Actress Priyanka Arul Mohan Comments About Her Role In ET Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Priyanka Arul Mohan : మహిళలు గర్వపడే సినిమా ఇది 

Published Wed, Mar 9 2022 8:28 AM | Last Updated on Wed, Mar 9 2022 10:55 AM

Priyanka Arul Mohan talk About ET Movie - Sakshi

‘‘ఈటీ’ చిత్రంలో రెండు షేడ్స్‌ ఉన్న హీరోయిన్‌ పాత్రలో కనిపిస్తాను. ఇంట్రవెల్‌కు ముందు చాలా హ్యాపీగా కనిపించే నా పాత్ర, ఇంట్రవెల్‌ తర్వాత కాస్త సీరియస్‌గా కనిపిస్తుంది. ఇందుకు ఓ కారణం ఉంది. ఆ కారణం ఏంటో సినిమాలో చూడాలి’’ అన్నారు ప్రియాంకా అరుల్‌ మోహనన్‌. సూర్య హీరోగా పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఈటీ’. ఇందులో ప్రియాంకా అరుల్‌ మోహనన్‌ హీరోయిన్‌గా నటించారు. తమిళంలో కళానిధి మారన్‌ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో సునీల్‌ నారంగ్, డి. సురేశ్‌బాబు, ‘దిల్‌’ రాజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం రేపు(గురువారం)  విడుదల కానుంది.

ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ– ‘‘మహిళల అంశాలతో పాటుగా మనం న్యాయంగా ఉంటే ఎవరికీ తలవంచాల్సిన పని లేదనే దృష్టి కోణంలో ఈ సినిమాను పాండిరాజ్‌గారు తెరకెక్కించారు. నాది చాలా బాధ్యతాయుతమైన పాత్ర. సినిమాలో సూర్యగారికి, నాకు సమాన ప్రధాన్యత ఉంటుంది. ఇక ఈ సినిమా మహిళలను ఎడ్యుకేట్‌ చేసేలా ఉంటుంది. మహిళలు గర్వపడే సినిమా ఇది’’ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెబుతారు? అన్న ప్రశ్నకు స్పందిస్తూ– ‘‘మహిళలు ఏ రంగంలో ఉన్నా హ్యాపీగా ఉండాలి. పనిలో మీ ప్రతిభ చూపండి. సమస్య వస్తే ఎదుర్కోండి’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement