
హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్... ఇలా విభిన్న పాత్రలతో విలక్షణ నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఇటీవల విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా తమిళ దర్శకుడు పాండిరాజ్ ఓ కథను రెడీ చేశారట.
గతంలోనే ఈ కథను విజయ్ సేతుపతికి వినిపించారట పాండిరాజ్. ఈ సినిమాలో నిత్యా మీనన్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నారని కోలీవుడ్ సమాచారం. ఇదిలా ఉంటే... రెండేళ్ల క్రితం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డైరెక్ట్‌గా విడుదలైన ‘19 (1)(ఎ)’ సినిమాలో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఇద్దరూ పాండిరాజ్ సినిమా కోసం మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment