటుతోంది. గతంలో రజనీకాంత్ కథానాయకుడిగా నిర్మించిన అన్నాత్తే చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విజయ్ కథానాయకుడిగా బీస్ట్ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం సేమ్ టు సేమ్ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అయితే ఘన విజయాన్ని మాత్రం సాధించలేదు. ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో నిర్మించిన జైలర్ చిత్రం సంచలన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు తగ్గేదే లే అన్నట్లుగా వరుసగా చిత్రాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం ధనుష్ కథానాయకుడిగా ఆయన 50వ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ క్రేజీ కాంబినేషన్లో ఓ చిత్రం ఉండబోతుందని అధికారికంగా ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం అజిత్‌తోనూ ఓ సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో నటించడానికిగానూ ఆయనకు ఏకంగా రూ.150 కోట్లు పారితోషికం ఇవ్వడానికి ఆఫర్ ఇచ్చినట్లు టాక్. ఇప్పటివరకు అంతపెద్ద మొత్తంలో పారితోషికాన్ని నటుడు రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్ మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో సన్ పిక్చర్స్ ఆఫర్‌కు అజిత్ ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈయన విడాముయిర్చి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షనన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. దీని తర్వాత ఆయన తన 63వ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థకు చేసే అవకాశం ఉంది. చదవండి: పూజలు, మొక్కులు పెళ్లి కోసమేనా..? .. అనుష్క ఆన్సర్ ఇదే! -
రజనీ 171 షురూ
ఏడు పదుల వయసులో జోరుగా సినిమా తర్వాత సినిమా చేస్తున్నారు రజనీకాంత్. ఇటీవల విడుదలైన రజనీ 169వ చిత్రం ‘జైలర్’ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. 170వ చిత్రాన్ని ‘జై భీమ్’ ఫేమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో చేయనున్నారు. సోమవారం రజనీకాంత్ 171వ సినిమా ప్రకటన వెల్లడైంది. రజనీతో ‘జైలర్’ని నిర్మించిన సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. గత ఏడాది కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి, ప్రస్తుతం విజయ్ హీరోగా ‘లియో’కి దర్శకత్వం వహిస్తున్న లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శ కత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, ఫైట్స్: అన్బు–అరివు. -
రజనీకాంత్ 171 సినిమా ప్రకటన.. డైరెక్టర్ ఎవరంటే?
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ప్రకటన వచ్చేసింది. తన 171 చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నట్లు అదికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తన X వెబ్సైట్లో ప్రచురించింది. సన్ పిక్చర్స్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్ పూర్తి.. అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం) సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహింస్తుండటంతో ఒక్కసారిగా భారీ అంచనాలు పెరిగిపోయాయి. కార్తీతో ఖైదీ, విజయ్‌తో మాస్టర్, కమల్ హసన్‌తో విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన డైరెక్ట్ చేసిన విషయం తెలిసందే. విక్రమ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఆయనకు రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. అలాగే ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఆధ్వర్యంలో రజనీకాంత్ 170వ చిత్రం జైలర్ ఆగస్టు 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టింది. జైలర్ విజయాన్ని పురస్కరించుకుని, సన్ పిక్చర్స్ చైర్మన్ కళానిధి మారన్, రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్‌లకు చెక్‌తో పాటు కార్లను బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత సినిమాలో పనిచేసిన 300 మందికి జైలర్ పేరుతో బంగారు నాణేన్ని బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంలో, సూపర్ స్టార్ రజనీకాంత్ 171 చిత్రాన్ని సన్ పిక్చర్స్ 'తలైవర్ 171' గా నిర్మించబోతున్నట్లు చిత్ర సంస్థ X వెబ్సైట్లో అధికారిక సమాచారాన్ని పోస్ట్ చేసింది. #Thalaivar171 అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. We are happy to announce Superstar @rajinikanth’s #Thalaivar171 Written & Directed by @Dir_Lokesh An @anirudhofficial musical Action by @anbariv pic.twitter.com/fNGCUZq1xi — Sun Pictures (@sunpictures) September 11, 2023 -
ఉపాసన తాతగారికి రూ.కోటి చెక్ అందించిన ‘జైలర్’ నిర్మాత
సూపర్ స్టార్ రజనీకాంత్ ఖాతాలో చాలా కాలం తర్వాత ‘జైలర్’తో ఓ హిట్ పడింది. అది ఆషామాషీ హిట్ కాదు.. ఇటీవల కాలంలో తమిళ్లో ఇలాంటి విజయం సాధించిన సినిమానే లేదు. ఆగస్ట్ 10న విడుదలైన ఈ చిత్రం.. నెల రోజులు పూర్తికాకముందే ప్రపంచ వ్యాప్తంగా రూ.700 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టి..సూపర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన చిత్రమిది. వాస్తవానికి ఈ స్థాయి విజయాన్ని ఈ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా ఊహించలేదు. ప్రిరిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువగా వసూళ్లు వచ్చాయట. అందుకే చిత్ర నిర్మాత కళానిధి మారన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. లాభాల్లోని కొంత భాగాన్ని హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్‌కి పంచేశారు. అంతటితో ఆగకుండా ఖరీదైన కార్లను గిఫ్ట్‌గా అందించారు. జైలర్ విజయంలో కీలక పాత్ర వహించింది ఈ ముగ్గురే కాబట్టి..వారికి లాభాల్లోని కొంత మొత్తం ఇవ్వాల్సిందేనని నిర్మాత ఇలా చేశారట. కేవలం చిత్రబృందానికే కాకుండా లాభాల్లోని కొంత డబ్బును సామాజిక సేవ చేయడానికి ఉపయోగించాలని నిర్మాత కళానిధి మారన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా అపోలో హాస్పిటల్స్‌కు రూ.కోటి చెక్ ఇచ్చారు. సన్ పిక్చర్స్ తరఫున నిర్మాత కళానిధి మారన్ భార్య కావేరి.. మంగళవారం అపోలో హాస్పిటల్స్ చైర్మన్, ఉపాసన కొణిదెల తాతయ్య డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డిని కలిసి కోటి రూపాయల చెక్ అందజేశారు. 100 మంది నిరుపేద పిల్లలకు గుండె శస్త్ర చికిత్సల కోసం ఆ డబ్బును అందించారట. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ సంస్థ ట్విటర్ ద్వారా తెలియజేసింది. సన్ పిక్చర్స్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమాల్లో వచ్చిన లాభాలను ఇలాంటి మంచి పనులకు ఉపయోగించడం గొప్ప విషయమని కామెంట్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని హిట్ చిత్రాలను నిర్మించి, లాభాల్లో కొంత మొత్తాన్ని ఇలా సామాజిక సేవకు ఉపయోగించాలని కోరుకుంటున్నారు. On behalf of Sun Pictures, Mrs. Kavery Kalanithi handed over a cheque for Rs.1 Crore to Dr. Prathap Reddy, Chairman, Apollo Hospitals, towards heart surgery for 100 under privileged children. #Jailer #JailerSuccessCelebrations pic.twitter.com/o5mgDe1IWU — Sun Pictures (@sunpictures) September 5, 2023 -
జైలర్ డైరెక్టర్‌కు జాక్‌పాట్.. చెక్, కోట్ల ఖరీదు చేసే లగ్జరీ కారు!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా భాటియా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్ని చోట్ల మంచి వసూళ్లు రాబట్టింది. విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. జైలర్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.650 కోట్లు దాటింది. (ఇది చదవండి: వారి కోసం ఉపాసన కీలక నిర్ణయం.. !) కోలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన 'పొన్నియన్ సెల్వన్', కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' చిత్రాల కలెక్షన్లను 'జైలర్' బీట్ చేసింది. ఈ మూవీ ఘనవిజయంతో చిత్రబృందం ఫుల్ ఖుషీలో ఉన్నారు. కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత హీరో రజినీకాంత్‌తో పాటు డైరెక్టర్ దిలీప్ కుమార్‌కు వాటాతో పాటు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. భారీ హిట్ కావడంతో ఫుల్ ఖుషీగా ఉన్న సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ తాజాగా దిలీప్ కుమార్‌కు సైతం కోట్ల విలువ చేసే ఖరీదైన లగ్జరీ కారును బహుకరించారు. దీంతో పాటు చెక్‌ను కూడా అందజేశారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. ఇప్పటికే తలైవాకు రూ.100 కోట్ల చెక్‌తో పాటు బీఎండబ్లూ కారును కూడా అందజేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ చిత్రంలో రమ్యకృష్ణ, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, టైగర్ ష్రాఫ్, సునీల్, వినాయకన్, వసంత్ రవి, మర్నా, యోగి బాబు, జాఫర్ సాదిక్ కీలక పాత్రల్లో నటించారు. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు. (ఇది చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి చెక్‌తో పాటు మరో సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత!) Mr.Kalanithi Maran congratulated @Nelsondilpkumar and handed over a cheque to him, celebrating the Mega Blockbuster #Jailer #JailerSuccessCelebrations pic.twitter.com/b6TGnGaFd6 — Sun Pictures (@sunpictures) September 1, 2023 -
హాఫ్ సెంచరీ కొట్టేందుకు ధనుష్ రెడీ.. ఈసారి స్పెషల్ అదే!
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. ఆయన తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా నటుడు, గాయకుడు, నిర్మాత, దర్శకుడు ఇలా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. అలా నటుడిగా 50 చిత్రానికి రెడీ అయిపోయారు. ఇటీవలే తన 49వ చిత్రం కెప్టెన్ మిల్లర్ షూటింగ్ పూర్తి చేసిన ధనుష్ తాజాగా మరో చిత్రానికి సిద్ధమయ్యారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ బుధవారం లాంఛనంగా ప్రారంభమైనట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. (ఇది చదవండి: 'సలార్' టీజర్ ఓకే.. కానీ డైరెక్టర్ని ఓ విషయంలో మెచ్చుకోవాలి!) ఆ పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా ఇందులో కథానాయకుడిగా నటిస్తున్న నటుడు ధనుష్ తనే దర్శకత్వం వహించనుండడం మరో విశేషం. నటుడు ఎస్జే సూర్య ప్రధాన పాత్రను పోషిస్తున్న ఇందులో నటి అపర్ణ బాలమురళి, నటుడు విష్ణు విశాల్, సందీప్ కిషన్, నటి దుషార విజయన్ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఇందులో ధనుష్ సరసన నటి అమలాపాల్ నటించనున్నట్లు సమాచారం. ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్స్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. (ఇది చదవండి: ఆలయంలో ప్రేమికులు చేసిన పనిని సమర్థించిన నటి) #D50 #DD2 Shoot begins @sunpictures Om Namashivaya pic.twitter.com/DP1g3rO1y5 — Dhanush (@dhanushkraja) July 5, 2023 -
ధనుష్ సరసన త్రిష?.. ఆమె పాత్ర ఇదేనా?
ధనుష్ సరసన త్రిష నటించనున్నారా? అంటే అవుననే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ధనుష్ కెరీర్‌లోని 50వ సినిమాను సన్‌పిక్చర్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు ధనుష్ స్వీయ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకే త్రిషను సంప్రదించిందట చిత్రంయూనిట్. కథ విన్న త్రిష కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసేందుకు సుముఖంగానే ఉన్నారట. ఇదిలా ఉంటే... 2016లో వచ్చిన ‘కొడి’(తెలుగులో ‘ధర్మయోగి’) చిత్రంలో ధనుష్‌కు జోడీగా త్రిష కనిపించారు. అయితే ఈ చిత్రంలో త్రిష పాత్ర కాస్త నెగటివ్ టచ్‌తో ఉంటుంది. మరి..ధనుష్‌తో మరోసారి త్రిష స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. -
‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2’ కోసం రజనీకాంత్ సినిమా వాయిదా?
వెండితెరపై ‘జైలర్’ రాక ఏప్రిల్ నుంచి ఆగస్టుకు మారిందా? అంటే అవునంటోంది కోలీవుడ్. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జైలర్’. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సన్నాహాలు చేస్తోందనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆగస్టులో రిలీజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2’ (ఏప్రిల్ 28 విడుదల) బాక్సాఫీస్ వసూళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేలా ‘జైలర్’ టీమ్ స్నేహపూర్వకంగా ఏప్రిల్ రిలీజ్‌ను వాయిదా వేసుకుందని కోలీవుడ్ టాక్. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
మైల్స్టోన్ దిశగా హీరో ధనుష్.. 50వ సినిమా ఫిక్స్
తమిళసినిమా: ఆరంభంలోనే తుళ్లువదో ఇళమై అనే చిన్న చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన నటుడు ధనుష్. ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ వరకు ఎదిగారు. టాలీవుడ్‌నూ వదల్లేదు. తెలుగులో ధనుష్ నటించిన వాత్తి అనే ద్విభాషా చిత్రం (తెలుగులో సార్ పేరుతో) త్వరలో విడుదలకు ముస్తాబవుతుంది. అదే విధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో చిత్రం కూడా కమిట్ అయ్యారు. తాజాగా తిరుచ్చిట్రం ఫలం చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. కాగా ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి ఈ చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. కాగా ధనుష్ తాజాగా ఓ మైల్‌స్టోన్‌ను టచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అదే తన 50వ చిత్రం. ఇంతకు ముందు తిరుచ్చిట్రం ఫలం చిత్రాన్ని నిర్మించిన సన్‌పిక్చర్స్ సంస్థనే ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మించనుంది. ఇంతకు ముందు రజనీకాంత్ కథానాయకుడిగా అన్నాత్తే చిత్రాన్ని నిర్మించిన ఈ సంస్థ ప్రస్తుతం అదే రజనీకాంత్ హీరోగా జైలర్ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, తెలుగు నటుడు సునీల్, నటి రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అతిథి పాత్రలో మెరవనున్నారు. చదవండి: ట్రోల్స్‌పై స్పందించిన గోపీచంద్ మలినేని నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. మిగతా షూటింగ్ ఏప్రిల్ నెలాఖరుకి పూర్తి చేసి చిత్రాన్ని ఆగస్టులో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా తదుపరి సన్ పిక్చర్స్ సంస్థ ధనుష్ హీరోగా నటించే చిత్రాన్ని నిర్మించనుంది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర నటీనటులు సాంకేతిక వర్గం వంటి వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. -
సూర్య 'ఈటీ' మూవీ వచ్చేది అప్పుడే.. మేకర్స్ కొత్త ప్రకటన
Suriya Etharkkum Thunindhavan Movie Release Date Announced: కోలీవుడ్ స్టార్ సూర్యకు అటు తమిళ్ ఇటు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్‌లో అదరగొడుతుంటాడు. కథ విభిన్నంగా ఉంటే చేసేందుకు అస్సలు వెనకాడడు. అందుకే ఈ తమిళ హీరో అంటే టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్. ఇటీవల 'జైభీమ్', 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు సూర్య. ఈ చిత్రాల తర్వాత సూర్య చేస్తున్న మూవీ 'ఈటీ' (ఎతర్క్కుమ్ తునిందవన్) అని తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. అయితే తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. మార్చి 10న 'ఈటీ' మూవీని రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ సందడి చేయనుంది. ఇంతకుముందు 'ఈటీ'ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది చిత్రబృందం. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో సూర్యకు జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. #EtharkkumThunindhavan is releasing on March 10th, 2022! See you soon in theatres!@Suriya_offl @pandiraj_dir #Sathyaraj @immancomposer @RathnaveluDop @priyankaamohan @sooriofficial #ETfromMarch10 #ET pic.twitter.com/HPJ9cYw9Eh — Sun Pictures (@sunpictures) February 1, 2022 -
ముగ్గురు భామలతో ధనుష్ రొమాన్స్!
తమిళ సినిమా: వరుస సినిమాలతో దూసుకెళ్తున్న హీరో ధనుష్.. తాజాగా మరో చిత్రాన్ని ప్రారంభించాడు. సన్ పిక్చర్స్ సంస్థలో కథానాయుడికిగా నటించేందుకు ధనుష్ సిద్ధం అవుతున్నా రు. జవహర్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్‌కు జంటగా రాశీఖన్నా, ప్రియ భవాని శంకర్, నిత్యామీనన్ నటిస్తున్నారు. దర్శకుడు భారతీరాజా, ప్రకాశ్‌రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చెన్నైలో గురువారం షూటింగ్ పూజా కార్యక్రమం ప్రారంభమైంది. -
దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది: పూజా హెగ్డే
దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది హీరోయిన్ పూజా హెగ్డే తమిళ సినిమా చేసి. మిస్కిన్ దర్శకత్వంలో జీవా హీరోగా నటించిన తమిళ చిత్రం ‘ముగముడి’ (2018) (తెలుగులో ‘మాస్క్’గా అనువాదమైంది) తర్వాత పూజా మరో తమిళ సినిమాలో నటించలేదు. ఇప్పుడు ఓ సినిమాకి సైన్ చేశారు. నెల్సన్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనున్నారు. ‘స్వాగతం పూజా’ అంటూ బుధవారం ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మార్చి రెండో వారంలో పూజా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఇక పూజా హెగ్డే తెలుగులో నటించిన ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హిందీలో రణ్‌వీర్‌సింగ్ ‘సర్కస్’, సల్మాన్ ఖాన్ ‘కబీ ఈద్ కబీ దీవాళి’ సినిమాల్లో పూజ నటిస్తోంది. ఇలా ఉత్తర, దక్షిణ సినీ పరిశ్రమలను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ గ్రాఫ్‌ను పెంచేసుకుంటున్నారు పూజా హెగ్డే. -
తలపతి తదుపరి చిత్ర దర్శకుడు నెల్సన్
చెన్నె : కోలీవుడ్ సూపర్‌స్టార్ తళపతి విజయ్ నటించనున్న 65 వ చిత్రానికి దర్శకుడు ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రతిష్టాత్మక చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహించనున్నట్లు సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మొదటి చిత్రం ‘కొలమావు కోకిల’తో హిట్ కొట్టిన దర్శకుడు నెల్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈచిత్రంలో విజయ్ జోడిగా నయనతార నటించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కె చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ బాణీలు సమకుర్చనున్నాడు. కాగా చిత్ర దర్శకుడు నెల్సన్ సినిమాకి సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. నా తదుపరి చిత్రం విజయ్‌తో చేస్తున్నందకు చాలా సంతోషంగా ఉందని.. ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైన్‌ర్‌గా ఉండబోతుందని తెలిపారు. ప్రస్తుతం విజయ్ నటించిన మాస్టర్ చిత్రం 2021 సంక్రాతికి విడుదలకు సిద్ధంగా ఉంది. -
అన్నయ్య ఆలస్యంగా వస్తాడు
అనుకున్న సమయానికి అన్నయ్య రాడట. ‘అయినా ఫర్వాలేదు.. మా అన్నయ్య లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తాడు’ అని తమ్ముళ్లు (ఫ్యాన్స్) అంటున్నారు. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో గత ఏడాది చివర్లో ఓ సినిమా ఆరంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రానికి ‘అన్నాత్తే’ అని టైటిల్ పెట్టినట్లు ప్రకటించారు. అంటే.. ‘అన్నయ్య’ అని అర్థం. 2021 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నామని చిత్రనిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తెలిపింది. అయితే లాక్డౌన్ ముందు వరకూ జరిపిన షెడ్యూల్స్‌లో 50 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయింది. లాక్డౌన్ కారణంగా షూటింగ్‌కి అంతరాయం ఏర్పడింది. వచ్చే నెల కానీ మరో రెండు నెలల తర్వాత కానీ షూటింగ్ మొదలుపెట్టినా సంక్రాంతి లోపు పూర్తి చేయడం కష్టం అని చిత్రబృందం భావిస్తోందట. అందుకని విడుదలను వాయిదా వేయాలనుకుంటున్నారని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: డి. ఇమ్మాన్, కెమెరా: వెట్రి. -
కొబ్బరికాయ కొట్టారు
కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు రజనీకాంత్. శివ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో రజనీ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో నటించనున్నారు. కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా ముహూర్తం బుధవారం జరిగింది. 28 ఏళ్ల తర్వాత రజనీకాంత్ సినిమాలో ఖుష్బూ నటించనుండటం విశేషం. అలాగే ఖుష్భూ తమిళ సినిమాలో కనిపించి దాదాపు పదేళ్లు కావస్తోంది. ఈ నెల రెండోవారంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. -
రజనీ సినిమాలో వారిద్దరూ!
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం దర్బార్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి పాటను ఇటీవలే విడుదల చేయగా.. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రజనీ తదుపరి చిత్రం తలైవార్ 168 సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్తలు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. రజనీ తదుపరి సినిమాను తామే నిర్మిస్తున్నామని సన్ పిక్చర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంతిరన్, పేట వంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత ఈ కాంబినేషనన్లో రూపొందనున్న తలైవార్ 168కు శివ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ చిత్రంలో సీనియర్ నటి మీనా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాదు గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో రజనీ కూతురుగా కీర్తి సురేష్, భార్యగా ఖుష్బూ నటించనున్నారంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి. అయితే మూవీ యూనిట్ మాత్రం ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. రెండు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైన చిత్రబృందం.. కమెడియన్ సూరి మాత్రం రజనీతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నట్లు పేర్కొంది. ఈ విషయం గురించి సూరి మాట్లాడుతూ... రజనీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న తన కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశాడు. సూపర్‌స్టార్‌తో ఇంతవరకు సెల్ఫీ తీసుకునే అవకాశం రాలేదని.. ఇప్పుడు ఆయన పక్కన కనిపించే అదృష్టం వరించిందంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. ఇక రజనీ- మీనా కాంబినేషన్లో తెరకెక్కిన ముత్తు సినిమా హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా కథానాయకుడు సినిమాలోనూ వీరిద్దరూ తెరను పంచుకున్నారు. -
రజనీకాంత్ ‘వ్యూహం’ ఫలించేనా!?
తమిళసినిమా: రజనీకాంత్ ఈ ఐదక్షరాల పేరు ఆలిండియా లెవల్లోనే ఒక అద్భుతం. రజనీ సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ఫ్యాన్స్ సెలబ్రేషన్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. అలాంటి రజనీ త్వరలోనే మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాలాకాలం తరువాత ఆయన పోలీసు ఆఫీసర్‌గా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న చిత్రం దర్బార్.. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ అదుర్స్ అనిపించింది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తనదైన స్టైల్లో చెక్కుతున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, రజనీకాంత్ నటించబోయే మరో కొత్త సినిమాకు కూడా రంగం సిద్ధమైంది. దర్శకుడు శివ డైరెక్షన్లో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మింస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ప్రస్తుతం పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్‌స్టార్ రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుందని, ఈ సినిమా కోసం ఒక టైటిల్ కూడా పరిశీలనలో ఉందని టాక్ స్ప్రెడ్ అయ్యింది. దర్శకుడు శివకు ‘వీ’ సెంటిమెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు అజిత్ హీరోగా చేసిన నాలుగు చిత్రాల టైటిల్స్ వీతోనే మొదలయ్యాయి. వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం ఇలా శివ ‘వీ’ టైటిల్ చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో చేసే చిత్రానికి ‘వీ’ సెంటిమెంట్ కలిసివచ్చేలా.. ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ‘వ్యూహం’ సినిమా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి కూడా పనికొచ్చేలా ఉంటుందని అంటున్నారు. ఇందులో నటి జ్యోతిక, కీర్తీసురేశ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. నటుడు సూరి, వివేక్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. రజనీకాంత్ 168వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి 2020లో సమ్మర్స్పెషల్గా తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు. -
రజనీ @ 168
రజనీకాంత్ ‘దర్బార్’ సినిమా చిత్రీకరణ ముగిసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావడానికి ఈ చిత్రం ముస్తాబవుతోంది. మరి.. రజనీకాంత్ తర్వాతి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఏ దర్శకుడిని వరిస్తుందనే ప్రశ్నకు శుక్రవారం సమాధానం దొరికింది. తమిళంలో అజిత్‌తో వరుసగా ‘వీరమ్’, ‘వేదాలం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి మాస్ సినిమాలను తెరకెక్కించిన శివ ఆ చాన్స్‌ను దక్కించుకున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. ‘‘యందిరిన్ (తెలుగులో ‘రోబో’), ‘పేట’ చిత్రాల తర్వాత మరోసారి రజనీకాంత్‌గారి సినిమాను నిర్మించనుండటం సంతోషంగా ఉంది’’ అని సన్ పిక్చర్స్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇది రజనీకాంత్ కెరీర్లో 168వ చిత్రం. మాస్ ఎంటర్టైనింగ్ కథను రెడీ చేశారట శివ. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... తెలుగులో వచ్చిన ‘శౌర్యం’, ‘శంఖం’, ‘దరువు’ చిత్రాలు శివ దర్శకత్వంలోనే తెరకెక్కాయన్న సంగతి గుర్తుండే ఉంటుంది. -
హిట్ కాంబోలో రజనీ మరోసారి..
జయాపజయాలతో సంబంధం లేకుండా సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే ‘పేట’ చిత్రంతో హిట్ కొట్టిన తలైవా ప్రస్తుతం దర్బార్తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇదే జోష్‌లో మరో సినిమాకు రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్బార్ తదుపరి తమ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కే సినిమాలో రజనీ నటించనున్నారని సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.‘ ఎంతిరన్, పేట వంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్, సన్ పిక్చర్స్ మెగా కాంబినేషన్లో తలైవార్ 168వ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తారు’ అంటూ రజనీ, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్, శివ ఫొటోలతో కూడిన వీడియోను ట్విటర్ షేర్ చేసింది. కాగా ఈ కాంబినేషన్లో రూపొందిన రోబో, పేట చిత్రాలు సూపర్ హిట్ కావడంతో.. ప్రస్తుతం రజనీ 168వ సినిమా కూడా రికార్డులు తిరగరాసి హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక తెలుగులో దరువు, శంఖం, శౌర్యం వంటి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు శివ.. వేదాలం, వివేగం, విశ్వాసం వంటి చిత్రాలతో తమిళ స్టార్ హీరో అజిత్‌కు హిట్లు ఇచ్చి ఫుల్‌ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. After the blockbuster hits Enthiran and Petta, the mega hit combo of Superstar @rajinikanth and @sunpictures come together for the third time for Thalaivar 168, Superstar’s next movie, directed by @directorsiva#Thalaivar168BySunPictures pic.twitter.com/AL5Z6ryjbG — Sun Pictures (@sunpictures) October 11, 2019 -
రజనీ ‘పేట్టా’ సంక్రాంతికి రావడం లేదు!
ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్.. యువ దర్శకులతో పనిచేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్న సంగతి తెలిసిందే. కబాలి, కాలా వంటి సినిమాలు యువదర్శకుడైన పా. రంజిత్ తెరకెక్కించగా... ప్రస్తుతం తలైవాతో కార్తీక్ సుబ్బరాజ్ ‘పేట్టా’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇటీవలె ఈ సినిమా షూట్‌ను కంప్లీట్ చేసింది చిత్రయూనిట్. ‘పేట్టా’ సినిమాలో సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మేఘా ఆకాష్, సతన్‌రెడ్డి, మాళవికా మోహనన్‌లతో పాటు డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, రజనీకాంత్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని టాక్. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలచేయాలని మేకర్స నిర్ణయించారు. సన్ పిక్చర్స్ సంస్థ ఇప్పటికే ‘2.ఓ’ను నవంబర్ 29న విడుదల చేసేందుకు రెడీ అవ్వగా.. మరీ అంత తక్కువ గ్యాప్‌తో ‘పేట్టా’ను తీసుకురావడానికి సుముఖంగా లేరని సమాచారం. అందుకే పేట్టాను సంక్రాంతి బరిలోంచి తప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌పై చిత్రబృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.