
Suriya Etharkkum Thunindhavan Movie Telugu Trailer Out: కోలీవుడ్ స్టార్ సూర్యకు అటు తమిళం ఇటు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్‌లో అదరగొడుతుంటాడు. కథ విభిన్నంగా ఉంటే చేసేందుకు అస్సలు వెనకాడడు. అందుకే ఈ తమిళ హీరో అంటే టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్. ఈసారి మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలు, దారుణాలను ఎండగట్టే ప్రయత్నం చేయబోతున్నాడు. సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎతర్క్కుమ్ తునిందవన్ (ఈటీ)'. మాస్ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈటీలో అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది.
బుధవారం (మార్చి 2) ఉదయం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. 'వాడేమె సైంటిస్ట్ కావాలని ఆశ పడ్డాడు. నేనేమో వేరేలే చూడాలని ఆశపడ్డాను. కానీ దైవం, కాలం వాడ్ని ఇలా చూడాలని ఆశపడింది' అనే డైలాగ్‌తో సినిమా ట్రైలర్ ప్రారంభమవుతోంది. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా చూపించారు. 'ఆడవాళ్లు అంటే బలహీనులు కాదు బలవంతులు', 'పంచె ఎగ్గడితే నేనే జడ్జి' వంటి తదితర డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10న థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment