Suriya Etharkkum Thunindhavan Movie Release Date Announced Deets inside - Sakshi
Sakshi News home page

Suriya Etharkkum Thunindhavan Movie: సూర్య 'ఈటీ' మూవీ వచ్చేది అప్పుడే.. మేకర్స్​ కొత్త ప్రకటన

Published Wed, Feb 2 2022 8:05 AM | Last Updated on Wed, Feb 2 2022 9:17 AM

Suriya Etharkkum Thunindhavan Movie Release Date Announced - Sakshi

Suriya Etharkkum Thunindhavan Movie Release Date Announced: కోలీవుడ్ స్టార్​ సూర్యకు అటు తమిళ్​ ఇటు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్‌, వైవిధ్యమైన రోల్స్‌లో అదరగొడుతుంటాడు. కథ విభిన్నంగా ఉంటే చేసేందుకు అస్సలు వెనకాడడు. అందుకే ఈ తమిళ హీరో అంటే టాలీవుడ్​లోనూ ఫుల్​ క్రేజ్​. ఇటీవల 'జైభీమ్'​, 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలతో సూపర్ హిట్​ అందుకున్నాడు సూర్య. ఈ చిత్రాల తర్వాత సూర్య చేస్తున్న మూవీ 'ఈటీ' (ఎతర్​క్కుమ్​ తునిందవన్​) అని తెలిసిందే. 

ఈ యాక్షన్​ థ్రిల్లర్​ చిత్రానికి పాండిరాజ్​ దర్శకుడు. అయితే తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్​. మార్చి 10న 'ఈటీ' మూవీని రిలీజ్​ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ సందడి చేయనుంది. ఇంతకుముందు 'ఈటీ'ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది చిత్రబృందం. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. సన్​ పిక్చర్స్​ నిర్మించిన ఈ చిత్రంలో సూర్యకు జంటగా ప్రియాంక అరుళ్​ మోహన్​ నటించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement