పూరీ- విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్‌.. ఘాటుగా స్పందించిన నటుడు | Shanthanu Fires On Netizens Trollings On Puri Jagannadh And Vijay Sethupathi Movie Announcement, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Puri Jagannadh: ఎదుటివాళ్ల గురించి చెత్తగా మాట్లాడకండి.. కనీస గౌరవం ఇ‍వ్వండి

Published Wed, Apr 2 2025 7:28 AM | Last Updated on Wed, Apr 2 2025 9:58 AM

Shanthanu Fires On Trolling at Puri Jagannadh, Vijay Sethupathi Movie

ఒకప్పుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) సినిమాలు వస్తున్నాయంటే మాస్‌ ప్రేక్షకులు పండగ చేసుకునేవారు. కానీ రానురానూ తన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొడుతూ వస్తుండటంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇలాంటి సమయంలో పూరీ.. తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొందరు వీరిద్దరిపైనా విరుచుకుపడ్డారు.

ఫ్లాప్‌ డైరెక్టర్‌తో సినిమా
కెరీర్‌లో టాప్‌ రేంజ్‌లో ఉన్న నువ్వు ఫ్లాప్‌ డైరెక్టర్‌తో పని చేయడం అవసరమా? అని విజయ్‌ సేతుపతిని తిట్టిపోస్తున్నారు. ఇండస్ట్రీలో నీ పని అయిపోయింది.. ఇంకా సినిమాలు చేయడం అవసరమా? అని పూరీ జగన్నాథ్‌ను సైతం విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై తమిళ స్టార్‌ డైరెక్టర భాగ్యరాజ్‌ తనయుడు, నటుడు శాంతను భాగ్యరాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తక్కువ అంచనా వేయొద్దు
ఎదుటివారి గురించి తప్పుగా మాట్లాడకండి. పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్స్‌లో అసభ్య పదజాలం అసలే వాడొద్దు. ఆయనొక పేరు పొందిన దర్శకుడు, నిర్మాత. సినిమా ఇండస్ట్రీలో ఎదుటి వ్యక్తుల్ని గౌరవించడం నేర్చుకోండి అని ట్వీట్‌ చేశాడు. ఏదో రెండు సినిమాలు బాలేనంత మాత్రాన ఆయన్ను తక్కువ అంచనా వేయొద్దని కొందరు రిప్లై ఇస్తుంటే రేపు ఈ కాంబినేషన్‌తో వచ్చిన సినిమా ఫ్లాప్‌ అయితే ఏం చేస్తావ్‌ అని ప్రశనిస్తున్నారు. మరికొందరేమో ఈ ప్రాజెక్టులో నువ్వు కూడా భాగమయ్యావా? అని శాంతనును ప్రశ్నిస్తున్నారు.

 

 

చదవండి: హారర్‌ ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement