ET On OTT: Suriya ET Movie Streaming On Netflix and Sun NXT From April 7th - Sakshi
Sakshi News home page

Suriya-ET Movie: రెండు ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ఈటీ మూవీ, స్ట్రీమింగ్‌ ఆ రోజు నుంచే

Published Thu, Mar 31 2022 3:41 PM | Last Updated on Fri, Apr 8 2022 3:23 PM

OTT: Suriya ET Movie Streaming On Netflix and Sun NXT From April 7th - Sakshi

Suriya ET Movie OTT Streaming Date Here: స్టార్‌ హీరో సూర్య క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెసిగ్గా తమిళ హీరో అయిన సూర్యకు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్‌ ఫ్యాలోయింగ్‌ ఉంది. ఇప్పటి వరకు సూర్య నేరుగా తెలుగు సినిమా చేయకపోయినప్పటికీ ఆయనకు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. గజిని మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన సూర్య వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తమిళంతో పాటు తెలుగులోనూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటించిన చిత్రం ఈటీ(ఎతర్​క్కుమ్​ తునిందవన్​) మార్చి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చదవండి: తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్‌ హీరో షాకింగ్‌ కామెంట్స్‌

తెలుగు, తమిళంలో కలిసి ఈ మూవీ మంచి షేర్‌ రాబట్టి ఎబో యావరేజ్‌గా నిలిచింది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌, సన్‌ ఎన్‌ఎక్స్‌టీలో ఏప్రిల్‌ 7 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. త‌మిళంతో పాటు తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ నిర్మించాడు. సూర్య‌కు జోడిగా ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహ‌న్‌ న‌టించింది.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌: జక్కన్నపై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు, పోస్ట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement