తగ్గేదే లే అంటున్న సన్‌ పిక్చర్స్‌.. అజిత్‌కు ఎన్ని వందల కోట్లంటే? | Sun Pictures Do a Film With Ajith | Sakshi
Sakshi News home page

Ajith: అజిత్‌తో సినిమాకు సిద్ధమైన జైలర్‌ నిర్మాతలు.. ఏకంగా అన్ని కోట్లు ఆఫర్‌!

Published Sun, Sep 17 2023 9:53 AM | Last Updated on Sun, Sep 17 2023 3:57 PM

Sun Pictures Do a Film With Ajith - Sakshi

ఆ మధ్య వరుసగా చిత్రాలు నిర్మించి చేతులు కాలడంతో కొంతకాలం చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఇప్పుడు సత్తా చాటుతోంది. గతంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా నిర్మించిన అన్నాత్తే చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విజయ్‌ కథానాయకుడిగా బీస్ట్‌ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం సేమ్‌ టు సేమ్‌ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అయితే ఘన విజయాన్ని మాత్రం సాధించలేదు.

ఇటీవల రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దర్శకత్వంలో నిర్మించిన జైలర్‌ చిత్రం సంచలన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు తగ్గేదే లే అన్నట్లుగా వరుసగా చిత్రాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం ధనుష్‌ కథానాయకుడిగా ఆయన 50వ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే రజినీకాంత్‌, దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ క్రేజీ కాంబినేషన్‌లో ఓ చిత్రం ఉండబోతుందని అధికారికంగా ప్రకటించింది.

తాజా సమాచారం ప్రకారం అజిత్‌తోనూ ఓ సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో నటించడానికిగానూ ఆయనకు ఏకంగా రూ.150 కోట్లు పారితోషికం ఇవ్వడానికి ఆఫర్‌ ఇచ్చినట్లు టాక్‌. ఇప్పటివరకు అంతపెద్ద మొత్తంలో పారితోషికాన్ని నటుడు రజనీకాంత్‌, విజయ్‌, కమల్‌ హాసన్‌ మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో సన్‌ పిక్చర్స్‌ ఆఫర్‌కు అజిత్‌ ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈయన విడాముయిర్చి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షనన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్‌ పైకి వెళ్లనుంది. దీని తర్వాత ఆయన తన 63వ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థకు చేసే అవకాశం ఉంది.

చదవండి: పూజలు, మొక్కులు పెళ్లి కోసమేనా..? .. అనుష్క ఆన్సర్‌ ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement