Et movie
-
సూర్య ఈటీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
Suriya ET Movie OTT Streaming Date Here: స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెసిగ్గా తమిళ హీరో అయిన సూర్యకు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫ్యాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు సూర్య నేరుగా తెలుగు సినిమా చేయకపోయినప్పటికీ ఆయనకు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. గజిని మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన సూర్య వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తమిళంతో పాటు తెలుగులోనూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటించిన చిత్రం ఈటీ(ఎతర్క్కుమ్ తునిందవన్) మార్చి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ తెలుగు, తమిళంలో కలిసి ఈ మూవీ మంచి షేర్ రాబట్టి ఎబో యావరేజ్‌గా నిలిచింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్, సన్ ఎన్ఎక్స్టీలో ఏప్రిల్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించాడు. సూర్యకు జోడిగా ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. చదవండి: ఆర్ఆర్ఆర్: జక్కన్నపై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు, పోస్ట్ వైరల్ -
ఈటీ (ఎవరికీ తలవంచడు) మూవీ రివ్యూ
టైటిల్: ఈటీ (ఎవరికీ తలవంచడు) నటీనటులు: సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, వినయ్ వర్మ, సత్యరాజ్ తదితరులు నిర్మాత: కళానిధి మారన్ రచన, దర్శకుడు: పాండిరాజ్ సంగీతం: డి. ఇమ్మాన్ సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు ఎడిటర్: రూబెన్ విడుదల తేది: మార్చి 10, 2022 సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈటీ (ఎదుర్కుమ్ తునిందవన్) తెలుగులో 'ఎవరికీ తలవంచడు' సినిమా వచ్చేసింది. విభిన్నమైన రోల్స్‌లో అదరగొట్టే సూర్య సినిమాలపై భారీగానే అంచనాలుంటాయి. ఇదివరకూ సూర్య చేసిన 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలు కరోనా కారణంగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. అయితేనేం బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. సుమారు మూడేళ్ల తర్వాత 'ఎవరికీ తలవంచడు'తో థియేటర్లలోకి వచ్చాడు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రాన్ని పాండిరాజ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. అమ్మాయిల సమస్యలపై పోరాడే పవర్ఫుల్ పాత్రలో సూర్య నటించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఎట్టకేలకు ఈ మూవీ మార్చి 10న (గురువారం) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. మరీ సూర్య నటించిన ఈటీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: దక్షిణపురంలో అందరితో సరదాగా గడుపుతూ జీవిస్తుంటాడు లాయర్ కృష్ణమోహన్ (సూర్య). ఇతడు ఉత్తరపురంలోని అధిర (ప్రియాంక అరుల్ మోహన్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు ప్రేమించుకునే క్రమంలోనే వారి గ్రామంలోని అమ్మాయిలు ఆత్మహత్యలు, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతుంటారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం ఫలితముండదు. ఇదిలా ఉంటే కృష్ణ మోహన్, అధిరలు పెళ్లి చేసుకునే క్రమంలో అధిర స్నేహితురాలు ఆపదలో ఉన్నట్లు మెసేజ్ వస్తుంది. దీంతో ఆమెను కాపాడేందుకు వెళ్లిన లాయర్ కృష్ణమోహన్‌కు అమ్మాయిల ఆత్మహత్యలు, యాక్సిడెంట్లకు కారణం, ఆ చావుల వెనక ఉంది ఎవరనేది తెలుస్తుంది. సూర్య వారిని ఎదుర్కొన్నాడా? 500 మంది అమ్మాయిలను ఎలా కాపాడాడు ? దక్షిణపురం, ఉత్తరపురం గ్రామాలకు మధ్య ఉన్న సంబంధం ఏంటి ? కృష్ణ మోహన్ చిన్నతనంలో తన చెల్లెలికి ఏం జరిగిందనేదే సినిమా కథ. ఎలా ఉందంటే ? రెండు గ్రామాల మధ్య జరిగిన సంఘటన ద్వారా ప్రారంభమైన సినిమా అమ్మాయిలపై జరిగే ఆకృత్యాల గురించి ప్రస్తావించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ పాండిరాజ్. అమ్మాయిలు అంటే బలహీనం కాదు బలవంతులు అని చాటి చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అమ్మాయిలు మనోధైర్యంతో ఎలా ఎదుర్కొవాలో నేర్పిన చిత్రమిది. రొటీన్ ఫార్ములా అయినా పవర్‌ప్యాక్ యాక్షన్ సీన్స్‌తో మాస్ ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించి మంచి సందేశమిచ్చారు. హీరో, విలన్ల మధ్య వచ్చే సీన్స్ ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ యాక్షన్ సీన్, మహిళల నగ్న చిత్రాలు, అశ్లీల చిత్రాలు చూసే జనానికి వాటికి కారకులు ఎవరో తెలిసేలా చేయాలని చూపించే సీన్ సినిమాలో హైలెట్‌గా నిలుస్తాయి. తప్పు చేయని మహిళలు కాదు అశ్లీల చిత్రాలు తీసేవారు సిగ్గుపడాలని చెబుతూ మహిళలకు ఈ సినిమాతో ధైర్యమిచ్చే ప్రయత్నం చేశారు. 'అబ్బాయిలు ఏడవద్దు అని చెప్పడం కాదు అమ్మాయిలను ఏడిపించొద్దని చెప్పండి' లాంటి మహిళల కోసం చెప్పే డైలాగ్స్ క్లాప్స్ కొట్టించేలా ఉన్నాయి. డి. ఇమ్మాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందనే చెప్పవచ్చు. సీరియస్‌గా సాగే కథలో అక్కడక్కడా వచ్చే ప్రేమ సన్నివేశాలు, కామెడీ సీన్స్ ఉఫ్ అనిపిస్తాయి. అమ్మాయిల చావులకు కారణమేంటనే విషయం తెలుసుకోవాలని ఎదురుచూసే ప్రేక్షకుడికి ఈ సీన్స్ కొంచెం బోర్ కొట్టిస్తాయి. కానీ లాయర్ కృష్ణ మోహన్, అధిరల మధ్య వచ్చే లవ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కామెడీ బాగానే పండిందని చెప్పవచ్చు. ఆకాశమే హద్దురా, జైభీమ్ తరహాలో కాకపోయినా మహిళల పక్షాన నిలబడిన లాయర్ కృష్ణమోహన్ పాత్రలో నటించిన సూర్య 'ఈటీ' చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఎవరెలా చేశారంటే? విభిన్నమైన గెటప్పులతో, రోల్స్‌తో అదరగొట్టే సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎప్పటిలానే ఈ సినిమాలో లాయర్ కృష్ణ మోహన్‌గా తనదైన శైలిలో అద్భుతంగా యాక్ట్ చేశాడు. అధిరగా చేసిన ప్రియాంక అరుల్ మోహన్ నటన కూడా బాగుంది. ఫస్టాఫ్‌లో సాధారణ యువతిగా నటించి ఆకట్టుకున్న ప్రియాంక సెకండాఫ్‌లో అశ్లీల చిత్రాలకు గురైన బాధితురాలిగా పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలనే పాత్రలో చక్కగా నటించింది. ఇక కృష్ణమోహన్ తండ్రిగా సత్యరాజ్, అమ్మగా శరణ్య పొన్వన్నన్, దేవదర్శిని చేతన్, సుబ్బు పంచు తమదైన పాత్రమేరకు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర కామ (వినయ్ రాయ్). స్త్రీలను కించపరుస్తూ మాట్లాడటం, వాళ్లను హింసించడం, అమ్మాయిలను వీఐపీలకు ఎరగా వేసి వాడుకునే కామేష్ పాత్రలో వినయ్ రాయ్ బాగానే నటించాడు. కార్తీ నటించిన 'చినబాబు' సినిమా ఫేమ్ పాండిరాజ్‌కు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇది మూడో సినిమా. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా తీయడంలో పాండిరాజ్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించి మహిళలపై జరిగే అరాచాకాలు, వారు ఎలా నిలదొక్కుకోవాలో చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో పూర్తిగా విజయం సాధించారనే చెప్పవచ్చు. అమ్మాయిలపై జరిగే ఆకృత్యాలు, అరాచకాలపై చాలానే సినిమాలు వచ్చాయి. అయితే అమ్మాయిలను పురుషులు చూసే కోణం మారనప్పుడు, మహిళలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడే రోజు రానంతవరకూ ఇలాంటి ఎన్ని సినిమాలు వచ్చినా స్వాగతించడంలో తప్పులేదు. -
`ఈటీ` మూవీ ట్విటర్ రివ్యూ
హీరో సూర్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఆయన హీరోగా నటించిన `ఆకాశం నీ హద్దురా`, `జై భీమ్` ఘన విజయం సాధించాయి. అయితే ఈ రెండు చిత్రాలు కరోనా కారణంగా ఓటీటీలోనే విడుదలయ్యాయి. దాదాపు మూడేళ్ల తర్వాత సూర్య థియేటర్‌కి వస్తున్న చిత్రం `ఈటీ`(ఎవరికి తలవంచడు). పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య ఈ గురువారం (మార్చి 10) ఈటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. . ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. అవేంటో చూద్దాం. #ET First Half 🔥 Interval Fight MARANAMASS 💥💥💥💥 — Rocky Bhai (@RockybhaiOffcl) March 10, 2022 ఫస్టాఫ్ మాస్ జాతరే అంటున్నారు. ఇంటర్వెల్ సీన్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. ఇక సెకండాఫ్ డీసెంట్‌గా సాగుతుందట. 2022లో ఫస్ట్ రియల్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే అని పేర్కొంటున్నారు. అలాగే సినిమాలో మహిళలకు సంబంధించిన అంశాలు చాలా బాగున్నాయని, పర్ఫెక్ట్ ఉమెన్స్ డే గిఫ్ట్ అంటున్నారు. #EtharkkumThunindhavan [4.5/5] : @Suriya_offl scores big time.. Any emotions.. He is much needed as he could convincingly sends out a sensitive message. From humor to Mass, he has done enough to satisfy both fans and general audience#EtharkumThunindhavan #ET #ETReview #ETFDFS pic.twitter.com/6njWqWDgkK — Swayam Kumar (@SwayamD71945083) March 10, 2022 #EtharkkumThunindhavan Good first half with same old masala things ... Afterwards very poor writing and full of cringe material... Music is very worst.. totally disaster 😭😭😭😭@Suriya_offl #EtharkkumThuninthavan #ET — Tech பாட்டி... (@Kavin506) March 10, 2022 Half way through #EtharkkumThuninthavan Full on packed entertainment. Loving it !! Suriya in #ET 🔥 — Venkatramanan (@VenkatRamanan_) March 10, 2022 #ET Movie Review.... First Real Blockbuster movie in 2022 💥 Guarantee ah TN la mattum 100cr eduthudum 💥#EtharkkumThunindhavan @Suriya_offl pic.twitter.com/fIHuSkNVi8 — சசிCasio (@Sasicasio) March 10, 2022 #EtharkkumThunidhavan Never expected this from @pandiraj_dir ! Yes it is an emotional family entertainer with mass elements well woved in. Intro, Interval and Climax ...pucca 🔥🔥🔥 Well done @pandiraj_dir ⚔️#ET is feast for mass movie audiences. 4/5#ETReview #ETFDFS — Kerala Boxoffice Stats (Wear Double Mask) (@kboxstats) March 10, 2022 #EtharkkumThunindhavan #ET 2nd half - Into the climax but I would like to write it now . Stamp Mar 10th, 22 as #Suriya’s official comeback . After donkeys years (almost 10 hrs) his muvi wil b celebrated by every1 in theatres 🔥🔥🔥 Hartick blockbusters for @Suriya_offl https://t.co/TWECwXnosn — Zaro (@toto_motto) March 10, 2022 -
ET Movie: మహిళలు గర్వపడే సినిమా ఇది
‘‘ఈటీ’ చిత్రంలో రెండు షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో కనిపిస్తాను. ఇంట్రవెల్‌కు ముందు చాలా హ్యాపీగా కనిపించే నా పాత్ర, ఇంట్రవెల్ తర్వాత కాస్త సీరియస్‌గా కనిపిస్తుంది. ఇందుకు ఓ కారణం ఉంది. ఆ కారణం ఏంటో సినిమాలో చూడాలి’’ అన్నారు ప్రియాంకా అరుల్ మోహనన్. సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఈటీ’. ఇందులో ప్రియాంకా అరుల్ మోహనన్ హీరోయిన్గా నటించారు. తమిళంలో కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో సునీల్ నారంగ్, డి. సురేశ్‌బాబు, ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం రేపు(గురువారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ– ‘‘మహిళల అంశాలతో పాటుగా మనం న్యాయంగా ఉంటే ఎవరికీ తలవంచాల్సిన పని లేదనే దృష్టి కోణంలో ఈ సినిమాను పాండిరాజ్‌గారు తెరకెక్కించారు. నాది చాలా బాధ్యతాయుతమైన పాత్ర. సినిమాలో సూర్యగారికి, నాకు సమాన ప్రధాన్యత ఉంటుంది. ఇక ఈ సినిమా మహిళలను ఎడ్యుకేట్ చేసేలా ఉంటుంది. మహిళలు గర్వపడే సినిమా ఇది’’ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెబుతారు? అన్న ప్రశ్నకు స్పందిస్తూ– ‘‘మహిళలు ఏ రంగంలో ఉన్నా హ్యాపీగా ఉండాలి. పనిలో మీ ప్రతిభ చూపండి. సమస్య వస్తే ఎదుర్కోండి’’ అని అన్నారు. -
ఈ వారం బాక్సాఫీస్‌పై పెద్ద సినిమాల దండయాత్ర!
కరోనా వల్ల సినీప్రేమికుడు మిస్సయిన వినోదాన్ని రెట్టింపు చేసి ఇచ్చేందుకు కొత్త సినిమాలు రెడీ అయ్యాయి. ఈ వారం పెద్ద సినిమాలు థియేటర్లో, మధ్య, చిన్న తరహా చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ జాబితా చూస్తుంటే ఈ వారం ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. మరి మీరూ కొత్త సినిమాలు వీక్షించాలనుకుంటే ఈ వారం(మార్చి 7-13 వరకు) ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి.. ఈటీ తమిళ స్టార్ హీరో సూర్య థియేటర్లో ప్రేక్షకులను పలకరించి చాలాకాలమే అయింది. ఆయన నటించిన 'ఆకాశమే హద్దురా', 'జై భీమ్' చిత్రాలు ఓటీటీలో రిలీజై సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఆ తర్వాత ఆయన ఈటీ సినిమా చేయగా ఇది థియేటర్లలో రిలీజవుతోంది. పాండిరాజ్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా, వినయ్ రామ్, సత్యరాజ్, జయప్రకాశ్ ముఖ్యపాత్రల్లో నటించారు. అమ్మాయికు జరిగే అన్యాయాలపై పోరాటమే ప్రధాన కథగా సాగే ఈ సినిమా మార్చి 10న రిలీజవుతోంది. రాధేశ్యామ్ డార్లింగ్ ప్రభాస్ థియేటర్లలో కనిపించి చాలా ఏళ్లవుతోంది. దీంతో అతడి సినిమా కోసం అభిమానులు కళ్లు కాయేలా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు కరోనా ఉధృతి కొంత తగ్గడంతో 'రాధేశ్యామ్' రిలీజ్‌కు రెడీ అయింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీ మార్చి 11న విడుదలవుతోంది. విధితో పోరాటం చేసిన ప్రేమకథే ఈ సినిమా స్టోరీలైన్. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాల జాబితా.. హాట్‌స్టార్ ► ఖిలాడి - మార్చి 11 ► మారన్ - మార్చి 11 ఆహా ► ఖుబూల్ హై - మార్చి 11 సోనీలివ్ ► క్లాప్ - మార్చి 11 జీ5 ► రౌడీ బాయ్స్ - మార్చి 11 ► మిసెస్ అండ్ మిస్టర్ షమీమ్ (వెబ్ సిరీస్) - మార్చి 11 ► రైడర్ - మార్చి 11 నెట్‌ఫ్లిక్స్ ► అవుట్ ల్యాండర్ (ఆరో సీజన్) - మార్చి 7 ► ద లాస్ట్ కింగ్డమ్ (ఐదో సీజన్) - మార్చి 9 ► ద అండీ వార్హోల్ డైరీస్ (వెబ్ సిరీస్) - మార్చి 9 ► ఎ ఆడమ్ ప్రాజెక్ట్ - మార్చి 11 అమెజాన్ ప్రైమ్ ► అప్లోడ్ (రెండో సీజన్) - మార్చి 11 ఎంఎక్స్ ప్లేయర్ ► అనామిక - మార్చి 10 -
ఆ సినిమా చూసి దర్శకుడు స్మోకింగ్ మానేశాడు: సూర్య
‘‘కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. మనుషుల జీవితాల్లోనూ మార్పులొచ్చాయి. జీవితంలో ఏయే అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలనే విషయాలపై చాలామందికి ఓ క్లారిటీ వచ్చినట్లుంది. ఇంతకుముందు ఫ్యామిలీ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవాళ్లు ఇప్పుడు బాధ్యతగా ఉంటున్నారు. నా బంధువులు, స్నేహితుల్లో చాలామంది ఇప్పుడు ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతున్నారు’’ అని సూర్య అన్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన ‘ఈటీ’ (ఎవరికీ తలవంచడు) ఈ నెల 10న విడుదల కానుంది. సునీల్ నారంగ్, డి. సురేష్‌బాబు, ‘దిల్’ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య చెప్పిన విశేషాలు. ► ఒక పుస్తకం పూర్తిగా చదవాలంటే రెండుగంటల కంటే ఎక్కువ సమయమే పడుతుంది. అయితే రెండు గంటల సమయంలోనే సినిమా ద్వారా ఎమోషన్స్‌ని షేర్ చేసుకోవచ్చు. అందుకే సినిమా అనేది స్ట్రాంగ్ మీడియమ్ అని నా నమ్మకం. అలాగే సినిమాలు మన జీవితాలను ప్రభావితం చేయగలవని నమ్ముతున్నాను. ‘వారనమ్ ఆయిరం’ (తెలుగులో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’) సినిమా చూసి స్మోకింగ్ మానేసినట్లుగా దర్శకుడు వెట్రిమారన్ ఓ సందర్భంలో చెప్పారు. హిందీ సినిమా ‘గెహరాయియా’ క్లైమాక్స్‌లో వచ్చే ఓ డైలాగ్ నా ఆలోచనల్లో, నా వ్యక్తిగత జీవితంలో మార్పు తీసుకువచ్చింది. అలా ‘ఈటీ: ఎవరికీ తలవంచడు’ చిత్రంలోని అంశాలు కొందరిలో మార్పు తేవడంతో పాటు ప్రతి ఇంట్లోనూ చర్చించుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ► ప్రతి నగరంలో జరిగే ఘటనలే ఈ సినిమాలో చూపించాం. మన ఇంట్లోని మహిళల పట్ల మన ప్రవర్తన, వ్యవహారశైలి ఎలా ఉండాలి? అనే విషయాలను చెప్పే ప్రయత్నం చేశాం. మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారికి మంచి నీళ్లు ఇవ్వాల్సిందిగా అమ్మాయిలకే చెబుతాం. అబ్బాయిలకు ఎందుకు చెప్పకూడదు? ఈ బ్యాలెన్స్ ఎక్కడ మిస్ అవుతోంది? భార్యాభర్తలు గొడవ పడితే.. భార్యను కాస్త తగ్గమని ఆమె పుట్టింటివారు కూడా చెబుతుంటారు. ఎందుకలా? ఇలాంటి అంశాలను ప్రస్తావించాం. ► ‘నేను హీరో’ అనే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే ‘సూరరై పోట్రు’, ‘జై భీమ్’ వంటి సినిమాలను చేయగలను. ‘‘ట్రైబల్ బ్యాక్‌డ్రాప్, పెద్దగా సాంగ్స్, ఫైట్స్ లేవు. సెంట్రల్ క్యారెక్టర్ కూడా నీది కాదు. ‘జై భీమ్’ చేయొద్దు’’ అని నాకు చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ చేశాను. ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’!), ‘జై భీమ్’ చిత్రాలు నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. మరిన్ని విభిన్నమైన సినిమాలు చేయాలనే తపనను నాలో కలిగించాయి. ‘ఆకాశం నీ హద్దురా’లో పెద్దగా స్టంట్ సీక్వెన్స్ లేవు. ‘జై భీమ్’ చిత్రంలో లవ్, సాంగ్ సీక్వెన్స్‌లు అవసరం పడలేదు. అయినా ‘జై భీమ్’ చిత్రం చాలామందిలో ఓ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సమాజానికి ఉపయోగపడే సినిమాలు మరిన్ని వచ్చేలా ప్రేరేపించిందని అనుకుంటున్నాను. ప్రతి సినిమా కూడా మన సమాజాన్ని, వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేసేలా ఉండాలనే కోరుకుంటాను. ఎప్పుడూ ఫ్యాంటసీ, భారీ కమర్షియల్ చిత్రాలే కాదు.. సమాజంలో మంచి మార్పు తీసుకొచ్చే సినిమాలూ రావాలి. ► ఒకప్పుడు రంగస్థల నటులు వేదికలపై వినోదాన్ని పంచేవారు. ఆ తర్వాత థియేటర్స్ వచ్చాయి. ఆ తర్వాతి తరంలో టెలివిజన్ల ప్రభావం పెరిగింది. ఇప్పుడు ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు. ఉదాహరణకు నా పిల్లలు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్‌నే చూస్తున్నారు. ఇలాంటి మార్పులను మనం ఆపలేం. జాగ్రత్తగా డీల్ చేయాల్సిందే. కానీ ఎలాంటి కంటెంట్ టీవీల్లో రావాలి? ఏ విధమైన కంటెంట్ థియేటర్స్‌లో ఉండాలి? ఏ రకమైన కంటెంట్ ఓటీటీకి కరెక్ట్ అనే అంశాలపై మరింత అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. మంచి సినిమా అయినా థియేటర్స్‌లో మూడు రోజులు మాత్రమే ఉంటుంది. అదే ఓటీటీలో అయితే వ్యూయర్స్ వారికి వీలైన టైమ్‌లో ఆ సినిమాను చూడగలిగే వీలుంటుంది. అలాగే కొత్త ఆడియన్స్ వస్తున్నారు. ఓటీటీ వల్ల సినిమాను ఎక్కువమంది చూడగలుగుతున్నారు. ఇండస్ట్రీ కూడా పెరుగుతోంది. ► ‘జై భీమ్’ చిత్రం ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లడం, ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకోవడం నాకు సంతోషాన్నిచ్చింది. ఆస్కార్ బరిలో నిలవడం అనేదానికి ఓ ప్రాసెస్ ఉంటుంది. ఒక సినిమా ఆస్కార్‌కి వెళ్లాలంటే యూఎస్‌లోని ఐదారు రాష్ట్రాల్లో స్క్రీనింగ్ జరగాలి. అక్కడి థియేటర్స్‌లో కనీసం వారం రోజుల ప్రదర్శన ఉండాలి. అయితే కరోనా వల్ల డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలను కూడా ఈసారి పరిశీలనలోకి తీసుకున్నారు. నిజానికి మేం స్పెషల్ కేటగిరీలో అప్లై చేయాల్సింది. జనరల్ కేటగిరీలో చేశాం. ► బాలాగారి దర్శక త్వంలో నా తర్వాతి సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ నెక్ట్స్ వెట్రిమారన్ దర్శకత్వంలో చేస్తున్న ‘వాడివాసల్’ సినిమా షూటింగ్‌ని స్టార్ట్ చేస్తాం ‘ఈటీ’లో యాక్షన్, ఫైట్స్, కామెడీ.. ఇలా అన్నీ ఉన్నాయి. అయితే వీటితో పాటు ఇంతకుముందు ఎవరూ ప్రస్తావించని, మన ఇంట్లో మనం చర్చించుకోవడానికి సంకోచించే ఓ కొత్త అంశాన్ని చిన్న సందేశంగా చెప్పే ప్రయత్నం చేశాం. మహిళల జీవితాల్లోని అంశాల గురించే ఈ సినిమా ఉంటుంది. -
సూర్య ఈటీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
‘నీది యాక్టింగ్ కాదురా.. సర్దేస్తున్నావ్.. ’అంటూ రానాకు క్లాస్ పీకిన సూర్య..!
‘‘కరోనా టైమ్‌లో ‘అఖండ’, ‘పుష్ప’, ‘బంగార్రాజు’, ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు హిట్ చేశారు. మిగతా ఇండస్ట్రీలకు సినిమాలను విడుదల చేయాలనే ఆత్మవిశ్వాసం టాలీవుడ్ వల్లే కలిగింది’’ అని సూర్య అన్నారు. సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఈటీ’. ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవుతోంది. నారాయణ్‌దాస్ నారంగ్, డి. సురేష్‌బాబు, ‘దిల్’ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిథులుగా పాల్గొన్న హీరో రానా, దర్శకుడు బోయపాటి శ్రీను, దర్శకుడు గోపీచంద్ మలినేని ‘ఈటీ’ బిగ్ టికెట్‌ను విడుదల చేశారు. సూర్య మాట్లాడుతూ – ‘‘ఇటీవల నా ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. మంచి సినిమాకు హద్దు లేదని నిరూపించారు. ఆ రెండు చిత్రాల్లా ‘ఈటీ’ కూడా స్పెషల్ ఫిల్మే. ఇక నా అగరం ఫౌండేషన్‌కు స్ఫూర్తి చిరంజీవిగారు. సినిమాల వల్ల మంచి స్థాయికి వెళ్లిన నేను ఏదో ఒకటి చేయాలని ఈ అగరం ఫౌండేషన్‌ని స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరూ మార్పు తీసుకురాగలరు. మనసు ఏం చెప్పిందో దాన్నే ధైర్యంగా చేయండి. కంఫర్ట్ జోన్లో ఉంటే ఎదుగుదల ఉండదు. అందుకే కంఫర్ట్ జోన్లో ఉండకండి’’ అన్నారు. రానా మాట్లాడుతూ – ‘‘నా సినిమా ఒకటి ఎడిటింగ్ రూమ్‌లో చూసిన సూర్యగారు ‘‘నీది యాక్టింగ్ కాదురా.. సర్దేస్తున్నావ్.. (స్టేజ్ పై నవ్వులు)’ అని క్లాస్ పీకారు. ఆ క్లాసే నన్ను భల్లాలదేవుడిని చేసింది. డేనియల్ శేఖర్ని చేసింది (సూర్య మైకు తీసుకుని ఇప్పుడు రానాను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు). ‘ఈటీ’ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘రజనీకాంత్‌గారి తర్వాత సూర్యని ‘మన’ అని తెలుగు ఆడియన్స్ అనుకుంటున్నారు. అలాంటి సూర్యగారు చేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘ ‘సూర్యగారు మాస్ ఫిల్మ్ చేస్తే షేకే. ఓ యునిక్ స్టైల్ ఉన్న డైరెక్టర్ పాండిరాజ్‌గారు’’ అన్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ‘‘హైదరాబాద్‌లో జరిగిన కార్తీ ‘చినబాబు’ సినిమా ఫంక్షన్‌కు వచ్చినప్పుడు సూర్యగారి పేరు ప్రస్తావనకు రాగానే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ రెస్పాన్స్ చూస్తున్నాను. సూర్యగారు స్ట్రయిట్‌గా తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు పాండిరాజ్. ‘‘ప్రేక్షకులు గర్వపడే సినిమాలు చేస్తుంటారు సూర్య. ‘ఈటీ’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత డి. సురేష్‌బాబు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘‘ప్రతి కథను డిఫరెంట్‌గా సెలెక్ట్ చేసుకునే ఇండియన్ హీరోల్లో సూర్య ఒకరు. ఆయన ఏ సినిమా చేసినా అందులో ఓ కొత్తదనం ఉంటుంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో సౌత్ ఇండియా సినిమాల పట్ల, ముఖ్యంగా తెలుగు సినిమాల పట్ల ముంబైలో మరింత గౌరవం పెరిగింది. సూర్యగారు చేసిన ‘ఈటీ’ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాత జ్ఞానవేల్‌రాజా. నిర్మాత రాజశేఖర్ పాండియన్, కెమెరామేన్ రత్నవేలు, నటులు వినయ్ రాయ్, మధుసూదన్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆడవాళ్లు అంటే బలహీనులు కాదు బలవంతులు.. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈటీ ట్రైలర్
Suriya Etharkkum Thunindhavan Movie Telugu Trailer Out: కోలీవుడ్ స్టార్ సూర్యకు అటు తమిళం ఇటు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్‌లో అదరగొడుతుంటాడు. కథ విభిన్నంగా ఉంటే చేసేందుకు అస్సలు వెనకాడడు. అందుకే ఈ తమిళ హీరో అంటే టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్. ఈసారి మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలు, దారుణాలను ఎండగట్టే ప్రయత్నం చేయబోతున్నాడు. సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎతర్క్కుమ్ తునిందవన్ (ఈటీ)'. మాస్ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈటీలో అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. బుధవారం (మార్చి 2) ఉదయం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. 'వాడేమె సైంటిస్ట్ కావాలని ఆశ పడ్డాడు. నేనేమో వేరేలే చూడాలని ఆశపడ్డాను. కానీ దైవం, కాలం వాడ్ని ఇలా చూడాలని ఆశపడింది' అనే డైలాగ్‌తో సినిమా ట్రైలర్ ప్రారంభమవుతోంది. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా చూపించారు. 'ఆడవాళ్లు అంటే బలహీనులు కాదు బలవంతులు', 'పంచె ఎగ్గడితే నేనే జడ్జి' వంటి తదితర డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10న థియేటర్లలో విడుదల కానుంది. -
మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు.. ఈటీ టీజర్ చూశారా?
మాస్ పాత్రల్లో విజృంభించి నటిస్తారు సూర్య. తాజాగా ‘ఈటి’ చిత్రంలో కూడా మాస్ క్యారెక్టర్లో రెచ్చిపోయినట్లుగా శనివారం విడుదలైన టీజర్ స్పష్టం చేస్తోంది. సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో మార్చి 10న రిలీజ్ కానుంది. తెలుగు హక్కులను ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ దక్కించుకుంది. ఈ చిత్రం తెలుగు టీజర్‌ను రానా విడుదల చేశారు. విలన్లను రఫ్ఫాడిస్తూ, ‘నాతో ఉన్నవాళ్లు ఎప్పుడూ భయపడకూడదు.. మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అని సూర్య చెప్పే డైలాగ్‌తో టీజర్ ముగుస్తుంది. సూర్య సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటించిన ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమ్మాన్, కెమెరా: ఆర్ రత్నవేలు. -
సూర్య అభిమానులకు గుడ్‌న్యూస్: చాన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు..
Suriya Telugu Dubbing For The First Time: తమిళ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్‌లోనూ మాంచి డిమాండ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ మంచి కలెక్షన్లు సాధిస్తుంటాయి. తాజాగా సూర్య ఈటీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాండీరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేస్తుంది. అయితే తాజాగా సూర్య ఈ సినిమా కోసం తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం. గతంలో బ్రదర్స్ సినిమా కోసం తొలిసారిగా డబ్బింగ్ చెప్పిన సూర్య మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రం డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.ఈ సినిమా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. A pakka treat for Telugu fans as@Suriya_offl dubs in his own voice for the Telugu version of #ET 👌👍 #EtharkkumThunindhavan @pandiraj_dir @sunpictures #Suriya pic.twitter.com/TuddNfHWzW — Kaushik LM (@LMKMovieManiac) February 12, 2022 -
సూర్య 'ఈటీ' మూవీ వచ్చేది అప్పుడే.. మేకర్స్ కొత్త ప్రకటన
Suriya Etharkkum Thunindhavan Movie Release Date Announced: కోలీవుడ్ స్టార్ సూర్యకు అటు తమిళ్ ఇటు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్‌లో అదరగొడుతుంటాడు. కథ విభిన్నంగా ఉంటే చేసేందుకు అస్సలు వెనకాడడు. అందుకే ఈ తమిళ హీరో అంటే టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్. ఇటీవల 'జైభీమ్', 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు సూర్య. ఈ చిత్రాల తర్వాత సూర్య చేస్తున్న మూవీ 'ఈటీ' (ఎతర్క్కుమ్ తునిందవన్) అని తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. అయితే తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. మార్చి 10న 'ఈటీ' మూవీని రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ సందడి చేయనుంది. ఇంతకుముందు 'ఈటీ'ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది చిత్రబృందం. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో సూర్యకు జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. #EtharkkumThunindhavan is releasing on March 10th, 2022! See you soon in theatres!@Suriya_offl @pandiraj_dir #Sathyaraj @immancomposer @RathnaveluDop @priyankaamohan @sooriofficial #ETfromMarch10 #ET pic.twitter.com/HPJ9cYw9Eh — Sun Pictures (@sunpictures) February 1, 2022 -
శ్రీదివ్య చూపు గ్లామర్ వైపు
నటి శ్రీదివ్య పేరు చెప్పగానే మంచి హోమ్లీ నటి అనే అంతా అంటారు. ఆమె ఇప్పటి వరకూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ కథా పాత్రలనే పోషించి సక్సెస్ అయ్యారు. కోలీవుడ్‌లో శ్రీదివ్య నటించి విడుదలైన తొలి చిత్రం వరుత్తపడాద వాలిభర్ సంఘం అనూహ్య విజయాన్ని సాధించింది.ఆ తరువాత నటించిన జీవా,వెళ్లైకారదురై, కాక్కిసట్టై చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. అధర్వతో నటించిన ఈటీ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. వాటిలో కార్తీ సరసన నటిస్తున్న కాష్మోరా చిత్రం ఒకటి. కాగా ఈ తెలుగమ్మాయికి నటి కీర్తీసురేశ్‌తో పెద్ద చిక్కే వచ్చిపడిందట. ఈ మలయాళీ బ్యూటీ హోమ్లీ పాత్రలు ఎంపిక చేసుకుంటూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను పొందుతుండడంతో నటి శ్రీదివ్యకు వస్తాయని ఆశించి అవకాశాలు కీర్తీసురేశ్‌ను వరిస్తున్నాయట. దీంతో ఆలోచనలో పడ్డ శ్రీదివ్య కొత్త నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదట. అదేమిటో తెలుసా?ఇకపై తన పంథాను మార్చుకుని గ్లామర్ వైపు దృష్టి సారిస్తున్నారట. ఇప్పటి వరకూ హోమ్లీ ఇమేజ్ రుచి చూసి శ్రీదివ్య ఇక గ్లామర్ సంగతి చూడాలనుకుంటున్నారట.