Pandiraj
-
విజయ్ సేతుపతి సరసన...
హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్... ఇలా విభిన్న పాత్రలతో విలక్షణ నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఇటీవల విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా తమిళ దర్శకుడు పాండిరాజ్ ఓ కథను రెడీ చేశారట. గతంలోనే ఈ కథను విజయ్ సేతుపతికి వినిపించారట పాండిరాజ్. ఈ సినిమాలో నిత్యా మీనన్‌ను హీరోయిన్గా అనుకుంటున్నారని కోలీవుడ్ సమాచారం. ఇదిలా ఉంటే... రెండేళ్ల క్రితం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో డైరెక్ట్‌గా విడుదలైన ‘19 (1)(ఎ)’ సినిమాలో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఇద్దరూ పాండిరాజ్ సినిమా కోసం మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ ఉంది. -
ఈటీ (ఎవరికీ తలవంచడు) మూవీ రివ్యూ
టైటిల్: ఈటీ (ఎవరికీ తలవంచడు) నటీనటులు: సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, వినయ్ వర్మ, సత్యరాజ్ తదితరులు నిర్మాత: కళానిధి మారన్ రచన, దర్శకుడు: పాండిరాజ్ సంగీతం: డి. ఇమ్మాన్ సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు ఎడిటర్: రూబెన్ విడుదల తేది: మార్చి 10, 2022 సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈటీ (ఎదుర్కుమ్ తునిందవన్) తెలుగులో 'ఎవరికీ తలవంచడు' సినిమా వచ్చేసింది. విభిన్నమైన రోల్స్‌లో అదరగొట్టే సూర్య సినిమాలపై భారీగానే అంచనాలుంటాయి. ఇదివరకూ సూర్య చేసిన 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలు కరోనా కారణంగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. అయితేనేం బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. సుమారు మూడేళ్ల తర్వాత 'ఎవరికీ తలవంచడు'తో థియేటర్లలోకి వచ్చాడు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రాన్ని పాండిరాజ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. అమ్మాయిల సమస్యలపై పోరాడే పవర్ఫుల్ పాత్రలో సూర్య నటించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఎట్టకేలకు ఈ మూవీ మార్చి 10న (గురువారం) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. మరీ సూర్య నటించిన ఈటీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: దక్షిణపురంలో అందరితో సరదాగా గడుపుతూ జీవిస్తుంటాడు లాయర్ కృష్ణమోహన్ (సూర్య). ఇతడు ఉత్తరపురంలోని అధిర (ప్రియాంక అరుల్ మోహన్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు ప్రేమించుకునే క్రమంలోనే వారి గ్రామంలోని అమ్మాయిలు ఆత్మహత్యలు, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతుంటారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం ఫలితముండదు. ఇదిలా ఉంటే కృష్ణ మోహన్, అధిరలు పెళ్లి చేసుకునే క్రమంలో అధిర స్నేహితురాలు ఆపదలో ఉన్నట్లు మెసేజ్ వస్తుంది. దీంతో ఆమెను కాపాడేందుకు వెళ్లిన లాయర్ కృష్ణమోహన్‌కు అమ్మాయిల ఆత్మహత్యలు, యాక్సిడెంట్లకు కారణం, ఆ చావుల వెనక ఉంది ఎవరనేది తెలుస్తుంది. సూర్య వారిని ఎదుర్కొన్నాడా? 500 మంది అమ్మాయిలను ఎలా కాపాడాడు ? దక్షిణపురం, ఉత్తరపురం గ్రామాలకు మధ్య ఉన్న సంబంధం ఏంటి ? కృష్ణ మోహన్ చిన్నతనంలో తన చెల్లెలికి ఏం జరిగిందనేదే సినిమా కథ. ఎలా ఉందంటే ? రెండు గ్రామాల మధ్య జరిగిన సంఘటన ద్వారా ప్రారంభమైన సినిమా అమ్మాయిలపై జరిగే ఆకృత్యాల గురించి ప్రస్తావించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ పాండిరాజ్. అమ్మాయిలు అంటే బలహీనం కాదు బలవంతులు అని చాటి చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అమ్మాయిలు మనోధైర్యంతో ఎలా ఎదుర్కొవాలో నేర్పిన చిత్రమిది. రొటీన్ ఫార్ములా అయినా పవర్‌ప్యాక్ యాక్షన్ సీన్స్‌తో మాస్ ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించి మంచి సందేశమిచ్చారు. హీరో, విలన్ల మధ్య వచ్చే సీన్స్ ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ యాక్షన్ సీన్, మహిళల నగ్న చిత్రాలు, అశ్లీల చిత్రాలు చూసే జనానికి వాటికి కారకులు ఎవరో తెలిసేలా చేయాలని చూపించే సీన్ సినిమాలో హైలెట్‌గా నిలుస్తాయి. తప్పు చేయని మహిళలు కాదు అశ్లీల చిత్రాలు తీసేవారు సిగ్గుపడాలని చెబుతూ మహిళలకు ఈ సినిమాతో ధైర్యమిచ్చే ప్రయత్నం చేశారు. 'అబ్బాయిలు ఏడవద్దు అని చెప్పడం కాదు అమ్మాయిలను ఏడిపించొద్దని చెప్పండి' లాంటి మహిళల కోసం చెప్పే డైలాగ్స్ క్లాప్స్ కొట్టించేలా ఉన్నాయి. డి. ఇమ్మాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందనే చెప్పవచ్చు. సీరియస్‌గా సాగే కథలో అక్కడక్కడా వచ్చే ప్రేమ సన్నివేశాలు, కామెడీ సీన్స్ ఉఫ్ అనిపిస్తాయి. అమ్మాయిల చావులకు కారణమేంటనే విషయం తెలుసుకోవాలని ఎదురుచూసే ప్రేక్షకుడికి ఈ సీన్స్ కొంచెం బోర్ కొట్టిస్తాయి. కానీ లాయర్ కృష్ణ మోహన్, అధిరల మధ్య వచ్చే లవ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కామెడీ బాగానే పండిందని చెప్పవచ్చు. ఆకాశమే హద్దురా, జైభీమ్ తరహాలో కాకపోయినా మహిళల పక్షాన నిలబడిన లాయర్ కృష్ణమోహన్ పాత్రలో నటించిన సూర్య 'ఈటీ' చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఎవరెలా చేశారంటే? విభిన్నమైన గెటప్పులతో, రోల్స్‌తో అదరగొట్టే సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎప్పటిలానే ఈ సినిమాలో లాయర్ కృష్ణ మోహన్‌గా తనదైన శైలిలో అద్భుతంగా యాక్ట్ చేశాడు. అధిరగా చేసిన ప్రియాంక అరుల్ మోహన్ నటన కూడా బాగుంది. ఫస్టాఫ్‌లో సాధారణ యువతిగా నటించి ఆకట్టుకున్న ప్రియాంక సెకండాఫ్‌లో అశ్లీల చిత్రాలకు గురైన బాధితురాలిగా పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలనే పాత్రలో చక్కగా నటించింది. ఇక కృష్ణమోహన్ తండ్రిగా సత్యరాజ్, అమ్మగా శరణ్య పొన్వన్నన్, దేవదర్శిని చేతన్, సుబ్బు పంచు తమదైన పాత్రమేరకు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర కామ (వినయ్ రాయ్). స్త్రీలను కించపరుస్తూ మాట్లాడటం, వాళ్లను హింసించడం, అమ్మాయిలను వీఐపీలకు ఎరగా వేసి వాడుకునే కామేష్ పాత్రలో వినయ్ రాయ్ బాగానే నటించాడు. కార్తీ నటించిన 'చినబాబు' సినిమా ఫేమ్ పాండిరాజ్‌కు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇది మూడో సినిమా. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా తీయడంలో పాండిరాజ్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించి మహిళలపై జరిగే అరాచాకాలు, వారు ఎలా నిలదొక్కుకోవాలో చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో పూర్తిగా విజయం సాధించారనే చెప్పవచ్చు. అమ్మాయిలపై జరిగే ఆకృత్యాలు, అరాచకాలపై చాలానే సినిమాలు వచ్చాయి. అయితే అమ్మాయిలను పురుషులు చూసే కోణం మారనప్పుడు, మహిళలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడే రోజు రానంతవరకూ ఇలాంటి ఎన్ని సినిమాలు వచ్చినా స్వాగతించడంలో తప్పులేదు. -
ఆడవాళ్లు అంటే బలహీనులు కాదు బలవంతులు.. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈటీ ట్రైలర్
Suriya Etharkkum Thunindhavan Movie Telugu Trailer Out: కోలీవుడ్ స్టార్ సూర్యకు అటు తమిళం ఇటు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్‌లో అదరగొడుతుంటాడు. కథ విభిన్నంగా ఉంటే చేసేందుకు అస్సలు వెనకాడడు. అందుకే ఈ తమిళ హీరో అంటే టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్. ఈసారి మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలు, దారుణాలను ఎండగట్టే ప్రయత్నం చేయబోతున్నాడు. సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎతర్క్కుమ్ తునిందవన్ (ఈటీ)'. మాస్ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈటీలో అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. బుధవారం (మార్చి 2) ఉదయం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. 'వాడేమె సైంటిస్ట్ కావాలని ఆశ పడ్డాడు. నేనేమో వేరేలే చూడాలని ఆశపడ్డాను. కానీ దైవం, కాలం వాడ్ని ఇలా చూడాలని ఆశపడింది' అనే డైలాగ్‌తో సినిమా ట్రైలర్ ప్రారంభమవుతోంది. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా చూపించారు. 'ఆడవాళ్లు అంటే బలహీనులు కాదు బలవంతులు', 'పంచె ఎగ్గడితే నేనే జడ్జి' వంటి తదితర డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10న థియేటర్లలో విడుదల కానుంది. -
మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు.. ఈటీ టీజర్ చూశారా?
మాస్ పాత్రల్లో విజృంభించి నటిస్తారు సూర్య. తాజాగా ‘ఈటి’ చిత్రంలో కూడా మాస్ క్యారెక్టర్లో రెచ్చిపోయినట్లుగా శనివారం విడుదలైన టీజర్ స్పష్టం చేస్తోంది. సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో మార్చి 10న రిలీజ్ కానుంది. తెలుగు హక్కులను ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ దక్కించుకుంది. ఈ చిత్రం తెలుగు టీజర్‌ను రానా విడుదల చేశారు. విలన్లను రఫ్ఫాడిస్తూ, ‘నాతో ఉన్నవాళ్లు ఎప్పుడూ భయపడకూడదు.. మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అని సూర్య చెప్పే డైలాగ్‌తో టీజర్ ముగుస్తుంది. సూర్య సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటించిన ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమ్మాన్, కెమెరా: ఆర్ రత్నవేలు. -
సూర్య 'ఈటీ' మూవీ వచ్చేది అప్పుడే.. మేకర్స్ కొత్త ప్రకటన
Suriya Etharkkum Thunindhavan Movie Release Date Announced: కోలీవుడ్ స్టార్ సూర్యకు అటు తమిళ్ ఇటు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్‌లో అదరగొడుతుంటాడు. కథ విభిన్నంగా ఉంటే చేసేందుకు అస్సలు వెనకాడడు. అందుకే ఈ తమిళ హీరో అంటే టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్. ఇటీవల 'జైభీమ్', 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు సూర్య. ఈ చిత్రాల తర్వాత సూర్య చేస్తున్న మూవీ 'ఈటీ' (ఎతర్క్కుమ్ తునిందవన్) అని తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. అయితే తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. మార్చి 10న 'ఈటీ' మూవీని రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ సందడి చేయనుంది. ఇంతకుముందు 'ఈటీ'ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది చిత్రబృందం. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో సూర్యకు జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. #EtharkkumThunindhavan is releasing on March 10th, 2022! See you soon in theatres!@Suriya_offl @pandiraj_dir #Sathyaraj @immancomposer @RathnaveluDop @priyankaamohan @sooriofficial #ETfromMarch10 #ET pic.twitter.com/HPJ9cYw9Eh — Sun Pictures (@sunpictures) February 1, 2022 -
సూర్య 40వ చిత్రంలో సామూహిక అత్యాచార ఘటన?
హీరో సూర్య, దర్శకుడు పాండిరాజ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది నటుడు సూర్య 40వ చిత్రం. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, చిత్ర టైటిల్‌ను జూలై నెలలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు పాండిరాజ్ ఇటీవల ట్విటర్లో పేర్కొన్నారు. ఇందులో మహిళలపై అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలను వేటాడి శిక్షించే యువకుడి పాత్రలో సూర్య నటిస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య పొల్లాచ్చిలో జరిగిన సామూహిక అత్యాచారాల ఘటన ఈ చిత్రంలో ఉన్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా వుంటే తెలుగులోనూ మార్కెట్ ఏర్పరుచుకున్న సూర్య ఇక్కడి ప్రేక్షకులను నేరుగా పలకరించాలనుకుంటున్నారట. ఇందుకోసం తెలుగు స్టార్ డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరి ఇదెంతవరకు నిజమో త్వరలోనే తేలనుంది. చదవండి: కరోనా ఎఫెక్ట్ : తన ఫ్యాన్స్ కోసం సూర్య ఏం చేశాడంటే... -
లుక్ అదుర్స్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) అందించిన విజయంతో హీరో సూర్య రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలో విడుదలైనా ఘన విజయం సాధించడంతో తర్వాతి చిత్రాన్ని మంచి జోష్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లారు సూర్య. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. సూర్య కెరీర్లో 40వ చిత్రమిది. కాగా ఈ చిత్రంలోని సూర్య లుక్ ఒకటి ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. కత్తి పట్టుకొని పంచెకట్టులో నడుస్తూ వెళుతున్న సూర్య లుక్ అదుర్స్ అంటున్నారు అభిమానులు. ఆయన హెయిర్ స్టయిల్ కూడా కాస్త మాస్‌గా అనిపిస్తోంది. తాజా ఫొటోను బట్టి చూస్తే యాక్షన్ సీక్వెన్స్‌లో విలన్ల భరతం పట్టబోతున్నారు సూర్య. ఆయన ఇమేజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా సామాజిక అంశాలతో కూడిన మాస్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని తీర్చిదిద్దుతున్నారట పాండిరాజ్. -
హీరో సూర్య కొత్త ప్రయాణం
కెరీర్లో మరో కొత్త సినిమా ప్రయాణాన్ని ప్రారంభించారు హీరో సూర్య. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. సత్యరాజ్, సూరి, వినయ్ కీలక పాత్రలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో మొదలైంది. సోమవారం నుంచి ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతున్నారు సూర్య. ఈ షెడ్యూల్ దాదాపు 25 రోజులు జరుగుతుందని సమాచారం. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట కూడా చిత్రీకరించే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఈ సినిమా కాకుండా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడీవాసల్’ అనే సినిమా కమిట్ అయ్యారు సూర్య. చదవండి: రేలంగి తన సంపాదనంతా ఆమెకే ఇచ్చేవారు..! -
సూర్యతో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన శ్రీకారం నటి!
‘గ్యాంగ్ లీడర్’ భామ ప్రియాంకా అరుళ్ మోహన్ క్రేజీ ఛాన్స్ కొట్టేశారని కోలీవుడ్ టాక్. సూర్యతో జోడీ కట్టే అవకాశం ప్రియాంక కొట్టేశారన్నది ఆ వార్త. పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు సూర్య. ఇదో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రమట. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంకా అరుళ్ మోహన్‌ను కథానాయికగా అనుకుంటున్నారట. ఫిబ్రవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. శివ కార్తికేయన్‌తో ‘డాక్టర్’ అనే సినిమా చేశారు ప్రియాంక. ఈ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. రెండో సినిమాకే సూర్యతో జోడీ అంటే క్రేజీ ఛాన్స్ అనాల్సిందే. ప్రస్తుతం ఆమె తెలుగులో శర్వానంద్‌తో ‘శ్రీకారం’ సినిమాలో నటిస్తున్నారు. -
మళ్లీ పిలుపొచ్చింది
కోలీవుడ్ నుంచి హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్‌కి మళ్లీ కబురొచ్చింది. రెండేళ్ల క్రితం విశాల్ ‘తుప్పరివాలన్ (2017)’లో నటించిన అనూ ఇప్పుడు శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కథానాయికగా నటించనున్నారు. ‘అజ్ఞాతవాసి (2018), నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018), శైలజారెడ్డి అల్లుడు’ (2018) చిత్రాల్లో నటించిన అనూ ఇమ్యాన్యుయేల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆ తర్వాత తెలుగులో వేరే సినిమాలు సైన్ చేయలేదీ బ్యూటీ. అయితే తమిళంలో శివకార్తికేయన్ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా అంగీకరించారామె. ఇందులో ఐశ్వర్యా రాజేష్ మరో హీరోయిన్గా నటిస్తారు. భారతీరాజా, సముద్రఖని, నటరాజన్, ఆర్కే సురేశ్, యోగిబాబు, సూరి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తారు. రూరల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. -
సక్సెస్మీట్కు ఆటోలో వచ్చిన కార్తీ
-
వైరల్.. ఆటోలో ‘చినబాబు’
నా పేరు శివ, ఆవారా సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ. ఊపిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కార్తీ గతేడాది ఖాకీ సినిమాతో హిట్‌కొట్టి మంచి ఫామ్‌లోకి వచ్చాడు. రీసెంట్గా చినబాబుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ సాధించాడు. కుటుంబ కథా, రైతు, గ్రామీణ వాతావరణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను హీరో సూర్య నిర్మించారు. ఈ సినిమా యూనిట్ సక్సెస్మీట్లు నిర్వహిస్తూ ఉంది. వీటికి హాజరయ్యేందుకు విచ్చేస్తోన్న కార్తీ.. ట్రాఫిక్, వర్షం కారణంగా ఆలస్యమవుతుండటంతో.. ఏమాత్రం ఆలోచించకుండా ఆటోలో కార్యక్రమానికి వచ్చాడు. కార్తీ అలా రావడంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. -
కన్నీటిని ఆపుకోలేకపోయా : హీరో
సూర్య నిర్మాణంలో ఆయన తమ్ముడు కార్తీ హీరోగా వచ్చిన సినిమా చినబాబు. ఫ్యామిలీ నేపథ్యంలో, కుటుంబ బంధాలను చక్కగా చూపించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా నడుస్తోంది. ఇటీవలె ఖాకీతో హిట్ కొట్టిన కార్తీకి ‘చినబాబు’తో మరో హిట్ వచ్చింది. సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నందుకు ఈ చిత్ర నిర్మాత సూర్య సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించారు. ‘థియేటర్లో ప్రేక్షకులందరూ.. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. హాయిగా నవ్వుకుంటున్నారు. నేనూ మనస్పూర్తిగా నవ్వుకున్నాను, కన్నీటిని ఆపుకోలేకపోయాను. దర్శకుడు పాండ్యరాజ్, చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు. మా చిత్రం తరుపున ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. To see the whole theatre laugh and connect with the emotions is bliss!!I laughed my heart out,n couldnt stop my tears..Thank you @pandiraj_dir and entire team!! Happy for you @Karthi_Offl .We #KadaikuttiSingam #Chinnababu team thank audience for blessing us with all the love. pic.twitter.com/t4HX6fGSTd — Suriya Sivakumar (@Suriya_offl) July 14, 2018 -
‘చినబాబు’ మూవీ రివ్యూ
టైటిల్ : చినబాబు జానర్ : ఫ్యామిలీ డ్రామా తారాగణం : కార్తీ, సయేషా, సత్యరాజ్, సూరి, శత్రు సంగీతం : డి ఇమాన్ దర్శకత్వం : పాండిరాజ్ నిర్మాత : సూర్య కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ.. తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తన ప్రతీ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తూ ఇక్కడ కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న కార్తీ, తాజాగా చినబాబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పల్లెటూరి కథతో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను కార్తీ అన్న, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నిర్మించటం విశేషం. మరి అన్నదమ్ములు కలిసి చేసిన ఈ ప్రయత్నం ఫలించిందా..? కార్తీ తెలుగు ప్రేక్షకులను మరోసారి మెప్పించాడా..? కథ; పెనుగొండ రుద్రరాజు (సత్యరాజ్) రైతు. ఇద్దరు భార్యలు, ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్న పెద్ద కుటుంబ యజమాని. ఎప్పటికైనా తన కూతుళ్లు, అల్లుల్లు.. వాళ్ల పిల్లలను ఇంటికి పిలిచి అందరితో కలిసి ఓ ఫ్యామిలీ ఫొటో తీయించుకోవాలని ఆశపడుతుంటాడు. రుద్రరాజు కొడుకు కృష్ణంరాజు (కార్తీ) ‘రైతే దేశానికి ఆధారం’ అని నమ్మే ఆదర్శ రైతు. రుద్రరాజు ఇద్దరు కూతుళ్లు తమ అమ్మాయిలను కృష్ణంరాజు కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ కృష్ణంరాజు, నీల నీరధ(సయేషా)ను ఇష్టపడతాడు. (సాక్షి రివ్యూస్) దీంతో కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. అదే సమయంలో నీల నీరధ బావ, సురేంద్ర రాజు (శత్రు)ను ఓ హ్యతకేసులో కృష్ణం రాజు అరెస్ట్ చేయిస్తాడు. దీంతో ఎలాగైన ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో సురేంద్ర, రుద్రరాజు కుటుంబంలో మొదలైన గొడవలు మరింత పెద్దవి చేసి అందరిని విడదీయాలని, కృష్ణంరాజును చంపాలని ప్రయత్నిస్తాడు. ఈ సమస్యల నుంచి కృష్ణంరాజు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు..? ఎలా తిరిగి ఒక్కటి చేశాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; రైతు పాత్రలో కార్తీ జీవించాడు. ఆదర్శ రైతుగా, కుటుంబం కోసం ప్రాణమిచ్చే పల్లెటూరి యువకుడి పాత్రలో కార్తీ నటన సూపర్బ్. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, యాక్షన్ ఇలా ప్రతీ విషయంలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సయేషాది దాదాపుగా అతిథి పాత్రే. ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. గత చిత్రాల్లో మోడ్రన్ అమ్మాయిగా కనిపించిన సయేషా పల్లెటూరి అమ్మాయిగానూ మెప్పించింది. (సాక్షి రివ్యూస్) కుటుంబ పెద్దగా సత్యరాజ్ హుందాగా కనిపించారు. తెలుగులో సపోర్టింగ్ రోల్స్ లో కనిపించిన శత్రుకు ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా అవకాశం దక్కింది. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏదైన చేసే పాత్రలో శత్రు మంచి విలనిజం పండించాడు. అక్కలు, బావల పాత్రలలో నటించిన వారంతా తమిళ నటులే కావటంతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావటం కాస్త కష్టమే. విశ్లేషణ ; మాస్ ఆడియన్స్‌లో మంచి పట్టున్న కార్తీని పల్లెటూరి రైతు బిడ్డగా చూపించాడు దర్శకుడు పాండిరాజ్. మాస్ కమర్షియల్, ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా, బలమైన ఎమోషన్స్ తో కథను నడిపించాడు. కార్తీ నుంచి ఫ్యాన్స్ ఆశించిన కామెడీ, రొమాన్స్ లాంటి అంశాలకు లోటు లేకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే సినిమా పూర్తిగా తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. నేటివిటి పరంగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వటం కాస్త కష్టమే. (సాక్షి రివ్యూస్)నటీనటులు అంతా తమిళ వారే కావటం కూడా ఇబ్బంది పెడుతుంది. వేల్రాజ్ సినిమాటోగ్రఫి బాగుంది. పల్లె వాతావరణాన్ని అందంగా తెర మీద చూపించారు. ఇమాన్ సంగీతమందించిన పాటలు పరవాలేదనిపించినా.. ఎమోషనల్ సీన్స్‌కు నేపథ్య సంగీతం మరింత బలాన్నించింది. ఎడిటింగ్ బాగుంది. సూర్య కథ మీద నమ్మకంతో తమ్ముడి కోసం భారీగానే ఖర్చు చేసి సినిమాను నిర్మించారు. ప్లస్ పాయింట్స్ ; ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధాన పాత్రల నటన మైనస్ పాయింట్స్ ; నేటివిటి ప్రధాన పాత్రల్లో తమిళ నటులే కనిపించటం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
పాండిరాజన్ కొడుకు హీరోగా తొడర్
దర్శకనటుడు పాండిరాజన్ వారసుడు పృధ్వీరాజన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం తొడర్. జేఎస్.అపూర్వ ప్రొడక్షన్స్ పతాకంపై చంద్ర సరవణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కే.భాగ్యరాజ్ శిష్యుడు మధురాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో పృధ్వీరాజన్ కు జంటగా వీణ అనే నవ నటి కథానాయకిగా పరిచయం అవుతోంది. సరవణకుమార్ విలన్ గా నటిస్తున్న ఇందులో దర్శకుడు ఏ.వెంకటేశ్, మైనా సూచన్, టీపెట్టి గణేశన్, కూల్‌సురేశ్ తదితరులు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఒక ప్రేమ జంట ఎదుర్కొనే సమస్యలు ఇతి వృత్తంగా రూపొందుతున్న చిత్రం తొడర్ అన్నారు. తమిళనాడును ఊపేసిన ఉత్తరాది జిల్లాల్లో జరిగిన రెండు యథార్ధ సంఘటనల ఆధారంగా తెరెక్కిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. పేదవాడి ప్రేమకు అన్నీ సమస్యలేనన్న అంశాలను తెరపై ఆవిష్కరించే చిత్రంగా తొడర్ ఉంటుందని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను పొల్లాచ్చిలో ఇంతకు ముందు దేవర్‌మగన్ చిత్రాన్ని చిత్రీకరించిన ప్రాంతాల్లో నిర్వహించామని తెలిపారు. కన్నడ చిత్రం ఆప్తమిత్ర–2 ఫేమ్ సంగీత దర్శకుడు ఉత్తమరాజా ఈ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారని తెలిపారు. అంజి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని దర్శకుడు తెలిపారు. -
సమస్యల్లో శింబు, నయనల చిత్రం?
శింబు, నయనల చిత్రం ఇదు నమ్మ ఆళు సమస్యల్లో చిక్కుకుందా! ప్రస్తుతం కోలీవుడ్ హాట్‌గా చర్చించుకుంటున్న అంశం ఇదే. ప్రారంభానికి ముందే సంచలనం కలిగించిన చిత్రం ఇదు నమ్మ ఆళు. ఒకప్పుడు గాఢంగా ప్రేమించుకుని ఆ తరువాత విడిపోయిన మాజీ ప్రేమ జంట శింబు, నయనతార కలసి నటించడమే అందుకు కారణం. దీంతో చిత్రం వ్యాపార వర్గాల్లో కూడా వేడి పుట్టించింది. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని నటుడు శింబునే సొంతంగా నిర్మించడం, ఆయన తమ్ముడు కురలరసన్ తొలిసారిగా సంగీతాన్ని అందించడం...అలాగే పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సెలైంట్‌గా శరవేగంగా జరుపుకుంది. అలాంటి చిత్రానికి అనూహ్యంగా సమస్యలు ఎదురైనట్లు సమాచారం. చిత్రం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పరిశ్రమలోని ఒక వర్గం టాక్. కాగా దర్శకుడు పాండిరాజ్‌కు, శింబుకు మధ్య విభేదాల కారణంగా ఇదు నమ్మ ఆళు చిత్ర షూటింగ్ జాప్యానికి కారణం అని మరో వర్గం ప్రచారం చేస్తోంది. దర్శకుడు పాండిరాజ్ ప్రస్తుతం సూర్య నిర్మించనున్న చిత్రానికి కథను తయారు చేసే పనిలో ఉన్నారనే చర్చ ఉంది. ఇలా శింబు, నయనతారల చిత్రంపై రకరకాల వదంతులు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఇదు నమ్మ ఆళు చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్న శింబు తండ్రి, నటుడు, దర్శకుడు టి.రాజేందర్ స్పందిస్తూ తమ చిత్రంపై అవాస్తవ ప్రచారం జరుగుతోందన్నారు. ఈ చిత్రం విషయంలో ఎవరికీ ఎవరితోను వివాదాలు లేవని స్పష్టం చేశారు. ఇదు నమ్మ ఆళు చిత్రం తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని వెల్లడించారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి చిత్రంగా రూపొందుతుందనే ఆశాభావాన్ని టి.రాజేందర్ వ్యక్తం చేశారు. -
పిల్లల కోసం సినిమా తీస్తున్న సూర్య
తమిళంతో పాటు తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్న సూర్య.. ఇప్పుడు పిల్లల కోసం ఓ సినిమా తీస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహిస్తారు. సింగం-2 విజయంతో మంచి ఊపుమీదున్న సూర్య.. ఇప్పుడు కొత్తగా పిల్లల చిత్రం తీయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా కథను తాను సూర్యకు చెప్పగానే వెంటనే ఆయన దాన్ని నిర్మించడానికి ఒప్పుకొన్నారని, ఈ తరహా సినిమాలు పిల్లలను బాగా ఆకట్టుకుంటాయని చెప్పారని పాండ్యరాజ్ తెలిపారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైపోయిందని అన్నారు. ఈ సినిమాలో ఇద్దరు పిల్లలు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. దీన్ని దర్శకుడు పాండిరాజ్, సూర్యల సొంత బేనర్ 2డి ఎంటర్టైన్మెంట్ మీద తీస్తున్నారు. జాతీయ అవార్డు పొందిన తమిళ పిల్లల చిత్రం పసంగాకు కూడా పాండిరాజే దర్శకుడు. -
జ్యోతిక రెడీ...
పెళ్లయ్యాక కూడా కథానాయికలుగా కొనసాగడం బాలీవుడ్ భామలకే చెల్లింది. దక్షిణాదిలో ఒకప్పుడు ఈ సంప్రదాయం ఉండేది కానీ, ఇప్పుడైతే లేదు. పెళ్లయ్యాక మళ్లీ నటించాల్సి వస్తే... కేరక్టర్యాక్టర్గా చేయడమే తప్ప హీరోయిన్గా నటించడం మాత్రం అరుదు. ఒక వేళ నటించినా రాణించడం మాత్రం ఇక్కడ జరగలేదు. అందుకు సిమ్రాన్‌ని, భూమికని ఉదాహరణగా చెప్పొచ్చు. రీసెంట్గా స్నేహ కూడా ‘ఉలవచారు బిరియాని’ చిత్రంతో హీరోయిన్గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ వరుసలో మరో పాత స్టార్ హీరోయిన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారట. ఆమె ఎవరో... ఇక్కడున్న స్టిల్ చూశాక మీకు అర్థమై ఉంటుంది. సూర్యని వివాహం చేసుకున్న తర్వాత ఇంటికే పరిమితమైపోయారు జ్యోతిక. ఇప్పుడామెకు ఓ పాప, ఓ బాబు. ఆ మధ్య ఓ వాణిజ్య ప్రకటనలో సూర్యతో కలిసి నటించి, ‘ఇద్దరు బిడ్డల తల్లినైనా... నా గ్లామర్‌లో ఏ మాత్రం మెరుపు తగ్గలేదు’ అని నిరూపించారామె. అందుకే తన భర్త సూర్య నుంచి ఇంట్లోవారందరూ ఆమె మళ్లీ నటన కొనసాగించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారట. ప్రస్తుతం జ్యోతిక కథలు వింటున్నారు. తమిళ దర్శకుడు పాండిరాజ్ చెప్పిన కథ నచ్చిందని వినికిడి. కథానాయిక ప్రాధాన్యంతో సాగే ఈ చిత్రం ద్వారా జ్యోతిక హీరోయిన్గా రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. -
శింబు - నయనతార సినిమాలో హన్సిక నటిస్తే?
‘శింబు హీరోగా నయనతార, హన్సిక హీరోయిన్లుగా సినిమా’. వినడానికే విడ్డూరంగా ఉంది కదా. మాజీ ప్రియురాలు నయనతారతో కలిసి శింబు నటిస్తుండటమే ఇప్పుడు దక్షిణాదిన హాట్ టాపిక్ అయ్యింది. అలాంటిది మరో మాజీ ప్రియురాలు హన్సిక కూడా నటిస్తే... ఇంకేమైనా ఉందా! మీడియాకు కావాల్సినంత స్టఫ్ దొరికినట్టేగా. అసలు ఈ కాంబినేషన్‌ని సెట్ చేసే సత్తా ఎవరికుంది? చాలామంది మదిలో మెదిలే ప్రశ్న ఇది. కానీ.. నిజానికి వారి ముగ్గుర్నీ కలిపి నటింపజేయడానికి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది నిజం. వివరాల్లోకెళితే... శింబు, నయనతార జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తమిళంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. కథ రీత్యా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరం. కాగా, శింబు, నయన కలిసి నటిస్తుండంతో ఈ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. సో... మరో మాజీ ప్రియురాలు హన్సిక కూడా ఈ సినిమాకు జత కూడితే... ఎలా ఉంటుంది? అనే ఆలోచన తమిళనాడుకి చెందిన కొందరు పంపిణీదారులకు వచ్చిందట. ఇంకేముంది... ఆలస్యం చేయకుండా తమ ఆలోచనను దర్శకుడు పాండిరాజ్‌కి విన్నవించారు. ఆయనక్కూడా ఇదేదో బాగుందనిపించి... ఆలస్యం చేయకుండా ప్రయత్నాలు మొదలుపెట్టారట. మరి ఈ సినిమాలో నటించడానికి హన్సిక అంగీకరిస్తారో, లేదో చూడాలి. ఈ సినిమాకు నయనతార తీసుకుంటున్న పారితోషికం రెండు కోట్ల రూపాయలట. సో... ఈ ప్రాజెక్ట్‌లో తాను భాగం అయితే... క్రేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హన్సిక ఎంత పారితోషికాన్ని డిమాండ్ చేస్తారో వేచి చూడాలి మరి. -
హాయ్.. హాయ్!
హాయ్..హాయ్! ఏంటనుకుంటున్నారా? ఈ పలకరింపులు ఒకనాటి గాఢ ప్రేమికులు, ఆ తరువాత మాజీ ప్రేమికులు, తాజా సంచలన జంట అయిన శింబు, నయనతారలవి. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఏ నోట విన్నా ఈ జంట ఊసులే. వల్లవన్ చిత్రం నిర్మాణం సమయంలో శింబు, నయనతార మధ్య ప్రేమాయణం ఘాటుగా సాగిన విషయం తెలిసిందే. అలాంటి ప్రేమ తరువాత ద్వేషంగా మారింది. ఆ తరువాత నయనతార ప్రభుదేవాతో రొమాన్స్ చేసింది. వీరి ప్రేమ పెళ్లి వరకు వెళుతుందనుకున్నారు. చివరికి అది పెటాకులయ్యింది. దీంతో మళ్లీ నటనపై దృష్టి సారించిన నయన ఇటీవల అందరూ విస్మయం చెందే నిర్ణయం తీసుకుంది. అదే మాజీ ప్రియుడు శింబుతో మళ్లీ జత కట్టడానికి అంగీకరించడం. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల మొదలైంది. తొలుత రెండు రోజుల్లో నయనతారకు చెందిన సన్నివేశాలనే చిత్రీకరించారు. ఆ తరువాత హీరో ఎంటర్ అయ్యారు. శింబు, నయనతారల సన్నివేశాల చిత్రీకరణ రోజు యూనిట్ అంతా ఒక విధమైన ఉద్వేగానికి గురైందట. ఒకనాటి ప్రేమికులు, మళ్లీ కలుసుకునే తరుణం ఎలా ఉంటుందన్నదే వారి టెన్షన్‌కు కారణం. అయితే సెట్లోకి అడుగుపెట్టిన శింబు, నయనతారలు చాలా కూల్‌గా హాయ్ హాయ్ అంటూ చిరునవ్వులు చిందిస్తూ పలకరించుకోవడంతో యూనిట్ వర్గాల ముఖాల్లో టెన్షన్ పోయి ఆశ్చర్యం చోటు చేసుకుందట. అంతేకాదు షూటింగ్ గ్యాప్‌లో నయన, శింబులు ఏకాంతంగా గంటల తరబడి మాట్లాడుకోవడం యూనిట్ వాళ్లు మరింత షాక్‌కు గురయ్యారట. ఇలాంటి షాక్‌ల మీద షాక్ లివ్వడం వీరిద్దరికీ మామూలేనంటూ కోలీవుడ్ గుసగుసలాడుతోంది. ఈ సంచలన జంట మధ్య మళ్లీ ప్రేమ మొదలైనా ఆశ్చర్యపడనక్కరలేదనే టాక్ వినిపిస్తోంది. -
శింబు చిత్రానికి నో చెప్పిన హన్సిక
శింబు సరసన నటించడానికి నటి హన్సిక నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ జంట ఇప్పటికే వాలు, వేట్టై మన్నన్ చిత్రాల్లో కలిసి నటిస్తున్నారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ మొలకెత్తింది. అయితే తాజాగా శింబు, హన్సికల ప్రేమ బ్రేకప్ అయ్యిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరో విషయం ఏమిటంటే శింబు సరసన మరో చిత్రంలో నటించే అవకాశాన్ని హన్సిక తిరస్కరించినట్లు తెలిసింది. అందుకు కారణం ఆ చిత్రంలో మరో హీరోయిన్గా నయనతార నటిస్తుండటమేనట. శింబు ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చట్టెన్డ్రు మారువదు వానిలె చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పగలు రాత్రి శరవేగంగా జరుగుతోంది. దీని గురించి శింబు తన ట్విట్టర్లో పేర్కొంటూ గౌతమ్ మీనన్ చిత్రం రెండవ షెడ్యూల్ మొదలైందని తెలిపారు. ఈ నెల 20 నుంచి పాండిరాజ్ దర్శకత్వంలో తాను నటించడానికి సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. ఇందులో ఒక హీరోయిన్గా నయనతార నటిస్తున్నారు. వీరి మధ్య సన్నివేశాల చిత్రీకరణ జనవరి నుంచి ప్రారంభం అవుతుంది అని పేర్కొన్నారు. ఇందులో మరో హీరోయిన్గా హన్సికను నటింప చేసే ప్రయత్నాలు జరిగాయట. అయితే నయనతార నటిస్తున్న చిత్రంలో తాను నటించనని హన్సిక నిర్మొహమాటంగా చెప్పేసిందట. దీంతో మరో హీరోయిన్ వేట జరుగుతోందని యూనిట్ వర్గాల సమాచారం. -
ముహూర్తం కుదిరింది
నటుడు శింబు, నయనతారల పునర్ కలయికకు ముహూర్తం కుదిరింది. ఈ జంట కలయికను ఇంత విశేషంగా చెప్పుకోవడానికి కారణం తెలియంది కాదు. ఇంతకుముందు నువ్వు లేక నేను లేను అన్నంతగా ప్రేమించుకున్న శింబు, నయనతార ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. 2006లో వల్లవన్ చిత్రం షూటింగ్ సమయంలో వీరి ప్రేమకు బీజం పడింది. కొన్ని నెలలకే ఆ ప్రేమ బ్రేక్ అప్ అయ్యింది. ఏడేళ్ల తర్వాత ఈ మాజీ ప్రేమికులు కలిసి డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో శింబు నిర్మిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ ఈ జంట కలయికకు డిసెంబర్ ఐదున ముహూర్తం కుదిరింది. ఆ రోజున వీరిద్దరూ నటించే సన్నివేశాలను దర్శకుడు పాండిరాజ్ చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై క్రేజ్ పెరిగిపోయింది. బయ్యర్లు అప్పుడే చిత్ర కొనుగోలుకు పోటీ పడుతున్నారట. పడరా మరి సంచలనాలకు కేంద్రబిందువు అయిన జంట నటిస్తున్న చిత్రం కదా! -
నయనతో శింబు లవ్ డ్యూయెట్లు
అప్పట్లో శింబు, నయనతార ఎంత ఘాటు ప్రేమయో అంటూ లవ్వాటాడుకున్నారు. తర్వాత వారి మధ్య ప్రేమ మాయమైంది. ఇటీవల శింబు, హన్సిక ఔను మేము ప్రేమించుకుంటున్నాం. పెళ్లి కూడా చేసుకుంటాం అన్నారు. ఇప్పుడు వీరి ప్రేమ కథ కంచికి చేరిందంటున్నారు. అంతేకాదు మాజీ ప్రేయసి నయనతారతో శింబు మళ్లీ డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. శింబు, నయనతార ఇంతకుముందు వల్లవన్ చిత్రంలో జతకట్టారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ పుట్టింది. చాలా సన్నిహితంగా మెలిగారు. ఆ ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేయడంతో వీరి ప్రేమకు ముసలం పుట్టింది. శింబునే వాటిని నెట్లో ప్రచారం చేశారన్న విషయం తెలిసి నయనతార మనసు విరిగిపోయింది. ఇటీవల శింబు లవ్‌లో పడ్డ హన్సికను పలువురు ఆక్షేపించారు. దీంతో పునరాలోచనలో పడ్డ హన్సిక శింబుకు దూరం అవుతూ వచ్చింది. ఇప్పుడు వీరి మధ్య పెద్ద అగాథం ఏర్పడినట్లు సమాచారం. శింబు తాజాగా నటిస్తున్న చిత్రంలో మాజీ ప్రియురాలు నయనతార హీరోయిన్గా నటించనున్నారట. ఈ విషయాన్ని స్వయానా ఆ చిత్ర దర్శకుడు పాండిరాజ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో హన్సిక పోయే, శింబు నయన్‌తో మళ్లీ జోడి చేరే అంటున్నారు. -
శింబుకు జోడీ ఎవరో?
శింబు చిత్రం తెరపైకి వచ్చి చాలా కాలమైంది. పోడాపోడినే తెరపైకొచ్చిన ఆయన చివరి చిత్రం. అది ఆశించిన విజయం సాధించలేదు. దీపావళికి విడుదలవుతుందనుకున్న వాలు చిత్రం తెరపైకి రాలేదు. దీంతో శింబు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యూ రు. అయితే తన అభిమానుల్ని అలరించడానికి శింబు సిద్ధమయ్యారు. ఈసారి తనే సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టారు. శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై రూపొందే చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి హీరోరుున్ను ఇంకా ఎంపిక చేయలేదట. దర్శకుడు మాట్లాడుతూ శింబుకు జంటగా నటించే హీరోయిన్ ఇంకా దొరకలేదన్నారు. ఏంజిల్ లాంటి ఒక అందమైన నటి కావాలని పేర్కొన్నారు. అలాంటి బ్యూటీ కోసం తీవ్రంగా అన్వేషణ సాగుతోందని వివరించారు. ఈ చిత్రానికి శింబు సోదరుడు కురళరసన్ సంగీతం అందించడం విశేషం.