
ఇప్పుడంటే రాజమౌళి, సుకుమార్ అంటున్నారు. కానీ ఒకప్పుడు వీళ్లకంటే ఎక్కువగా కల్ట్ సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ కిక్కిచ్చిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్. తనదైన మాస్ మూవీస్ తీయడంలో స్పెషలిస్ట్ అయిన ఇతడు.. ట్రెండ్ ని పట్టుకోలేక లైన్ తప్పేశాడు. పాన్ ఇండియా ట్రెండ్ వెనకాల పడ్డాడు గానీ భారీ డిజాస్టర్స్ మూటగట్టుకున్నాడు. అలాంటిది ఇప్పుడు ఇతడికి ఓ తమిళ హీరో అవకాశమిచ్చాడట.
(ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)
పూరీ జగన్నాథ్ అంటే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు అభిమానమే. కానీ అవే రొట్టకొట్టుడు మూవీస్ తీస్తూ తనపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాడు. 2019లో 'ఇస్మార్ట్ శంకర్' హిట్ కావడంతో పూరీ మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడేమో అనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండతో 'లైగర్', రామ్ తో 'డబుల్ ఇస్మార్ట్' అని భారీ డిజాస్టర్స్ అందుకున్నాడు.
దీంతో పూరీ పనైపోయింది, ఇక సినిమాలు తీస్తాడా లేదా అని చాలామంది అనుకున్నారు. మరోవైపు ఛార్మితోనూ కటిఫ్ చెప్పేశాడని రూమర్స్ వచ్చాయి. ఇవన్నీ వినిపిస్తున్న టైంలో తమిళ హీరో విజయ్ సేతుపతికి పూరీ ఓ కథ చెప్పి ఒప్పించాడని, మిగతా విషయాలు ఫైనల్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో చూడాలి?
(ఇదీ చదవండి: థియేటర్‌లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్‌లు)
Comments
Please login to add a commentAdd a comment